రాష్ట్రంలో శాసనసభ స్థానాల సంఖ్య పెంచాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
హైదరాబాద్: రాష్ట్రంలో శాసనసభ స్థానాల సంఖ్య పెంచాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రీషీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ లేఖ రాశారు.
శాసనసభ స్థానాలను 119 నుంచి 153కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం స్థానాలు పెంచాలని కోరారు. జనాభా లెక్కలు పూర్తైన తర్వాత నియోజక వర్గ పునర్విభజన జరపాలని రాజ్యాంగం సూచిస్తోందని లేఖలో ప్రస్తావించారు. అసెంబ్లీ సీట్ల పెంపు కోసం ఎన్నికల కమిషన్ ప్రక్రియ ప్రారంభించేలా దిశానిర్ధేశం చేయాలని విజ్ఞప్తి చేశారు.