ప్రి క్వార్టర్స్కు దీపికా
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్లో మరో భారత మహిళా ఆర్చర్ దీపికా కుమారి ప్రి క్వార్టర్స్లోకి ప్రవేశించింది. గురువారం తెల్లవారుజామున జరిగిన తొలి రౌండ్లో క్రిస్టైన్ ఎసెబ్యా(జార్జియా)ను 6-4 తేడాతో ఓడించిన దీపికా.. రెండో రౌండ్లో సర్తోరి గ్వేన్దోలిన్(ఇటలీ)పై 6-2 తేడాతో విజయం సాధించి ప్రి క్వార్టర్స్ కు అర్హత సాధించింది.
దీపికా కుమారికి తొలి రౌండ్లో క్రిస్టెన్ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంది. ఇద్దరు క్రీడాకారిణులు చెరో రెండు సెట్లను గెలుచుకోవడంతో నిర్ణయాత్మక ఐదో సెట్ అనివార్యమైంది. ఈ సెట్లో ఆకట్టుకున్న దీపికా.. ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా స్కోరును కాపాడుకుని పైచేయి సాధించింది. ఇక రెండో రౌండ్లో మూడు సెట్లను దీపిక గెలుచుకోగా, ఒక సెట్ను మాత్రమే గ్వేన్దోలిన్ గెలుచుకుంది. అంతకుముందు మహిళల ఆర్చరీ విభాగంలో బొంబాలే దేవి ప్రి క్వార్టర్స్ కు చేరిన సంగతి తెలిసిందే.