న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ మేరకు ఈసీ, ఏపీ, తెలంగాణకు నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఏపీలో అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచాలని పిటిషన్ దాఖలైంది.
అయితే ఈ మధ్య జమ్మూ, కశ్మీర్‌లకు సంబంధించిన అసెంబ్లీ సీట్లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఒక డీలిమిటేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే జమ్మూలోనూ, కశ్మీర్‌లోనూ అసెంబ్లీ సీట్లను పెంచారు. ఈ నేపథ్యంలోనే ఏపీ, తెలంగాణలో కూడా అసెంబ్లీ సీట్లను పెంచాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. సెప్టెంబర్ 29న సుప్రీంకోర్టులో ఇందుకు సంబంధించిన కేసు విచారణ జరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment