
సాక్షి, చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటే ముఖ‍్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాత్రం అసెంబ్లీ సీట్లు కావాల్సి వచ్చిందని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. నరేంద్రమోదీ, చంద్రబాబుతో ఏపీకి ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. చంద్రబాబు తన కేసుల నుంచి తప్పించుకునేందుకు అసెంబ్లీ సీట్లు పెంచుకోవడానికే ప్రాధాన్యమిచ్చారని రోజా విమర్శించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న చంద్రబాబుకు అసెంబ్లీ సీట్ల పెంపు ఒక్కటే సమస్యగా కనిపిస్తుందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ముఖ్యమా..? అసెంబ్లీ సీట్లు ముఖ్యమా..? అని ఆమె సూటిగా చంద్రబాబును ప్రశ్నించారు. ప్రధానితో భేటీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సిందిగా మోదీని కోరినట్లు చంద్రబాబు పేర్కొన్న విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment