మంత్రికి వినతుల వెల్లువ | requests to minister | Sakshi
Sakshi News home page

మంత్రికి వినతుల వెల్లువ

Published Thu, Sep 22 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM

requests to minister

అనంతపురం న్యూటౌన్‌ :  జిల్లా పర్యటనలో ఉన్న బీసీ సంక్షేమ శాఖా మంత్రి కొల్లు రవీంద్రకు బీసీ సంఘాల నేతలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. అన్ని జిల్లాలలో బీసీ భవన్లు ఏర్పాటు చేయాలని,  జనాభా దామాషా  ప్రకారం బీసీ కార్పోరేషన్‌కు రూ.20 కోట్లు కేటాయించాలని,  చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని, ప్రమోషన్లలో రిజర్వేషన్లు కేటాయించాలని, ఎస్సీ అట్రాసిటీ కేసుల్లో బీసీలకు మినహాయింపు ఇవ్వాలని డిమాండు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement