ఖచ్చితమైన సమాచారం పొందుపరచాలి
కడప ఎడ్యుకేషన్:
ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో చదివే విద్యార్థుల వివరాలతోపాటు కళాశాలలోని వసతులకు సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరచాలని, లేకుంటే చర్యలు తప్పవనిఆర్‌ఐవో రవి, డీవీఈవో చంద్రమౌళి పేర్కొన్నారు. కడప నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆన్‌లైన్ ఆడ్మిషన్లు, జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్‌పై ప్రిన్సిపల్‌తో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆర్‌ఐవో, డీవీఈవోలు మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించిన ప్రతి అడ్మిషన్‌ను ఆన్‌లైన్‌లో పెట్టాలన్నారు. ఆన్‌లైన్‌లో పెట్టేటప్పుడు విద్యార్థులకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని ఖచ్చితంగా ఉండాలన్నారు. అలాగే కళాశాలలోని సైన్సుల్యాబ్, ల్యాబ్‌లో పరికరాలు, అధ్యాపకుల వివరాలతోపాటు అన్ని రకాల వసతులకు సంబంధించి ప్రతి విషయాన్ని ఖచ్చితంగా తప్పులు లేకుండా ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. సంబంధిత విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు.
అలాగే జంబ్లింగ్‌విధానంలో ప్రయోగ పరీక్షల గురించి విద్యార్థులను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలన్నారు. ప్రతి ల్యాబ్‌లో పరికరాలు కల్పించి విద్యార్థుల చేత ప్రయోగాలను చేయించాలన్నారు. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ సెక్రటరీ రేణుకాప్రసాద్, ఎయిడెడ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ సెక్రటరీ రమణరాజుతోపాటు ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.