అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో లేనట్లే!
అసెంబ్లీ సీట్ల పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ అందింది గానీ.. ఇప్పట్లో సీట్లు పెంచే అవకాశం ఏ రాష్ట్రంలోనూ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 170 (3) అధికరణం ప్రకారం, 2026 జనాభా లెక్కలు వచ్చేంత వరకు ఏ రాష్ట్రంలోనూ అసెంబ్లీ సీట్లు పెంచడం సాధ్యం కాదని తెలిపింది.
రాజ్యసభలో టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఈ వివరాలు తెలిపింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రభుత్వాలు అసెంబ్లీ సీట్ల పెంపుపై పెట్టుకున్న ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది.