సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచే అవకాశం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. దీనిపై తుది నిర్ణయం కేంద్ర న్యాయ శాఖదేనని స్పష్టం చేశారు. ‘జమ్ము, కశ్మీర్ బ్లాక్ స్థాయి ప్రజాప్రతినిధులతో ఆయన గురువారం ఇక్కడ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మార్చి, ఏప్రిల్‌లో జమ్మూ కశ్మీర్‌లో పర్యటిస్తానని, జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియ ప్రారంభం కాలేదని, అసెంబ్లీ సీట్ల పెంపుపై ఆలోచన చేస్తున్నామని వివరిం చారు. మే నెలలో జమ్మూ కశ్మీర్ ‘ఔట్ రీచ్’కార్యక్రమం అమలు చేస్తామని, కేంద్ర మంత్రులంతా బ్లాక్ లెవల్‌కు వెళ్లి అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని వివరించారు.
ఢిల్లీ ఘర్షణలపై సిట్..: ‘ఢిల్లీలో ప్రశాంత వాతావర ణం ఏర్పడింది. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నా యి. కర్ఫ్యూ ఎత్తేశారు. ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లపై విచారణకు ‘సిట్’(ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటైంది’అని కిషన్‌రెడ్డి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment