Olympic Village
-
కలకలం: టోక్యో ఒలింపిక్స్ విలేజ్‌లో తొలి కరోనా కేసు
Tokyo Olympics Village టోక్యో ఒలింపిక్స్ విలేజ్‌లో కరోనా కలకలం రేగింది. తొలి కేసును గుర్తించినట్లు టోక్యో 2020 ఒలింపిక్స్ నిర్వాహకులు ప్రకటించారు. అయితే అది ఆటగాడికి కాదని, పనుల్ని పర్యవేక్షించడానికి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకిందని టోక్యో 2020 సీఈవో తోషిరో ముటో ధృవీకరించారు. ప్రైవసీ దృష్ట్యా ఆ వ్యక్తి ఏ దేశస్థుడో చెప్పలేమని, అతన్ని హోటల్‌కు తరలించి ఐసోలేట్ చేశామని వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈనెల 23 నుంచి ప్రారంభంకానున్న టోక్యో ఒలింపిక్స్. ఈనెల 13న ఒలింపిక్స్ విలేజ్‌ను తెరిచిన నిర్వాహకులు.. ప్రతిరోజూ క్రీడాకారులకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తొలి కేసు బయటపడింది. మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌లో 11వేల మంది క్రీడాకారులు పాల్గొనబోతున్నారు. ఆటగాళ్ల ఆరోగ్యంపై జాగ్రత్తగా వ్యవహరిస్తామని, కరోనా విజృంభించకుండా అప్రమత్తంగా ఉంటామని ఛీఫ్ ఆర్గనైజర్ సెయికో హషిమోటో చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఇంతకు ముందు టోక్యోలో విమానం దిగిన ఓ ఉగాండా అథ్లెటిక్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. అతన్ని క్వారంటైన్ సెంటర్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వరుసగా కొంత మంది సిబ్బంది, ఆటగాళ్లు విలేజ్‌కు చేరుకోక ముందే కరోనా బారిన పడ్డారు. -
కండోమ్‌లు ఇస్తాం.. కానీ, వాడొద్దు
టోక్యో: సమ్మర్ ఒలంపిక్స్ 2020(2021) నిర్వాహకులు ఆటగాళ్లకు ఒక ముఖ్యమైన గమనిక తెలియజేశారు. ఒలంపిక్ విలేజ్‌లో సోషల్ డిస్టెన్స్ అమలులో ఉన్నందున అథ్లెట్స్ కండోమ్‌లను ఉపయోగించడానికి వీల్లేదని పేర్కొన్నారు. బదులుగా వాటిని తమ వెంట ఇంటికి(స్వంత దేశాలకు) తీసుకెళ్లొచ్చని తెలిపారు. ఒలంపిక్స్ నేపథ్యంలో ఆటగాళ్లకు కండోమ్‌లు సరఫరా చేస్తుండడం షరా మామూలే. 1988 సియోల్ ఒలంపిక్స్ నుంచి హెచ్ఐవీ-ఎయిడ్స్ మీద అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ పని చేస్తున్నారు. అయితే కరోనా నిబంధనలకు ప్రాధాన్యం ఇస్తూ.. ఈసారి సోషల్ డిస్టెన్స్ కఠినంగా అమలయ్యేలా చూస్తున్నామని, అందుకే కండోమ్‌లు ఇంటికి తీసుకెళ్లాలని ఈసారి ఆటగాళ్లకు సూచించనున్నట్లు ఓ ప్రముఖ మీడియా హౌజ్ అడిగిన ప్రశ్నకు కమిటీ సీఈవో తోషిరో ముటో బదులిచ్చారు. ఇదిలా ఉంటే ఈసారి ఆటగాళ్ల కోసం లక్షా యాభై వేల కండోమ్‌లను నిర్వాహకులు సిద్ధం చేశారు. కాగా, తాజా ప్రకటనతో ఆటగాళ్లు దూరంగా ఉండాలని, ఒలంపిక్ విలేజ్‌లో శృంగారంలో పాల్గొనడానికి వీల్లేదని పరోక్షంగా హింట్ ఇచ్చారు. ఇక కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఆటగాళ్లకు భోజన సదుపాయాలు అందించడం దగ్గరి నుంచి ప్రతీది ఈసారి ఛాలెంజింగ్‌గా ఉండబోతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో మద్యపాన నిషేధం విధించారు కూడా. చదవండి: మాకొద్దీ చైనా దుస్తులు! -
కామన్వెల్త్ గేమ్స్ అనుభూతి గుర్తొచ్చింది
సచిన్ టెండూల్కర్ న్యూఢిల్లీ: రియోలోని ఒలింపిక్స్ విలేజ్‌లో అడుగుపెట్టిన బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పాత రోజులను గుర్తుచేసుకున్నారు. 1998 కౌలాలంపూర్ కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ సభ్యుడిగా అడుగుపెట్టినప్పుడు ఎలాంటి ఉద్వేగానికి గురయ్యానో రియోలోనూ అలాగే ఫీలవుతున్నట్టు చెప్పారు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓసీ) గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సచిన్ విలేజ్‌లో ఆటగాళ్లను కలుసుకున్నారు. ‘గేమ్స్ విలేజ్‌లో ఉంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో నేను మరోసారి అనుభవించాను. 1998 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రికెటర్‌గా పాల్గొన్నాను. అయితే ఆ గేమ్స్‌కు దీనికి చాలా వ్యత్యాసమున్నా క్రీడా స్ఫూర్తి, ఉత్సాహం మాత్రం ఒక్కటే. ఇక ఒలింపిక్ క్రీడల్లో నేనేమీ నిపుణుడిని కాను. అందుకే పోటీల్లో ఎలా గెలవాలో వారికి సలహాలివ్వలేను. ఎలా పోరాడాలో ఆటగాళ్లకు తెలుసు. నాకు టెన్నిస్, టేబుల్ టెన్నిస్ అంటే ఇష్టం’ అని సచిన్ అన్నారు. -
ఒలింపిక్ విలేజ్ లో వరుస చోరీలు
రియోడీజనీరో: రియో ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు వచ్చిన అథ్లెట్లు, ఇతర ఆటగాళ్లు వరుస చోరీ ఘటనలతో సతమతమవుతున్నారు. ఒపింపిక్ విలేజ్ లో ఏర్పాట్లు చవకబారుగా ఉన్నాయంటూ ఇప్పటికే ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో చోరీలు ఆటగాళ్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాజాగా డెన్మార్క్ అథ్లెట్ల మొబైల్స్, బట్టలు, ఐపాడ్, ఇతర విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయని అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. డెన్మార్క్ చెఫ్ డె మిషన్ కు చెందిన రాడ్ విట్ మాట్లాడుతూ.. తన ఐపాడ్ కూడా చోరీ చేశారని ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో అర్థం కావడం లేదని చెప్పారు. జూలై 18 నుంచి ఇప్పటివరకూ ఒలింపిక్ విలేజ్ లోని 36 అపార్ట్ మెంట్ల నుంచి దాదాపు 150 ఫిర్యాదులు అందాయి. ఇందులో ఎక్కువగా చైనా, ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాళ్లు బాధితులుగా ఉన్నారు. రియోలో 88 వేలకు పైగా సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. లండన్2012 ఒలింపిక్స్ తో పోల్చి చూస్తే ఇది చాలా ఎక్కువని, అయితే వరుస చోరీలతో అథ్లెట్లు భయబ్రాంతులకు లోనవుతున్నారని డెన్మార్క్ అధికారులు వివరించారు. రియో నిర్వాహకులు మాత్రం ఫిర్యాదు అందిన ప్రతిసారి బాధితులకు క్షమాపణలు చెబుతున్నారు తప్ప ఇలాంటివి జరకుండా చేయడంలో విఫలమవుతున్నారు. -
‘ప్లంబర్’తో ఒలింపిక్స్‌కు...
బ్రిటన్ జట్టు ముందు జాగ్రత్త రియో: ఒలింపిక్ విలేజ్‌లో సౌకర్యాలు బాగా లేవు... నల్లాలు లీక్ అవుతున్నాయి, డ్రైనేజీ సమస్యలు కూడా ఉన్నాయి... రియోలో అడుగు పెట్టిన దగ్గరినుంచి చాలా మంది ఆటగాళ్లు చేస్తున్న ఫిర్యాదులు ఇవి. బ్రిటన్ జట్టు మాత్రం వీటికి పరిష్కారం కనుక్కుంది! ఎవరో వస్తారని, బాగు చేస్తారని ఎందుకు సమయం వృథా చేయడం. మనమే చేసుకుంటే పోలా అనుకుంది. అందుకే ఒలింపిక్స్‌కు తమ జట్టుతో పాటు ప్లంబర్‌ను కూడా తీసుకుపోయింది. ‘మాతో పాటు ప్లంబర్‌ను తీసుకొచ్చాం. అతడికి పెద్దగా పని పడకపోతే మంచిదే. కానీ ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే బాగు చేసుకోవచ్చు. ఆటగాళ్లకు సౌకర్యంగా కూడా ఉంటుంది’ అని బ్రిటన్ చెఫ్ డి మిషన్ మార్క్ ఇంగ్లండ్ చెప్పడం విశేషం. -
రియోలో తొలి టెన్నిస్ ప్లేయర్ సానియా !
రియోడిజనీరో: భారత టెన్నిస్, టేబుల్ టెన్నిస్ బృందాలు రియో ఒలింపిక్ గ్రామానికి చేరుకున్నాయి. ఒలింపిక్ విలేజ్‌లో అడుగుపెట్టిన తొలి టెన్నిస్ ప్లేయర్ గా సానియా నిలిచింది. మాంట్రియెల్ లో రోజర్స్ కప్ ఆడిన సానియా నేరుగా అక్కడి నుంచే రియోడిజనీరోకు వచ్చింది. సానియాకు ఇది మూడో ఒలింపిక్ గేమ్స్. మహిళల డబుల్స్ లో ప్రార్థనా థోంబరే, మిక్స్డ్ డబుల్స్ లో రోహన్ బోపన్నతో కలిసి సానియా బరిలో దిగనుంది. మరోవైపు భారత హాకీ టీమ్ ఇక్కడ జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో దుమ్మురేపింది. స్పెయిన్ పై 2-1 తేడాతో గెలుపొంది ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత శరత్ మూడోసారి ఒలింపిక్ గేమ్స్ లో పాల్గొంటున్నాడు. కొన్ని కారణాల వల్ల లండన్ ఒలింపిక్స్ లో పాల్గొనలేకపోయాను. రియోలో కచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేస్తానని ధీమాగా ఉన్నానని శరత్ చెప్పాడు. -
ముద్దు వివాదంపై రచ్చ రచ్చ!
రియోడిజనీరో: రియో ఒలింపిక్స్ లో భాగంగా ఒలింపిక్ విలేజ్ ను కొన్ని రోజుల ముందే సిద్ధంచేయాలి. అయితే ఒలింపిక్ గ్రామం ఏర్పాట్లపై సర్వత్రా విమర్శులు వ్యక్తమవుతున్న తరుణంలో రియో మేయర్ ఎడ్యార్డో పేస్ చేసిన చిన్న పొరపాటుపై పెను దుమారం చెలరేగుతోంది. ఇప్పటికే బ్రెజిల్ వాసులు కూడా రియో ఏర్పాట్లు, నిర్వహణ తీరుపై చాలా నిరాశగా ఉండగా, మేయర్ ముద్దు వివాదంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రియోకు రావడంలో భాగంగా స్థానిక మేయర్ పేస్‌ను ఆస్ట్రేలియాకు చెందిన కీలక అధికారిణి కిట్టీ చిల్లర్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ పేస్, కిట్టీ బుగ్గపై ముద్దుపెట్టారు. ఒలింపిక్ విలేజ్ లో ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని విమర్శలు ఎక్కవయ్యాయి. అన్ని ఏర్పాట్లు దాదాపు బాగున్నాయని, కొంతమేరకు సమస్యలు తన దృష్టికి వచ్చాయని పేస్ పేర్కొన్నారు. కిట్టీ చిల్లర్ మాట్లాడుతూ.. గత ఐదు ఒలింపిక్స్ లో నిర్వహణ ఇంత సాధారణంగా లేదని, ఏర్పాట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని రియో మేయర్ కు ఆమె సూచించారు. ముద్దు వివాదంపై తీవ్ర విమర్శల వ్యక్తమవుతున్న నేపథ్యంలో పేస్ స్పందిస్తూ.. తాను ఎలాంటి తప్పిదం చేయలేదని, క్షమాపణ కోరాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చుకున్నారు. కేవలం మర్యాదపూర్వకంగా ఆమెతో ప్రవర్తించానని బుధవారం స్థానిక మీడియాతో ఈ వివరాలు తెలిపారు. ఎలాంటి తప్పిదాలు జరగకుండా మెగా ఈవెంట్ నిర్వహిస్తే చాలంటూ మేయర్ పై స్థానికుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. -
ఇంకా సిద్ధం కాలేదు!
* అసంపూర్తిగా ఒలింపిక్ విలేజ్ * వారంలో సిద్ధం చేస్తామన్న నిర్వాహకులు రియో డి జనీరో: మురుగు నీటితో నిండిపోయిన టాయిలెట్లు, లీకేజ్ పైపులు, ప్రమాదభరితంగా మారిన వైరింగ్, మెట్లపై అడుగుల మందం పేరుకుపోయిన మట్టి, ఇంకా పూర్తికానీ లైటింగ్ వ్యవస్థ, దుమ్ముపట్టిన రూమ్‌లు, ఫ్లోరింగ్, నీటితో తడిసిపోయిన గోడలు... ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణం... ఒలింపిక్స్ విలేజ్ ప్రస్తుత పరిస్థితి ఇది. గేమ్స్‌కు 10 రోజుల సమయం కూడా లేదు. కానీ అక్కడ పనులన్నీ అసంపూర్తిగానే ఉన్నాయి. గేమ్స్ కోసం రియో చేరుకుంటున్న చాలా దేశాల అథ్లెట్లు... విలేజ్ పరిస్థితి చూసి అక్కడికి వెళ్లేందుకు జంకుతున్నారు. సోమవారం ఆస్ట్రేలియా అథ్లెట్లు అపార్ట్మెంట్లో వసతులు చూసి వెనుదిరిగిపోయారు. దీంతో ఆఘామేఘాల మీద సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన నిర్వాహకులు వారం రోజుల్లో ఒలింపిక్ విలేజ్‌ను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. సమస్యలను పరిష్కరించేందుకు 630 మంది పని చేస్తున్నారని కమిటీ అధికార ప్రతినిధి మారియో ఆండ్రెడా తెలిపారు. గురువారానికి విలేజ్‌ను అందుబాటులో తెస్తామన్నారు. రోయింగ్, సెయిలింగ్ జరిగే ప్రాంతాల్లో అధిక జనాభా కారణంగా జికా వైరస్ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న నిర్వాహకులు అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షల కోసం అపార్ట్మెంట్లలో ఓపెన్ చేసిన నల్లాలను ఆపి వేయకపోవడంతో రూమ్‌లన్నీ నీటితో నిండిపోయి విపరీతమైన దుర్గంధం, గ్యాస్ వాసన వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో షార్ట్ సర్క్యూట్ జరుగుతోంది. మొత్తానికి తొలిసారి గేమ్స్‌కు ఆతిథ్యమిస్తున్న ఆనందం దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్‌కు లేకుండా పోతోంది. అనుభవరాహిత్యం, ప్రణాళిక లోపంతో ఒకేసారి పలు రకాల సమస్యలు చుట్టుముట్టుతుండటం తలకు మించిన భారంగా మారింది. -
ఒక్కో క్రీడాకారునికి 42 కండోమ్‌లు
రియో డి జెనీరో: నాలుగేళ్లకోసారి వచ్చే ఒలింపిక్స్‌ను విజయవంతం చేయడాన్ని ఆతిథ్య దేశం బ్రెజిల్ ఏర్పాట్లు భారీగా చేసింది. స్టేడియాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం దగ్గర్నుంచి క్రీడాకారులకు సౌకర్యాల కల్పన, క్రీడా గ్రామంలో పరిశుభ్రత, ఈవెంట్‌కు భారీ భద్రతలపై అధికారులు ఎక్కడా రాజీపడటంలేదు. చివరకు కండోమ్ ల సరఫరాలోనూ అదే విధానాన్ని అవలంభిస్తున్నారు. ఆగస్ట్ 5 నుంచి 21 వరకు జరగనున్న ఈ మెగా ఈవెంట్ లో 206 దేశాలకు చెందిన 11 వేల మంది అథ్లెట్లు, 7 వేల మంది సిబ్బంది పాల్గొంటారు. వీరి బస కోసం రూపొందించిన స్పోర్ట్స్ విలేజ్(క్రీడా గ్రామం)లో మొత్తం 4.50 లక్షల కండోమ్‌లను సిద్ధంగా ఉంచారు. అంటే ఒక్కొక్కరికి 42 కండోమ్‌లు అందుబాటులో ఉన్నాయన్నమాట! జికా వైరస్ బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా తగిన చర్యలు తీసుకున్నారు. మొత్తం 3604 అపార్ట్మెంట్లతో కూడిన కాంప్లెక్స్‌లో టెన్నిస్ కోర్టులు, సాకర్ మైదానాలు, స్విమ్మింగ్ పూల్స్, అధునాతన జిమ్‌తో పాటు ఇతర వసతులు కల్పించారు. 13 వేల టాయ్‌లెట్ సీట్లు, 2.75 లక్షల క్లాత్ హ్యాంగర్స్, 18,500 బెడ్స్ అందుబాటులో ఉంచారు. -
ఒలింపిక్ క్రీడా గ్రామం ప్రారంభం
రియో డి జనీరో: బ్రెజిల్లో ఒలింపిక్స్ సందడి ప్రారంభమైంది. మరో రెండు వారాల్లో ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ ప్రారంభం కాబోతుండగా తాజాగా ఒలింపిక్స్ అథ్లెట్స్ గ్రామాన్ని అధికారికంగా తెరిచారు. అత్యంత అధునాతనంగా నిర్మించిన ఈ క్రీడా గ్రామం 10,500 మంది అథ్లెట్లు, 7 వేల మంది సిబ్బందికి వసతి కల్పించనుంది. 31 భవన సముదాయాలతో కూడిన ఈ గ్రామంలో టెన్నిస్ కోర్టులు, సాకర్ మైదానాలు, ఏడు స్విమ్మింగ్ పూల్స్, అధునాతన జిమ్‌తో పాటు సకల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఇక భోజనశాలలో ప్రపంచంలోని ఏ వంటకమైనా అథ్లెట్లకు రుచి చూపించేందుకు సిద్ధం చేశారు. దీంట్లో రోజుకు 60 వేల భోజనాలను వడ్డించనున్నారు.