Online Admission
-
ఆన్లైన్ ద్వారా డిగ్రీ అడ్మిషన్లు
ప్రవేశాలకు నేడు నోటిఫికేషన్మొత్తం సీట్లు దాదాపు 3.20 లక్షలు గత ఏడాది జూన్ 19నే ప్రక్రియ ప్రారంభంసాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఉన్నత విద్యా మండలి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు అన్ ఎయిడెడ్, అటానమస్ డిగ్రీ కళాశాలల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో ఆన్లైన్ ద్వారా సీట్లను భర్తీ చేయనుంది. వాస్తవానికి ఇంటరీ్మడియట్ ఫలితాలు విడుదలై రెండు నెలలు దాటినప్పటికీ డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. తాజాగా.. ఇంటరీ్మడియెట్ సప్లిమెంటరీ ఫలితాలు కూడా ప్రకటించారు. వర్సిటీల నుంచి కళాశాలలకు అనుమతుల పొడిగింపు ప్రక్రియలో జాప్యంతోపాటు కొత్తగా బీసీఏ, బీబీఏ, బీఎంఎస్ కోర్సులు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పరిధిలోకి వెళ్లాయి. ఫలితంగా యూజీసీ నుంచి రావాల్సిన గుర్తింపు ఏఐసీటీఈ ఇవ్వాల్సి వస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో సుమారు వెయ్యికి పైగా డిగ్రీ కళాశాలలు ఉండగా అందులో 800 వరకు బీసీఏ, బీబీఏ, బీఎంఎస్ కోర్సులు అందిస్తున్న కళాశాలలు వున్నాయి. వీటికి ఏఐసీటీఈ అనుమతులు వచ్చి, రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఎన్ఓసీ ఇచి్చన తర్వాతే సీట్ల భర్తీ చేయాల్సి రావడంతో అడ్మిషన్లకు జాప్యం జరిగింది. వీటికి తోడు.. 43 కళాశాలలు కొత్తగా అనుమతులు కోసం దరఖాస్తు చేశాయి. వీటిలో కేవలం రెండు లేదా మూడింటికి మాత్రమే అనుమతులొచ్చే అవకాశముందని ఉన్నత విద్య వర్గాలు చెబుతున్నాయి. ఈ కళాశాలల్లో 2024–25లోనే అడ్మిషన్లకు అవకాశం కలి్పంచనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. గతేడాది జూన్ 19 నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కాగా.. ప్రస్తుత ప్రభుత్వంలో ఆలస్యంగా జరుగుతుండటం గమనార్హం. మొత్తం సాధారణ డిగ్రీలో సుమారు 3.20 లక్షల వరకు సీట్లున్నాయి. -
ఏపీలో ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల
అమరావతి: ఏపీలో ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లకు ఇంటర్‌బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 13 నుంచి 23 వరకు ఆన్లైన్ ద్వారా ఇంటర్ అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరించనున్నారు. bie.ap.gov.inలో ఆన్లైన్ ద్వారా ఇంటర్ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్ల కోసం apoasis అనే మొబైల్ అప్లికేషన్ రూపకల్పన చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులు సులువుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. కాగా విద్యార్ధులు ఎటువంటి ఒరిజనల్ సర్టిఫికేట్స్ కళాశాలలకి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని ఇంటర్ బోర్డు తెలిపింది. ధరఖాస్తు సమయంలో కూడా ఎటువంటి సర్టిఫికేట్స్ అప్ లోడ్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రతీ కాలేజ్‌లో.. ప్రతీ జిల్లా కేంద్రంలో హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు, ఇంటర్ రెండు సంవత్సరాలతో పాటు వొకేషనల్ విద్యార్ధులకి ఆన్ లైన్ ద్వారానే అడ్మిషన్లు పొందే అవకాశం కల్పించారు. ధరఖాస్తు ఫీజు ఓసీ, బీసీలకి రూ.100, ఎస్సీ,ఎస్టీ, పీహెచ్లకి రూ. 50గా నిర్ణయించారు. విద్యార్దుల సందేహాలకి టోల్ ఫ్రీ నంబర్ 18002749868 కాల్ చేయాల్సిందిగా సూచించారు. నెలాఖరు లోపు ధరఖాస్తులని పరిశీలించి విద్యార్ధులకి అడ్మిషన్ లెటర్స్ పంపనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. -
ఖచ్చితమైన సమాచారం పొందుపరచాలి
కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో చదివే విద్యార్థుల వివరాలతోపాటు కళాశాలలోని వసతులకు సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరచాలని, లేకుంటే చర్యలు తప్పవనిఆర్ఐవో రవి, డీవీఈవో చంద్రమౌళి పేర్కొన్నారు. కడప నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆన్లైన్ ఆడ్మిషన్లు, జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్‌పై ప్రిన్సిపల్‌తో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆర్ఐవో, డీవీఈవోలు మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించిన ప్రతి అడ్మిషన్‌ను ఆన్లైన్లో పెట్టాలన్నారు. ఆన్లైన్లో పెట్టేటప్పుడు విద్యార్థులకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని ఖచ్చితంగా ఉండాలన్నారు. అలాగే కళాశాలలోని సైన్సుల్యాబ్, ల్యాబ్‌లో పరికరాలు, అధ్యాపకుల వివరాలతోపాటు అన్ని రకాల వసతులకు సంబంధించి ప్రతి విషయాన్ని ఖచ్చితంగా తప్పులు లేకుండా ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. సంబంధిత విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. అలాగే జంబ్లింగ్విధానంలో ప్రయోగ పరీక్షల గురించి విద్యార్థులను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలన్నారు. ప్రతి ల్యాబ్‌లో పరికరాలు కల్పించి విద్యార్థుల చేత ప్రయోగాలను చేయించాలన్నారు. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ సెక్రటరీ రేణుకాప్రసాద్, ఎయిడెడ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ సెక్రటరీ రమణరాజుతోపాటు ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. -
వర్సిటీల్లో ఆన్లైన్ అడ్మిషన్లు: యూజీసీ
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని వర్సిటీల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆన్లైన్ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాలని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) సూచించింది. ఆన్లైన్ అడ్మిషన్ల విషయంలో వర్సిటీలు తీసుకుంటున్న చర్యలను తెలపాలని యూజీసీ చైర్మన్ వేద్ ప్రకాశ్.. వర్సిటీల వీసీలకు లేఖ రాశారు. ఈ విధానం ద్వారా అడ్మిషన్ల ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని.. కోర్సులను ఎంచుకునే విషయంలో తల్లిదండ్రులకు మరిన్ని అవకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు.