విలియమ్స్ సిస్టర్స్కు షాక్ | Venus and Serena Williams crash out in first round as Czechs post huge upset | Sakshi
Sakshi News home page

విలియమ్స్ సిస్టర్స్కు షాక్

Published Mon, Aug 8 2016 12:52 PM | Last Updated on Wed, Sep 18 2019 2:58 PM

విలియమ్స్ సిస్టర్స్కు షాక్ - Sakshi

విలియమ్స్ సిస్టర్స్కు షాక్

రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్లో టాప్ సీడ్గా బరిలోకి దిగిన మహిళల టెన్నిస్ డబుల్స్ జోడీ సెరెనా విలియమ్స్-వీనస్ విలియమ్స్లకు ఆదిలోనే చుక్కెదురైంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి జరిగిన తొలి రౌండ్ పోరులో లియమ్స్ జోడి 3-6, 4-6 తేడాతో చెక్ రిపబ్లిక్ జంట లూసీ సఫరోవా-బార్బోరా స్ట్రైకోవా చేతిలో పరాజయం చవిచూసింది. దీంతో ఇప్పటివరకూ ఒలింపిక్స్లో ఓటమి ఎరుగని విలియమ్స్ జోడికి తొలిసారి చేదు అనుభవం ఎదురైంది.

 

అంతకుముందు ఒలింపిక్స్ బరిలోకి దిగిన మూడు సార్లు(2000,08, 12) స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ అమెరికా జోడీ .. రియోలో తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టడం గమనార్హం.  దీంతో రియోకు ముందు వరకూ 15-0 తో  ఉన్న సెరెనా జోడి ఒలింపిక్ కెరీర్ రికార్డుకు బ్రేక్ పడింది. గత నెల్లో జరిగిన వింబుల్డన్ టైటిల్ ను గెలవడం ద్వారా 14 వ గ్రాండ్  స్లామ్ డబుల్స్ చాంపియన్షిప్ను సెరెనా ద్వయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, మహిళల  సింగిల్స్ లో సెరెనా తొలి రౌండ్లో విజయం సాధించి తదుపరి రౌండ్ కు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement