3 ఎంపీ, 33 అసెంబ్లీ స్థానాలకు ఏర్పాట్లు పూర్తి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో మూడు లోక్‌సభ స్థానాలతోపాటు 33 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలకు నేడు (శనివారం) పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్, గుజరాత్‌లోని వడోదరా, ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి ఎంపీ స్థానాలతోపాటు యూపీలో 11, గుజరాత్‌లో 9, రాజస్థాన్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 2, ఈశాన్య రాష్ట్రాల్లో 5, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లలోని ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక లు జరగనున్నాయి. ఈ నెల 16న ఓట్ల లెక్కింపు జరగనుంది. లోక్‌సభ ఎన్నికల్లో రెండేసి సీట్లలో గెలిచిన ప్రధాని నరేంద్ర మోడీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయంసింగ్‌లు వడోదరా, మెయిన్‌పురి స్థానాలను ఖాళీ చేయడంతో పాటు, తెలంగాణలో జరిగి న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఎంపీ స్థానాన్ని వదులుకోవడంతో మెదక్‌లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
నేడు ఉప ఎన్నికల పోలింగ్
Published Sat, Sep 13 2014 2:45 AM | Last Updated on Sat, Mar 9 2019 3:26 PM
Advertisement