ఫిబ్రవరి నెలాఖరుకల్లా రెండు రాష్ట్రాలు ఏర్పడతాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, జాతీయ విపత్తు నివారణ సంస్థ (ఎన్ డీఎంఏ) ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ : ఫిబ్రవరి నెలాఖరుకల్లా రెండు రాష్ట్రాలు ఏర్పడతాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, జాతీయ విపత్తు నివారణ సంస్థ (ఎన్ డీఎంఏ) ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ బిల్లు ఆమోదానికి ప్రత్యేక సమావేశాలు ఉండొచ్చునని ఆయన సోమవారమిక్కడ అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచేందుకు కేంద్రం ఆలోచిస్తుందన్నారు.
రాజకీయ సుస్థిరతను పెంపొందించేందుకు శాసనసభ స్థానాలు పెంచాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కు పెంచాలన్నారు. ఈ అంశాన్ని మరోసారి కేంద్ర హోమంత్రి సుశీల్ కుమార్ రెడ్డి, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్తామని శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పాటైనప్పుడు కూడా అసెంబ్లీ స్థానాలు పెంచడం జరిగిందని ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి గుర్తు చేశారు.