బ్రెజిల్ అమ్మాయితో బోల్ట్ రాసలీలలు | Usain Bolt caught in bed with Brazilian student in Rio | Sakshi
Sakshi News home page

బ్రెజిల్ అమ్మాయితో బోల్ట్ రాసలీలలు

Published Mon, Aug 22 2016 3:23 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM

బ్రెజిల్ అమ్మాయితో బోల్ట్ రాసలీలలు

బ్రెజిల్ అమ్మాయితో బోల్ట్ రాసలీలలు

జమైకా చిరుత ఉసేన్ బోల్ట్కు ట్రాక్పై ఎదురేలేదు. బోల్ట్ రిటైరయినట్టు ప్రకటించినా.. అతణ్ని ఓడించే మొనగాడు ఇంకా రాలేదు. బోల్ట్ వరుసగా మూడు ఒలింపిక్స్లోనూ స్ప్రింట్లో మూడేసి స్వర్ణాలు చొప్పున తొమ్మిది పతకాలు గెలిచి చరిత్ర సృష్టించాడు. బీజింగ్, లండన్, రియో ఒలింపిక్స్ ఈవెంట్లో బోల్ట్ స్టార్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచాడు.

ప్రపంచ స్టార్ స్ప్రింటర్గా బోల్ట్ సాధించిన ఘనతలు అందరికీ తెలుసు. ట్రాక్పై చిరుతలా పరుగెత్తే బోల్ట్ అమ్మాయిల విషయంలోనూ చాలా ఫాస్టే. జమైకాకు చెందిన గాళ్ఫ్రెండ్ కాసి బెనెట్తో రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు. త్వరలోనే వీరద్దరూ వివాహం చేసుకోనున్నట్టు సమాచారం. గత ఆదివారం రియోలో 30వ బర్త్ డే పార్టీ చేసుకున్న బోల్ట్ ఓ అమ్మాయితో కలసి హుషారుగా డాన్స్ చేశాడు. ఈ ఫొటోలు బయటకు వచ్చాయి. బ్రెజిల్కు చెందిన 20 ఏళ్ల జేడీ డార్టె అనే విద్యార్థిని వాట్సాప్లో పోస్ట్ చేసిన ఫొటోలు సంచలనం రేపాయి. బెడ్ మీద బోల్ట్ తో కలసి ఉన్నప్పటి ఫొటోలను కొన్నింటిని అప్​లోడ్ చేసింది. ఒలింపిక్స్ సందర్భంగా రియోలో ఓ రాత్రి బోల్ట్తో గడిపినట్టు ఈ అమ్మడు బాంబు పేల్చింది. వెస్ట్ రియోలోని ఓ క్లబ్​లో జమైకా స్ప్రింటర్​ను కలిసినట్టు ట్వీట్ చేసింది. కాగా తన ఫ్రెండ్ చెప్పేంత వరకు బోల్ట్ స్టార్ అథ్లెట్ అన్న విషయం తెలియదని చెప్పింది. ఇది సాధారణ విషయమని, ఫేమస్ కావడం కోసం ఫొటోలను వాట్సప్​లో షేర్ చేయలేదని వ్యాఖ్యానించింది.

బోల్ట్ కూడా ఈ విషయాన్ని లైట్​గా తీసుకున్నాడు. జమైకా సంస్కృతి విభిన్నంగా ఉంటుందని, మహిళలతో పోలిస్తే పురుషులకు ఒకరి కంటే ఎక్కువ భాగస్వాములుంటారని చెప్పాడు. ఓ సెలెబ్రిటీగా ఒకే మహిళతో కలసి ఉండటం కష్టమని అంగీకరించాడు. ఈ విషయంపై బోల్ట్ సోదరి క్రిస్టినె బోల్ట్ హైల్టన్ మాట్లాడుతూ.. తన సోదరుడు కాసి బెనెట్​ను వివాహం చేసుకుంటాడని చెప్పింది. త్వరలో ఇద్దరికీ నిశ్చితార్థం జరుగుతుందని వెల్లడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement