రియో విన్నర్లకు మరో ఆఫర్! | IRCTC offers free ride to Rio winners in Maharajas' Express | Sakshi
Sakshi News home page

రియో విన్నర్లకు మరో ఆఫర్!

Published Thu, Aug 25 2016 4:06 PM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

రియో విన్నర్లకు మరో ఆఫర్!

రియో విన్నర్లకు మరో ఆఫర్!

న్యూఢిల్లీ: ఇటీవల రియోలో జరిగిన ఒలింపిక్స్లో అద్భుత ప్రదర్శన కనబరిచి భారత్ కు పతకాలు సాధించిన షట్లర్ పీవీ సింధు, మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్లపై వరాల జల్లు కురుస్తోంది. ఇక నుంచి ఆ ఇద్దరు క్రీడాకారిణులు లగ్జరీ టూరిజం ట్రైన్ మహరాజ ఎక్స్ప్రెస్ల్లో ఉచితంగా ప్రయాణించవచ్చంటూ ఐఆర్సీటీసీ(ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పేరేషన్) తాజాగా ఆఫర్ చేసింది. వీరితో పాటు ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్లో తృటిలో పతకాన్నికోల్పోయిన త్రిపుర అమ్మాయి దీపా కర్మాకర్కు సైతం మహరాజస్ ఎక్స్ప్రెస్ రైల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తూ ఐఆర్సీటీసీ నిర్ణయం తీసుకుంది.

 

ఈ మేరకు   ఆయా క్రీడాకారిణులకు  ఐఆర్సీటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఏకే మనోకా ట్విటర్ట్లో అభినందనలు తెలియజేశారు. ఇది వారికిచ్చే అరుదైన గౌరవంగా భావిస్తున్నామని మనోకా తెలిపారు. ఇప్పటికే నార్తరన్ రైల్వేస్లో సీనియర్ క్లర్క్గా విధులు నిర్వహిస్తున్న సాక్షి మాలిక్కు రూ. 60 లక్షల పురస్కారాన్ని ఐఆర్సీటీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement