రికార్డు స్థాయిలో రియో టికెట్ల అమ్మకాలు! | 133,000 tickets for Paralympic Games sold in just one day | Sakshi
Sakshi News home page

రికార్డు స్థాయిలో రియో టికెట్ల అమ్మకాలు!

Published Thu, Aug 25 2016 2:00 PM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

రికార్డు స్థాయిలో రియో టికెట్ల అమ్మకాలు!

రికార్డు స్థాయిలో రియో టికెట్ల అమ్మకాలు!

రియో డీ జనీరో: వచ్చే నెలలో రియోలో ఆరంభం కానున్న పారా ఒలింపిక్స్ నేపథ్యంలో అక్కడ అప్పుడే టికెట్ల అమ్మకాల సందడి ఊపందుకుంది. గతవారం ముగిసిన రియో ఒలింపిక్స్ విజయవంతం కావడంతో పారా ఒలింపిక్స్ను చూసేందుకు అభిమానులు పోటీ పడుతున్నారు. పారా ఒలింపిక్స్ టికెట్లు అమ్మకాలు మొదలుపెట్టిన నాలుగు రోజుల్లోనే దాదాపు మూడు లక్షల టికెట్లు అమ్మడైపోయాయి. గత మంగళవారం ఒక్క రోజే లక్షా ముప్పై మూడు వేల టికెట్లు అమ్ముకావడంతో సరికొత్త రికార్డు నమోదయ్యింది.  రియో ఒలింపిక్స్ లో ఒక్క రోజులోనే అత్యధిక సంఖ్యలో టికెట్లను విక్రయించడం ఇదే ప్రథమం.

'గడిచిన 48 గంటల్లో టికెట్లు అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. ఇలా పారా ఒలింపిక్ టికెట్లకు డిమాండ్ పెరగడం గేమ్స్నిర్వహణకు ప్రోత్సాహకంగా ఉంది. తొలి రోజు పదహారు వేల టికెట్లు అమ్ముడుపోగా, రెండో రోజు యాభై టికెట్లు అమ్ముడయ్యాయి. ఇక మూడు, నాలుగు రోజుల్లో లక్షల సంఖ్యలో టికెట్లను విక్రయించాం'అని అంతర్జాతీయ పారా ఒలింపిక్ కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోన్జాలెజ్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement