ఒక్కో క్రీడాకారునికి 42 కండోమ్లు
రియో డి జెనీరో: నాలుగేళ్లకోసారి వచ్చే ఒలింపిక్స్ను విజయవంతం చేయడాన్ని ఆతిథ్య దేశం బ్రెజిల్ ఏర్పాట్లు భారీగా చేసింది. స్టేడియాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం దగ్గర్నుంచి క్రీడాకారులకు సౌకర్యాల కల్పన, క్రీడా గ్రామంలో పరిశుభ్రత, ఈవెంట్కు భారీ భద్రతలపై అధికారులు ఎక్కడా రాజీపడటంలేదు. చివరకు కండోమ్ ల సరఫరాలోనూ అదే విధానాన్ని అవలంభిస్తున్నారు.
ఆగస్ట్ 5 నుంచి 21 వరకు జరగనున్న ఈ మెగా ఈవెంట్ లో 206 దేశాలకు చెందిన 11 వేల మంది అథ్లెట్లు, 7 వేల మంది సిబ్బంది పాల్గొంటారు. వీరి బస కోసం రూపొందించిన స్పోర్ట్స్ విలేజ్(క్రీడా గ్రామం)లో మొత్తం 4.50 లక్షల కండోమ్లను సిద్ధంగా ఉంచారు. అంటే ఒక్కొక్కరికి 42 కండోమ్లు అందుబాటులో ఉన్నాయన్నమాట!
జికా వైరస్ బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా తగిన చర‍్యలు తీసుకున్నారు. మొత్తం 3604 అపార్ట్మెంట్లతో కూడిన కాంప్లెక్స్లో టెన్నిస్ కోర్టులు, సాకర్ మైదానాలు, స్విమ్మింగ్ పూల్స్, అధునాతన జిమ్‌తో పాటు ఇతర వసతులు కల్పించారు. 13 వేల టాయ్లెట్ సీట్లు, 2.75 లక్షల క్లాత్ హ్యాంగర్స్, 18,500 బెడ్స్ అందుబాటులో ఉంచారు.