Assembly seats
-
పోటెత్తిన ఓటర్లు: ఏపీ సీఈవో ముఖేష్‌కుమార్ మీనా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు సోమవారం జరిగిన ఎన్నికల్లో ఓటర్ల చైతన్యం పోటెత్తింది. ఉదయం ఆరు గంటల నుంచే వారు భారీ క్యూలైన్లలో వేచిఉండి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహం చూపించారు. గతంలో ఎన్నడూలేని విధంగా సంక్షేమ పథకాల కొనసాగింపునకు మద్దతుగా మహిళలు, వృద్ధులు పెద్దఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెదురుమదురు సంఘటనలు తప్ప రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసిందని, ఎక్కడా రీపోలింగ్ అవసరం ఏర్పడలేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా సోమవారం సాయంత్రం ప్రకటించారు.తొలిసారి ఓటర్లు, వృద్ధులు పెద్దఎత్తున పోలింగ్‌లో పాల్గొన్నారని, దీంతో గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. సా.6 గంటల దాటిన తర్వాత కూడా 3,500 పోలింగ్ స్టేషన్లలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, రాత్రి 8.30 గంటలకు కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ముగిసిందని మీనా తెలిపారు. మరో 360 పోలింగ్ స్టేషన్లలో రాత్రి 10.30 గంటల వరకు పోలింగ్ కొనసాగిందన్నారు. దీంతో తుది పోలింగ్ శాతం మంగళవారం ప్రకటిస్తామని, సాయంత్రం ఐదు గంటలకు 68.04 శాతం నమోదైందని మీనా తెలిపారు. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం, గాలివాన బీభత్సాలతో పోలింగ్ మందకొడిగా సాగిందన్నారు.చెదురుమదురు సంఘటనలుఇక రాష్ట్రంలో ఎటువంటి హింసాత్మక సంఘటనలు, రీపోలింగ్ లేకుండా ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల సంఘం గత కొన్ని నెలలుగా చేసిన కసరత్తు సత్ఫలితాలిచి్చందని మీనా చెప్పారు. పల్నాడు, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతాయన్న భావనతో ముందస్తు భద్రత ఏర్పాట్లు చేశామని.. దీంతో సంఘటన జరిగిన వెంటనే స్పందించి వాటిని అదుపులోకి తెచ్చామన్నారు. ఈ సంఘటనలకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారన్నారు. వివిధ ప్రాంతాల్లో మొత్తం 11 ఈవీఎంలను ధ్వంసం చేయగా వాటిని భెల్ అధికారులు పరిశీలించి అందులోని డేటా సురక్షితంగా ఉందని నిర్థారించడంతో రీపోలింగ్ అవసరంలేకుండా కొత్త ఈవీఎంలతో పోలింగ్‌ను కొనసాగించినట్లు తెలిపారు.కౌంటింగ్ సమయంలో ఈ రెండు ఈవీఎంల డేటాను పరిగణనలోకి తీసుకుంటారని మీనా స్పష్టంచేశారు. అత్యధికంగా పల్నాడు జిల్లాలో 12 హింసాత్మక సంఘటనలు జరిగాయన్నారు. తెనాలి, నరసరావుపేటల్లో ఎమ్మెల్యేలను.. అనంతపురంలో ఇరుపార్టీల అభ్యర్థులను గృహనిర్భందం చేయడం ద్వారా ఉద్రిక్త వాతావరణాన్ని నియంత్రించినట్లు ఆయన తెలిపారు. ఇక పుంగనూరులో జరిగిన సంఘటనలో నిందితులను వదిలేసిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. పీలేరులో ఏజెంట్ల కిడ్నాప్ విషయం దృష్టికి రాగానే పోలీసులు రంగం ప్రవేశంచేసి వారిని తీసుకొచ్చి పోలింగ్ కొనసాగించినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే.. మంగళవారం పోలింగ్ పరిశీలకులు, రాజకీయ పార్టీలతో 17ఏ స్రూ్కటినీ పూర్తయిన తర్వాత రీ–పోలింగ్‌పై ఒక స్పష్టత వస్తుందని మీనా చెప్పారు. స్ట్రాంగ్ రూమ్‌కు చేరుకున్న ఈవీఎంలుఇక ఎన్నికల ప్రక్రియ పూర్తియిన చోట్ల ఈవీఎం మిషన్లను పటిష్ట బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చినట్లు మీనా తెలిపారు. కొన్నిచోట్ల 10.30 వరకు పోలింగ్ కొనసాగే అవకాశం ఉండటంతో అక్కడ అర్థరాత్రి దాటిన తర్వాత ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌కు చేరుకుంటాయన్నారు. ఈవీఎంలను రాజకీయ పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపర్చి ఆ తాళాలను సీఆర్పీఎఫ్ వారికి అందిస్తారన్నారు. 24 గంటలూ కెమెరాల పర్యవేక్షణలో స్ట్రాంగ్‌రూమ్‌లు ఉంటాయని, రాజకీయ పార్టీలకు చెందిన వారు కూడా అక్కడ 24 గంటలు కాపలాగా ఉండటానికి అనుమతిస్తామన్నారు.ఓటు హక్కు వినియోగించుకున్న మీనారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా సోమవారం ఉ.7.30కు తన ఓటు హక్కును విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని రైల్వే ఫంక్షన్ హాల్లో వినియోగించుకున్నారు. -
బీజేపీలో సీనియర్లకు సీటులేదు!
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ : పొత్తులో భాగంగా రాష్ట్రంలో పది అసెంబ్లీ స్థానాలకు పోటీచేయనున్న బీజేపీ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ మేరకు ఏపీ లోక్‌సభ ఎన్నికల ఇంచార్జ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక మాజీ ఎంపీ, ఇద్దరు మాజీమంత్రులు, ఒక జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యేలకు ఈ జాబితాలో చోటుదక్కింది. కానీ, రెండు మూడు దశాబ్దాలకు పైగా పార్టీనే నమ్ముకున్న కొందరు ముఖ్యమైన సీనియర్లకు మాత్రం అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలోనూ తీవ్ర నిరాశే మిగిలింది. మొన్న పార్లమెంట్ అభ్యర్థుల జాబితాలోనూ టికెట్ దక్కని పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజుతో పాటు ప్రస్తుత రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్సీ మాధవ్, విష్ణువర్థన్‌రెడ్డి, పరిపూర్ణానంద స్వామికి కూడా ఈ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో రిక్తహస్తమే మిగిలింది. బీజేపీలో చంద్రబాబుకు అనుకూలమన్న వ్యక్తులుగా పేరున్న నాయకులకు మాత్రం సీట్లు దక్కాయని అసలైన బీజేపీ నేతలు మండిపడుతున్నారు. నచ్చిన వారికి అనుకూలంగా పురందేశ్వరి నివేదికలు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తనకు నచ్చిన వలస నేతలకు.. నిన్న మొన్నటి వరకు పార్టీతో సంబంధంలేని వారికి టికెట్లు ఇప్పించుకున్నారని ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న అసలైన బీజేపీ సీనియర్ నాయకులు ఆరోపిస్తున్నారు. తాను అనుకున్న వారికి అనుకూలంగానే ఆమె జాతీయ నాయకత్వానికి నివేదికలు పంపి వారికి టికెట్లు దక్కేలా చేసుకున్నారని వారు మండిపడుతున్నారు. నిజానికి.. బీజేపీ జాబితాలో బద్వేలు అభ్యర్థిగా ప్రకటించిన రోశన్న అభ్యర్థుల ప్రకటనకు ఒకరోజు ముందే పార్టీలో చేరారని వారు చెప్పారు. అలాగే, రెండు మూడ్రోజుల క్రితం వరకు ఆయన టీడీపీ నియోజకవర్గ ప్రధాన నాయకుడిగా కొనసాగారని.. అసలు పొత్తులో బద్వేలు స్థానాన్ని బీజేపీ ఎందుకు కోరుకోవాల్సి వచ్చిందో.. టీడీపీ నేతను హడావుడిగా పార్టీలో చేర్చుకుని అతనికెందుకు సీటు ఇవ్వాల్సి వచ్చిందో రాష్ట్ర పార్టీలో చాలామందికి అంతుబట్టడంలేదు. ఇప్పుడు బీజేపీలో ఇది హాట్‌టాపిక్‌గా మారింది. నిజానికి.. చాలా నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు బీజేపీ నాయకులు రెండు మూడేళ్లుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ కష్టపడిన వారి స్థానాలను పట్టించుకోకుండా.. చంద్రబాబు ఇస్తామన్న స్థానాల్లో తనకు అనుకూలమైన వారి పేర్లను పురందేశ్వరి జాతీయ నాయకత్వానికి నివేదికలు పంపారని వారు ఆరోపిస్తున్నారు. పదిలో ఆరుగురు వలస నేతలే.. ఇక 2019 ఎన్నికలు వరకు తెలుగుదేశంలో ఉండి, ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే తాత్కాలిక పునరావాసం కోసం బీజేపీలో చేరిన చంద్రబాబు సొంత మనుషులు సుజనా చౌదరి, ఆదినారాయణరెడ్డి వంటి నాయకులు పొత్తులో బీజేపీకి దక్కిన స్థానాల్లో సీట్లు ఎగరేసుకెళ్లారని ఆ నాయకులు ఆవేదన చెందుతున్నారు. కైకలూరు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు మరో నమ్మినబంటు కామినేని శ్రీనివాస్ సైతం 2014 ఎన్నికల సమయంలో బీజేపీ–టీడీపీ పొత్తు ఖాయమని తెలిశాక కమల దళంలో చేరి ఆ ఎన్నికల్లో గెలుపొందాక ఉమ్మడి ప్రభుత్వంలో మంత్రి పదవి అనుభవించారన్నారు. అలాగే.. 2019లో టీడీపీ–బీజేపీ మధ్య పొత్తులేకపోవడంతో ఆయన తిరిగి బీజేపీ తరఫున పోటీచేసేందుకు విముఖత వ్యక్తంచేసి ఎన్నికలకు దూరంగా ఉన్నారని తాజాగా సీట్లు దక్కని బీజేపీ నాయకులు గుర్తుచేస్తున్నారు. ఇక పార్టీ ప్రకటించిన పది స్థానాల్లో అరకు, అనపర్తి, విశాఖ పశ్చిమ స్థానాల అభ్యర్థులు మినహా మిగిలిన ఏడు స్థానాల అభ్యర్థులు కేంద్రంలో బీజేపీ అధికారం ఖాయమని స్పష్టంగా తెలిసిన తర్వాత పదేళ్ల క్రితం పార్టీలో చేరిన నాయకులని చెబుతున్నారు. ధర్మవరం అభ్యర్థిగా ప్రకటించిన సత్యకుమార్ మొదట నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా కొనసాగిన వ్యక్తి. అప్పట్లో ఆయన అసలు పార్టీ నాయకుడిగా పనిచేయలేదని, ఒకవేళ అతణ్ణి మొదటి నుంచి పార్టీలో కొనసాగిన వ్యక్తిగా పరిగణించినా మిగిలిన ఆరుగురు వలస నేతలేనని బీజేపీలో చర్చ సాగుతోంది. -
కుల గణితంలో... హస్తవ్యస్తమే..!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ అసెంబ్లీ ఎన్నికల పోరు సాగుతున్న మధ్యప్రదేశ్‌లో కులాల కుంపట్లు హస్తం పార్టీకి ప్రతికూలంగా మారేలా కన్పి స్తున్నాయి. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగల అగ్రకులాలు అండగా లేకపోవడం కాంగ్రెస్‌కు ఈసారీ నష్టం చేస్తుందంటున్నారు. వారి మద్దతు కూడగట్టుకునేందుకు పార్టీపరంగా పెద్దగా ప్రయత్నాలు కూడా జరగడం లేదు. దాంతో ఈసారి కూడా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లపైనే ప్రధానంగా ఆధారపడాల్సిన పరిస్థితి! సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలోకి ఫిరాయించిన తర్వాత ఉన్నత వర్గాలను ఆకట్టుకునేలా చర్యలేవీ లేకపోవడం కూడా కాంగ్రెస్ విజయావకాశాలను ప్రభావితం చేసేలా కన్పి స్తోంది... అగ్రకులాలు.. గట్టి శక్తే మధ్యప్రదేశ్ జనాభాలో అగ్ర కులాలు 14 శాతం వరకు ఉన్నాయి. వీరిలో 6 శాతం బ్రాహ్మణులు, 5.8 శాతం రాజపుత్రులు 2.5 బనియాలున్నారు. రాష్ట్రంలో 10కి పైగా జిల్లాల్లో ఏకంగా 80కి పైగా అసెంబ్లీ స్థానాల్లో ఫలితాలను అగ్రవర్ణాల ఓట్లు గట్టిగా ప్రభావితం చేయగలవు. గ్వాలియర్, నర్సింగఢ్, రేవా, సారన్‌గఢ్, కంకేర్ ప్రాంతాల్లో అగ్రకులాలదే ఆధిపత్యం. ఇక మధ్యప్రదేశ్‌లో ఓబీసీలు 42 శాతం, ఎస్టీలు 21 శాతం, ఎస్సీలు 14 శాతం దాకా ఉన్నారు. క్రమంగా దూరం... మధ్యప్రదేశ్‌లో అగ్రవర్ణాలన్నీ నిజానికి 2003 వరకు కాంగ్రెస్‌తోనే సాగాయి. ఆ తర్వాత నుంచి పలు కారణాలతో క్రమంగా పార్టీకి దూరమవుతూ వస్తున్నారు... రాష్ట్రంలో బీజేపీ హవా పెరుగుతున్న కొద్దీ కాంగ్రెస్‌కు అగ్ర కుల ఓట్లు బాగా తగ్గుతూ వచ్చాయి. 1990 వరకు అగ్రకుల ఓట్లలో కాంగ్రెస్ 40 శాతం దాకా రాబడుతూ వచ్చింది. 2003 నాటికి ఇది సుమారు 37 శాతానికి పరిమితమైంది. 2008లో అగ్రవర్ణ ఓటర్లలో కేవలం 19 శాతం మంది మాత్రమే కాంగ్రెస్‌కు ఓటేశారు. దాదాపు 45 శాతం మందికి పైగా బీజేపీకి జై కొట్టారు. 2013లో అగ్ర కుల ఓట్లలో బీజేపీకి 59 శాతం, కాంగ్రెస్‌కు 24 శాతం దక్కాయి. 2018లో కాంగ్రెస్ కాస్త మెరుగైన ఫలితాలే సాధించింది. అగ్రవర్ణ ఓట్లలో కాంగ్రెస్ 33 శాతం సాధించింది! అయితే బీజేపీకి ఏకంగా 58 శాతం ఓట్లు పడ్డాయి. సింధియా నిష్కమణతో... 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు 15 నెలలకే షాక్ తగిలింది. తనను కాదని కమల్‌నాథ్‌ను సీఎం చేయడంపై ముందునుంచీ తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా అదను చూసి దెబ్బ కొట్టారు. 2020లో ఏకంగా 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరిపోయారు! దాంతో కమల్‌నాథ్ సర్కారు కుప్పకూలడం, శివరాజ్‌సింగ్ చౌహాన్ సీఎంగా బీజేపీ అధికార పగ్గాలు చేపట్టడం చకచకా జరిగిపోయాయి. సింధియా నిష్కమణతో అగ్ర వర్ణాలతో కాంగ్రెస్‌కు దూరం మరింత పెరిగింది. వారిని పార్టీకి దగ్గర చేసేందుకు సీనియర్ నాయకుడు దిగ్విజయ్‌సింగ్ చొరవ చూపినా పెద్దగా లాభం లేకపోయింది. ఆయన ప్రయత్నాలకు పార్టీ అధిష్టానం నుంచి పెద్దగా సహకారం కూడా లభించలేదంటారు. ఆ కులాల మీదే దృష్టి! రాష్ట్రంలో 42 శాతానికి పైగా ఉన్న ఓబీసీలు, 35 శాతం దాకా ఉన్న ఎస్సీ, ఎస్టీల ఓట్లపైనే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంటూ వస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ, పీసీసీ చీఫ్ కమల్ నాథ్ తదితరులు కూడా తమ ఎన్నికల వ్యూహాల్లో అదే చెబుతూ వస్తున్నారు. ఈ సామాజిక వర్గాల ఓట్లమీదే ప్రధానంగా దృష్టి పెట్టాలని అభ్యర్థులకు పదేపదే నొక్కిచెబుతూ వచ్చారు... అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బిహార్ తరహాలో కులగణన జరుపుతామని ఇప్పటికే ప్రకటించారు. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ల హామీ ఇచ్చారు. ఈసారి ఎన్నికల్లో ఓబీసీలకు 62 టికెట్లు, ఎస్టీలకు 34, ఎస్సీలకు 18 టికెట్లు కాంగ్రెస్ కేటాయించింది. ఓబీసీల్లోనూ ఈజీ కాదు...! అయితే కేవలం ఓబీసీ, ఇతర కులాల దన్నుతో గత ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఓట్లను అధిగమించడం కాంగ్రెస్‌కు అంత సులువు కాదని గణాంకాలు చెబుతున్నాయి... 2008 అసెంబ్లీ ఎన్నికల్లో ఓబీసీల్లో బీజేపీ 41% శాతం ఓట్లను సాధించింది. కాంగ్రెస్‌కు దక్కింది 27 శాతమే. 2013 ఎన్నికల్లోనూ ఓబీసీ ఓట్లలో కాంగ్రెస్‌కు 35 శాతం రాగా బీజేపీ 44 శాతం ఓట్లు సాధించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి 48 శాతం ఓబీసీ ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 41శాతం వచ్చాయి. ఇక ఎస్సీ, ఎస్టీ ఓట్లలోనూ కాస్త అటూ ఇటుగా ఇదే ధోరణి ప్రతిఫలించి. ఈ నేపథ్యంలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లతోనే గట్టెక్కాలనుకోవడం సాహసమేనని కాంగ్రెస్ వర్గాలే అంటున్నాయి! -
పరామర్శకైనా పనికిరామా?
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న క్రమంలో బీజేపీలో టికెట్ల చిచ్చు రగులుతోంది. రెండు జాబితాల్లో కలిపి 53 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాక, నవంబర్ 1న మూడో జాబితా వెలువడనున్న నేపథ్యంలో బీజేపీ టికెట్లు ఆశించి భంగపడిన పలువురిలో అసంతృప్తి వ్యక్త మౌతోంది. మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో కనీసం 60–70 చోట్లయినా సీరియస్‌గా టికెట్ ఆశిస్తున్న వారు ఇద్దరు, ముగ్గురున్నప్పుడు అభ్యర్థిత్వం ఖరా రుకాని వారిని పిలిచి మాట్లాడే పరిస్థితి పార్టీలో లేకపోవడాన్ని తప్పుబడు తున్నారు. గతంలో టికెట్ రాని వారికి నచ్చజెప్పి పార్టీ కోసం పని చేసేలా ఒప్పించిన పరిస్థితులుండగా ఇప్పుడు జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు పట్టించుకోక పోవడం సరికాదని మండిపడుతున్నారు. కనీసం బుజ్జగింపులు, నచ్చజెప్ప డాలు వంటి వాటికి కూడా తాము నోచుకోలేదని పలువురు బీజేపీ నేతలు వాపోతున్నారు. పరామర్శకైనా తాము పని కిరామా అని ఆవేదన చెందుతున్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే పార్టీ విజయం సాధ్యమనే విష యాన్ని నాయకులు విస్మరించారని అంటున్నారు. గుర్తింపుపై భరోసా ఏదీ? ఇప్పుడు వివిధ సమీకరణల మధ్య టికెట్ ఇవ్వలేక పోయామని, భవిష్యత్‌లో గుర్తింపు లభిస్తుందని భరోసా కల్పించకపోవడంపైనా పలువురు కమలనాథులు రుసరుసలాడుతున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పోస్టులు ఇస్తామనే హామీ కూడా ఇవ్వకపోవడం దేనికి సంకేతమని అంటున్నారు. అలాంటప్పుడు ఆశావహుల నుంచి దరఖాస్తులు కోరాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో పోటీకి ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని నాయకత్వం కోరడంతో రికార్డు స్థాయిలో 6,003 దరఖాస్తులు వచ్చాయి. వారిలో తొలి జాబితాలో టికెట్లు దక్కని వారిని పార్టీపరంగా అనునయించే ప్రయత్నమేదైనా జరిగిందా అని నిలదీస్తున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి వెంటనే అవకాశం కల్పించి, ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరిస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. రాజీనామా చేస్తానని ప్రకటించినా... ముథోల్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి రాజీనామా చేస్తానని ప్రకటించాక కూడా ఎవరూ సర్దిచెప్పే ప్రయత్నం చేయలేదనే చర్చ పార్టీ వర్గాల్లో సాగు తోంది. తొలిజాబితాలో తనకు ఆందోల్ టికెట్‌ను ప్రకటించకపోవడంపై మాజీ మంత్రి బాబూ మోహన్ ఇప్పటికే ఆందోళన వ్యక్తంచేశారు. ఏదైనా భరోసా దొరుకుతుందేమోనని ముఖ్యనేతలకు ఫోన్ చేసినా వారి నుంచి స్పందన కరువైందని ఆయన వాపోయారు. వరంగల్(పశ్చిమ) నుంచి రావు పద్మకు టికెట్ కేటాయించడంతో... టికెట్ ఆశించి భంగపడిన అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి రెబెల్‌గా పోటీచేస్తానని ప్రకటించారు. అయినా ఆయనను నచ్చజెప్పేందుకు ఏ ఒక్కరూ ప్రయత్నించకపోవడం చర్చనీయాంశమైంది. ఇదే తరహా పరిస్థితులు మరికొన్ని నియోజక వర్గాల్లోనూ ఉన్నాయి. తదుపరి జాబితా ప్రకటించే సమయంలోనైనా టికెట్లు ఆశిస్తున్న ముఖ్యనే తలతో పార్టీ పెద్దలు మాట్లాడాలని ఓ ముఖ్యనేత సాక్షితో చెప్పారు. -
పెండింగ్ 19పై నేడు భేటీ
సాక్షి, హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న 19 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌పార్టీ సోమ వారం తుది చర్చలు జరపనుంది. వామపక్షాలతో పొత్తుతో పాటు పోటీ తీవ్రంగా ఉన్న ఈ స్థానాల్లో ఏం చేయాలన్న దానిపై ఢిల్లీ వేదికగా నేతలు సమా వేశం కానున్నారు. ఈ భేటీ కోసం టీపీసీసీ నేతలు ఆదివారమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఏఐసీసీ కార్యాలయంలోని వార్ రూంలో పార్టీ అధిష్టానంతో జరిగే సమావేశానంతరం సోమవారం రాత్రి లేదంటే మంగళవారం తుది జాబితా వస్తుందని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి. లెఫ్ట్‌తో ‘లెఫ్టా.. రైటా?’ లెఫ్ట్ పార్టీలతో పొత్తుల విషయంలోనూ సోమవారం జరిగే సమావేశాల్లో స్పష్టత వస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి. ముఖ్యంగా సీపీఎం పార్టీతో పీటముడి పడిన వైరా, మిర్యాలగూడ స్థానాల్లో ఏం చేయాలన్న దానిపై కాంగ్రెస్ నేతలు నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు సీపీఐకి ఇవ్వాలనుకుంటున్న కొత్తగూడెం, చెన్నూరు సీట్ల విషయంలోనూ తేడా వచ్చిందనే చర్చ జరుగుతోంది. వివేక్ కుమారుడికి చెన్నూరు సీటు? చెన్నూరు స్థానాన్ని మాజీ ఎంపీ వివేక్ కుమారుడికి కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని, ప్రస్తుతం బీజేపీలో ఉన్న వివేక్‌ను పార్టీలో చేర్చుకుని ఆయన్ను పార్లమెంటుకు పోటీ చేయించాలని కాంగ్రెస్ ప్రతిపాదిస్తోందని సమాచారం. ఈ మేరకు శనివారమే మొయినాబాద్‌లోని వివేక్ ఫాంహౌస్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, వివేక్‌లు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో సీపీఐకి చెన్నూరు అసెంబ్లీ కేటాయించడం కష్టమేనని, సీపీఐ, సీపీఎంలకు చెరొక్క సీటును మాత్రమే కాంగ్రెస్ ఆఫర్ చేస్తుందని, ఇందుకు ఆ పార్టీలు అంగీకరిస్తే కలిసి ముందుకెళ్లవచ్చని, లేదంటే ఎవరి దారిలో వారు వెళ్లాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలంటుండడం గమనార్హం. -
చెరొక్కటి మాత్రమే..!
-
కంగుతిన్న కామ్రేడ్లు...!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల వేళ బీఆర్ఎస్తో చిగురించిన వామపక్షాల పొత్తు అంతలోనే వాడిపోయింది. రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొనే దమ్మున్న పార్టీ కేవలం బీఆర్ఎస్ మాత్రమే అని విశ్వసించిన కమ్యూనిస్టు పార్టీలు బీఆర్ఎస్ అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ప్రకటనతో కంగుతిన్నాయి. మునుగోడు ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో మాట్లాడుతూ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్తో కమ్యూనిస్టుల పొత్తు కొనసాగుతుందని చెప్పారు. తీరా ఇప్పుడు వామపక్షాలను పరిగణనలోకి తీసుకోకుండా బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంపై వామపక్షాల నాయకులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో బీఆర్ఎస్తో పొత్తులేదని స్పష్టం కావడంతో ఎలక్షన్లకు ఎలా సన్నద్ధం కావాలో తేల్చుకునేందుకు వామపక్షాలు తర్జనభర్జన పడుతున్నాయి. కార్యాచరణపై సమావేశాలు బీఆర్ఎస్ వైఖరితో కంగుతిన్న సీపీఎం, సీపీఐ పార్టీ లు భవిష్యత్ కార్యాచరణ కోసం మంగళవారం సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాయి. ఇందులోభాగంగా సీపీఎం, సీపీఐ రాష్ట్ర పార్టీ కార్యాలయాల్లో ముఖ్యనేతలతో చర్చలు జరిపి ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ముందుగా రెండు పార్టీలు విడివిడిగా సమావేశమైన తర్వాత ఉమ్మడి గా సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్నాయి. ఇందులోభాగంగా మేథోమథనానికి సిద్ధమయ్యా యి. ఏదేమైనా ఈసారి కలిసి ఉండాలని నిర్ణయించుకున్న వామపక్ష పార్టీలు అతి త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టార్గెట్ బీజేపీ: వామపక్షాల ప్రధాన ప్రత్యర్థి బీజేపీ. దేశంలో బీజేపీని ఎదుర్కొనేందుకు కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకత్వం కాంగ్రెస్‌తో జతకట్టింది. కానీ రాష్ట్రంలో బీజేపీని గట్టిగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర నాయకత్వం బీఆర్ఎస్తో కలిసి నడిచింది. మునుగోడు ఎన్నికల్లో బీజేపీని ఎదిరించడంలో వామపక్షాల పాత్ర కీలకంగా ఉందని, అందుకే పొత్తు పొడిచిందని కామ్రేడ్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ పార్టీతో పొత్తు ముగియడంతో ప్రత్యామ్నాయ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. దేశంలో జత కట్టిన కాంగ్రెస్‌తో ఇప్పుడు పొత్తులు కొనసాగించే అంశంపై నేటి సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ప్రత్యర్థి పార్టీతో పొత్తులు సాగించిన కామ్రేడ్లతో రాష్ట్ర కాంగ్రెస్ కలిసిపోతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో జాతీయ నాయకత్వంపై ఒత్తిడి చేసే కోణంలోనూ వామపక్ష నేతలు యోచిస్తున్నారు. బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందన్న సమయంలో తమకు మూడోవంతు సీట్లు కేటాయించాలని కా మ్రేడ్లు డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్‌తో పొత్తు సమయంలో సీట్ల సంఖ్యను ఏమేరకు పరిమితం చేయాలనే అంశంపైనా చర్చించనున్నట్లు తెలిసింది. మరోవైపు పొత్తులు లేకుండా ఉమ్మడిగా పోటీ చేసే అంశంపైనా చర్చించనున్నారు. ఇప్పటివరకు చెరో పాతిక స్థానాల్లో పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సీపీఐ, సీపీఎంలు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాయో వేచిచూడాలి. -
బీఆర్ఎస్లో సీట్ల కేటాయింపుపై సస్పెన్స్.. ఆ 70 మంది పరిస్థితేంటి?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను వేగవంతం చేసిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. పోటీలో ఉండే అభ్యర్థులు ఒక్కొక్కరికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు, దశాబ్ది ఉత్సవాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇతర ఆశావహుల పనితీరు ఆధారంగా జాబితాపై కసరత్తు చేస్తున్నారని అంటున్నాయి. స్పష్టత వచ్చిన అభ్యర్థులకు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివిధ సందర్భాల్లో పరోక్షంగా పోటీ చేసేది మీరేనంటూ సంకేతాలు ఇస్తున్నారని వివరిస్తున్నాయి. 20 స్థానాల్లో సిట్టింగ్‌లకు గ్రీన్‌సిగ్నల్.. ఇప్పటివరకు సుమారు 20 అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు మరో అరడజను స్థానాల్లో కొత్త అభ్యర్థులకు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని స్పష్టం చేస్తున్నాయి. ఇదే తరహాలో పార్టీ, అధికారిక కార్యక్రమాల్లో మరికొందరు అభ్యర్థుల పేర్లనూ పరోక్షంగా క్లియర్ చేయాలని భావిస్తున్నారని చెప్తున్నాయి. మొత్తంగా జూలై నెలాఖరులోగా అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే అవకాశం ఉందని అంటున్నాయి. పనితీరు బాగోలేని, వ్యతిరేకత మూటగట్టుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలు, విపక్షాల వ్యూహాలను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని స్థానాలు కలిపి.. 20–30 సీట్లలో అభ్యర్ధులపై చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగే పరిస్థితి ఉందని వివరిస్తున్నాయి. ఏదో ఓ కార్యక్రమంలో.. సంకేతాలిస్తూ.. కేసీఆర్, కేటీఆర్ ఇటీవల జిల్లా పర్యటనలు, సభలు, సమావేశాల్లో పార్టీ అభ్యర్థుల విషయంలో సంకేతాలు ఇస్తూ ఇస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్ (కరీంనగర్)తోపాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు (కూకట్పల్లి), గండ్ర వెంకటరమణారెడ్డి (భూపాలపల్లి), ఆరూరి రమేశ్ (వర్ధన్నపేట), ఒడితెల సతీశ్‌కుమార్ (హుస్నాబాద్), దాస్యం వినయభాస్కర్ (వరంగల్ పశ్చిమ), నల్లమోతు భాస్కర్‌రావు (మిర్యాలగూడ) ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు గువ్వల బాలరాజు (అచ్చంపేట), ఆల వెంకటేశ్వర్‌రెడ్డి (దేవరకద్ర), జాజాల సురేందర్ (ఎల్లారెడ్డి), మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం), సండ్ర వెంకట వీరయ్య (సత్తుపల్లి), ఆశన్నగారి జీవన్‌రెడ్డి (ఆర్మూరు), బిగాల గణేశ్ గుప్తా (నిజామాబాద్ అర్బన్), షకీల్ అహ్మద్ (బోధన్), మర్రి జనార్దన్‌రెడ్డి (నాగర్‌కర్నూల్), బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (గద్వాల)లకు కూడా గ్రీన్‌సిగ్నల్ లభించినట్టు తెలిసింది. అక్కడక్కడా ఆశావహులకు చాన్స్! అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు సుమారు 70 మంది ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. ఆశావహుల్లో పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్, ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్ పర్సన్లు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. ఇలా తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ వీలైనచోట ఆశావహుల పేర్లను పరోక్షంగా కేసీఆర్ ఖరారు చేస్తున్నారు. ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిషాంక్ ఇప్పటికే సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి సంకేతాలు అందడంతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కూడా దుబ్బాక నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు. వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ స్థానంలో చల్మెడ లక్ష్మీనర్సింహారావు రంగప్రవేశం చేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. శనివారం వేములవాడలో యువ సమ్మేళనం నిర్వహించి కేసీఆర్ ఆశీర్వాదంతోనే ముందుకు వెళ్తున్నట్టు ప్రకటించారు. జహీరాబాద్‌లో ఎమ్మెల్యే మాణిక్‌రావు స్థానంలో కొత్తవారికి అవకాశం దక్కుతుందనే ప్రచారం నేపథ్యంలో.. ఎర్రోళ్ల శ్రీనివాస్ స్థానిక నేతలను కలుస్తుండగా, ఢిల్లీ వసంత్ జయహో జహీరాబాద్ పేరిట ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తున్నారు. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీచేసిన బోయినపల్లి వినోద్‌కుమార్, మల్కాజిగిరి అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డిలకు వచ్చే ఎన్నికల్లోనూ మీరే అభ్యర్ధులు అంటూ సంకేతాలు అందాయి. ఇది కూడా చదవండి: పోడు రైతులకు 30 నుంచి పట్టాల పంపిణీ -
ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ముగిసిన పోలింగ్
సాక్షి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలోని అంధేరి(తూర్పు)లో అత్యల్పంగా 31.74% పోలింగ్ నమోదైంది. బిహార్‌లోని మొకామాలో 53.45%, గోపాల్‌గంజ్‌లో 51.48%, హరియాణాలోని ఆదంపూర్‌లో 75.25%, యూపీలోని గోలా గోరఖ్‌నాథ్‌లో 57.35%, ఒడిశాలోని ధామ్‌నగర్‌లో 66.63% పోలింగ్ నమోదైంది. స్వల్ప ఘటనలు మినహా మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని అధికారులు తెలిపారు. పోటీ ప్రధానంగా బీజేపీకి, ప్రాంతీయ పారీ్టలకు మధ్యనే నడిచింది. అంధేరి(తూర్పు) నియోజకవర్గ శివసేన అభ్యర్థి రుతుజా లట్కే గెలవచ్చు.. శివసేనకు ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు ఇస్తుండటంతోపాటు బీజేపీ అభ్యర్థి బరి నుంచి వైదొలిగారు. శివసేన ఎమ్మెల్యే రమేశ్ లట్కే మృతి చెందడంతో ఆయన భార్య పోటీలో ఉన్నారు. ఉప ఎన్నికలు జరిగిన 7 స్థానాల్లో బీజేపీకి 3, కాంగ్రెస్‌కు 2, శివసేనకు ఒకటి, ఆర్జేడీకి చెందిన ఒక సిట్టింగ్ సీటు ఉన్నాయి. 6న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు అన్ని భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు మరింత పటిష్ఠం చేశారు. గుర్తింపు కార్డు, ఓటర్ స్లిప్‌లను పరిశీలించి ఓటర్లను పోలింగ్ బూత్‌లోకి అనుమతించారు. ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాలు (7) మహారాష్ట్ర-తూర్పు అంధేరి బిహార్-మోకమ బిహార్- గోపాల్‌గంజ్ హరియాణ-అదంపూర్ తెలంగాణ-మునుగోడు ఉత్తర్‌ప్రదేశ్- గోల గోకరన్నాథ్ ఒడిశా- ధామ్‌నగర్ మహారాష్ట్రలోని తూర్పు అంధేరి అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఉద్ధవ్ ఠాక్రే, షిండే నేతృత్వంలోని ప్రభుత్వానికి కీలకంగా మారింది. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యాక జరుగుతున్న తొలి ఎన్నిక ఇదే కావడం విశేషం. శివసేన ఎమ్మెల్యే రమేశ్ లాట్కే కొన్ని నెలల క్రితం మరణించడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. అంధేరి తూర్పులో ఆయన భార్య రుతుజా ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నిక నుంచి బీజేపీ తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. దీంతో శివసేన దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. హర్యానాలో మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ కుటుంబానికి అయిదు దశాబ్దాల కంచుకోటగా ఉన్న అదంపూర్‌లో మరోసారి పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఇక్కడ ఆయన మనవడు(కుల్దీప్ బిష్ణోయ్ కొడుకు) భవ్య బిష్ణోయ్ బీజేపీ తరపున పోటీలో నిలిచారు. గత ఆగష్టులో కుల్దీప్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. హిస్సార్ నుంచి మూడుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కేంద్ర మాజీ మంత్రి జై ప్రకాశ్‌ను కాంగ్రెస్ రంగంలోకి దించగా.. బీజేపీ నుంచి వచ్చిన సతేందర్ సింగ్‌ను ఆప్ తమ అభ్యర్థిగా నిలిపింది. ఇక బిహార్‌లో 'మహాఘట్బంధన్' ప్రభుత్వానికి ఇవి తొలి ఎన్నికలు. రాష్ట్రంలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు నెలల కిందట బీజేపీతో తెగతెంపులు చేసుకొని ఆర్జేడీతో కలిసి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చెదురుమదురు ఘటనలు.. రాజకీయ విమర్శల పర్వంతో ఈ ఏడు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. నవంబర్ 6న ఫలితాలు వెల్లడికానున్నాయి. -
ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంలో పిటిషన్
న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ మేరకు ఈసీ, ఏపీ, తెలంగాణకు నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఏపీలో అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచాలని పిటిషన్ దాఖలైంది. అయితే ఈ మధ్య జమ్మూ, కశ్మీర్లకు సంబంధించిన అసెంబ్లీ సీట్లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఒక డీలిమిటేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే జమ్మూలోనూ, కశ్మీర్‌లోనూ అసెంబ్లీ సీట్లను పెంచారు. ఈ నేపథ్యంలోనే ఏపీ, తెలంగాణలో కూడా అసెంబ్లీ సీట్లను పెంచాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. సెప్టెంబర్ 29న సుప్రీంకోర్టులో ఇందుకు సంబంధించిన కేసు విచారణ జరిగే అవకాశం ఉంది. చదవండి: (మార్గదర్శికేసులో రామోజీకి సుప్రీంకోర్టు నోటీసులు) -
ఎస్సీ నియోజకవర్గాల్లో గెలుపే కీలకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, నేతల పనితీరుపై జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపు వ్యవహారం జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో జరుగుతుందని స్పష్టంచేశారు. వివిధ నియోజకవర్గాల్లో ఎస్సీలతోపాటు ఇతర అన్ని సామాజికవర్గాల ప్రజలను బీజేపీవైపు మళ్లించడంతోపాటు టీఆర్ఎస్ సర్కార్ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పార్టీకి అనుకూలంగా మార్చుకునేలా కార్యాచరణ రూపొందించాలని ఆయన ముఖ్యనేతలకు సూచించారు. సోమవారం ఒక హోటల్లో జరిగిన పార్టీ ‘ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ’తొలి సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే ఎస్సీ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపే కీలకమని పేర్కొన్నారు. ‘మిషన్–19’పేరిట రాష్ట్రంలోని 19 ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ‘ఎస్సీ నియోజకవర్గాల్లో ఓట్ల శాతమే గెలుపోటములను నిర్ణయిస్తుంది. లోక్‌సభ ఎన్నికల్లోనూ అభ్యర్థుల గెలుపోటముల్లో ఎస్సీ నియోజకవర్గాల్లోని ఓట్లే కీలక పాత్ర పోషించాయి. అందుకు నా గెలుపే ఒక ఉదాహరణ. కరీంనగర్ ఎంపీ సీటు పరిధిలో చొప్పదండి, మానకొండూరు ఎస్సీ నియోజకవర్గాలున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చొప్పదండిలో 9 శాతం, మానకొండూరులో 2.52 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అదే పార్లమెంట్ ఎన్నికలొచ్చేసరికి చొప్పదండిలో 61 శాతం, మానకొండూరులో 51.5 శాతం ఓట్లు బీజేపీకి పోలయ్యాయి. అందుకే నేను దాదాపు లక్ష ఓట్లతో గెలవగలిగాను’అని సంజయ్ అన్నారు. ఎస్సీ ఓట్లను మాత్రమే కాకుండా ఇతర సామాజిక వర్గాల ఓట్లను కూడా రాబట్టేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఎస్సీ సమన్వయ కమిటీ చైర్మన్ ఎ.పి.జితేందర్ రెడ్డి, కమిటీ సభ్యులు ఒంటేరు జైపాల్, సీహెచ్ విఠల్, కాంచన కృష్ణతోపాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష తదితరులు పాల్గొన్నారు. -
ఒకే దేశం.. ఒకే చట్టం... మరి ఇదెక్కడి న్యాయం !
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రారంభించాలని, తెలంగాణలో ప్రస్తుతమున్న 119 అసెంబ్లీ సీట్లను 153కు పెంచాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్ బి.వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు జమ్మూకశ్మీర్‌లో మాత్రమే అసెంబ్లీ సీట్లు పెంచాలని ప్రయత్నించడం, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం ఆక్షేపణీయమని అన్నారు. అక్కడెలా పెంచుతారు హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో జూన్ 26 శనివారం వినోద్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు. ‘తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరితే 2026 వరకు అసెంబ్లీ సీట్ల పెంపు కుదరదని, అందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుందని ప్రధాని మోదీ బదులిచ్చారు. మరి ఇప్పుడు ఈ రాజ్యాంగ సవరణ అంశం జమ్మూ కశ్మీర్‌కు వర్తించదా?’అని వినోద్‌కుమార్ ప్రశ్నించారు. ఒకే దేశం... ఒకే చట్టం అంటే ఇదేనా అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో వెంటనే అసెంబ్లీ సీట్లు పెంచాలన్నారు. చదవండి : కశ్మీరీల్లో అపనమ్మకాన్ని తొలగించాలి -
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు లేదు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచే అవకాశం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. దీనిపై తుది నిర్ణయం కేంద్ర న్యాయ శాఖదేనని స్పష్టం చేశారు. ‘జమ్ము, కశ్మీర్ బ్లాక్ స్థాయి ప్రజాప్రతినిధులతో ఆయన గురువారం ఇక్కడ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మార్చి, ఏప్రిల్‌లో జమ్మూ కశ్మీర్లో పర్యటిస్తానని, జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియ ప్రారంభం కాలేదని, అసెంబ్లీ సీట్ల పెంపుపై ఆలోచన చేస్తున్నామని వివరిం చారు. మే నెలలో జమ్మూ కశ్మీర్ ‘ఔట్ రీచ్’కార్యక్రమం అమలు చేస్తామని, కేంద్ర మంత్రులంతా బ్లాక్ లెవల్‌కు వెళ్లి అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని వివరించారు. ఢిల్లీ ఘర్షణలపై సిట్..: ‘ఢిల్లీలో ప్రశాంత వాతావర ణం ఏర్పడింది. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నా యి. కర్ఫ్యూ ఎత్తేశారు. ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లపై విచారణకు ‘సిట్’(ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటైంది’అని కిషన్‌రెడ్డి వివరించారు. -
కొలిక్కిరాని కుస్తీ...
సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి) : తెలుగుదేశం పార్టీలో సీట్ల ఎంపిక ఇంకా కొనసా..గుతూనే ఉంది. చింతలపూడి, నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం, పోలవరం సీట్లకు సంబంధించి వివాదాల కారణంగా అభ్యర్థుల ఎంపిక ముందుకు సాగడం లేదు. సమన్వయ కమిటీ ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి సంబం ధించి మూడు, నాలుగు సార్లు సమీక్షలు నిర్వహించినా ఏకాభిప్రాయం రాలేదు. సోమవారం కూడా నిడదవోలు, కొవ్వూరు నాయకులను అమరావతి పిలిపించి సమన్వయ కమిటీ అభిప్రాయాలు సేకరించింది. అయితే అక్కడ ఏకాభిప్రాయం రాలేదు. సగంమంది కొవ్వూరులో మంత్రి జవహర్‌కు ఇవ్వడానికి ససేమిరా అనగా మిగిలిన వారు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పినట్లు సమాచారం. అదే సందర్భంలో నిడదవోలుపై కూడా పీటముడి వీడలేదు. ఒక వర్గం కుందుల సత్యనారాయణకు సీటు ఇవ్వాలని కోరగా, మరికొంతమంది శేషారావుకు మద్దతు పలికారు. దీంతో ఈ అంశాన్ని మరో రెండురోజులు వాయిదా వేశారు. ఘంటా మురళి చేరికను పురస్కరించుకుని చింతలపూడి నేతలు కూడా తమ నాయకుడి దృష్టిలో పడేందుకు అమరావతి వెళ్లారు. స్థానిక టీడీపీ శ్రేణుల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఇంకా ఖరారు చేయని విషయం తెలిసిందే. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న స్థానాలు, సీట్లు కేటాయించిన స్థానాల విషయంలో ముఖ్యమంత్రి అసంతృప్తులను బుజ్జగించేందుకు తంటాలు పడుతున్నారు. వాటిలో భాగంగా అసంతృప్తులను బుజ్జగించేందుకు రెండు కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం నుంచి నేతలందరితో చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. అసంతృప్తులు ఉన్న చోట్ల ఆయా నేతలను పిలిచి మాట్లాడుతున్నారు. నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అనుకూల, వ్యతిరేక వర్గాలను పిలిపించి మాట్లాడారు. ఎక్కడెక్కడ అసమ్మతి రగులుకుంటుందో ఆయా అసమ్మతి నేతలతో మాట్లాడి నామినేషన్లకు ముందుగానే అక్కడి పరిస్థితులను చక్కదిద్దడం, మార్పులు చేర్పులు చేయడం లాంటి అంశాలపై చంద్రబాబు కుస్తీ పడుతున్నారు. అయితే ఇరువర్గాలు తగ్గకపోవడంతో మళ్లీ నిడదవోలు, కొవ్వూరుపై రెండు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పి పంపించారు. చింతలపూడి, పోలవరం, గోపాలపురం నియోజకవర్గాలపై కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తాడేపల్లిగూడెంలో ఈలి నానికి టిక్కెట్ ఇస్తామని చెప్పడంతో జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గం తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. సీటు ఆశించిన మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి జనసేనలో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. మరోవైపు ఈ అసమ్మతి సద్దుమణిగేలా చేసేందుకు బాపిరాజుకు ఉంగుటూరు సీటు కేటాయిస్తే ఎలా ఉంటుందనే అంశంపై పార్టీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మంత్రి జవహర్‌కు మళ్లీ చుక్కెదురు కొవ్వూరు టీడీపీ అభ్యర్థి ఖరారు విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్‌కి మరోసారి చుక్కెదురైంది. సోమవారం నియోజకవర్గ నాయకులతో భేటీ అయిన సీఎం చంద్రబాబు అభ్యర్థి ఎంపిక అంశాన్ని మరో రెండు రోజులు పాటు వాయిదా వేశారు. జవహర్‌పై తీవ్ర వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వం ఖరారుపై అధిష్టానం సుముఖంగా లేనట్లు చెబుతున్నారు. అందుకే చంద్రబాబు సాగదీత ధోరణి అవలంభిస్తున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. జవహర్‌కి టిక్కెట్టు కేటాయిస్తే తాము సహకరించబోమని వ్యతిరేక వర్గీయులు పార్టీ అధినేత చంద్రబాబు ముందు తెగేసి చెబుతున్నట్టు సమాచారం. సోమవారం జరిగిన సమావేశంలో మరో రెండు రోజుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ప్రకటిస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు సమాచారం. ప్రయత్నాలు ముమ్మరం చేసిన ఆశావహులు మంత్రి జవహర్‌కి దాదాపుగా ఈసారి టిక్కెట్ ఇవ్వరన్న ప్రచారం ముమ్మరంగా సాగుతుండడంతో ఇక్కడ టిక్కెట్ ఆశిస్తున్న ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇరుపక్షాల నాయకులను ప్రసన్నం చేసుకుంటున్నారు. పార్టీ పెద్దలను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు తనకు గానీ తన కుమార్తె దివ్యరాణికి టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారు. రిటైర్డు ఉద్యోగులు రాపాక సుబ్బారావు, అయినపర్తి రాజేంద్రప్రసాద్, పెనుమాక జయరాజుతో పాటు వేమగిరి వెంకటరావు, బచ్చు శ్రీనుబాబు తదితరులు టికెట్ ఆశిస్తున్నారు. -
ఒక్కరికే అయితే ఎలా..
2014 సీన్ రిపీటవుతుందా..? మాజీ మంత్రి సబిత కుటుంబంలో ఈసారి కూడా ఒక్కరే పోటీచేస్తారా..? లేక ఇద్దరూ పోటీ చేసేందుకు అధిష్టానం అవకాశం కల్పిస్తుందా..? ఒకవేళ అనుకున్నది జరగకపోతే పటోళ్ల ఫ్యామిలీ ఆలోచన ఏంటి..? ఇవీ ఇప్పుడు జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్నలు. కుటుంబం నుంచి ఒక్కరికే పోటీచేసే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తుందన్న వార్తల నేపథ్యంలో సబిత ఎలాంటి వ్యూహంతో వెళతారనేది హాట్‌టాపిక్‌గా మారింది. అయితే, గతంలో పోటీ చేసిన వారికి మినహాయింపు ఉంటుందని, కొత్త వారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందన్న ప్రచారం కూడా పార్టీలో జరుగుతోంది. మొత్తంమీద ఏఐసీసీ ఆలోచన జిల్లా కాంగ్రెస్‌తో పాటు అన్ని రాజకీయ పార్టీల్లో చర్చకు దారి తీసింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కుటుంబంలో ఒక్కరికే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేస్తుండడం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఇరకాటంలో పడేస్తోంది. గత ఎన్నికల్లోనూ ఇదే నిబంధనతో సబిత పోటీకి దూరమయ్యారు. తాజాగా అదే నిబంధనను అధిష్టానం మరోసారి అమలు చేస్తుందేమోననే ఆందోళన సబిత కుటుంబంలో కనిపిస్తోంది. గత ఎన్నికల్లో సబిత మహేశ్వరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాల్సి ఉన్నా కుటుంబం నుంచి ఒక్కరే పోటీచేయాలని అధిష్టానం చెప్పడంతో ఆమె తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. తాను పోటీచేయకుండా తనయుడు కార్తీక్‌ను చేవెళ్ల లోక్‌సభ నుంచి బరిలోకి దించారు. ఇప్పుడు ఇద్దరూ పోటీచేయాలనే ఆలోచనలో ఉన్నారు. మహేశ్వరం నుంచి సబిత, రాజేంద్రనగర్ నుంచి కార్తీక్‌లు బరిలో నిలవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని కొంత కాలంగా పనిచేసుకుంటూ వెళుతున్నారు. కానీ, ఏఐసీసీ నుంచి అందిన తాజా ఖబర్ మళ్లీ సబితను డోలాయమానంలో పడేసింది. అయితే, అధిష్టానం విధించిన నిబంధనల్లోనూ కొన్ని సానుకూలతలు ఉండడం, తల్లీ, తనయులు అడిగే స్థానాల్లో సొంత పార్టీలో పెద్దగా పోటీ లేకపోవడంతో వారు బరిలో నిలిచే అవకాశాలుగా కనిపిస్తున్నాయి. సుఖాంతమేనా..? కుటుంబంలో ఒకరికే టికెట్టు ఇవ్వాలనే నిబంధన సబిత ఫ్యామిలీకి వర్తించేలా కనిపించడం లేదనే చర్చ కూడా జరుగుతోంది. అటు మహేశ్వరం.. ఇటు రాజేంద్రనగర్ నుంచి పోటీ చేయడానికి ఒకరిద్దరూ మినహా చెప్పుకోదగ్గ నేతలు ఆసక్తి చూపడం లేదు. ఇది వీరికి కలిసొచ్చే అంశం. దీనికితోడు ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్న తరుణంలో ఈ నిబంధనను తప్పనిసరిగా అమలు చేయకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. అంతేగాకుండా సబిత, కార్తీక్ ఇరువురు కూడా సీనియర్లు కావడం.. గతంలో పోటీచేసిన నేపథ్యం ఉండడంతో ఈ షరతుల నుంచి సడలింపులు ఉంటాయని తెలుస్తోంది. కేవలం కొత్తవారికి మాత్రమే ఈ నిబంధనను వర్తింపజేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ అధిష్టానం వీటిని పరిగణనలోకి తీసుకోకుండా ఆంక్షలు అమలు చేస్తే మాత్రం సబిత కుటుంబీకులకు ఇబ్బందులు కలగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే పరిస్థితి అనివార్యమైతే ఈసారి తల్లి కోసం తనయుడు బరి నుంచి తప్పుకునేందుకు సిద్ధమవుతారని తెలిసింది. గతంలో పోటీచేసిన కుటుంబాలకు కాకుండా కేవలం కొత్తవారికి మాత్రమే ఈ నిబంధన అమలు చేసే అవకాశముంది. తప్పదనుకుంటే అమ్మ కోసం ఈసారి టికెట్‌ను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా. – కార్తీక్‌రెడ్డి -
జెండా మోసినా టికెట్లు రాలేదు.. పదవీ ఇవ్వలేదు!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఉద్యమ ప్రస్థానంలో, అధికారం చేపట్టడంలో కీలకంగా వ్యవహరించిన నేతల్లో కొందరు ఇప్పటికీ ఎలాంటి గుర్తింపునకు నోచుకోవడం లేదు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలోనూ ఎలాంటి పదవులు పొందని వారు ప్రతి జిల్లాలో ఉన్నారు. నాలుగేళ్లు ఎదురు చూసినా పదవీ ఇవ్వలేదు.. టికెట్లూ రాలేదు. గత ఎన్నికల్లో ఓడిన వారి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఏదో ఓ పదవి వస్తుందని నాలుగేళ్లు ఎదురు చూసినా నిరాశే మిగిలింది. దీనికితోడు ఆ పార్టీ తాజాగా ప్రకటించిన జాబితాలో చోటు కూడా దక్కలేదు. ఇక పార్టీ సీనియర్ నేతల పరిస్థితి మరీ దయనీయం. ఉద్యమ సమయంలో పార్టీలో కీలకంగా వ్యవహరించి, గత ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన వారిని గెలిపించేందుకు పని చేసిన వారిలో కొందరు ఎలాంటి పదవులు లేకుండానే మిగిలిపోయారు. కీలకంగా పని చేసినా.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగిన జిల్లాలో కీలకంగా పని చేసి గుర్తింపునకు నోచుకోని నేతలు చాలా మందే ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో గుడిమల్ల రవికుమార్, జన్ను జకార్య, తక్కళ్లపల్లి రవీందర్రావు.. టీఆర్ఎస్ ప్రయాణంలో కీలకంగా పని చేశారు. వీరికి ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశంగానీ.. నామినేటెడ్ పోస్టులుగానీ దక్కలేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కీలక నేతగా ఉన్న పోశెట్టికీ ఇంకా గుర్తింపు రాలేదు. ఆర్మూరుకు చెందిన వినయ్‌కుమార్‌రెడ్డి, ఆరెంజ్ ట్రావెల్స్ సునీల్‌రెడ్డి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న ఓరుగంటి రమణారావుకూ నిరాశే మిగిలింది. రమణారావు 2001 నుంచి గత ఎన్నికల వరకు జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన బాలూరి గోవర్దన్‌రెడ్డికి కూడా ఎలాంటి పదవి దక్కలేదు. ఉమ్మడి మెదక్‌లోనూ.. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ గుర్తింపునకు నోచుకోని నేతలున్నారు. గత ఎన్నికల వరకు పటాన్చెరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఇన్చార్జిగా వ్యవహరించిన గాలి అనిల్‌కుమార్, నర్సాపూర్ నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించిన దేవేందర్‌రెడ్డికి ఇంకా పదవులు రాలేదు. టీఆర్ఎస్ మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన విఠల్‌రావు ఆర్యదీ ఇదే పరిస్థితి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉద్యమ సమయంలో కీలకంగా పని చేసిన నేతలకూ పదవులు రాలేదు. నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న బొల్లేపల్లి శ్రీనివాసరాజు, మిర్యాలగూడ సెగ్మెంట్లో కీలక నేత అన్నభీమోజు నాగార్జునచారి, హుజూర్నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ నేత సామల శివారెడ్డిలకు నిరాశే మిగిలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్కు మొదటి నుంచి కాస్త పట్టున్న కొత్తగూడెం నియోజకవర్గంలో పార్టీ కీలక నేతగా వ్యవహరించిన కంచర్ల చంద్రశేఖరరావుకు కూడా ఎదురు చూపులు తప్పడం లేదు. చేరిన వారికే చాన్స్ 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ 63 స్థానాల్లో విజయం సాధించింది. తర్వాత జరిగిన పాలేరు, నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లోనూ గెలిచింది. ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ సీపీ, బీఎస్పీ, సీపీఐ పార్టీల నుంచి 25 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు. తాజా ఎన్నికల్లోనూ వీరికి టీఆర్ఎస్ తాజా అభ్యర్థుల జాబితాలో చోటు దక్కింది. కానీ ఆయా నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున పోటీ చేసి ఓడిన నేతల్లో ఎక్కువ మందికి మాత్రం టికెట్ రాలేదు, నామినేటెడ్ పదవులూ రాలేదు. ఎం.సహోదర్‌రెడ్డి (పరకాల), ఎన్.సుధాకర్‌రావు (పాలకుర్తి), సత్యవతి రాథోడ్ (డోర్నకల్), శ్రీహరిరావు (నిర్మల్), కావేటి సమ్మయ్య (సిర్పూర్), దుబ్బాక నర్సింహారెడ్డి (నల్లగొండ), ఎ.అమరేందర్‌రెడ్డి (మిర్యాలగూడ), కొత్త మనోహర్‌రెడ్డి (మహేశ్వరం), కంచర్ల శేఖర్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం), కొలను హన్మంతరెడ్డి(కుత్బుల్లాపూర్), గొట్టిముక్కుల పద్మారావు (కూకట్పల్లి), కె.శంకర్‌గౌడ్ (శేరిలింగంపల్లి), స్వర్ణలత (రాజేంద్రనగర్), మురళీగౌడ్ (జూబ్లీహిల్స్), దండె విఠల్ (సనత్‌నగర్), గజ్జెల నగేశ్ (కంటోన్మెంట్), మందా శ్రీనాథ్ (అలంపూర్), బొమ్మెర రామ్మూర్తి (మధిర), ఊకె అబ్బయ్య (ఇల్లెందు), శంకర్‌నాయక్ (పినపాక), ఆదినారాయణ (అశ్వారావుపేట)లకు తాజాగా టికెట్ రాలేదు. పార్టీ పరంగానూ పదవులు దక్కలేదు. -
దారెటు?!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రాజకీయంగా ఇన్నాళ్లు ఆధిపత్యం ప్రదర్శించిన టీఆర్ఎస్లో అసంతృప్తి రాజుకుంటోంది. ముందుస్తు ఎన్నికల్లో భాగంగా అసెంబ్లీని రద్దు చేయడం, రాబోయే ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్థులను గులాబీ దళపతి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. అభ్యర్థుల విషయంలో సిట్టింగ్‌లందరికీ అవకాశం కల్పించడంతో పాటు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి కూడా టిక్కెట్లు ప్రకటించారు. దీంతో రాబోయే ఎన్నికల బరిలో నిలవాలని కొండంత ఆశలు పెట్టుకున్న ఆశావహులకు తీవ్ర నిరాశ ఎదురైంది. అనుచరుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తుండడంతో ఏం చేయాలో అసంతృప్తులకు దిక్కుతోచడం లేదు. కొన్ని చోట్ల టిక్కెట్లు దక్కని వారు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అందుకు అనుగుణంగా ముఖ్య అనుచరులు, నమ్మకస్తులతో రెండు రోజులుగా రహస్య సమావేశాలు జరుపుతున్నారు. కొన్ని చోట్ల స్వతంత్య్ర అభ్యర్థులుగా బరిలో నిలవాలని యోచిస్తున్నట్లు తెలుస్తుండగా.. టీఆర్ఎస్లో వర్గపోరు తారాస్థాయికి చేరినట్లయింది. అక్కడ నో ప్రాబ్లం ఉమ్మడి పాలమూరు ప్రాంతంలో టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో అసంతృప్తి జాడలకు తావు లేదనే చెప్పాలి. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే తర్వాత మరే ఇతర నాయకులు ఎదగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తాము ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో అసంతృప్తికి అవకాశం లేకుండా చూసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలకు గాను 2014 ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలను టీఆర్ఎస్ గెలుపొందింది. వీటితో పాటు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మక్తల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, నారాయణపేట నియోజకవర్గంలో టీడీపీ నుంచి గెలుపొందిన ఎస్.రాజేందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. ఇలా మొత్తం మీద ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ సిట్టింగ్‌ల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ ఎనిమిది నియోజకవర్గాల్లో తాజా మాజీ ఎమ్మెల్యేలదే హవా కొనసాగింది. వీటితో పాటు వనపర్తి నియోజకవర్గంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి సైతం తనకు ఎదురు లేకుండా చేసుకున్నారు. ఇలా మొత్తం మీద గట్టి అభ్యర్థులు ఉన్న చోట్ల అసంతృప్తి లేదనే చెబుతున్నారు. సమస్య అంతా ఇక్కడే.. పాలమూరు ప్రాంతంలో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కొన్నిచోట్ల తలనొప్పులు తప్పకపోవచ్చని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గాల్లోనే ఈ సమస్య రావొచ్చని చెబుతున్నారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలోని కల్వకుర్తి, అలంపూర్, గద్వాల, కొడంగల్ నియోజకవర్గాలతో పాటు మక్తల్‌లో కూడా ద్వితీయ శ్రేణి నేతలు టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్నారు. కల్వకుర్తిలో గత ఎన్నికల్లో ఓడిపోయిన జైపాల్‌యాదవ్‌కే ఈసారి కూడా టీఆర్ఎస్ అవకాశం కల్పించింది. దీంతో అక్కడి నుంచి టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, బాలాజీసింగ్, గోలి శ్రీనివాస్‌రెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి వర్గాలు చీలిపోయారు. దీంతో టిక్కెట్టు దక్కించుకున్న జైపాల్‌యాదవ్ పార్టీ ముఖ్యనేతలను మద్దతు కోరుతున్నారు. అలాగే అలంపూర్‌లో ఇటీవలి కాలంలో పార్టీలో చేరిన డాక్టర్ అబ్రహంకు టిక్కెట్ ప్రకటించారు. అయితే ఎట్టి పరిస్థితిలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన మందా జగన్నాథం లేదా ఆయన కుమారుడు మందా శ్రీనాథ్ తీవ్ర నిరాశకు గురయ్యారని సమాచారం. వీరు టిక్కెట్ దక్కించుకున్న అబ్రహంకు సహకరిస్తారా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇక గద్వాల నియోజకవర్గంలో ఇన్చార్జ్గా ఉన్న బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి టిక్కెట్ దక్కినా ఇతర నేతలు అసంతృప్తికి గురవుతున్నట్లు తెలుస్తోంది. గద్వాలలో ఈసారి బీసీ అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వాలని అందులోనూ బీసీ కమిషన్ సభ్యుడు ఆంజనేయులు గౌడ్ గట్టి ప్రయత్నం చేసినట్లు సమాచారం. దీంతో గద్వాలలో కూడా గ్రూపు తగాదాలు నెలకొనగా టీఆర్ఎస్ అభ్యర్థిపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఇక కొడంగల్‌లో కూడా మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డికి టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన వర్గం కూడా అసంతృప్తిగా ఉంది. ద్వితీయశ్రేణిలో అసంతృప్తి రాష్ట్రంలో 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక బంగారు తెలంగాణ సాధనలో భాగంగా ఇతర పార్టీలకు చెందిన నేతలను భారీగా చేర్చుకున్నారు. ఈ మేరకు మండలాలు, గ్రామాల నుంచి కాంగ్రెస్, టీడీపీల నేతలు భారీగా గులాబీ జెండా కిందకు వచ్చారు. అయితే, పార్టీలో చేరిన తర్వాత ఎమ్మెల్యేలు పట్టించుకోలేదని సదరు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. అంతేకాదు కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు కొందరిని మాత్రమే ప్రోత్సహిస్తూ.. ఇతరులను పట్టించుకోలేదనే అపవాదు కూడా ఉంది. ఇలా మొత్తం మీద నియోజకవర్గాల్లో ద్వితీయశ్రేణి నేతలే రెండు, మూడు వర్గాలుగా ఏర్పడ్డారు. టీఆర్ఎస్లో మొదటి నుంచి ఉన్న నేతలు, కాంగ్రెస్ నేతలు, టీడీపీ నేతలు ఇలా ఏ పార్టీ నుంచి వచ్చారో అలాగే గ్రూపులను కొనసాగించారు. ప్రస్తుతం అవే గ్రూపులు బరిలో నిలిచే అభ్యర్థులకు తలనొప్పిగా మారనున్నాయి. తాజాగా దేవరకద్ర నియోజకవర్గంలోని సీసీ కుంట మండలం జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మి, ఎంపీపీ క్రాంతి గ్రూపుల నేపథ్యంలో టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా మొత్తం మీద అసంతృప్తుల బెడదతో టీఆర్ఎస్ అభ్యర్థులు ఆదిలోనే సతమతమవుతున్నారు. అసంతృప్తులకు గాలం రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ దక్కుతుందని బోలెడు ఆశలు పెట్టుకుని నిరాశకు గురైన అసంతృప్తులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. నిరాశలో ఉన్న టీఆర్ఎస్ నేతలను గాలం వేసేందుకు ఇతర రాజకీయపక్షాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. అలంపూర్‌లో నిరాశగా ఉన్న మందా కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తున్నట్లు వినికిడి. ఢిల్లీ స్థాయిలో చర్చలు ప్రారంభమయ్యాయని నాలుగైదు రోజుల్లో ఏదో ఒక విషయం తేలే అవకాశముందని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అదే విధంగా కొడంగల్‌లో కూడా మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డిని స్వంత గూటికి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందుకోసం ఇప్పటికే కొందరు దూతలు చర్చలు జరుపుతున్నారని, ఇవి త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. -
ఖాళీ సీటు నాదే..
‘గులాబీ’ దళపతి వ్యూహాత్మకంగా విసిరిన రాజకీయ వలలో వరంగల్ నేతలు మళ్లీ పడ్డారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో శుక్రవారం జరిగిన టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో ముగ్గురు, నలుగురికి తప్ప మిగిలిన సిట్టింగులందరికీ సీట్లు ఇస్తామని కేసీఆర్ చెప్పిన మాటలు ఆశావహుల్లో ఆశలు రేపుతున్నాయి. తమకు టికెట్ రాకపోవచ్చనే నిరాశలో పక్క పార్టీల వైపు చూస్తున్న వాళ్లకు ఆయన మాటలతో పునరుత్తేజం వచ్చినటయ్యింది. టికెట్ ఆశిస్తున్న నేతలందరూ ఆ ముగ్గురు, నలుగురిలో మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఉంటాడంటే.. మా ఎమ్మెల్యే ఉంటాడని ఎవరికి వారు అంచనా వేసుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘ముగ్గురు.. నలుగురికి తప్ప మిగిలిన సిట్టింగులందరికీ సీట్లు ఇస్తాం..’ అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన మాటలు ఆశావహుల్లో ఆశలు రేపడంతోపాటు ఇతర పార్టీ ల్లోకి జంపింగ్ ఆలోచనలో ఉన్న వారికి పునరు త్తేజాన్ని నింపాయి. ఆ ముగ్గురు, నలు గురిలో మా ఎమ్మెల్యే ఉంటారని ఎవరకు వారు అంచనా వేసుకుంటున్నారు. కొందరు ఆశావహులు అడుగు ముందుకేసి ఇప్పటి సిట్టింగు ఎమ్మెల్యేలు చేసిన తప్పిదాలు, లోపాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులను మచ్చిక చేసుకుని సమాచారం తీసుకునే పనిలోఉన్నారు. మరి కొందరు ప్రైవేట్ గూఢాచారి సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఎన్నికలు సమీపించే నాటికి పూర్తి స్థాయి సమాచారంతో పార్టీ అధినాయకత్వానికి పంపగలిగితే ‘కారు’లో ఖాళీ అయ్యే సీటు ఇక తమకే అనే ఆలోచనతో ఉన్నారు. కలెగూర గంప ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ తూర్పు, భూపాలపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, మహబూబా బాద్, ములుగు, పరకాల నియోజకవర్గాల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. జనగామ, నర్సంపేట, డోర్నకల్, పాలకుర్తి నియోజకవర్గాల్లో ఓ మోస్తరు పోటీ ఉంది. ఇందుకు ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు కారణమని చెప్పవచ్చు. మరోవైపు అప్పట్లో నియోజకవర్గాల పునర్విభజన అంశం జోరుగా ప్రచారంలోకి రావడంతో ముందస్తుగా సీటు ఖరారు చేసుకుందామని మరికొందరు ఇతర పార్టీల నుంచి గంపగుత్తగా టీఆర్ఎస్లో చేరిపోయారు. అటు పాత వాళ్లు.. ఇటు కొత్త వాళ్లతో టీఆర్ఎస్ పార్టీ కలెగూర గంపగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ‘తూర్పు’లో తీవ్ర పోటీ వరంగల్ తూర్పు నియోజకవర్గ టికెట్‌పై తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటికే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొండా సురేఖ బలంగా ఉన్నా రు. ఆమె తన సీటు పైలం జేసుకుంటూనే తన కూతురు సుష్మితాపటేల్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు నగర మేయర్ నన్నపునేని నరేందర్ ఇదే సీటు కోసం గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వర్గపోరాటం తారస్థాయికి చేరుకుంది. అవకాశం దొరికితే అటు కొండా సురేఖ, ఇటు నన్నపునేని నరేందర్ ఆధారాలతో పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇక మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, తెలంగాణ మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్పర్సన్ గుండు సుధారాణి, వరంగల్ అర్బన్ కో అపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఇదే సీటు కోసం పోటీపడుతున్నారు. మానుకోటలో.. మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉన్నారు. తరచుగా ఆయన వివాదాల్లో చిక్కుకోవడం.. ఐఏఎస్ అధికారిని చేతితో తాకడం వంటి సంఘటనలతో నేరుగా కేసీఆర్ కల్పించుకోవాల్సి వచ్చింది. ఇదే నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ఎదురుచూస్తున్న మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత.. తాజా ఎమ్మెల్యే లోతుపాతులు లాగే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన మాజీ ఎక్సైజ్ అధికారి మోహన్‌లాల్, ప్రస్తుతం మెదక్ ఏఎస్పీగా పని చేస్తున్న నాగరాజు తదితరులు టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఎక్కడ ఖాళీ ఉన్నా నేనే కూర్చుంటా.. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య పేరు ఎక్కువగా వినిపిస్తోంది. జిల్లాలో ఏ సీటు ఖాళీ అయితే అదే నాది అంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కావ్య స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారనే ప్రచారం జరిగింది. దీంతో పాటు అరూరి రమేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న వర్ధన్నపేట నియోజకవర్గంపై కూడా ఆమె ఆశతో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ రెండు కాకుంటే వరంగల్ ఎంపీగానైనా నిలబడాలని ఉవ్విళ్లూరుతున్నట్లు సమాచారం. ఎవరు.. ఎక్కడ పోటీ పడుతున్నారంటే.. వర్ధన్నపేట : ప్రస్తుత ఎమ్మెల్యే అరూరి రమేష్, కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య నర్సంపేట : గతంలో పోటీ చేసి ఓడిపోయిన రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి పరకాల : ప్రస్తుత ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, గతంలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సహోదర్ రెడ్డి, టీఆర్ఎస్ సంయుక్త కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ( కేటీఆర్ సన్నిహితుడు) భూపాలపల్లి : ప్రస్తుత ఎమ్మెల్యే స్పీకర్ సిరికొండ మధుసుదనాచారి, గండ్ర సత్యనారాయణరావు, కొండా సుíష్మితాపటేల్, తెలంగాణ రైతు రుణమాఫీ కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు ములుగు : ప్రస్తుత ఎమ్మెల్యే, మంత్రి అజ్మీరా చందూలాల్, ఆయన తనయుడు ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అజ్మీరా ప్రహ్లాద్, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ డోర్నకల్ : ప్రస్తుత ఎమ్మెల్యే డీఎస్.రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ పాలకుర్తి : ప్రస్తుత ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు జనగామ : ప్రస్తుత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జనగామ జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి, ఎన్ఆర్ఐ గుడి వంశీధర్ రెడ్డి స్టేషన్ ఘన్పూర్ : ప్రస్తుత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజారపు ప్రతాప్, కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య, డాక్టర్ సుగుణాకర్ రాజు, డాక్టర్ సుధ -
నోటి దూల తగ్గించుకుంటే బాగుంటుంది
సాక్షి ప్రతినిధి, వరంగల్: వచ్చే సార్వత్రిక ఎన్నికల టికెట్ల వేట లో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న ఆ ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు.. మరోసారి కూడా సీట్లు దక్కే అవకాశాలు మెరుగుపడ్డాయి. ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కచ్చితంగా టికెట్లు ఇస్తామని, సెప్టెంబర్‌లో అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఊగిసలాటలో ఉన్న జనగామ, మహబూబాబాద్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బానోత్ శంకర్‌నాయక్, తాటికొండ రాజయ్య కు టికెట్లు ఖాయమైనట్లేనని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక కేసీఆర్‌కు సన్నిహితులుగా పేరున్న భూపాలపల్లి ఎమ్మెల్యే శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, ములుగు ఎమ్మెల్యే, గిరిజన పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ భవిష్యత్ నిర్ణయాన్ని వారికే వదిలేసినట్లు సమాచారం. సిట్టింగ్‌లను పక్కనపెట్టి కొత్త వారికి టికెట్లు ఇస్తే... ఓటర్లకు తప్పుడు సంకేతాలు పో యే ప్రమాదం ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎంతో కొంత సొంత బలం ఉంటుందని, ఆ బలానికి పార్టీ క్యాడర్ కలిస్తేనే సునాయాస విజయం దక్కుతుందని కేసీఆర్ యో చిస్తున్నారు. సిట్టింగ్‌లను కాదని కొత్తవారికి అవకాశం ఇస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేల బలాన్ని వ్యతిరేక శక్తులు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమా దం ఉందనే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. స్వయంకృతాపరాధమే.. నియోజవర్గాల్లో ఎమ్మెల్యేల పని తీరు, వారికి ఉన్న ప్రజాదరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే వివిధ సంస్థల ద్వారా ఆరు సార్లు› సర్వే చేయి ంచారు. ఇవి కాకుండా పోలీస్ ఇంటెలిజెన్స్‌తో ఎమ్మెల్యేల వ్యక్తిగత ప్రవర్తన, ప్రజలతో మమే కం అవుతున్న తీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. తొలి సర్వేలో కొంత వెనుకబడిన జనగామ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ తర్వాత సర్వేలో పుంజుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్లు తేలింది. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు నోటి దురుసుతనంతోనే వెనుకబడుతున్నట్లు ఇంటెలిజెన్స్ అధికా రులు నివేదించారు. ముఖ్యంగా శంకర్‌నాయక్ గత హరితహారం సమయంలో మహిళా కలెక్టర్ చెయ్యి పట్టుకోవడం వివాదాస్పదమైంది. ఈ సంఘటన సాధారణ ప్రజలు, మహిళలను ఆగ్రహానికి గురి చేసింది. వెంటనే సీఎం కల్పించుకుని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని పంపించి శంకర్‌నాయక్‌తో కలెక్టర్‌కు క్షమాపణ చెప్పించడంతో ప్రజాగ్రహం కొంత మేరకు చల్లబడింది. ఆ వెంటనే మళ్లీ ఆయనపై కేసు నమోదు చేశారు. గిరిజన నాయకుడు కాబట్టే ఇందంతా చేస్తున్నారంటూ ప్రజలు కొంత మేరకు ఆయనపై సానుభూతి వ్యక్తం చేశారు. దీనికి తోడు నియోజకవర్గంలో ఆయనకు డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానా యక్ కూతురు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే కవిత, ఎక్సైజ్ మాజీ అధికారి మోహన్‌లాల్ ప్రధాన పోటీగా ఉన్నారు. వారినుద్దేశించి శంకర్‌నాయక్ అక్కడక్కడ ఇషమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారనే సమాచారం ముఖ్యమంత్రి వద్ద ఉంది. నోరు అదుపులో పెట్టుకుంటే ఢోకా లేదు ! జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిది ఇదే తరహా వ్యవహారం. ఆయనకు నియోకవర్గంతో చెప్పుకోదగిన పోటీదారుడు లేడు. కానీ, ఆయన స్వయం కృతాపరాధంతోనే టికెట్‌కు ఎసరు తెచ్చుకున్నాడనే ప్రచారం ఉంది. మొదటి నుంచి భూ ఆక్రమణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నా రు. బతుకమ్మ కుంట ఆక్రమణ విషయంపై కలెక్టర్‌తో ఘర్షణ పడడంతో టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బ ందిగా మారింది. అంతకంటే ముందు కొమురవెల్లి మల్లన్న విగ్రహం మార్పు, వార్తలు రాశారనే కక్షతో ఓ జర్నలిస్టు ప్లాట్‌లో అడ్డంగా రోడ్డు వేసుకుంటూ వెళ్లడం తదితర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటీవల ఓ భూమి గొడవ విషయంలో మహిళా వీఆర్వో ఇంటికి రాత్రి వేళ వెళ్లి తమకు అనుకూలంగా రికార్డులు చేయాలని అడగడం కూడా వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత వెంటనే ఆమెకు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ ఇద్దరు నియోజకవర్గంలో బలమైన నాయకులే. కానీ, నోటి దురుసుతనం ముంచుతోందని, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటే వారికి ఢోకా లేదని ఇంటెలిజెన్స్ అధికారులు నివేదించినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. రాజయ్యపై అంతుపట్టని సీఎం అంతరంగం స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య భవిష్యత్‌పై ముఖ్యమంత్రి అంతరంగం ఇప్పటి వరకు ఎక్కడా బయటపడలేదు. భూపాలపల్లి ఎమ్మెల్యే, శాసన సభ స్పీకర్ మధుసుదనాచారిని పెద్దల సభకు పంపిస్తారనే ప్రచారం ఉంది. అయితే తుది నిర్ణయం ఆయన మీదనే ఆధారపడి ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీకే ఆయన మొగ్గు చూపుతున్నారు. కొండా దంపతుల కూతురు సుష్మితపటేల్, గండ్ర సత్యనారాయణరావు ఇక్కడి నుంచి ప్రధానంగా టికెట్‌ను ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధుసుదనాచారి దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. విమర్శల నేపథ్యంలో నియోజకవర్గానికి తన కొడుకులను కొంతదూరం పెట్టి, అభివృద్ధి పనులను ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వివాద రహితుడిగా ఆయనకు మంచి పేరే ఉంది. వేలాది మంది తన నియోజకవర్గ ప్రజలను అసెంబ్లీ సమావేశాలను చూపించడం ఆయనకు కొంత కలిసి వచ్చింది. ములుగుపై సీతారాం కన్ను ? ములుగు ఎమ్మెల్యే, గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయన కొడుకు అజ్మీరా ప్రహ్లాద్‌కు టికెట్ అడిగే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సీటుపై మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ కన్నేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా గెలిస్తే ఎస్టీ కోటాలో మంత్రి పదవి దక్కుతుందనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక విషయంలో చందూలాల్ సలహాలు, సూచనలను స్వీకరించి..కేసీఆర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
అక్కడ టీఆర్ఎస్ గెలిస్తే రాజకీయ సన్యాసం
నల్లగొండ జిల్లా /శాలిగౌరారం(నకిరేకల్): రానున్న సాధారణ ఎన్నికల్లో నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల పరిధిలోని అసెంబ్లీ స్థానాలన్నింటిలో టీఆర్ఎస్ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలో బుధవారం ఆయన పర్యటించారు. ఊట్కూరు గ్రామంలో వాటర్‌ప్లాంటు ప్రారంభోత్సవం అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని, ఎంతమంది కేసీఆర్‌లు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఏమిచేయలేరన్నారు. సీఎం కేసీఆర్ మాయమాటలకు మరోసారి మోసపోయేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరన్నారు. అబద్దాలు ఆడడంలో సీఎం గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కారని, మరెవరూ ఆ రికార్డుకు చేరుకోలేరన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని చేయివ్వడంతో ప్రారంభమైన ఆయన మోసాలు దళితుడిని ముఖ్యమంత్రిని చేయడం, ప్రతి గ్రామంలో డబుల్బెడ్రూం ఇళ్లు నిర్మించడం, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పడం, కేటీ టుపీజీ విద్య ఇలా కొనసాగుతున్నాయన్నారు.బంగారు తెలంగాణ దేవుడెరుగు..అప్పుల తెలంగాణగా రాష్ట్రం మారిందని చెప్పారు. పంటలు నష్టపోయి వందల మంది రైతులు అత్మహత్యలకు పాల్పడితే ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు సమయం దొరకని కేసీఆర్ ప్రజాధనంతో హెలికాప్టర్లలో ఇతర రాష్ట్రాలలో జరిగే పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్లేందుకు మాత్రం సమయం దొరుకుతుందన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని,తగిన సమయంలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సభలో స్థానిక సర్పంచ్ వేముల శైలజఅశోక్, నాయకులు మురారిశెట్టి కృష్ణమూర్తి, తాళ్లూరి మురళి, బండపల్లి కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. -
అసెంబ్లీకి వివేక్... లోక్‌సభకు వినోద్?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ నియోకజవర్గం పరిధిలోని రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే నేతలకు సంబంధించి ఇప్పటికే పలు అంశాలు చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలను మార్చమని, ఒకటి, అర తప్ప అందరికీ టిక్కెట్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆసక్తిగా మారాయి. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో దశాబ్ధాల పాటు ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన దివంగత గడ్డం వెంకటస్వామి కుటుంబం వచ్చే ఎన్నికల్లో కూడా కీలకంగా మారనుంది. 2009 నుంచి 2014 వరకు పెద్దపల్లి లోక్‌సభ ఎంపీగా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన గడ్డం వివేక్ ఈసారి టీఆర్ఎస్ నుంచి శాసనసభకు పోటీ చేయాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే వివేక్ సోదరుడు, 2004లో చెన్నూరు నుంచి ప్రాతినిథ్యం వహించిన మాజీ మంత్రి జి.వినోద్‌ను పెద్దపల్లి ఎంపీగా పోటీ చేయించే ప్రతిపాదనలు సాగుతున్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం పెద్దపల్లి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న బాల్క సుమన్ మాత్రం వచ్చే ఎన్నికల్లో సైతం తనకే అవకాశం లభిస్తుందన్న ధీమాతో ఉన్నారు. అలాగే ఆదిలాబాద్ ఎంపీగా ఉన్న గొడెం నగేష్ ఈసారి బోథ్ అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆదిలాబాద్ ఎంపీగా బరిలో నిలిచేందుకు పలువురు ఎస్టీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. మారుతున్న సమీకరణలు 2009 సార్వత్రిక ఎన్నికల్లో చెన్నూరు ఎమ్మెల్యేగా వినోద్ విజయం సాధించి, వైఎస్సార్ క్యాబినెట్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పదవి చేపట్టారు. 2004 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2004లో పెద్దపల్లి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన వెంకటస్వామి వారసుడిగా వివేక్ 2009 ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దపల్లి ఎంపీగా వివేక్ విజయం సాధించారు. 2010 నుంచి ఊపందుకున్న తెలంగాణ ఉద్యమంలో నల్లాల ఓదెలు ఎమ్మెల్యేగా టీఆర్ఎస్లో కీలకపాత్ర పోషించగా, వివేక్, వినోద్ కాంగ్రెస్‌లోనే ఉన్నారు. కేసీఆర్ పిలుపు మేరకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఓదెలు టీఆర్ఎస్ అభ్యర్థిగా వినోద్‌పై రెండుసార్లు గెలుపొందారు. ఈ పరిణామాల క్రమంలో వివేక్, వినోద్ 2013లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచే వారిద్దరు పోటీ చేస్తారని భావించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మొగ్గుచూపడంతో ఈ ఇద్దరు నాయకులు తిరిగి కాంగ్రెస్‌లో చేరి, 2014 ఎన్నికల్లో పూర్వ స్థానాల నుంచే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2017లో గడ్డం సోదరులు మళ్లీ టీఆర్ఎస్లోకి రాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ఎంపీ వివేక్‌ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. వీరిద్దరు టీఆర్లోకి వచ్చినప్పటి నుంచి 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున పోటీలో ఉంటారనే ప్రచారం ఊపందుకుంది. అయితే వివేక్ ఒక్కరే పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండగా, వినోద్ తెరవెనుకే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కొత్తగా వివేక్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. వివేక్ ఎమ్మెల్యేగా గెలిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో మంత్రివర్గంలో కీలక పదవి దక్కుతుందని ఆయన వర్గీయులు చెపుతున్నారు. పోటీ ఎక్కడి నుంచి..? వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని వివేక్ భావిస్తే ఆయనకు టిక్కెట్టు ఇవ్వక తప్పని పరిస్థితి టీఆర్ఎస్లో ఉందనేది వాస్తవం. అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేదే ప్రశ్న. 2004లో తన సోదరుడు గడ్డం వినోద్ పోటీ చేసిన చెన్నూరు ఎస్సీ రిజర్వు స్థానం నుంచి బరిలో దిగుదామంటే 2009 నుంచి సాధారణ, ఉప ఎన్నికల్లో వరుసగా టీఆర్ఎస్ నుంచి విజయం సాధిస్తూ వస్తున్న నల్లాల ఓదెలును కాదనే పరిస్థితి కనిపించడం లేదు. ఇక మరో రిజర్వుడు సీటు అయిన బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వివేక్ కోసం చిన్నయ్యకు చెక్ పెడతారా అనేది కూడా అనుమానమే. దుర్గం చిన్నయ్య రాష్ట్రంలోనే నేతకాని సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే. కుల సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటే చిన్నయ్యను కదపడం కూడా పార్టీకి చిక్కే. ఇక జిల్లాలో మిగిలిన జనరల్ సీటు మంచిర్యాల. ఇక్కడ నుంచి నడిపెల్లి దివాకర్‌రావు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌లో అంతకు ముందు రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన దివాకర్‌రావు ప్రస్తుతం ఇక్కడ తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. అయినా ఏకైక జనరల్ సీటు నుంచి కూడా ఎస్సీ అభ్యర్థికి స్థానం కల్పించే సాహసం కేసీఆర్ చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలోని ధర్మపురి స్థానం ఎస్సీ రిజర్వుడు అయినప్పటికీ ఇక్కడ సీనియర్ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అలాగే ఎంపీగా వివేక్ సోదరుడు మాజీ మంత్రి వినోద్‌ను పోటీ చేయించాలని భావిస్తుండగా, పెద్దపల్లిలో సిట్టింగ్ ఎంపీ బాల్క సుమన్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. తాను మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేయడం ఖాయమనే ధీమాతో ఉన్నారు. అయితే ‘రాజు తలుచుకుంటే... ఏదైనా సాధ్యమే’ అనే సూత్రం ప్రకారం కేసీఆర్ సీటు ఇవ్వాలనుకుంటే ఎక్కడి నుంచైనా వివేక్ సోదరులను పోటీ చేయించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెపుతున్నాయి. ఆదిలాబాద్ ఎంపీ చూపు బోథ్ వైపు... 2014 వరకు తెలుగుదేశం పార్టీ నుంచి బోథ్ ఎమ్మెల్యేగా ఉన్న గొడెం నగేష్ 2014లో టీఆర్ఎస్లో చేరి సాధారణ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా విజయం సాధించారు. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మంత్రివర్గంలో స్థానం దక్కేదని భావిస్తున్న నగేష్ వచ్చే 2019 ఎన్నికల్లో ఆ అవకాశాన్ని కోల్పోకూడదనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా బోథ్ నుంచి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నగేష్ బోథ్‌కు వస్తారని ప్రచారం సాగుతుండడంతో ఆదిలాబాద్ ఎంపీ సీటు కోసం పోటీ పెరిగింది. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ ఖానాపూర్ సీటుపై కన్నేశారు. వివిధ సమీకరణాల నేపథ్యంలో ఖానాపూర్ తప్పిపోతే ఆదిలాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు కూడా సిద్ధమేనని చెపుతున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ ఎన్నికల నాటికి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఇప్పటి నుంచే సవాలక్ష అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
అసెంబ్లీ సీట్ల పెంపుపై ఈసీ కొర్రీ
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం కొర్రీలు వేసింది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారంలో స్పష్టత లేదంటూ పలు అంశాలను లేవనెత్తింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి సుమిత్ ముఖర్జీ రెండు నెలల క్రితమే కేంద్రానికి లేఖ రాశారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల పరిధిపై స్పష్టత ఇచ్చేందుకు సరిపడే సమాచారం లేదని లేఖలో ఈసీ ప్రస్తావించింది. విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచాలంటూ కేంద్రం గతంలో ఈసీకి వర్కింగ్ పేపర్లను పంపింది. రాష్ట్రంలో 119 స్థానాలను 153కు, ఏపీలో 175 స్థానాలను 225కు పెంచాలని విభజన చట్టంలో పొందుపరిచారు. తదనుగుణంగా ఏపీ రీ ఆర్గనైజేషన్ (రిమూవల్ ఆఫ్ డిఫీకల్టీస్) ఆర్డర్–2015ను కేంద్ర హోం శాఖ ప్రచురించింది. అందులో ప్రస్తావించిన ప్రతిపాదనలను ఈసీ తప్పుబట్టింది. పెరిగే అసెంబ్లీ స్థానాలకు అనుగుణంగా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ స్థానాల సంఖ్యను నిర్ణయించాల్సి ఉంటుందని ప్రస్తావించింది. ‘‘అలా ఎస్సీ, ఎస్టీ స్థానాలను నిర్దేశించేందుకు అసెంబ్లీ పరిధి అత్యంత కీలకం. ప్రభుత్వం నుంచి అందిన సమాచారంలో మరింత స్పష్టత కావాలి’’అంటూ పలు అంశాలను ఉటంకించింది. విభజన సమయంలో రంపచోడవరం, పోలవరం, పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం అసెంబ్లీ స్థానాలు తెలంగాణ, ఏపీ మధ్య అటువిటుగా చెల్లాచెదురయ్యాయి. కొన్ని రెండు రాష్ట్రాల పరిధిలో విస్తరించటం సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో నాలుగు అంశాలను ఈసీ ప్రధానంగా లేఖలో ప్రస్తావించింది. ఏపీలోని రంపచోడవరంలో నెల్లిపాక మండలం ఉన్నట్టుగా ప్రతిపాదనలు అందాయని, పునర్విభజనతో నెల్లిపాక మండలం ప్రభావితమైనట్లు చట్టంలో లేదంటూ ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కారణంగా రంపచోడవరంలో ఏయే ప్రాంతాలుండాలో కచ్చితంగా నిర్ణయించలేని పరిస్థితి నెలకొందని రిమార్కు రాసింది. ఖమ్మం జిల్లాలోని బూర్గంపాడు మండలం ఉమ్మడి రాష్ట్రంలో పినపాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. విభజన నేపథ్యంలో ఈ మండలంలోని ఆరు గ్రామాలు ఏపీ పరిధిలోకి వెళ్లాయి. కానీ వాటిని ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో చేర్చాలనేది హోం శాఖ ప్రచురించిన ఉత్తర్వుల్లో ప్రస్తావించలేదని ఈసీ అభ్యంతరం వెలిబుచ్చింది. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో భద్రాచలం మండలంలోని కొన్ని ప్రాంతాలు విభజన సందర్భంగా ఏపీలో చేరాయి. వాటిని కొత్తగా ఏ అసెంబ్లీ స్థానం పరిధిలో చేర్చాలో కూడా హోం శాఖ ఉత్తర్వుల్లో పేర్కొనలేదంది. ఇన్ని సందిగ్థతలున్నందున ఎస్టీ స్థానాలు, వాటి పరిధిలోకి వచ్చే ప్రాంతాలను స్పష్టంగా నిర్ధారించలేని పరిస్థితి ఉందని ఈసీ అభిప్రాయపడింది. అందుకే మరింత స్పష్టతతో వెంటనే సమాచారమివ్వాలంటూ తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు కేంద్ర హోం శాఖ రెండు నెలల కింద లేఖలు రాసింది. తాజాగా ఏప్రిల్ 19న ఈ విషయాన్ని గుర్తు చేస్తూ మరో లేఖ కూడా రాసింది. -
చంద్రబాబుకు అసెంబ్లీ సీట్లే ముఖ్యమా?
సాక్షి, చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాత్రం అసెంబ్లీ సీట్లు కావాల్సి వచ్చిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. నరేంద్రమోదీ, చంద్రబాబుతో ఏపీకి ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. చంద్రబాబు తన కేసుల నుంచి తప్పించుకునేందుకు అసెంబ్లీ సీట్లు పెంచుకోవడానికే ప్రాధాన్యమిచ్చారని రోజా విమర్శించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న చంద్రబాబుకు అసెంబ్లీ సీట్ల పెంపు ఒక్కటే సమస్యగా కనిపిస్తుందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ముఖ్యమా..? అసెంబ్లీ సీట్లు ముఖ్యమా..? అని ఆమె సూటిగా చంద్రబాబును ప్రశ్నించారు. ప్రధానితో భేటీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సిందిగా మోదీని కోరినట్లు చంద్రబాబు పేర్కొన్న విషయం విదితమే. -
సీట్ల పెంపు లేదు!
2026లోనే అసెంబ్లీ సీట్ల పెంపు.. భేటీలో ప్రధాని ఈ విషయాన్నే స్పష్టం చేశారు: కేసీఆర్ ► ఇప్పుడు ప్రక్రియ మొదలుపెట్టినా ఐదేళ్లు పడుతుందన్నారు ► తెలంగాణ, ఏపీలకు త్వరలో కొత్త గవర్నర్లు! ► ‘ఓటుకు కోట్లు’ కేసు ఇంకా ముగిసిపోలేదు ► ఏపీతో వివాదాలు రావొద్దనే కోరుకుంటున్నాం ► వచ్చే ఎన్నికల్లో బీజేపీ హవా పెద్దగా ఉండకపోవచ్చు సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ, ఏపీల్లో 2026 సంవత్సరానికి ముందు అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఉండే అవకాశం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. 2026లో ఎలాగూ పెరుగుతాయి కదా అని బుధవారం నాటి భేటీలో ప్రధాని మోదీ పేర్కొన్నారని.. దీనిని బట్టి సీట్ల పెంపు ఇప్పట్లో ఉండకపోవచ్చని తెలిపారు. గురువారం ఢిల్లీలోని తుగ్లక్‌రోడ్‌లో ఉన్న తన నివాసంలో కేసీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘‘పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలని ప్రధాని మోదీని కోరాను. దీనిపై ప్రధాని స్పందిస్తూ.. ఒకవేళ నియోజకవర్గాల పెంపుపై ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసినా అది ఐదేళ్ల సమయం తీసుకుంటుందని.. అప్పటికి 2026 డెడ్‌లైన్ దగ్గరికి వచ్చేస్తుందని చెప్పారు. కానీ నియోజకవర్గాల పునర్విభజనపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తే.. మూడు నాలుగు నెలల్లోనే ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అయినా దీనిపై కేంద్రం ఎందుకు దృష్టి పెట్టడం లేదో అర్థం కావడం లేదు..’’అని పేర్కొన్నారు. అయినా అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు సహా పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని అంశాలను అమలు చేయాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి చేస్తామని తెలిపారు. ఇక తెలంగాణ, ఏపీలకు త్వరలో కొత్త గవర్నర్లు వస్తారని తాను కూడా విన్నానని, కానీ కచ్చితమైన సమాచారమేదీ లేదని కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణకు గవర్నర్‌గా రాజ్యసభలో బీజేపీపక్ష నేత శంకరమూర్తి, ఏపీకి గవర్నర్‌గా గుజరాత్ మాజీ సీఎం ఆనందీబెన్ పేర్లు వినిపిస్తున్నాయని చెప్పారు. ‘ఓటుకు కోట్లు’ను వదలబోం.. టీడీపీ ‘ఓటుకు కోట్లు’కుంభకోణాన్ని విలేకరులు ప్రస్తావించగా.. ఆ కేసు ముగిసిన అధ్యాయమేమీ కాదని, దర్యాప్తు జరుగుతోందని కేసీఆర్ స్పష్టం చేశారు. ‘‘మా ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి, రాష్ట్రపతి పాలన వచ్చేలా చేయడానికి పొరుగు రాష్ట్రం పన్నిన కుట్ర అది. అందుకే దాన్ని మేం సీరియస్‌గా తీసుకున్నాం. అసలు రాష్ట్రం ఏర్పాడ్డాక చంద్రబాబుకు హైదరాబాద్‌లో పనేంటి? నేనైతే పది రోజుల్లోనే విజయవాడకు మకాం మార్చేవాడిని..’’అని పేర్కొన్నారు. ఓటుకు కోట్లు కుంభకోణం తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఫిరాయింపులు అనైతికమని ఆ సమయంలో చాలా మంది అన్నారని... కానీ తెలంగాణ సుస్థిరంగా ఉండి తన కాళ్లపై తాను నిలబడటం కోసం ఏకీకృతం కావడం నైతికం, న్యాయం కూడా అని చెప్పారు. బీజేపీ విస్తరణ అంత సులువుకాదు.. 2019లో వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీకి ఇప్పుడున్నంత సంఖ్యాబలం రాకపోవచ్చని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అప్పటికి ఆ పార్టీ ముందు అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతాయని చెప్పారు. ఏ ఒక్క వర్గాన్ని ఆకట్టుకునే పథకాలేవీ ఇంతవరకు తేలేదని, ఈ విషయాన్ని నేరుగా మోదీకే చెప్పానని తెలిపారు. దక్షిణ భారతదేశానికి విస్తరించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని.. కానీ అదంత సులువుకాదని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలోని కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయడం చాలా కష్టమని.. కర్ణాటకలోనూ అంత సులువేమీ కాదని చెప్పారు. అయితే ముస్లిం జనాభా ఎక్కువగా లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కన్నా తెలంగాణపైనే బీజేపీ ఎక్కువగా దృష్టి పెడుతోందన్నారు. ఇక తెలంగాణకు కేంద్రం సాయంపై అమిత్‌షా లెక్కలను తానెందుకు విమర్శించానో మోదీకి వివరించానని చెప్పారు. వెంకయ్యనాయుడు వెళ్లడం నష్టమే వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్లడం మనకు కొంత నష్టమేనని, కేంద్రంలో దక్షిణాది గొంతు వినిపించే అవకాశం పోయిందని కేసీఆర్ పేర్కొన్నారు. మన సమస్యలు సులభంగా వినిపించే వెసులుబాటు పోయిందని.. ఆ స్థాయి నాయకుడు ఎదగడం ఇప్పట్లో కష్టమేనని వ్యాఖ్యానించారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో పరిపాలనా పరమైన సమస్యల కారణంగా తగిన ఫలితాలేవీ రాలేదని.. అసలు తొలి ఐదారు నెలలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని కేసీఆర్ చెప్పారు. 2015–16 తర్వాత రాష్ట్రం గాడిన పడిందని పేర్కొన్నారు. ఎన్నో సరికొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని.. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభావవంతమైన విధానాలను అమలు చేశామని తెలిపారు. గ్యాంబ్లింగ్, పేకాటలను నిషేధించామని, కల్తీ విత్తనాలు సహా ఇతర అక్రమాలకు పాల్పడే ముఠాలను నియంత్రించామని చెప్పారు. కరెంటు కోతలతో అల్లాడిన పరిస్థితి నుంచి మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చుతున్నామన్నారు. రాష్ట్రంలో భూవివాదాలకు చెక్ పెట్టేందుకు భారీ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. వ్యవసాయం తప్ప వేరే ఆదాయం లేని రైతులు ఎంతో నిరాశలో ఉన్నారని.. వారిని ఆదుకునేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని.. ఏటా ఎకరానికి రూ.8 వేల చొప్పున పెట్టుబడి సాయంగా ఇవ్వనున్నామని వెల్లడించారు. ముస్లింలు అభద్రతాభావం వీడి ప్రధాన స్రవంతిలో కలవాలని, ప్రభుత్వం వారికి అన్ని సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తోందని చెప్పారు. ఆర్థికాభివృద్ధిలో నంబర్ వన్ 27 శాతం అభివృద్ధితో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందని, దేశాన్ని పోషిస్తున్న ఆరు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.50 వేల కోట్లు వెళుతుంటే.. కేంద్రం తిరిగి ఇస్తున్నది 24 వేల కోట్లేనని చెప్పారు. వినూత్న పారిశ్రామిక విధానం వల్ల స్వల్పకాలంలోనే నాలుగు వేల పైచీలుకు పరిశ్రమలు వచ్చాయన్నారు. అయితే నోట్ల రద్దు కారణంగా రాష్ట్రంలో రియల్ఎస్టేట్ రంగం కుదేలైందని.. ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందని పేర్కొన్నారు. జీఎస్టీతో తెలంగాణ రెవెన్యూ పెరుగుతుందన్నారు. ఏపీతో ఇచ్చి, పుచ్చుకుంటాం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలూ పూర్తి సహాయ సహకారాలతో.. స్నేహపూర్వక పోటీతో ముందుకు పోవాలని భావిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. జలాలు సహా ఏ అంశంపై అయినా వివాదాలు తలెత్తవని ఆశిస్తున్నానని.. ఇచ్చి, పుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తామని తెలిపారు. తెలంగాణలో ఆంధ్రా వారు అభద్రతాభావంతో ఉన్నారన్న ప్రచారం ఇప్పుడు తొలగిపోయిందని.. హైదరాబాద్‌లో ఇప్పుడు ఆంధ్రావారే తమకు పెద్ద బలంగా తయారయ్యారని వ్యాఖ్యానించారు. అందరికీ ప్రభుత్వోద్యోగాలు సాధ్యం కాదు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని.. ఉపాధి పొందే మార్గాలను సృష్టించడమే ప్రభుత్వాల బాధ్యత అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇప్పటికే 60 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని, మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంచేది లేదని స్పష్టం చేశారు. అకున్ బృందానికి పూర్తి అధికారాలు హైదరాబాద్, ముంబై, పుణె, కోల్‌కతా, అహ్మదాబాద్ వంటి నగరాల్లో డ్రగ్స్ కల్చర్ ఉందని.. ఈ భూతాన్ని తరిమికొట్టేందుకు చర్యలు చేపట్టామని సీఎం కేసీఆర్ చెప్పారు. అందులో భాగంగానే తాజాగా డ్రగ్స్ దందాపై కఠిన చర్యలు చేపట్టామని తెలిపారు. నకిలీ విత్తనాలు, కల్తీ వస్తువులపై తనిఖీలు చేస్తున్నప్పుడు డ్రగ్స్ తీగ కదిలిందని.. దానిని లాగితే డొంకంతా కదులుతోందని చెప్పారు. డ్రగ్స్ వ్యవహారంపై విచారణ చేస్తున్న అకున్ సబర్వాల్ నేతృత్వంలోని సిట్‌కు పూర్తి అధికారాలు ఇచ్చామని, ఈ కేసుల్లో ఎంతటి వారున్నా వదలబోమని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో అంతర్జాతీయ మాఫియా పాత్ర కూడా బయటికి వస్తోందని తెలిపారు. పవన్ చేతులూపితే ఓట్లు పడతాయా? తెలంగాణలో కుల రాజకీయాలు లేవని, ఎన్నికలప్పుడు ప్రజా అంశాలే ప్రాధాన్యత వహిస్తాయని కేసీఆర్ పేర్కొన్నారు. అదే ఏపీలో మాత్రం కుల రాజకీయాలే ప్రధాన పాత్ర పోషిస్తాయని వ్యాఖ్యానించారు. ‘‘పవన్ కల్యాణ్ చేతులూపితే ఓట్లు పడతాయా..? పార్టీకి బేస్ ఉండాలి. చిరంజీవి లాంటి వ్యక్తే పార్టీని నడపలేక కట్టెలమోపులాగా బరువు దించుకున్నారు. నేను 14 ఏళ్లు పార్టీ నడిపా, ఉద్యమం చేశాను. ఎవరైనా పోరాటానికి సిద్ధంగా ఉండాలి, లక్ష్యం కోసం పనిచేయాలి..’’అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితిపై చేసిన సర్వే వివరాలను ఓ మిత్రుడు తనకు చెప్పాడని.. వైఎస్సార్సీపీకి 45 శాతం ఓట్లు, టీడీపీకి 43 శాతం, బీజేపీకి 2.6 శాతం, పవన్ కల్యాణ్‌కు 1–1.2 శాతం ఓట్లు వస్తాయని ఆ సర్వేలో తేలిందని వెల్లడించారు. రాష్ట్రపతిని కలసిన కేసీఆర్ ⇒ ఎన్నికల్లో మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిన కోవింద్ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమావేశమయ్యారు. నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన నేపథ్యంలో గురువారం రాష్ట్రపతి భవన్లో కోవింద్‌ను మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో తనకు మద్దతు పలికినందుకు కేసీఆర్‌కు కోవింద్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతిని కలసిన వారిలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, సలహాదారు వివేక్, ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కవిత, కొండా విశ్వేశ్వరరెడ్డి, సీతారాంనాయక్, జి.నగేశ్, బీబీ పాటిల్, బాల్క సుమన్, మల్లారెడ్డి, పసునూరి దయాకర్ తదితరులు ఉన్నారు. -
సీట్ల పెంపు లేదు! టీడీపీ నేతలకు షాక్
-
అసెంబ్లీ సీట్లు పెంచాల్సిందే
తెలుగుదేశం పార్టీ లాబీయింగ్ సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు కోసం తెలుగుదేశం పార్టీ లాబీయింగ్ ముమ్మరం చేస్తోంది. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచేందుకు వీలుగా చట్ట సవరణ చేయాలని పట్టుబడుతోంది. అయితే, కేవలం పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని సవరిస్తే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ సాధ్యం కాదని, ఇందుకోసం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించాల్సి ఉంటుందని భారత అటార్నీ జనరల్, కేంద్ర న్యాయ శాఖ ఇప్పటికే తేల్చిచెప్పాయి. ఈ నేపథ్యంలో కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి నేతృత్వంలోని బృందం హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను గురువారం కలవనుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా పాల్గొంటారని సమాచారం. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26ను సవరించడం ద్వారా అసెంబ్లీ సీట్ల పెంపునకు వీలుగా ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు తేవాలని టీడీపీ కోరుతోంది. అలా వీలుకాని పక్షంలో పార్లమెంట్ సమావేశాలు ముగిసిన అనంతరం ఆర్డినెన్స్ ద్వారానైనా పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించాలని కేంద్రంపై ఒత్తిడి పెంచుతోంది. కానీ, ఇది సాధ్యపడదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు టీడీపీ వర్గాలకు స్పష్టం చేసినట్లు సమాచారం. -
సీట్లు పెంచాలని రెండు రాష్ట్రాలు అడిగాయి
⇒ ఏపీఆర్ఏ ప్రకారం పెంచడం సాధ్యం కాదు: కేంద్ర హోం శాఖ సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టం-2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అసెంబ్లీ సీట్లను పెంచాలని కోరాయని కేంద్ర హోం శాఖ తెలిపింది. మంగళవారం ఈమేరకు టీఆర్ఎస్ ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, కొత్త ప్రభాకర్ రెడ్డి అడిగిన రాతపూర్వక ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ లోక్‌సభలో సమాధానం ఇచ్చారు. ‘తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అసెంబ్లీ సీట్లు పెంచాలని అడిగాయా, అయితే వివరా లేంటి? కేంద్ర స్పందన ఏంటి?’ అని సభ్యు లు కోరిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ ‘ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు సీట్లు పెంచాలని అడిగాయి. ఈ అంశాన్ని కేంద్ర న్యాయ శాఖ దృష్టికి తీసుకెళ్లాం. న్యాయ శాఖ కేంద్ర అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం 2026 తర్వాత తొలి జనగణనను ప్రచురించే వరకు రెండు రాష్ట్రాల్లోని అసెంబ్లీ సీట్ల సంఖ్యను సర్దుబాటు చేయడం కుదరదని అటార్నీ జనరల్ అభిప్రాయపడ్డారు. అందువల్ల ఆర్టికల్ 170ని సవరించనంత వరకు.. విభజన చట్టంలోని సెక్షన్ 26ను అనుసరించి అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచడం సాధ్యం కాదు’ అని పేర్కొన్నారు. -
అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో లేనట్లే!
-
అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో లేనట్లే!
అసెంబ్లీ సీట్ల పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ అందింది గానీ.. ఇప్పట్లో సీట్లు పెంచే అవకాశం ఏ రాష్ట్రంలోనూ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 170 (3) అధికరణం ప్రకారం, 2026 జనాభా లెక్కలు వచ్చేంత వరకు ఏ రాష్ట్రంలోనూ అసెంబ్లీ సీట్లు పెంచడం సాధ్యం కాదని తెలిపింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఈ వివరాలు తెలిపింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రభుత్వాలు అసెంబ్లీ సీట్ల పెంపుపై పెట్టుకున్న ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది. -
అసెంబ్లీ సీట్లను వెంటనే పెంచండి
కేంద్ర హోంమంత్రికి సీఎం కేసీఆర్ వినతి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం స్ఫూర్తిని తూ.చ. తప్పకుండా పాటిస్తూ శాసనసభ నియోజకవర్గాల పెంపు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరారు. పార్టీ ఎంపీలు, ఉన్నతాధికారులతో కలసి గురువారం ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో రాజ్‌నాథ్‌తో ఆయన సమావేశమయ్యారు. అసెంబ్లీ సీట్ల పెంపును ఉద్దేశించే చట్టంలో తగిన నిబంధనలు పొందుపరిచారని, కానీ ఈ అంశంపై అటార్నీ జనరల్ ఇటీవల వెలిబుచ్చిన అభిప్రాయం (రాజ్యాం గంలోని ఆర్టికల్ 170 ప్రకారం సీట్ల పెంపు సాధ్యం కాదంటూ) అందుకు విరుద్ధంగా ఉందన్నారు. అందువల్ల ఈ న్యాయ సంఘర్షణకు తెరదించాలని కోరారు. సీట్ల పెంపు ఉద్దేశం లేకుంటే విభజన చట్టంలో ఆ నిబంధన ఉండేదే కాదని కేసీఆర్ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 3, 4 ఆర్టికల్స్ ద్వారా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇతర ఏ ఆర్టికల్ కూడా వాటిపై పైచేయి సాధించజాలదని, ఆర్టికల్ 170 అందుకు మినహాయింపు కాదని కేసీఆర్ వివరించారు. అందువల్ల రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపునకు అడ్డంకిగా ఉన్న సాంకేతికపరమైన అంశాలను పరిష్కరిస్తూ త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇందుకు హోంమంత్రి సానుకూలంగా స్పందించినట్టు టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలిసింది. తెలంగాణలో జిల్లాల పునర్విభజన జరుగుతున్న నేపథ్యంలో పరిపాలన సౌలభ్యం కోసం మరింత మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేసీఆర్ ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌కు విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు రాష్ట్రానికి కేటాయించిన ఉన్నతాధికారులతో ప్రభుత్వం సంతృప్తిగా ఉన్నప్పటికీ కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో మరింత మందిని కేటాయించాలని కోరారు. ఆ తీర్పు అన్నింటికీ వర్తించదు పదో షెడ్యూల్లోని సంస్థల విభజనపై తలెత్తిన గందరగోళంపై కేసీఆర్ హోంమంత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పదో షెడ్యూల్లోని అన్ని సంస్థలకూ వర్తింపచేయాలనడం అర్థరహితమని ఆయన వివరించినట్టు తెలిసింది. జనాభా ప్రాతిపదిక అనేది విభజన చట్టం స్ఫూర్తి కాదని, ఈ ప్రాతిపదికన పదో షెడ్యూలులోని సంస్థలన్నింటినీ విడదీయాలనడం తెలంగాణకు అన్యాయం చేయడమే అవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. తీవ్రవాద ప్రాంతాల్లో రోడ్లకు రూ. 300 కోట్లివ్వండి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల్లో గోదావరి, ప్రాణహిత నదుల వెంట జాతీయ రహదారుల నిర్మాణానికి రూ. 1,290 కోట్లు కేటాయించినందుకు కేంద్రానికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అన్ని అనుమతులు పొందిన ఈ రహదారుల నిర్మాణ పనుల ప్రారంభానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసేందుకు చొరవ చూపాలని రాజ్‌నాథ్‌ను కోరారు. వామపక్ష తీవ్రవాద ప్రాబల్యంగల ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి మరో రూ. 300 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాజ్‌నాథ్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. కాళేశ్వరం నుంచి అర్జున్‌గుట్ట వరకు రహదారి, కాళేశ్వరం వద్ద కిలోమీటరు పొడవైన వంతెన (గోదావరి పై), రాచర్ల-వేమనపల్లి రహదారి, సోమనిగూడెం రహదారి, గూడెం-బాబా సాహెబ్ రహదారుల నిర్మాణానికి మరో రూ. 300 కోట్లు విడుదల చేయాలని కోరారు. రాజ్‌నాథ్‌ను కలసిన వారిలో పార్టీ పార్లమెంటరీ విభాగం చైర్మన్ కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత ఎ.పి.జితేందర్‌రెడ్డి, పార్టీ విప్ బి.వినోద్‌కుమార్, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు ఉన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు లేనట్లే
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచడం కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విభజన చట్టాన్ని సవరించినా సీట్ల పెంపు సాధ్యంకాదని రాజ్యసభలో కేంద్ర మంత్రి హన్స్ రాజ్ గంగారామ్ తేల్చిచెప్పారు. విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాలను పెంచాలని ఏపీ, తెలంగాణ కేంద్రాన్ని కోరాయి. 2026లో నియోజక వర్గాల పునర్విభజన జరగాల్సివుండగా, రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ముందుగానే సీట్లు పెంచాలని తెలుగు రాష్ట్రాలు కోరాయి. అసెంబ్లీ సీట్ల పెంపుపై టీడీపీ ఎంపీ దేవేందర్ గౌడ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్ రాజ్ గంగారామ్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. రాజ్యాంగపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం అటార్నీ జనరల్ వివరణ కోరగా, తెలుగు రాష్ట్రాల్లో నియోజక వర్గాల పెంపు కుదరదని కేంద్రానికి అటార్నీ జనరల్ నివేదిక ఇచ్చారు. నియోజక వర్గాలు పెంచాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని అటార్నీ జనరల్ చెప్పారు. కేంద్ర మంత్రి ఈ విషయాన్ని సభలో తెలిపారు. -
అసెంబ్లీ సీట్ల పెంపు లేనట్టే
-
తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెంచాలి
కేంద్ర మంత్రి సదానంద గౌడకు ఎంపీ వినోద్ విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడను గురువారం తెరాస ఎంపీ వినోద్ కుమార్ కలుసుకొని తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, తెలంగాణ కు ప్రత్యేక హైకోర్టు, హైకోర్టులో తెలంగాణ న్యాయమూర్తుల వాటా తదితర అంశాలపై చర్చించారు. అసెంబ్లీ స్థానాల పెంపునకు అనువుగా ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యవస్థీకరణ చట్ట సవరణల బిల్లు ఈ నెల 25 వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు బిల్లుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రిని వినోద్ కోరారు. కేంద్ర మంత్రితో సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 26 లో చేయాల్సిన సవరణపై కేంద్ర మంత్రితో చర్చించామని వినోద్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 26 లో చేసే చిన్న సవరణ ద్వారా రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు పెంచే ఆస్కారం ఉందన్నారు. ఈ సవరణ కు సంబంధించి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు, న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గతంలోనే లేఖలు రాశారని వినోద్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఒకటి, రెండు రోజుల్లో తమ మంత్రిత్వ శాఖ తగు నిర్ణయాలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి సదానంద గౌడ తెలిపారని వినోద్ చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు ఉన్నందున న్యాయమూర్తుల ఎంపికలో తెలంగాణ కు దక్కాల్సిన వాటాపై చర్చించామన్నారు. ఈ విషయంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చిస్తామని మంత్రి హామీ ఇచ్చారన్నారు. -
అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచండి
119 స్థానాలను 153కు పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా ప్రస్తుతమున్న 119 సీట్లను 153కు పెంచాలని కోరింది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ప్రజలందరికీ సామాజిక న్యాయం అందించడంతో పాటు ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడానికి సీట్లను పెంచాల్సి ఉందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శుక్రవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జోక్యం చేసుకోవాలని... ఈ అంశాన్ని వెంటనే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి వీలైనంత వేగంగా చర్యలు చేపట్టాలని అందులో విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 26వ సెక్షన్‌ను ప్రత్యేకంగా ఉటంకించారు. ‘రాజ్యాంగంలోని 170వ ఆర్టికల్ ప్రకారం ఎలాంటి పక్షపాతం లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు జరుగుతుంది. ఏపీలోని 175 సీట్లు 221కు, తెలంగాణలోని 119 సీట్లు 153కు పెరుగుతాయి. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల కమిషన్ నిర్వర్తిస్తుంది..’ అని చట్టంలో ఉన్న అంశాలను లేఖలో ప్రస్తావించారు. ‘రాజ్యాంగంలోని 170వ ఆర్టికల్ మూడో నిబంధన ప్రకారం ప్రతి జనగణన పూర్తయిన తర్వాత ప్రతి రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ సీట్లను, రాష్ట్రంలోని ప్రాదేశిక నియోజకవర్గాలను పార్లమెంట్లో చట్టం చేయటం ద్వారా పునర్విభజించే వీలుంది..’ అని ప్రస్తావించారు. -
'శాసనసభ స్థానాల సంఖ్య పెంచాలి'
హైదరాబాద్: రాష్ట్రంలో శాసనసభ స్థానాల సంఖ్య పెంచాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రీషీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ లేఖ రాశారు. శాసనసభ స్థానాలను 119 నుంచి 153కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం స్థానాలు పెంచాలని కోరారు. జనాభా లెక్కలు పూర్తైన తర్వాత నియోజక వర్గ పునర్విభజన జరపాలని రాజ్యాంగం సూచిస్తోందని లేఖలో ప్రస్తావించారు. అసెంబ్లీ సీట్ల పెంపు కోసం ఎన్నికల కమిషన్ ప్రక్రియ ప్రారంభించేలా దిశానిర్ధేశం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
2019 నాటికి శాసనసభ స్థానాల పెంపు
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల పెంపునకు సంబంధించిన చట్టసవరణ బిల్లు రానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలను పెంచే ప్రక్రియ పూర్తవడానికి సమయం పడుతుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తం 2019 నాటికల్లా పూర్తవుతుందన్నారు. ముందుగా రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు కేంద్రానికి అందాలని, వీటిని కేంద్ర హోం శాఖ, న్యాయశాఖ పరిశీలించిన అనంతరం అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకుంటారని బుధవారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆ తరువాత కేబినెట్‌కు న్యాయశాఖ నోట్ పంపితే పార్లమెంటు ముందుకు చట్ట సవరణ బిల్లు వస్తుందని వివరించారు. శాసనసభ స్థానాల పెంపుపై భవిష్యత్తులో కోర్టుల్లో ఎవరూ సవాల్ చేయని విధంగా, పక్కాగా చట్ట సవరణ చేయాల్సి ఉందన్నారు. చర్చకు ప్రభుత్వం సిద్ధం... పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పక్షాలు సహకరించాలని వెంకయ్య నాయుడు కోరారు. ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అఖిలపక్ష సమావేశంలో స్వయంగా ప్రధాని మోదీ ఈ విషయాన్ని స్పష్టం చే శారని గుర్తు చేసారు. వర్సిటీల్లో జరుగుతున్న సంఘటనలను ప్రస్తావిస్తూ, అలజడులు సృష్టించేందుకు విద్యార్థుల ముసుగులో కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని ఆరోపించారు. విద్యార్థులను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని విమర్శించారు. అఫ్జల్ గురుకు తగిన న్యాయం జరగలేదని వస్తున్న వాదనలను ఖండిస్తూ అన్ని స్థాయిల్లో విచారణ తర్వాతే అఫ్జల్‌గురుకు శిక్ష ఖరారైందని స్పష్టం చేశారు. -
అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపుపై ఆల్ పార్టీ మీటింగ్
-
నేడు ఉప ఎన్నికల పోలింగ్
3 ఎంపీ, 33 అసెంబ్లీ స్థానాలకు ఏర్పాట్లు పూర్తి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో మూడు లోక్‌సభ స్థానాలతోపాటు 33 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలకు నేడు (శనివారం) పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్, గుజరాత్‌లోని వడోదరా, ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి ఎంపీ స్థానాలతోపాటు యూపీలో 11, గుజరాత్లో 9, రాజస్థాన్‌లో 4, పశ్చిమ బెంగాల్లో 2, ఈశాన్య రాష్ట్రాల్లో 5, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లలోని ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక లు జరగనున్నాయి. ఈ నెల 16న ఓట్ల లెక్కింపు జరగనుంది. లోక్‌సభ ఎన్నికల్లో రెండేసి సీట్లలో గెలిచిన ప్రధాని నరేంద్ర మోడీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయంసింగ్‌లు వడోదరా, మెయిన్‌పురి స్థానాలను ఖాళీ చేయడంతో పాటు, తెలంగాణలో జరిగి న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఎంపీ స్థానాన్ని వదులుకోవడంతో మెదక్‌లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. -
ఓట్లు గల్లంతు
గులాబీ సునామీలో ప్రధాన పార్టీల ఓటు బ్యాంకు చెల్లాచెదురైంది. ఊడ్చిపెట్టినట్లుగా జిల్లాలో ఓటర్ల తీర్పు ఏకపక్షంగా వెల్లువెత్తటంతో టీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు గణనీయంగా పుంజుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఒక్కసారిగా మూడింతలకు పెరిగింది. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న టీఆర్ఎస్ ఈసారి ఏకంగా 12 స్థానాల్లో విజయపతాకం ఎగరేసింది. మొత్తం పోలైన ఓట్లతో పోలిస్తే అప్పుడు కేవలం 16.62 శాతం ఓటు బ్యాంకు పొందిన టీఆర్ఎస్ ఈసారి 48.38 శాతం ఓట్లు సాధించింది. 31.76 శాతం అదనంగా సంపాదించింది. అప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌పైనే ఆశలు పెట్టుకున్న పార్టీ ఈసారి తెలంగాణ సాధించిన ఘనత తమదేనని చెప్పుకోవటంతో పాటు ప్రజాకర్షక పథకాలతో ప్రజల్లోకి వెళ్లింది. దీంతో కొత్త రాష్ట్రం, కొత్త ఆశలు, ఆకాంక్షలన్నీ ఓటు బ్యాంకు రూపంలో టీఆర్ఎస్కు వెన్నంటి నిలిచాయి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత తమదేనని చెప్పుకోవటం తప్ప ప్రజలను ఆకట్టుకునే సంక్షేమం, అభివృద్ధి ఎజెండాను మేనిఫెస్టోగా ప్రచారం చేసుకోవటంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. దీంతో జిల్లాలో జగిత్యాల మినహా ఒక్క సీటును గెలుచుకోలేకపోయింది. గత ఎన్నికల్లో మూడు అసెంబ్లీ సీట్లతో పాటు రెండు ఎంపీ స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈసారి చావుతప్పి కన్ను లొట్టబోయినంతపనైంది. ఒక్క సీటుతోనే పరువు కాపాడుకుంది. ఈసారి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 26.75 శాతం ఓట్లు లభించాయి. అంటే టీఆర్ఎస్తో పోలిస్తే 21.63 శాతం ఓట్లతో వెనుకబడింది. కాంగ్రెస్‌తో పోలిస్తే టీఆర్ఎస్ ఇంచుమించుగా రెండింతల ఓట్లు సాధించే దిశగా పరుగులు తీసింది. అందుకే ఉన్నఫళంగా 12 అసెంబ్లీ సీట్లతో పాటు రెండు ఎంపీ సీట్లు గులాబీ ఖాతాలో జమయ్యాయి. 2004లో కాంగ్రెస్ పొత్తుతో టీఆర్ఎస్ జిల్లాలో పది స్థానాల్లో పోటీ చేసి అయిదింటిని గెలుచుకుంది. అప్పుడు కాంగ్రెస్-టీఆర్ఎస్ కలిసికట్టుగా సాధించింది 48.37 శాతం ఓట్లు. ఇప్పుడు టీఆర్ఎస్ ఒక్కటే అంత మొత్తం ఓట్లను కూడగట్టుకోవటం విశేషం. టీడీపీ-బీజేపీ మిత్రపక్షాలు జిల్లాలో ఒక్క సీటు గెలుచుకోలేకపోయాయి. టీడీపీ పోటీ చేసిన ఆరు స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీ నాయకుడు ఎల్.రమణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావుకు సైతం ఘోర పరాభవం తప్పలేదు. టీడీపీతో పొత్తు కూడటం వల్ల బీజేపీకి నష్టం వాటిల్లింది. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనంతో పాటు తెలంగాణ ఉద్యమ ఊపుతో జిల్లాలో బీజేపీ కాస్తా పుంజుకుంది. ఆరు స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ రెండు చోట్ల నువ్వా.. నేనా అన్నట్లుగా ప్రత్యర్థులతో తలపడింది. వేములవాడ, కరీంనగర్లో ఆ పార్టీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. రెండు పార్టీలు చెరో ఆరు స్థానాల్లో పోటీ చేశాయి. అక్కడ పోలైన ఓట్లలో 5.31 శాతం ఓట్లు టీడీపీకి వస్తే.. 8.02 శాతం ఓట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకోవటం గమనార్హం. -
ఆల్ ద బెస్ట్
కోటి ఆశలు.. కొత్త ఆకాంక్షలు సార్వత్రిక సమరానికి తెలంగాణ సిద్ధమైంది. ఏడవ దశలో భాగంగా బుధవారం పది జిల్లాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడుతున్న సమయంలో జరుగుతున్న ఈ ఎన్నికల మీద పదిజిల్లాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొత్త రాష్ట్రంలోనైనా తమ వెతలు తీరుతాయన్న ఆకాంక్షను వ్యక్తంచేస్తున్నారు. రైతు ఆత్మహత్యలు లేని.. కరెంటుకోతలు లేని.. వలసలు లేని.. సాగు,తాగు నీళ్ల కోసం తల్లడిల్లే దుస్థితి లేని.. పాలన కోరుకుంటున్నారు. పది జిల్లాల్లో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలు.. ఎన్నికల మీద మీద ప్రభావం చూపే అంశాలు... హైదరాబాద్ జిల్లా జిల్లాలోని అసెంబ్లీ స్థానాలు : 15 పోటీలో ఉన్న అభ్యర్ధుల సంఖ్య : 298 లోకసభ నియోజకవర్గాలు :హైదరాబాద్, సికింద్రాబాద్ పోటీలో ఉన్న అభ్యర్ధుల సంఖ్య : 46 2009 ఎన్నికల్లో జిల్లాలో పోలయిన ఓట్ల వివరాలు మొత్తం ఓట్లు : 29,67,350 పోలైన ఓట్లు : 53.82 % పురుషులు : 55.84 % మహిళలు : 51.66 % ప్రభావం చూపే అంశాలు: తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, కాలుష్యం, ప్రజారవాణా వ్యవస్థ, విద్యుత్ కోతలు, ఉపాధి, శివారు సమస్యలు రంగారెడ్డి జిల్లా జిల్లాలోని అసెంబ్లీ స్థానాలు : 14 పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య : 284 పార్లమెంట్ స్ధానాలు : మేడ్చల్, మల్కాజిగిరి పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య : 45 2009 ఎన్నికల్లో జిల్లాలో పోలైన ఓట్లు మొత్తం ఓట్లు : 40,18,664 పోలైన ఓట్లు : 58.15 % పురుషులు : 59.70 % మహిళలు : 56.60 % ప్రభావితం చేసే అంశాలు: సాగు, తాగునీరు, ఉద్యాన పంటలకు కరువైన ప్రోత్సాహం, కరెంట్ కోతలు, బస్సు సౌకర్యం లేక విద్యార్థుల కష్టాలు ఖమ్మం జిల్లా జిల్లాలోని అసెంబ్లీ స్థానాలు : 10 పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య : 143 పార్లమెంట్ స్ధానం : ఖమ్మం పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య : 27 2009లో జిల్లాలో పోలైన ఓట్లు మొత్తం ఓట్లు : 17,74.049 పోలైన ఓట్ల శాతం : 81.68% పురుషులు : 82.14% మహిళలు : 81.23% ప్రభావితం చేసే అంశాలు : రైతు ఆత్మహత్యలు, కరెంటు కోతలు, తాగునీటి సమస్యలు, ప్లోరైడ్ సమస్యలు, పూర్తి కాని సాగు నీటి ప్రాజెక్టులు కరీంనగర్ జిల్లా జిల్లాలోని అసెంబ్లీ స్థానాలు : 13 పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య : 168 పార్లమెంట్ స్ధానాలు: కరీంనగర్, పెద్దపల్లి పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య : 34 2009 ఎన్నికల్లో జిల్లాలో పోలయిన ఓట్లు మొత్తం ఓట్లు : 27,09,831 పోలైన ఓట్లు : 62.51 % పురుషులు : 64.67 % మహిళలు : 68.36 % ప్రభావితం చేసే అంశాలు: చేనేత కార్మికుల (మరమగ్గాల) సమస్యలు, గల్ఫ్ బాధితులు, బీడీ కార్మికుల సమస్యలు, మెట్ట ప్రాంత రైతు సమస్యలు, కరెంటు కోతలు.... నల్లగొండ జిల్లా జిల్లాలోని అసెంబ్లీ స్థానాలు :12 పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య : 161 పార్లమెంట్ స్ధానాలు: నల్లగొండ, భువనగిరి పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య : 22 2009 ఎన్నికల్లో జిల్లాలో పోలైన ఓట్లు మొత్తం ఓట్లు : 25,26,496 పోలయిన ఓట్లు : 74.89 % పురుషులు : 76.75 % మహిళలు : 73.04 % ప్రభావితం చేసే అంశాలు: రైతు ఆత్మహత్యలు, కరువు, ఫ్లోరైడ్ రక్కసి, ముందుకుసాగని నాగార్జునసాగర్ ఆధునికీకరణ, చేనేత కార్మికుల సమస్యలు. నిజామాబాద్ జిల్లా జిల్లాలోని అసెంబ్లీ స్థానాలు : 10 పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య : 101 పార్లమెంట్ స్ధానం : నిజామాబాద్ పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య : 16 2009 ఎన్నికల్లో జిల్లాలో పోలైన ఓట్లు మొత్తం ఓట్లు : 16,63,906 పోలయిన ఓట్లు : 70.40 % పురుషులు : 69.77 % మహిళలు : 70.96 % ప్రభావితం చేసే అంశాలు: నిజాంసుగర్స ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ, సరిహద్దు సమస్యలు, పసుపు పంటకు గిట్టుబాటు ధర, గల్ప్ భాదితుల సమస్యలు. వరంగల్ జిల్లా జిల్లాలోని అసెంబ్లీ స్థానాలు : 12 పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య : 153 పార్లమెంట్ స్ధానాలు : వరంగల్, మహబూబాబాద్ పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య : 29 2009 ఎన్నికల్లో జిల్లాలో పోలైన ఓట్లు మొత్తం ఓటు ్ల : 24,46,931 పోలైన ఓట్లు : 72.84% పురుషులు : 73.74% మహిళలు : 73.74% ప్రభావితం చేసే అంశాలు : రైతుల ఆత్మహత్యలు, కరెంట్ కోతలు, తాగునీటి సమస్యలు, కాగితాలకే పరిమితమైన దేవాదుల ప్రాజెక్టు ఆదిలాబాద్ జిల్లా జిల్లాలోని అసెంబ్లీ స్థానాలు : 10 పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య : 107 పార్లమెంట్ స్ధానం : ఆదిలాబాద్ పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య : 8 2009 ఎన్నికల్లో జిల్లాలో పోలయిన ఓట్లు మొత్తం ఓట్లు : 16,19,101 పోలైన ఓట్లు : 74.65 % పురుషులు : 75.33 % మహిళలు : 73.98 % ప్రభావితం చేసే అంశాలు: సింగరేణి కార్మికుల సమస్యలు, డిమాండ్లు, గిరిజన మరణాలు, తాగునీటి సమస్య, బీడీ కార్మికుల సమస్యలు మెదక్ జిల్లా జిల్లాలోని అసెంబ్లీ స్థానాలు : 10 పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య : 105 పార్లమెంట్ స్ధానాలు : మెదక్, జహీరాబాద్ పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య : 23 2009 ఎన్నికల్లో జిల్లాలో పోలై ఓట్లు మొత్తం ఓట్లు : 20,31.643 పోలయిన ఓట్లు : 76 % పురుషులు : 77 % మహిళలు : 74 % ప్రభావితం చేసే అంశాలు : రైతుల ఆత్మహత్యలు, పూర్తికాని సాగునీటి పథకాలు, గిరిజన తండాల్లో తాగునీటికి కటకట మహబూబ్‌నగర్ జిల్లా జిల్లాలోని అసెంబ్లీ స్థానాలు : 14 పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య : 147 పార్లమెంట్ స్ధానాలు:మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య : 15 2009 ఎన్నికల్లో జిల్లాలో పోలైన ఓట్లు మొత్తం ఓటు ్ల : 28,28,473 పోలైన ఓట్లు : 69 % పురుషులు : 71 % మహిళలు : 66 % ప్రభావితం చేసే అంశాలు : కరువుపీడిత ప్రాంతం, తాగునీటి సమస్య, జిల్లాను పట్టి పీడిస్తున్న వలసలు -
పోలింగ్‌కు సర్వం సిద్ధం: భన్వర్‌లాల్
* తెలంగాణ జిల్లాల్లో నేడు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ షురూ * సాయంత్రం 6 గంటలకు లైన్లో ఉన్న అందరికీ ఓటు వేసే అవకాశం * 16,512 కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్.. ప్రధాన కూడళ్లలో తెరలపై పోలింగ్ సరళి * నేడు అన్ని సంస్థలకూ సెలవు.. అత్యవసర సేవల సంస్థలకూ ఒక షిఫ్ట్ సెలవు * సెలవు ఇవ్వని యాజమాన్యాలపై కేసు నమోదు.. ఏడాది జైలు * ఓటర్ గుర్తింపు కార్డు లేకపోతే 11 ప్రత్యామ్నాయ కార్డులతో ఓటు * ఎగ్జిట్, ఓపీనియన్ పోల్స్‌పై నిషేధం.. ఓటెవరికి వేశారని అడగరాదు * టీవీ, రేడియో, ఎస్ఎంఎస్ల ప్రచారంపై నిషేధం * అందరూ ఓటు హక్కును వినియోగించుకోండి: సీఈఓ భన్వర్‌లాల్ పిలుపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని తెలంగాణ జిల్లాల్లో 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ స్థానాలకు మరి కొద్ది గంటల్లో పోలింగ్ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామగ్రి, ఈవీఎంలతో మంగళవారం రాత్రి సిబ్బంది చేరుకున్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఐదేళ్లకోసారి వచ్చే ఓటు వేసే అవకాశాన్ని ఎవరూ జారవిడుచుకోకుండా ప్రతి ఒక్కరు మంచి అభ్యర్థికి ఓటు వేయాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులకు రెండు నిముషాల్లో ఓటు వేయచ్చునని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేయాలని సూచించారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని, ఉద్యోగ సంఘాలు తటస్థంగా వ్యవహరించాలని భన్వర్‌లాల్ సూచించారు. ఎవరైనా పక్షపాతంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్‌కు ముందు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, డబ్బు పంపిణీని నిరోధించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను 4000కు పెంచామని, ఈ స్క్వాడ్స్ ద్వారా రాత్రిపూట గట్టి నిఘా పెట్టామని తెలిపారు. లక్షకు పైగా ఈవీఎంలను పోలింగ్‌కు వినియోగిస్తున్నామని, ఎక్కడైనా ఈవీఎంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే 20 నిముషాల నుంచి అరగంటలోగా మరో ఈవీఎం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రతి సెక్టార్ ఆఫీసర్ దగ్గర నాలుగేసి ఈవీఎంలు స్టాక్ ఉంటాయన్నారు. ఒక్క నిజామాబాద్‌లో 300 ఈవీఎంలు ఫ్యాక్టరీ మోడ్‌లోకి వెళ్లిపోయాయని, అక్కడ 200 ఈవీఎంలు మిగులు ఉండటంతో పోలింగ్ నిర్వహణకు సమస్యలేదని వివరించారు. సీఈఓ భన్వర్‌లాల్ మంగళవారం సచివాలయంలో సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలింగ్ నిర్వహణకు తీసుకున్న చర్యలను వివరించారు. ముఖ్యాంశాలివీ... * తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు 265 మంది.. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,669 మంది పోటీలో ఉన్నారు. * తెలంగాణ జిల్లాలోని నక్సలైట్ ప్రభావిత భూపాలపల్లి, ములుగు, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. 4 గంటల వరకు క్యూలో ఉన్నవారందరికీ ఎంత సమయమైనా ఓటు వేసే అవకాశం కల్పిస్తాం. అలాగే సిర్పూర్, చెన్నూరు, ఆసిఫాబాద్, ఖానాపూర్, మంథని, అచ్చంపేట, కోల్లాపూర్ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఈ నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు క్యూలో ఉన్నవారికి ఎంత సమయమైనా ఓటు వేసే అవకాశం కల్పిస్తాం. మిగతా 109 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు లైన్లో ఉన్నవారికి అర్ధరాత్రి వరకు అయినా ఓటు వేసే అవకాశం కల్పిస్తాం. * పోలింగ్ నిర్వహణ, భద్రతా చర్యల్లో మూడున్నర లక్షల మంది సిబ్బందిని నియమించాం. 182 కంపెనీల కేంద్ర సాయుధ బలగాల వినియోగం. ప్రతి పోలింగ్ కేంద్రంలోను ముగ్గురేసి పోలీసులు విధులు. శాంతిభద్రతల పరిరక్షణలో 11,898 మంది రాష్ట్ర పోలీసు అధికారులు, 44,223 కానిస్టేబుళ్లు, 13,058 మంది హోంగార్డులు. మొత్తం 30,518 పోలింగ్ కేంద్రాల్లో 8,894 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తింపు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సాయుధ పోలీసులు నియామకం. * తెలంగాణలో 16,512 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు. మండల, నియోజకవర్గ, సమీపంలోని పట్టణ కూడళ్లలో తెరలపై ఆయా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళి చూపిస్తారు. అభ్యర్థులు, పార్టీ నాయకులు, ప్రజలు పోలింగ్ సరళిని తెరలపై పరిశీలించవచ్చు. మిగతా పోలింగ్ కేంద్రాల్లో వీడియో చిత్రీకరణతో పాటు, స్టాటిక్ కెమెరాలు, మైక్రో పరిశీలకుల ఏర్పాటు. * తెలంగాణలో బుధవారం అత్యవసర సేవలందించే ఆసుప్రతుల్లో సిబ్బందికి కూడా ఒక షిఫ్ట్ సెలవు ఇవ్వాలి. బుధవారం ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ కంపెనీలు, పరిశ్రమలు, ఐటీ సంస్థలు, దుకాణాలన్నింటినీ సెలవు ప్రకటించాం. ఎవరైనా సెలవు ఇవ్వకపోతే ఆ యాజమాన్యంపై కేసు నమోదు చేస్తారు. ఏడాది పాటు జైలు శిక్షపడుతుంది. * తెలంగాణ జిల్లా ఓటర్లలో ముగ్గురు ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నారు. తెలంగాణ జిల్లాల్లో మొత్తం ఓటర్లు సంఖ్య 2,81,74,055 ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 1,43,82,661 కాగా మహిళా ఓటర్లు సంఖ్య 1,37,81,276 ఉన్నారు, ఇతర ఓటర్లు 2,329 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్లు మొత్తం 7,786 ఉన్నారు. * అభ్యర్థులు కాని వారు పోలింగ్ రోజు సెక్యురిటీతో ఓటు వేయడానికే బయటకు వెళ్లాలి. ఓటు వేసి వచ్చి ఇంట్లో కూర్చోవాలి. అలా కాకుండా బయట తిరిగితే అలాంటి వారిని గృహ నిర్బంధం చేస్తారు. సెక్యూరిటీ గల అభ్యర్థుల వెంట 24 గంటలు షాడో బృందాలతో నిఘా ఏర్పాటు చేస్తారు. * పోలింగ్ రోజు ఎగ్జిట్, ఓపీనియన్ పోల్ నిర్వహించరాదు. పోలింగ్ ముగిసే వరకు ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో, ఎస్ఎంఎస్లు, సామాజిక మీడియా ద్వారా ప్రచారం నిర్వహించరాదు. పోలింగ్ రోజు అభ్యర్థులను గానీ, ఓటర్లను గానీ ఎలక్ట్రానిక్ మీడియా ఇంటర్వ్యూలు చేయరాదు. స్లిప్ లేకున్నా జాబితాలో పేరు ఉంటే ఓటు ‘‘ఓటర్ స్లిప్‌లు రాకపోయినా జాబితాలో పేరు ఉంటే వెళ్లి ఓటు వేయవచ్చు. గుర్తింపు కార్డు లేకపోయినా ఇతర గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకుని వెళ్లి ఓటు వేయవచ్చు. గుర్తింపు కార్డుగా పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్స్, ఉద్యోగుల గుర్తింపు కార్డు, పాసు పుస్తకం, పాన్‌కార్డ్, ఆధార్ కార్డ్, ఉపాధి హామీ జాబ్ కార్డు, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, పెన్షన్ డాక్యుమెంట్, ఫొటో ఓటర్ స్లిప్, జనాభా గుర్తింపు కార్డు- వీటిలో ఏదైనా తీసుకెళ్లవచ్చు. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్ స్లిప్‌లతో బూత్‌స్థాయి ఆఫీసర్లు ఉంటారు. వారి నుంచి స్లిప్‌లు తీసుకోవచ్చు. 2 నిమిషాల్లోనే రెండు ఓట్లు ‘‘పోలింగ్ కేంద్రాల్లో తొలుత పార్లమెంటు అభ్యర్థులకు ఓటు వేసే కంపార్ట్మెంట్ ఉంటుంది. తెలుపు రంగు బ్యాలెట్ పార్లమెం టు అభ్యర్థికి ఉంటుంది. రెండో కంపార్ట్మెం ట్లో అసెంబ్లీ అభ్యర్థుల ఈవీఎం ఉంటుంది. గులాబి రంగు బ్యాలెట్ అసెంబ్లీ అభ్యర్థికి ఉంటుంది. రెండు నిముషాల్లో రెండు ఓట్లు వేయవచ్చు. ఓటు వేయగానే రెడ్ లైట్ వెలుగుతుంది. ఆ లైట్ వెలిగితే ఓటు నమోదైనట్లే.’’ 6.30 గంటలకు మాక్ పోలింగ్ తెలంగాణలో 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 30,518 పోలింగ్ కేంద్రాల్లో బుధవారం ఉదయం 6.30 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఈ మాక్ పోలింగ్‌ను అభ్యర్థుల ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎన్నికల ఏజెంట్లందరూ ఉదయం 6.30 గంటల కల్లా పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉండాలి. ఆయా పోలింగ్ కేంద్రాల్లో వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో ఎవరికి ఓటు వేస్తున్నారో వారికే ఓటు పడుతోందో లేదో మాక్ పోలింగ్ ద్వారా నిర్థారించనున్నారు. ఒక్కో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంలో 50 ఓట్లు వేసి ఈ మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఎవరికి వేసిన ఓట్లు వారికే పడుతున్నట్లు నిర్థారణ అయిన తరువాత ఆ యంత్రాల్లో వేసిన ఓట్లను తొలగిస్తారు. ఆ తరువాత సీల్ వేసి ఉదయం 7 గంటలకు పోలింగ్‌ను నిర్వహిస్తారు. -
జహీరా‘బాద్షా’ ఎవరో...
రాజకీయ, భౌగోళిక వైవిధ్యాలకు చిరునామా జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం. రెండు జిల్లాల అసెంబ్లీ సెగ్మెంట్లతో ఏర్పడిన ఈ నియోజకవర్గం కర్ణాటక, మహారాష్ట్రల సరిహద్దులో ఉంది. ఓ జిల్లాలో టీఆర్ఎస్ బలంగా ఉండగా, మరో జిల్లాలో బలహీనంగా ఉండడంతో ఇక్కడి ఓటరు నాడి అంతుచిక్కడం లేదు. అన్ని పార్టీల అభ్యర్థులు గెలుపు తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. సొంత బలం కన్నా ప్రత్యర్థుల బలహీనతలపైనే గురిపెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గం: జహీరాబాద్ నియోజకవర్గం ఏర్పడింది : 2009 ఎవరెన్ని సార్లు గెలిచారు : కాంగ్రెస్- 1 ప్రస్తుత ఎంపీ : సురేష్ షెట్కార్ ప్రస్తుత రిజర్వేషన్ : జనరల్ ప్రస్తుతం బరిలో ఉన్న అభ్యర్థులు : 12 మంది మొత్తంఓటర్లు : 14,30,413 పురుషులు : 7,03,823 స్త్రీలు : 7,26,516 ఇతరులు : 74 నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలు : జహీరాబాద్, అందోలు, నారాయణ్‌ఖేడ్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్, బాన్సువాడ (నిజామబాద్ జిల్లా ) ప్రధాన అభ్యర్థులు : సురేష్ షెట్కార్(కాంగ్రెస్), మహమ్మద్ మొహియొద్దీన్ (వైఎస్సార్సీపీ), బీబీ పాటిల్(టీఆర్ఎస్), మదన్మోహన్ రావు(టీడీపీ) మహమ్మద్ ఫసియొద్దీన్- సంగారెడ్డి: నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో సిద్దిపేట లోక్‌సభ స్థానం రద్దయి, జహీరాబాద్ నియోజకవర్గం ఏర్పడింది. మెదక్ జిల్లాలోని మూడు, నిజామాబాద్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిటింగ్ ఎంపీ సురేష్ షెట్కార్ బరిలో ఉన్నారు. మెదక్ జిల్లా జహీరాబాద్‌కు చెందిన ఆయన గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సయ్యద్ యూసుఫ్ అలీపై 17,407 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఐదేళ్లలో ఆయన అభివృద్ధిని పట్టించుకోలేదని ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి మహమ్మద్ మొహియొద్దీన్, టీఆర్ఎస్ అభ్యర్థి భీంరావు బస్వంత్‌రావు పాటిల్, బీజేపీ బలపరిచిన టీడీపీ అభ్యర్థి కె. మదన్ మోహన్‌రావు నుంచి సురేష్ షెట్కార్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. ఉద్యమం మీదే భారం.. నిజామాబాద్ జిల్లా సిర్పూర్‌కు చెందిన పారిశ్రామికవేత్త బీబీ పాటిల్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు చివరి నిమిషంలో టికెట్ కేటాయించడంతో పార్టీ శ్రేణుల నుంచే విమర్శలొచ్చాయి. ఉద్యమ ప్రభావం పాటిల్‌కు ఎంత వరకు ఉపకరిస్తుందన్నది అనుమానమే. ఆయనకు తెలుగు భాష రాదని.. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో టీఆర్ఎస్ బలంగానే ఉన్నా.. మెదక్ జిల్లా పరిధిలోని మూడు అసెంబ్లీ స్థానాలపై ఏమాత్రమూ పట్టు లేకపోవడం ఆ పార్టీకి ప్రతికూలంగా మారవచ్చు. పొత్తుపైనే ఆశలు.. టీడీపీ తరఫున నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన ఐటీ కంపెనీ అధినేత కె.మదన్ మోహన్ రావు బరిలో ఉన్నారు. ఆయన టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు సమీప బంధువు. ఇక్కడ టీడీపీ బలహీనంగా ఉన్నా, బీజేపీతో పొత్తు- నరేంద్ర మోడి గాలిపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. వైఎస్ పథకాలే అండ.. హైదరాబాద్ నగరానికి చెందిన మహమ్మద్ మొహియొద్దీన్ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు గణనీయంగా ఉండడం ఆయనకు కలిసివచ్చే అంశం. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన ముస్లిం అభ్యర్థి స్వల్ప తేడాతో ఓడిపోవడం విశేషం. వైఎస్సార్ సంక్షేమ కార్యక్రమాలతో లబ్ధి పొందిన వారు తనను ఆదరిస్తారని ఆయన ధీమాగా ఉన్నారు. సమస్యలతో సహవాసం.. - ఎగువ ప్రాంతంలో మంజీరానది పారుతున్నా నియోజకవర్గ ప్రజలు మాత్రం తాగు, సాగునీరుకు నోచుకోలేకపోయారు. - తాగునీటి కోసం పల్లె ప్రజలు కిలోమీటర్ల దూరంలో ఉండే చెలమలు, వ్యవసాయ బావులపై ఆధారపడాల్సిన దుస్థితి. - మద్దతు ధర లభించక చెరకు రైతు నష్టపోతున్నారు. - పరిశ్రమలు లేక స్థానికంగా ఉపాధి అవకాశాల్లేవు. వందల సంఖ్యలో గిరిజన తండాలుండగా.. ఏటా గిరిజన కుటుంబాలకు వలసబాట తప్పదు. ఏడాదిలో సగభాగం తండాలన్నీ ఖాళీగా కనిపిస్తాయి. - కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో వేల మంది గల్ఫ్ బాధితులు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. - గణనీయ సంఖ్యలో ఉన్న బీడీ కార్మికుల బతుకులు పొగ చూరుతున్నాయి. రెక్కలు ముక్కలు చేసి బీడీలు చుట్టినా పూట గడవని స్థితిలో ఉన్నారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందడం లేదు. క్షయ, క్యాన్సర్ లాంటి రోగాల బారిన పడుతున్నారు. సురేష్ షెట్కార్ (కాంగ్రెస్) అనుకూలం.. - కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందనే ప్రచారం - మృదు స్వభావి..వివాదాలకు దూరంగా ఉండడం - ప్రభుత్వ విద్యా సంస్థల ఏర్పాటుకు కృషి చేయడం - బరిలో ఉన్న ప్రత్యర్థుందరూ కొత్తవాళ్లే కావడం ప్రతికూలం... - సమస్యలు పరిష్కారం కాక ప్రజల్లో వ్యతిరేకత - స్థానికంగా అందుబాటులో ఉండకపోవడం - జిల్లాలో టీఆర్ఎస్ బలంగా ఉండడం - సొంత పార్టీలో అంతర్గ కుమ్ములాటలు నే గెలిస్తే... - ప్రతి గ్రామానికి మంజీర నీటి సరఫరా - పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉపాధి - బోధన్-బీదర్ రైల్వే లైన్ ఏర్పాటుకు చర్యలు - కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కృషి మదన్ మోహన్ రావు (టీడీపీ) అనుకూలం.. - ఆర్థికంగా బలంగా ఉండడం - సామాజిక సేవా కార్యక్రమాలు - సైకిల్ యాత్రతో గ్రామాల్లో పర్యటించడం - నరేంద్ర మోడి అంశం ప్రతికూలం... - రాజకీయాలకు కొత్త కావడం - టీడీపీ సంస్థాగతంగా బలహీనపడడం - బీజేపీ పొత్తుతో మైనారిటీ ఓట్లు దూరం కావడం నే గెలిస్తే... - వలసల నివారణ కోసం పరిశ్రమల స్థాపనకు కృషి - బోధన్ నుంచి బీదర్ వరకు జుక్కల్, బాన్సువాడ, నారాయణ్ఖేడ్ల మీదుగా రైల్వే లైన్ ఏర్పాటు - గల్ఫ్ బాధితులు, బీడీ కార్మికులకు పునరావాసం - మంజీర నుంచి ప్రతి గ్రామానికి తాగునీరు - పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తా బీబీపాటిల్ (టీఆర్ఎస్) అనుకూలం.. - తెలంగాణవాదం బలంగా ఉండడం - వ్యాపారవేత్తగా గుర్తింపు - తెలుగు కన్నడిగుల మద్దతు ప్రతికూలం... - తెలుగు భాష రాకపోవడం - చివరి నిమిషంలో పార్టీ టికెట్‌పై బరిలో దిగడం - ప్రజల్లో ప్రచారం లేకపోవడం - బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేశారనే ఆరోపణలు నే గెలిస్తే... - గిట్టుబాటు ధరతో పాటు రైతుల ఇతర సమస్యల పరిష్కారం - కాలుష్య రహిత పరిశ్రమల స్థాపన ..యువతకు ఉపాధి కల్పన - రైల్వే లైనుల ఆధునికీకరణ మహమ్మద్ మొహియొద్దీన్ (వైఎస్సార్సీపీ) అనుకూలం... - దివంగత సీఎం వైఎస్ పథకాల ప్రభావం - మైనారిటీల ఓట్లు గణనీయంగా ఉండడం - గత ఎన్నికల్లో ముస్లిం అభ్యర్థి స్వల్ప ఓట్లతో ఓడిపోవడం - వ్యాపారవేత్తగా ప్రజలతో సత్సంబంధాలు ప్రతికూలం.. - తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేయడం - ప్రత్యర్థులతో పోలిస్తే ఆర్థికంగా బలహీనమే నే గెలిస్తే... - స్థానిక కంపెనీల్లో స్థానికులకే ఉపాధి అవకాశాలు - కొత్త పరిశ్రమల ఏర్పాటు, పెద్దాస్పత్రి నిర్మాణం - ప్రతి పల్లెకు మంజీర నీటి సరఫరా - రైతు ఆత్మహత్యల నివారణకు కృషి - ప్రభుత్వ విద్యా సంస్థల్లో టీచర్ల నియామకం -
భువనగిరిలో పోటాపోటీ
భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలు: భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగుతుర్తి, ఆలేరు, జనగామ (వరంగల్) ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి) నియోజకవర్గం ప్రత్యేకతలు: చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల ఓట్లు కీలకం. ఫ్లోరైడ్ పీడితుల సంఖ్య ఎక్కువ . పట్టణీకరణ వల్ల పెరిగి పోయిన సమస్యలు ప్రధాన అభ్యర్థుల వీరే - కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్) - బూర నర్సయ్యగౌడ్ (టీఆర్ఎస్) - చెరుపల్లి సీతారాములు (సీపీఎం) - నల్లు ఇంద్రాసేనారెడ్డి (బీజేపీ) - కపిలవాయి దిలీప్‌కుమార్ (రాష్ట్రీయ లోక్‌దళ్) మొత్తం ఓటర్లు: 14,85,021 ఎన్.క్రాంతి, నల్లగొండ: భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం మూడు జిల్లాలతో ముడిపడి ఉంది. వరంగల్ జిల్లాలోని జనగామ, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్లు దీని పరిధిలోనే ఉన్నాయి. స్థానిక కేడర్‌ను తయారుచేసుకోలేక పోయినవారు ఆ జిల్లా కేడర్, అసెంబ్లీ అభ్యర్థులపై పూర్తిస్థాయిలో ఆధారపడాల్సి వస్తోంది. కాకపోతే ఏడు సెగ్మెంట్లూ తెలంగాణవాదం బలంగా ఉన్నవి కావడంతో కొంత ఆశతో ఉన్నారు. గెలుపోటములను ప్రభావితం చేసేవి ఇవే.. భువనగిరి ఎంపీ అభ్యర్థుల గెలుపోటములను ఈ నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. సాగు, తాగునీరు ప్రధానంగా వేధిస్తున్న సమస్యలు. వ్యవసాయ రంగంపై ఆధారపడ్డ రైతులు గోదావరి, మూసీ నదీ జలాలు అందించాలని ఎంతో కాలంగా కోరుతున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలోని మునుగోడు సెగ్మెంటులో ఫ్లోరైడ్ సమస్య ఉంది. వ్యవసాయ రంగం తర్వాత ఈ నియోజకవర్గంలో చేనేత రంగంపై ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. వీరు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాగే రైల్వే ఆధునికీకరణ, భువనగిరి వరకు మూడో రైల్వే లైను నిర్మాణం, బీబీనగర్- నడికుడి మార్గంలో డబ్లింగ్ పనులు, విద్యుదీకరణ వంటి సమస్యలు ఉన్నాయి. భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ పడుతున్న అభ్యర్థులు ప్రధానంగా ఆధారపడుతోంది తెలంగాణ సెంటిమెంటు ఓటుపైనే. తెలంగాణ ఇచ్చిన తమకే ప్రజలు పట్టం కడతారనే ధీమాతో కాంగ్రెస్, తెలంగాణ వచ్చిందే తమ పార్టీ వల్ల కాబట్టి ఓట్లన్నీ తమకేనని టీఆర్ఎస్, తెలంగాణ ఏర్పాటులో తమదే కీలకపాత్ర కాబట్టి ఓటర్ల మొగ్గు తమవైపేనని బీజేపీ గెలుపుపై ఆశలు పెట్టుకున్నాయి. ఇక రాష్ట్రీయ లోక్‌దళ్, సీపీఎంలు కూడా గెలుపుపై ఆశలు పెట్టుకున్నాయి. నే.. గెలిస్తే.. - సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తా - బీబీనగర్ నిమ్స్‌ను అభివృద్ధి చేస్తా - చేనేత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేస్తా - భువనగిరి పట్టణాన్ని శాటిలైట్ టౌన్‌గా ఏర్పాటు చేయిస్తా - కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్) అనుకూలం - అసెంబ్లీ సెగ్మెంట్లలో బలమైన సిట్టింగ్ అభ్యర్థులు - తెలంగాణ వాదాన్ని పార్లమెంటులో బలంగా వినిపించారన్న పేరు - తెలంగాణ ఉద్యమంలో కనిపించడం ప్రతికూలం - తెలంగాణ సెంటిమెంటు ఓటు చీలిపోయే అవకాశం - సంస్థాగతంగా ఉన్న గ్రూపులు - ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తా - బీబీనగర్ నిమ్స్‌ను ప్రారంభించి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేయిస్తా - పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తా - బత్తాయి రైతుల సమస్యల పరిష్కారానికి జిల్లాలో జ్యూస్ ఆధారిత కంపెనీలు ఏర్పాటు చేయిస్తా. - నల్లు ఇంద్రసేనారెడ్డి (బీజేపీ) అనుకూలం - తెలంగాణ కోసం పనిచేసిన గుర్తింపు - గతంలో ఈ నియోజకవర్గ ప్రజలతో ఉన్న పరిచయాలు ప్రతికూలం - పార్టీ నిర్మాణం బలంగా లేకపోవడం - స్థానికేతరుడు కావడం - ప్రజలకు వైద్య సేవల సమాచారంపై ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తా - సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయిస్తా - ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయిస్తా - బూర నర్సయ్యగౌడ్ (టీఆర్ఎస్) అనుకూలం - ఉద్యమ పార్టీ అభ్యర్థి కావడం - డాక్టర్స్ జేఏసీలో కీలకంగా పనిచేయడం ప్రతికూలం - తెలంగాణ సెంటుమెంటుపైనే ఆధారపడడం - రాజకీయాలకు కొత్త కావడం - భువనగిరి పట్టణాన్ని శాటిలైట్ టౌన్‌షిప్‌గా మారుస్తా - పెద్ద చెరువులను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా మారుస్తా - నల్లగొండలో విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేస్తా - భువనగిరి, కొలనుపాకను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తా - దిలీప్‌కుమార్ (ఆర్ఎల్డీ) అనుకూలం - టీఆర్ఎస్లో పనిచేసినప్పుడున్న పరిచయాలు - ఎమ్మెల్సీగా ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం ప్రతికూలం - టీఆర్ఎల్డీ బలహీనంగా ఉండడం - క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలు లేకపోవడం - సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తా - పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయిస్తా - {పజలకు నిత్యం అందుబాటులో ఉంటా - భువనగిరి పట్టణాన్ని మోడల్ టౌన్‌గా అభివృద్ధి చేస్తా. - కులవృత్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటా - చెరుపల్లి సీతారాములు (సీపీఎం) అనుకూలం - సీపీఎం సంప్రదాయ ఓటు బ్యాంకు - కార్మిక వర్గంలో పట్టుండడం - చేనేత వర్గానికి చెందిన అభ్యర్థి కావడం ప్రతికూలం - సమైక్యవాద పార్టీ అన్న ముద్ర - తెలంగాణకు పూర్తి వ్యతిరేకంగా పనిచేయడం - సగం అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ బలహీనంగా ఉండడం పోల్ పదనిసలు మూడుసార్లు... మూడు సెగ్మెంట్లు ఎన్నికల బరిలోకి దిగుతున్న ప్రతిసారీ కొత్త నియోజకవర్గాన్ని ఎంచుకుంటున్న బొజ్జపల్లి రాజయ్య ముచ్చటగా మూడోసారి కూడా కొత్త నియోజకవర్గాన్నే ఎంచుకున్నారు. 1985లో వరంగల్ జిల్లా పరకాల ఎస్సీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన ఆయన 1999లో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం ఎస్సీకి రిజర్వు కావడంతో అక్కడి నుంచి పోటీచేసి విజయం సాధించారు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా వర్ధన్నపేట నుంచి బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు. - న్యూస్‌లైన్, హన్మకొండ అలుపెరగని అజ్మీరా వరంగల్ జిల్లాకు చెందిన మాజీమంత్రి అజ్మీరా చందూలాల్ తొమ్మిదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఎనిమిది పర్యాయాలు పోటీచేసి గెలుపోటములు చవిచూసిన ఆయన ప్రస్తుతం ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మాజీ మంత్రులు ఎన్.యతిరాజారావు, కమాలుద్దీన్ అహ్మద్‌లు కూడా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు కలిపి తొమ్మిది పర్యాయాలు బరిలో నిలిచినవారే. ఇదే జిల్లాకు చెందిన చందుపట్ల జంగారెడ్డి ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు పోటీ చేశారు. ప్రస్తుతం పోటీలో ఉన్న చందూలాల్ తొలిసారి ములుగు నుంచి టీడీపీ అభ్యర్థిగా 1983లో పోటీచేసి ఓటమి పాలయ్యారు. 1985లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన తిరిగి 1989లో ఓడిపోయారు. మళ్లీ 1994లో విజయం సాధించారు. 1996,1998లో వరంగల్ ఎంపీగా బరిలోకి దిగి విజయ కేతనం ఎగరవేశారు. 1999లో తిరిగి ములుగు ఎమ్మెల్యేగా పోటీచేసి పరాజయం పాలయ్యారు. 2009లో మహబూబాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తాజాగా ములుగు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. - న్యూస్‌లైన్, వరంగల్ సిద్దిపేట.. హ్యాట్రిక్‌ల కోట సిద్దిపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన పలువురు హ్యాట్రిక్ కొట్టారు. ఇక్కడి నుంచి 1967 ఎన్నికల్లో పోటీ చేసిన జి.వెంకటస్వామి 1971,1977లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టగా నంది ఎల్లయ్య 1989, 1991, 1996లో విజయం సాధించారు. సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుంచి అనంతుల మదన్మోహన్ 1972, 1978, 1983లో గెలుపొందారు. ఇక టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 1985, 1989, 1994, 1999, 2001, 2004 ఎన్నికల్లో వరుసగా గెలుపొంది డబుల్ హ్యాట్రిక్ సాధించారు. అదే పార్టీ ముఖ్యనేత టి.హరీష్‌రావు 2004, 2008, 2009, 2010 ఎన్నికల్లో జయకేతనం ఎగురవేశారు. -
దారెటు..?
కలిసి నడుద్దామనుకున్న తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీలకు మధ్య విరిసిన స్నేహం మూన్నాళ్ల ముచ్చటే అవుతోంది. ఇరు పక్షాల మధ్య సీమాంధ్రలో ఎగిసిన విభేదాల నెగళ్ల ప్రభావం ‘తెలంగాణ’లోనూ కనిపిస్తోంది. మనసులు కుదరక ఇక్కడా రెండూ పార్టీలు చెరో దారిన వెళ్తున్నాయి. ప్రచార పర్వంలో ఇది కొట్టొచ్చినట్లుగా ఉంది. దీంతో తెలుగుదేశం అభ్యర్థులు ఒంటరిగానే ముందుకెళ్తున్నారు. వాళ్లే అలా ఉంటే మేమేం తక్కువా అంటూ కమల దళం బెట్టుచేస్తోంది. బెడిసిన వ్యవహారం ఎటుదారితీస్తుందోనని రెండు పార్టీల అభ్యర్థులు, కేడరు ఆందోళన చెందుతున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలుగుదేశం పార్టీ 2009 సాధారణ ఎన్నికల్లో తొమ్మిది అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుని జిల్లాపై పట్టు సాధించింది. కానీ ఐదేళ్లు తిరిగే సరికి పార్టీ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్ట పోయిన చందంగా తయారైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో వలసలు, తిరుగుబాట్లు పార్టీ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చాయి. బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నా పొసగ క పోవడంతో ఒంటరిగా ప్రచార పర్వంలో దిగిన దేశం అభ్యర్థులు పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల షెడ్యూలు వెలువడిన తర్వాత మార్చి 25న జిల్లా కేంద్రం మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రసంగించారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ అన్ని ప్రధాన పార్టీలు ముఖ్య నేతలను జిల్లాకు రప్పిస్తున్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే రెండు చోట్ల బహిరంగ సభల్లో పాల్గొన్నారు. 21న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, 22న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మహబూబ్‌నగర్‌లో నిర్వహించే సభల్లో పాల్గొంటున్నారు. సీమాంధ్రలో తెలుగుదేశం, బీజేపీల పొత్తు రోజుకో మలుపు తిరుగుతుండటంతో నరేంద్ర మోడీ సభకు టీడీపీ కేడర్ హాజరు అనుమానంగానే కనిపిస్తోంది. క్షేత్ర స్థాయిలోనూ టీడీపీ, బీజేపీ కలిసి పనిచేస్తున్న ఘట్టం అరుదుగా కనిపిస్తోంది. టీడీపీ నాగర్‌కర్నూలు లోక్‌సభ నియోజకవర్గంతో పాటు ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించింది. కొడంగల్‌లో టీడీపీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి సొంత ఇమేజీని నమ్ముకుని ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీలో రెండు వర్గాలు ఉండటంతో వారిని వేర్వేరుగా ప్రచార పర్వంలో పాల్గొనేలా రేవంత్ తంటాలు పడుతున్నారు. మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి ఇప్పటి వరకు నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. మక్తల్‌లో ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి టీడీపీ, బీజేపీ మధ్య సమన్వయం కోసం ప్రయత్నించినా సయోధ్య కుదరడం లేదు. బీజేపీ, టీడీపీ కార్యకర్తల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసినా మెజారిటీ బీజేపీ కార్యకర్తలు ముఖం చాటేశారు. జడ్చర్లలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఒంటరిగా ప్రచారం చేసుకుంటున్నారు. సొంత పార్టీ కేడర్ ఇతర పార్టీల్లోకి వలస వెళ్లడంతో వ్యక్తిగత పరిచయాలపైనే ఆధార పడి ప్రచార వ్యూహం సిద్దం చేసుకుంటున్నారు. నారాయణపేటలో టీడీపీ అభ్యర్థి రాజేందర్‌రెడ్డి పొత్తు ఉన్నా ఒంటరి ప్రచారం చేసుకుంటున్నారు. టికెట్ దక్కక పోవడంతో తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో వున్న రతంగ్ పాండు రెడ్డి తన ప్రచార రథంపై బీజేపీ ఎంపీ అభ్యర్థి నాగం జనార్దన్‌రెడ్డి ఫోటో, ఎన్నికల గుర్తును పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా తనకు, ఎంపీగా నాగంకు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు టీడీపీ అభ్యర్థి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దేవరకద్రలో ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి టీడీపీ కేడర్‌ను వెంటేసుకుని ప్రచారం చేసుకుంటున్నారు. రెండు పార్టీలు వేర్వేరు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడంతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు. నామమాత్రంగా వున్న బీజేపీ కేడర్ ఎంపీ అభ్యర్థి నాగం పక్షాన మాత్రమే ఓట్లు అడుగుతున్నారు. వనపర్తిలో సిట్టింగ్ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి రెండు పార్టీలను సమన్వయం చేస్తున్నారు. త్రిముఖ పోటీ నెలకొనడంతో జనం స్పందన అంతంత మాత్రంగా కనిపిస్తోంది. ఓట్ల చీలికపైనే రావుల భారీగా ఆశ పెట్టుకుని లెక్కలు వేసుకుంటున్నారు. నాగర్‌కర్నూలు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి బక్కని నర్సింహులు ప్రచార పర్వంలో ఎక్కడా కనిపించడం లేదు. ఆలంపూర్లో ఎమ్మెల్యే అబ్రహాం సానుభూతి ఓటుపై ఆధార పడి ప్రచారం ప్రారంభించారు. బీజేపీ కేడర్ ఎక్కడా ప్రచారంలో కనిపించడం లేదు. అచ్చంపేటలో ఎమ్మెల్యే రాములు నియోజకవర్గంపై తనకున్న అవగాహనతో ప్రచార షెడ్యూలును అనుసరిస్తున్నారు. బీజేపీ కేడర్ ప్రచార పర్వంలో మొక్కుబడిగా కనిపిస్తోంది. -
ఇదీ ‘దేశం’తుదిజాబితా?
సాక్షి, తిరుపతి: జిల్లాలో అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల తుది జాబితా సిద్ధమైనట్టు తెలిసింది. ఈ జాబితాలో తిరుపతి, సత్యవేడు, పీలేరు, పుంగనూరు స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించనున్నారు. పొత్తుల్లో భాగంగా తిరుపతి, రాజంపేట లోక్‌సభ స్థానాలు, మదనపల్లె అసెంబ్లీ సెగ్మెంట్ బీజేపీకి వదిలిన విషయం విదితమే. ఇవి కాకుండా తొమ్మిది అసెంబ్లీ, చిత్తూరు లోక్‌సభ స్థానాల అభ్యర్థులను రెండు విడతలుగా ప్రకటించారు. మిగిలిన నాలుగు అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ఎంపిక క్లిష్టంగా మారడంతో చంద్రబాబు వాటిపై సుదీర్ఘంగా కసరత్తు చేశారు. ముఖ్యంగా తిరుపతి, పుంగనూరు అసెంబ్లీ సెగ్మెంట్లలో టికెట్లు ఆశిస్తున్న వారిమధ్య పోటీ ఉంది. సత్యవేడు, పీలేరు నియోజకవర్గాలకు అభ్యర్థులు దొరకక జాప్యం చేశారు. తిరుపతి నుంచి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి చదలవాడ కృష్ణమూర్తితో పాటు ఇటీవల కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ, బోత్ ఆస్పత్రి మేనేజింగ్ డెరైక్టర్ పసుపులేటి హరిప్రసాద్ టికెట్ కోసం తీవ్రంగా పోటీపడ్డారు. చివరికి మాజీ ఎమ్మెల్యేల పేర్లు మాత్రమే పరిశీలనకు రాగా వెంకటరమణ పేరు ఖరారు చేశారని తెలిసింది. పార్టీ అధికారంలోకి వస్తే చదలవాడకు ఏదో ఒక పదవి ఇస్తానని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో చదలవాడ వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు అంటిపెట్టుకుని పని చేస్తే ఇప్పుడు అవమానపరుస్తున్నారనే ఆవేదనతో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంకా హైదరాబాద్‌లోనే మకాం వేసిన చదలవాడ ్ణమూర్తి తిరుపతికి వచ్చిన తరువాత తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఎవరికి టికెట్టు ఇచ్చినా మరొకరు పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో తిరుపతి టీడీపీ అభ్యర్థికి వెన్నుపోట్ల ప్రమాదం పొంచి ఉందని చెప్పకతప్పదు. ఈ పరిస్థితుల్లో డాక్టర్ హరిప్రసాద్ వైఖరి ఏంటనేది వేచి చూడాల్సిందే. పీలేరు నుంచి మైనారిటీ అభ్యర్థి మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు నుంచి మైనారిటీ అభ్యర్థిని రంగంలోకి తెస్తున్నారు. టీడీపీ మైనారిటీ సెల్ జిల్లా ప్రధానకార్యదర్శి కాబ్లీ ఇక్బాల్ అహ్మద్ పేరును ఖరారు చేశారు. ఇక్కడ ద్వితీయశ్రేణి నాయకులు పోటీపడినప్పటికీ చివరికి ఇక్బాల్ అభ్యర్థిత్వంవైపే మొగ్గుచూపారు. టికెట్టు ఆశించిన ద్వితీయశ్రేణి నాయకులు ఎలా వ్యవహరిస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రాజుకే పుంగనూరు ఎడతెగని సంప్రదింపుల తరువాత పుంగనూరు నుంచి ఎం.వెంకటరమణరాజు పేరు ఖరారు చేశారు. కిందటి ఎన్నికల్లో కూడా ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ స్థానం నుంచి ఎన్.శ్రీనాథరెడ్డి, ఆయన సతీమణి అనూషారెడ్డి టికెట్టు ఆశించారు. నాలుగు రోజుల తర్జనభర్జన తరువాత వెంకటరమణరాజు వైపు మొగ్గుచూపారు. దీంతో శ్రీనాథరెడ్డి వర్గీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సత్యవేడు నుంచి రాజేష్‌కృష్ణ సత్యవేడు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి రాజేష్‌కృష్ణ పేరు దాదాపుగా ఖరారైనట్టు తెలిసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే హేమలత పట్ల పార్టీ శ్రేణుల్లోనూ ప్రజల్లోనూ వ్యతిరేకత ఉన్నట్టు సర్వేలు తేల్చడంతో కొత్త అభ్యర్థి కోసం అన్వేషించారు. ఇందులో తలారి మనోహర్, రాజేష్‌కృష్ణ పేర్లు పరిశీలనకు వచ్చాయి. రాజేష్‌కృష్ణ వైపే చంద్రబాబు మొగ్గుచూపారు. ఈయన తొలిసారిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు, -
టీడీపీ, బీజేపీ మధ్య పొత్తుల కుంపటి
సాక్షి ప్రతినిధి, కర్నూలు : పొత్తు కుదిరింది కానీ.. టికెట్ల పంచాయితీ ఓ పట్టాన తేలడం లేదు. బీజేపీ ప్రతిపాదించిన మూడు అసెంబ్లీ స్థానాలను ఇచ్చేందుకు టీడీపీ ససేమిరా అంటోంది. ఇదే సమయంలో బీజేపీ కూడా పట్టువిడవని ధోరణి అవలంబిస్తోంది. ఆదోని, నంద్యాల, పాణ్యం అసెంబ్లీ సీట్లివ్వాల్సిందేనంటూ ఆ పార్టీ నేతలు భీష్మించారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు జిల్లా నాయకులను విజయవాడకు రావాలని కబురు పెట్టడం చర్చనీయాంశమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడంపై ఇప్పటికే తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. జిల్లాలో మైనార్టీ ఓటర్లు అత్యధికంగా ఉండటంతో పొత్తు తమ పుట్టి ముంచుతుందేమోనని వారిలో కలవరం మొదలైంది. రెండు కళ్ల సిద్ధాంతంతో ఓటమికి చేరువైన కారణంగా కనీసం మోడీని ముందుంచుకునైనా పరువు కాపాడుకునేందుకు బాబు ఈ పొత్తుకు తెర తీసినట్లు చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే పొత్తులో భాగంగా పాణ్యం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చేందుకు బాబు మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ స్థానంలో టీడీపీ గెలిచే పరిస్థితి లేకపోవడం.. అక్కడ తమ్ముళ్ల మధ్య పోటీ ఉండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ అక్కడ ప్రముఖ రియల్టర్ కేజే రెడ్డి ప్రచారం చేస్తున్నారు. అదే విధంగా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి కూడా పాణ్యం టికెట్ ఆశిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలో తేల్చుకోలేక బాబు పాణ్యం ను వదులుకునేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదే ఖరారైతే ఎమ్మెల్యే కాట సాని రాంభూపాల్‌రెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా.. బీజేపీ కోరుతున్న ఆదోని, నంద్యాల స్థానాల విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది. మొత్తంగా పొత్తు ‘పంచాయితీ’ తమ్ముళ్లను అయోమయానికి గురి చేస్తోంది. అధినేత ఎవరి సీటుకు ఎసరు పెడతారోననే బెంగ వారిని వెంటాడుతోంది. ఆదోని, నంద్యాల, పాణ్యం అసెంబ్లీ స్థానాలను ఆశిస్తున్న నాయకులు టిక్కెట్ తమకే ఖరారనే భావనతో ప్రచారం చేసుకుంటున్నారు. ఇదే సమయంలో బీజేపీ ఈ సీట్లపై కన్నేయడంతో ఆయా ప్రాంతాల్లోని టీడీపీ అభ్యర్థులు వేచిచూసే ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఈనెల 11న ఆదోని డివిజన్లో ప్రాదేశిక ఎన్నికలపైనా పొత్తు ప్రభావం చూపవచ్చని తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. -
సిట్టింగులకు ఫిట్టింగ్!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు జట్టుకట్టడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. కుదిరితే పొత్తు, లేకుంటే విలీనంతోనే ఎన్నికలకు వెళ్లేందుకు ఇరుపార్టీల పెద్దల మధ్య ఒక మౌఖిక అంగీకారం కుదిరినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ దోస్తీ జిల్లాలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారింది. మెదక్ జిల్లాలో ఆరు అసెంబ్లీ సీట్ల కోసం టీఆర్ఎస్ పట్టుబడుతుండగా, ఇందులో నాలుగు సీట్లలో కాంగ్రెస్ పార్టీ వారే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ మేరకు అత్యంత నమ్మదగిన వ్యక్తుల నుంచి ‘సాక్షి’కి సమాచారం అందింది. కొలిక్కివచ్చిన కసరత్తు! టీఆర్ఎస్, కాంగ్రెస్‌పార్టీలు వచ్చే సాధారణ ఎన్నికల్లో కలిసే పోటీ చేయడం ఖాయంగా తెలుస్తోంది. తెలంగాణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన అనంతరం టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం చేయటం, లేదా పొత్తు పెట్టుకోవడం అనే అంశంపై ఇరుపార్టీల నేతల మధ్య వారం రోజులుగా నెలకొన్న హై‘డ్రామా’ ఒక కొలిక్కి వచ్చినట్టు సమాచారం. వీలైనన్ని ఎక్కువ సీట్లు, రాష్ట్రంలో ‘ముఖ్య’మైన బాధ్యతలు అప్పగించాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. పార్టీని విలీనం చేయమని ఒత్తిడి చేయడం తప్ప.. టీఆర్ఎస్ లేవదీసిన అభ్యంతరాలపై కాంగ్రెస్‌నేతలు సమాధానం చెప్పడం లేదు. దీంతో ఆగ్రహంగా ఉన్న టీఆర్ఎస్ అధినాయకత్వం బీజేపీతో పొత్తు పెట్టుకుంటామనే బెదిరింపు సంకేతాలను ఇప్పటికే కాంగ్రెస్‌కు పంపింది. దీంతో కలవరపడ్డ కాంగ్రెస్ నేతలు గులాబీ ముఖ్యనేతతో మాట్లాడినట్టు సమాచారం. శత్రుశేషం లేకుండా చూసుకునేందుకు.. తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డగా పేరుగాంచిన మెదక్ జిల్లాపైనే కేసీఆర్ ఎక్కువ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పైగా ఆయన సొంత జిల్లా కూడా ఇదే కావడంతో టీఆర్ఎస్కు బలమైన పునాదులు వేసుకోవడంతో పాటు శత్రుశేషం లేకుండా చేసుకోవాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నట్లు సమాచారం. అందులోభాగంగానే సిద్దిపేట, మెదక్, దుబ్బాక, సంగారెడ్డి, జోగిపేట, గజ్వేల్, అసెంబ్లీ సీట్లు కావాలని కేసీఆర్ డిమాండ్ చేసినట్లు సమాచారం. వీటిలో సిద్దిపేట, మెదక్ మినహా మిగిలిన నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ ఆరు స్థానాలను కోరడం వెనుక రాజకీయ ఎత్తుగడ ఉన్నట్లు సమాచారం. టీఆర్ఎస్ బహిష్కృత నేత, మెదక్ ఎంపీ విజయశాంతి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె మెదక్ అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నట్ల సమాచారం. సంగారెడ్డి ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి, టీఆర్ఎస్ నేతల మధ్య రాజకీయ శతృత్వం ఉంది. వీలుచిక్కినప్పుడు కేసీఆర్‌పై, ఆయన కుటుంబసభ్యులపై విమర్శల వర్షం కురిపించడంతో పాటు అవసరమైతే కేసీఆర్‌పై పోటీకి సిద్ధమని ఇప్పటికే జగ్గారెడ్డి ప్రకటించారు. అందువల్లే అటు విజయశాంతికి, ఇటు జగ్గారెడ్డికి చెక్ పెట్టాలనే ఆలోచనతోనే మెదక్, సంగారెడ్డి సీట్ల కోసం టీఆర్ఎస్ ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దామోదర సీటుకూ గండం కేసీఆర్ కోరుతున్న టికెట్లలో దామోదర రాజనర్సింహ సీటు కూడా ఉన్నట్లు సమాచారం. తెలంగాణ తొలి సీఎం దళితుడే ఉంటాడని ప్రకటించిన కేసీఆర్, ఆ ఛాన్స్ దామోదర రాజనర్సింహకు ఇచ్చేందుకు మాత్రం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసిన వెంటనే డిప్యూటీ సీఎంగా ఉన్న దామోదర రాజనర్సింహ సీఎం అయ్యేందుకు ప్రయత్నించినా రాష్ట్రపతి పాలనతో ఆ కోరిక నెరవేరలేదు. కానీ రేపొద్దున ఆయన గెలిచి ముఖ్యమంత్రి పదవికోసం దళితకోటాను తెరపైకి వస్తే ప్రమాదముంటుందని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. అందువల్లే, కేసీఆర్‌తో సన్నిహితంగా ఉంటూ టీడీపీ తరఫున అందోల్ టికెట్ ఆశిస్తున్న మాజీమంత్రి, టీడీపీ నేత బాబూమోహన్‌ను టీఆర్ఎస్ నుంచి రంగంలోకి దింపేందుకు కసరత్తు చేస్తోన్నట్లు సమాచారం. ఇక సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌లో టీఆర్ఎస్ పార్టీకి సహజ సిద్ధంగానే బలమైన పార్టీ కేడబ్ ఉంది. కాబట్టి ఈ మూడు సీట్లు కూడా తమకే కావాలని గులాబీ నేతలు అడుగుతున్నట్లు సమాచారం. -
ఫిబ్రవరి నెలాఖరుకల్లా 2 రాష్ట్రాలు : మర్రి శశిధర్‌రెడ్డి
హైదరాబాద్ : ఫిబ్రవరి నెలాఖరుకల్లా రెండు రాష్ట్రాలు ఏర్పడతాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, జాతీయ విపత్తు నివారణ సంస్థ (ఎన్ డీఎంఏ) ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ బిల్లు ఆమోదానికి ప్రత్యేక సమావేశాలు ఉండొచ్చునని ఆయన సోమవారమిక్కడ అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచేందుకు కేంద్రం ఆలోచిస్తుందన్నారు. రాజకీయ సుస్థిరతను పెంపొందించేందుకు శాసనసభ స్థానాలు పెంచాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కు పెంచాలన్నారు. ఈ అంశాన్ని మరోసారి కేంద్ర హోమంత్రి సుశీల్ కుమార్ రెడ్డి, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్తామని శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పాటైనప్పుడు కూడా అసెంబ్లీ స్థానాలు పెంచడం జరిగిందని ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి గుర్తు చేశారు. -
అసెంబ్లీ సీట్ల పెంపుపై నిర్ణయం ప్రభుత్వానిదే
కేంద్ర ఎన్నికల కమిషనర్ హెచ్.ఎస్.బ్రహ్మ స్పష్టీకరణ సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ హెచ్.ఎస్.బ్రహ్మ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోనిదే ఈ విషయంలో ఎన్నికల సంఘం ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో అసెంబ్లీ సీట్లను పెంచాలని టీ కాంగ్రెస్ నేతలు ఇటీవల జీవోఎంను కలిసి విజ్ఞప్తి చేయడం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలకు అదనంగా 34 స్థానాలను పెంచాలని టీ కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సీట్ల పెంపు విషయమై శనివారం తనను కలిసిన ఓ మీడియా చానల్‌తో బ్రహ్మ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో 294 అసెంబ్లీ స్థానాలున్నాయని, సీట్లను పెంచాల్సి వస్తే ఆంధ్ర, తెలంగాణలో.. రెండు చోట్లా పెంచాలి కదా అని అన్నారు. అయితే సీట్లు పెంచుతారా? లేదా? అనేది ప్రభుత్వమే నిర్ణయించాలన్నారు. ఒక ప్రాంతంలో సీట్లను పెంచడం సాధ్యమేనా? అన్న ప్రశ్నకు.. సీట్ల పెంపుపై కేంద్రం ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని, కేబినెట్ నిర్ణయం తర్వాత చేసుకోవచ్చని ఆయన బదులిచ్చారు. రాష్ట్ర విభజన జరుగుతుందా? లేదా? అనేది తాను సరిగ్గా చెప్పలేనన్నారు. ఇందుకు చాలా ప్రక్రియ... సమయం కూడా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. -
అసెంబ్లీ సీట్లను పెంచాలి : తెలంగాణ కాంగ్రెస్ నేతలు
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రానున్న ఎన్నికల లోపే ఆ రాష్ట్ర అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల లోపు అసెంబ్లీ స్థానాల పెంపు సాధ్యం కాని పక్షంలో ‘తెలంగాణ ప్రొవిజనల్ అసెంబ్లీ’ పేరుతో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలతోనే సభను కొనసాగించాలని కోరారు. అసెంబ్లీ స్థానాలను పెంచిన తరువాతే శాసనసభకు ఎన్నికలు నిర్వహించాలని కోరారు. పార్టీ సీనియర్ నాయకుడు, జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి నేతృత్వంలో సుమారు 30 మంది టీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు మంగళవారం కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందించారు. అసెంబ్లీలో తక్కువ స్థానాలు ఉంటే రాజకీయ అస్థిరత ఏర్పడి, మరో జార్ఘండ్లా మారే ప్రమాదముందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ‘విభజన తరువాత తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలే ఉంటాయి. దాంతో రాజకీయంగా చాలా సమస్యలు వస్తాయి’ అని తెలిపారు. ఈ సందర్భంగా అసెంబ్లీ స్థానాలను పెంచుకునే పద్ధతులను షిండేకు శశిధర్ రెడ్డి తెలిపారు. ‘425 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌ను విభజించాక ఉత్తరాఖండ్ రాష్ట్రానికి 22 అసెంబ్లీ స్థానాలను మాత్రమే కేటాయించారు. ఆ తరువాత ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచే అంశాన్ని ఉత్తరప్రదేశ్ పునర్విభజన చట్టం-2000లో పొందుపర్చి, అసెంబ్లీ సీట్ల సంఖ్యను 70కి పెంచారు. అప్పటివరకు ఎన్నికలు నిర్వహించకుండా, అప్పుడున్న ఎమ్మెల్యేలతో ఉత్తరాంచల్ ప్రొవిజనల్ అసెంబ్లీని ఏర్పాటు చేశారు’ అని ఆయన షిండేకు వివరించారు. ఒక్కో లోక్‌సభ సీటు పరిధిలో 9 అసెంబ్లీ స్థానాలు రాజ్యాంగ సవరణ అవసరం లేకుండా ఎంపీ స్థానాల పరిధిలో ఎమ్మెల్యే సీట్ల సంఖ్యను పెంచుకునే వెసులుబాటు కూడా ఉందని మర్రి శశధర్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో కూడా హర్యానా మాదిరిగా ఒక్కో పార్లమెంట్ పరిధిలో 9 అసెంబ్లీ స్థానాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రిని కోరారు. దాంతో తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక 153కు పెరుగుతుందని, శాసనమండలిని కూడా కొనసాగించవచ్చని సూచిం చారు. వీరి వాదనలను సావధానంగా విన్న షిండే ఈ ప్రతిపాదనలను పరిశీలించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి సూచించినట్లు తెలిసింది. ఇదే సందర్భంలో భద్రాచలం డివిజన్‌ను పూర్తిగా తెలంగాణలోనే కొనసాగించాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కోరారు. షిండేను కలిసిన వారిలో ఎంపీలు నంది ఎల్లయ్య, వి.హనుమంతరావు, ఎమ్మెల్యేలు పి.శంకర్రావు, ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పొంగులేటి, జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెస్ ప్రభాకర్, పూల రవీందర్, జనార్దన్‌రెడ్డి, సీనియర్ నేతలు మల్లు రవి, కోదండరెడ్డి తదితరులున్నారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. తమ ప్రతిపాదనలకు కాంగ్రెస్ నేతలతో పాటు, టీఆర్ఎస్లోని ముఖ్యనాయకుడు కూడా మద్దతు తెలిపారని మర్రి వెల్లడించారు. -
కౌన్సిల్‌పై యావతోనే అసెంబ్లీ స్థానాల పెంపు డిమాండ్
తెలంగాణ ఏర్పడటం దాదాపు ఖాయమయ్యిందన్న ఊపులో, కొత్త రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాలన్న కొత్త డిమాండుతో ముందుకొచ్చారు తెలంగాణా కాంగ్రెస్ నాయకులు. ఈ మేరకు, జాతీయ విపత్తు నిర్వహణా సంస్థ వైస్‌చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందం తెలంగాణ పై ఏర్పాటైన జీవోఎంను మంగళవారం కలిశారు కూడా. పాలనా సౌలభ్యం కోసం అని వీరు చెప్పుకుంటున్నప్పటికీ, తెలంగాణ నేతల అసలు ఆంతర్యం వేరే ఉందని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలతో ఎగువ సభ విధాన పరిషత్ (లెజిస్లెటివ్ కౌన్సిల్) ఏర్పాటు కుదరదు కనుక, రాజకీయ ఉపాధి కేంద్రంగా కాంగ్రెస్ భావించే కౌన్సిల్ ఏర్పాటుకు అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచడమే మార్గమని వారి ఆలోచన అని తెలుస్తోంది. రాజ్యాంగంలోని 171వ అధికరణ ప్రకారం, లెజిస్లెటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్య అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో మూడోవంతు మించకూడదు. అంతే కాకుండా, కౌన్సిల్ సభ్యుల సంఖ్య కనీసం 40 ఉండితీరాలి. ఈ లెక్కల ప్రకారం చూస్తే, 119 మంది ఉండబోయే తెలంగాణ రాష్ట్రంలో, అందులో మూడో వంతు 40 కంటే తక్కువ కావడం వల్ల కౌన్సిల్ ఏర్పాటు చేసే అవకాశం ఉండదు. అందుకే ముందు జాగ్రత్తగా తెలంగాణ ఏర్పడ్డాక అసెంబ్లీలో సీట్ల సంఖ్యపై ముందుగానే తెలంగాణ బిల్లులో పొందుపరిచేలా చూడాలని జీవోఎంని కలిశారు తెలంగాణా ప్రతినిధులు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో సమావేశమైన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు కొత్త రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల పెంచడం మీద ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆ తీర్మాన సారాంశాన్ని మర్రి శశిధర్‌రెడ్డి బృందం ఈ రోజు సుశీల్ కుమార్ షిండేని కలిసి అందజేశారు. రాజకీయ అస్థిరత ఉండకూడదని, పాలనా సౌలభ్యం ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నా, కాంగ్రెస్సులో తామరతంపరగా ఉండే రాజకీయ నిరుద్యోగులకి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ డిమాండ్ ప్రాణం పోసుకుందని తెలియవచ్చింది. -
తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెంచాలి
-
తెలంగాణ వస్తే రాత్రికి రాత్రి అంతా మారిపోదు: మర్రి
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను కోరారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంగళవారం షిండేను కలిసి తెలంగాణలో లోక్‌సభ, అసెంబ్లీ నియోజవర్గాల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు. భేటీ అనంతరం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు, సనత్ నగర్ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను పెంచాలని షిండేని కోరామని, చిన్న రాష్ట్రాల్లో రాజకీయ అస్థిరత్వాన్ని పోగొట్టడానికే ఈ ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. తాము పది జిల్లాలలో కూడిన హైదరాబాద్ రాజధానిగా ఉన్న తెలంగాణనే కోరుతున్నామని మర్రి స్పష్టం చేశారు. నాగాలాండ్ లాంటి చోట ఒక్క పార్లమెంట్ స్థానంలో 60 అసెంబ్లీ స్థానాలు కూడా ఉన్నాయని మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ వస్తే రాత్రికి రాత్రి అంతా మారిపోతుందనుకోవద్దని ఆయన అన్నారు. చాలా సమస్యలు ఉంటాయని.... వాటిని పరిష్కరించడానికి ఎక్కువ మంది ప్రజా ప్రతినిధులు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీ స్థానాలు పెంచాలనే ప్రతిపాదనపై టీఆర్ఎస్లోని ఓ ముఖ్యనేత తనతో మాట్లాడి.... మద్దతు తెలిపారన్నారు. కాంగ్రెస్ పార్టీతో సహా తెలంగాణలోని అన్ని పార్టీలు ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయటం సాధ్యమేనని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. -
తెలంగాణలో అసెంబ్లీ సీట్లను పెంచాలని కోరాం
-
తెలంగాణ అసెంబ్లీ సీట్లు పెంచాలి: మర్రి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో కొత్తరాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచాలని జాతీయ విపత్తుల నిర్వహణా సంస్థ (ఎన్డీఎంఏ) ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి, కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) సారథి సుశీల్ కుమార్ షిండేకి ఆయన బుధవారం లేఖ రాశారు. తెలంగాణ పరిధిలో 17 లోక్‌సభ సీట్లు, 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని రాజకీయ అస్థిరతకు ఆస్కారం లేకుండా సీట్ల సంఖ్య పెంచాలని కోరారు. ఒక్కో లోక్‌సభ సీటు పరిధిలో రెండేసి చొప్పున అదనంగా 34 అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు చేయాలని, దీనితో సీట్ల సంఖ్య 153కు పెరుగుతుందని తన లేఖలో తెలిపారు.