ఆతిథ్య జట్టు శుభారంభం | Brazil kick off at home with 3-0 win over China | Sakshi
Sakshi News home page

ఆతిథ్య జట్టు శుభారంభం

Published Thu, Aug 4 2016 5:27 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

ఆతిథ్య జట్టు శుభారంభం

ఆతిథ్య జట్టు శుభారంభం

రియోడీజనీరో: రియో ఒలింపిక్స్ ఆరంభ వేడుకులకు రెండు రోజుల ముందే జరిగిన మహిళల ఫుట్ బాల్ మ్యాచ్లో ఆతిథ్య బ్రెజిల్ జట్టు శుభారంభం చేసింది. భారతకాలమాన ప్రకారం బుధవారం రియోడీజనీరో నగరంలో జరిగిన సాకర్ పోరులో బ్రెజిల్ 3-0 తేడాతో చైనా మహిళలపై ఘన విజయం సాధించింది. బ్రెజిల్ తరపున మోనికా, ఆండ్రెస్సా ఎల్వెస్, క్రిస్టేన్లు తలో గోల్ చేసి గెలుపులో ముఖ్య పాత్ర పోషించారు. ఆట 10 వ నిమిషంలోనే గోల్ సాధించిన బ్రెజిల్.. 59వ నిమిషంలో మరో గోల్ సాధించి పైచేయి సాధించింది. అయితే ఆట చివరి నిమిషంలో క్రిస్టేన్ హెడర్ ద్వారా గోల్ సాధించడంతో బ్రెజిల్ ఖాతాలో సంపూర్ణ విజయం చేరింది.

మరో మ్యాచ్లో స్వీడన్ 1-0 తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఆట రెండో అర్థభాగంలో స్వీడన్ క్రీడాకారిణి నిల్లా ఫిచర్ గోల్ సాధించడంతో స్వీడన్ ఆధిక్యం సాధించింది. ఆ తరువాత ఇరు జట్లు చివరి వరకూ పోరాడినా గోల్ నమోదు కాలేదు. దీంతో స్వీడన్ ఏకైక గోల్ తో విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement