
‘ప్లంబర్’తో ఒలింపిక్స్కు...
బ్రిటన్ జట్టు ముందు జాగ్రత్త
రియో: ఒలింపిక్ విలేజ్‌లో సౌకర్యాలు బాగా లేవు... నల్లాలు లీక్ అవుతున్నాయి, డ్రైనేజీ సమస్యలు కూడా ఉన్నాయి... రియోలో అడుగు పెట్టిన దగ్గరినుంచి చాలా మంది ఆటగాళ్లు చేస్తున్న ఫిర్యాదులు ఇవి. బ్రిటన్ జట్టు మాత్రం వీటికి పరిష్కారం కనుక్కుంది! ఎవరో వస్తారని, బాగు చేస్తారని ఎందుకు సమయం వృథా చేయడం. మనమే చేసుకుంటే పోలా అనుకుంది. అందుకే ఒలింపిక్స్‌కు తమ జట్టుతో పాటు ప్లంబర్‌ను కూడా తీసుకుపోయింది. ‘మాతో పాటు ప్లంబర్‌ను తీసుకొచ్చాం. అతడికి పెద్దగా పని పడకపోతే మంచిదే. కానీ ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే బాగు చేసుకోవచ్చు. ఆటగాళ్లకు సౌకర్యంగా కూడా ఉంటుంది’ అని బ్రిటన్ చెఫ్ డి మిషన్ మార్క్ ఇంగ్లండ్ చెప్పడం విశేషం.