స్ఫూర్తినిచ్చారు..
- పారాలింపిక్స్‌లో అదరగొట్టిన భారత్
- చరిత్రలో తొలిసారి ఒకే టోర్నీలో నాలుగు పతకాలు
ఒలింపిక్స్‌లో కనీసం పది పతకాలైనా తెస్తారని భావించిన భారత క్రీడాభిమానుల ఆశలపై మన అథ్లెట్లు నీళ్లు చల్లారు. చివర్లో రెండు పతకాలు వచ్చాయన్న సంతృప్తి మిగిలినా ఎక్కడో ఏదో తెలీని వెలితి. ఆ వెలితి తీరిపోయి.. అభిమానులకు ఊహించని స్థాయి ఆనందం మరో నెలరోజుల్లోపే కలుగుతుందని ఎవరూ అనుకోలేదు. అయితే మన పారాథ్లెట్లు తమ అద్భుత ప్రదర్శనతో దేశానికి గర్వకారణంగా నిలిచారు. చరిత్రలో ఎన్నడూ లేని ఒకే పారాలింపిక్ టోర్నీలో రెండు స్వర్ణాలు సహా నాలుగు పతకాలు సాధించి అభిమానులకు వెల కట్టలేని ఆనందం అందించారు. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి అంగవైకల్యాన్ని లెక్క చేయకుండా పతకాలు నెగ్గిన మన క్రీడారులు.. అలాగే ఆ ఈవెంట్ పాల్గొన్న మొత్తం 19 మంది భారత ప్లేయర్లు మనందరికీ స్ఫూర్తిదాయకం.
రియో డీ జనీరో: రియో పారాలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు పోటీ పడుతున్న క్రీడాంశాల్లో పోటీలు ముగిశాయి. మన క్రీడాకారులు ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి అద్భుత ప్రదర్శనతో మనకు గర్వకారణంగా నిలిచారు. నిజానికి రియో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల ప్రదర్శనతో నిరాశ చెందిన క్రీడాభిమానులకు పారాలింపిక్స్ మొదలయ్యేంత వరకు అందులో పోటీపడుతున్న ఆటగాళ్ల గురించి మనవాళ్లకు పెద్దగా తెలియదు. ఈ పోటీల్లో పాల్గొన్న భారత క్రీడాకారులు 19 మందే. పైగా అంచనాలు లేవు. కానీ ఒక్కసారి పోటీలు ఆరంభమాయ్యక అద్భుత ప్రదర్శనతో అందరీ దృష్టీ తమవైపు మళ్లేలా చేశారు. దృఢ సంకల్పంతో శారీరక వైకల్యాన్ని జరుుంచి పతకాలతో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. శనివారంతో రియో పారాలింపిక్స్‌లో భారత ఆటగాళ్ల ప్రస్థానం ముగిసింది. ఆఖరి రోజు పోటీపడ్డ ముగ్గురు భారత క్రీడాకారులూ విఫలమయ్యారు. పురుషుల షాట్‌పుట్ (ఎఫ్56/57)లో వీరేందర్ 8వ స్థానంలో నిలవగా.. . హైజంప్ (టీ45/46/47)లో రాంపాల్ ఆరో స్థానం సాధించాడు. మహిళల డిస్కస్ త్రో (ఎఫ్55)లో కర్మజ్యోతి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది.
రెండు స్వర్ణాలు, ఒక రజతం, మరొక కాంస్యం.. పారాలింపిక్స్‌లో 1968 నుంచి పోటీపడుతున్న భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఒకే పారాలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు గెలవడం ఇదే తొలిసారి. చిన్నప్పుడే ప్రమాదంలో కాలు కోల్పోయిన తమిళ తంబి తంగవేలు మారియప్పన్ హైజంప్‌లో పసిడితో ఘన బోణీ కొట్టగా.. పోలియో కారణంగా వికలాంగుడిగా మారిన వరుణ్ సింగ్ భాటి కాంస్యం కొల్లగొట్టాడు. శస్త్రచికిత్సల వల్ల చక్రాల కుర్చీకి పరిమితమైన దీపా మాలిక్ షాట్‌పుట్ రజతం గెలిచి పారాలింపిక్స్‌లో పతకం నెగ్గిన భారత తొలి మహిళగా చరిత్ర సృష్టించగా.. ఎనిమిదేళ్లవయసులో విద్యుదాఘాతానికి ఓ చేరుుకోల్పోరుున దేవేంద్ర జజారియా పారాలింపిక్స్‌లో రెండో స్వర్ణం నెగ్గిన భారత తొలి పారాఅథ్లెట్‌గా ఘనత వహించాడు.
వైకల్యం శరీరానికే కాని సవాళ్లకు కాదని చాటి చెప్పిన ఈ అథ్లెట్ల విజయగాథ కోట్ల మందికి స్ఫూర్తిదాయకం.