
ఒలింపిక్స్ లో భారత రెఫరీ..
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది బ్రెజిల్ లోని జరుగనున్న రియో ఒలింపిక్స్ లో భారత్ కు చెందిన అశోక్ కుమర్ రిఫరీగా ఎంపికయ్యాడు. దీంతో అశోక్ కుమార్ ఒలింపిక్స్ కు ఎంపికైన తొలి భారతీయ రెజ్లింగ్ రిఫరీగా స్థానం సంపాదించాడు. యునైటెట్ వరల్డ్ రెజ్లింగ్(యూడబ్యూడబ్యూ) మ్యాచ్ ల నిర్వహణలో భాగంగా సూపర్ వైజర్లు, సలహాదారులను కలుపుకుని మొత్తంగా 50 మందిని ఎంపిక చేసింది.
వీరిలో తొమ్మిది మందికి ఆసియానుంచి చోటు లభించగా, వారిలో అశోక్ కుమార్ ఒకరు. ప్రస్తుతం అశోక్ కుమార్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వారెంట్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు. ఈ ఏడాది లాస్ వేగాస్‌లో జరిగిన ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పనితీరును పరిగణనలోకి తీసుకుని రిఫరీల ఎంపిక జరిగింది.