plumber
-
పాక్ కుర్రోడి సాయానికి కెనడా యువతి ఫిదా.. తరువాత జరిగిందిదే!
ప్రేమకు బాషాబేధాలు అడ్డుకావంటారు. ప్రేమ అనేది ఏ ఇద్దరి మధ్య ఎప్పుడు, ఎలా పుడుతుందో చెప్పలేమని కూడా అంటారు. ప్లంబర్‌గా పనిచేసే ఒక పాకిస్తాన్ యువకుని విషయంలో ఇదే జరిగింది. వివరాల్లోకి వెళితే 26 ఏళ్ల పాకిస్తాన్ యువకుడు ముకర్రమ్ ఎంజాయ్ చేసేందుకు థాయ్‌లాండ్ వెళ్లాడు. అక్కడ కెనడాకు చెందిన ఒక యువతి ఏదో ఇబ్బంది పడుతూ అతనికి కనిపించింది. దీంతో ముకర్రమ్ ఆమెను సమస్య ఏమిటని అడిగాడు. దీనికి ఆమె తన ఫోను పాడయ్యిందని తెలిపింది. అలాగే తాను బ్రెజిల్ వెళ్లాలని, దానికి సంబంధించిన ఫ్లయిట్ టిక్కెట్ ఆ ఫోనులోనే ఉన్నదని తెలిపింది. ఆమె సమస్యను గ్రహంచిన ముకర్రమ్ ఆమెకు తన ఫోన్ ఇవ్వడమే కాకుండా, బ్రెజిల్ వెళ్లేందుకు ఫ్లయిట్ టిక్కెట్ కూడా కొనుగోలు చేసి ఆమెకు ఇచ్చాడు. అది మొదలు ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. అది వారిద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. పాకిస్తాన్ పాడ్‌కాస్ట్ ఛానల్ డెయిలీ పాకిస్తాన్ గ్లోబుల్ తెలిపిన వివరాల ప్రకారం ముకర్రమ్ ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. అతనిని వివాహం చేసుకునేందుకు కెనడా నుంచి పాకిస్తాన్‌కు ఒక యవతి వచ్చింది. ముకర్రమ్ గత ఏడాది డిసెంబరు 6న ఎంజాయ్ చేసేందుకు థాయ్‌లాండ్ వెళ్లాడు. అక్కడ ముకర్రమ్ కెనడాకు చెందిన యువతికి సాయం అందించాడు. బ్రెజిల్ చేరుకున్న ఆ యువతి ముకర్రమ్కు ధన్యవాదాలు తెలిపింది. తరువాత వారిద్దరి మధ్య ఫోను సంభాషణల ద్వారా స్నేహం ఏర్పడి అది ప్రేమగా పరిణమించింది. కొద్ది రోజుల క్రితమే వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఒక ఇంటర్యూలో ముకర్రమ్ మాట్లాడుతూ థాయ్‌ల్యాండ్‌లో ఆమె బాధపడుతుందటం చూసి, తన ఫోను ఇచ్చానని, దీనిలో ఎటువంటి దురుద్దేశం లేదన్నాడు. కెనడా యువతి మాట్లాడుతూ తాను అర్జెంటీనాలో పుట్టానని, ఎంజాయ్ చేసేందుకు థాయ్‌లాండ్ వెళ్ళగా,అక్కడ ముకర్రమ్ పరిచయమయ్యాడన్నారు. ఇది కూడా చదవండి: ‘కాకి ఇలా కూడా చేస్తుందా?’.. ఇంతకుముందెన్నడూ చూడని స్ఫూర్తిదాయక వీడియో! -
‘ప్లంబర్’తో ఒలింపిక్స్‌కు...
బ్రిటన్ జట్టు ముందు జాగ్రత్త రియో: ఒలింపిక్ విలేజ్‌లో సౌకర్యాలు బాగా లేవు... నల్లాలు లీక్ అవుతున్నాయి, డ్రైనేజీ సమస్యలు కూడా ఉన్నాయి... రియోలో అడుగు పెట్టిన దగ్గరినుంచి చాలా మంది ఆటగాళ్లు చేస్తున్న ఫిర్యాదులు ఇవి. బ్రిటన్ జట్టు మాత్రం వీటికి పరిష్కారం కనుక్కుంది! ఎవరో వస్తారని, బాగు చేస్తారని ఎందుకు సమయం వృథా చేయడం. మనమే చేసుకుంటే పోలా అనుకుంది. అందుకే ఒలింపిక్స్‌కు తమ జట్టుతో పాటు ప్లంబర్‌ను కూడా తీసుకుపోయింది. ‘మాతో పాటు ప్లంబర్‌ను తీసుకొచ్చాం. అతడికి పెద్దగా పని పడకపోతే మంచిదే. కానీ ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే బాగు చేసుకోవచ్చు. ఆటగాళ్లకు సౌకర్యంగా కూడా ఉంటుంది’ అని బ్రిటన్ చెఫ్ డి మిషన్ మార్క్ ఇంగ్లండ్ చెప్పడం విశేషం. -
హార్వర్డ్ మేధావుల నుంచి ప్లంబర్ల వరకు!
ఐఐటియన్లు.. హార్వర్డ్ మేధావులు.. ఒలింపియన్లు.. గాయకులు.. ప్లంబర్లు.. నరేంద్రమోదీ మంత్రివర్గంలో ఇన్ని వర్గాల వాళ్లకు ప్రాతినిధ్యం లభించిందంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. కొత్తగా విస్తరించిన మంత్రివర్గంలో అన్ని తరగతుల వాళ్లకు ప్రాతినిధ్యం లభించింది. నిన్న మొన్నటి వరకు గోవా ముఖ్యమంత్రిగా పనిచేసి.. ఇప్పుడు రక్షణశాఖను చేపట్టిన మనోహర్ పారిక్కర్ ఐఐటీ బాంబే నుంచి మెటలర్జీలో ఇంజనీరింగ్ చేశారు. ఇక యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా అయితే తొలుత ఐఐటీ ఢిల్లీలో ఇంజనీరింగ్ చదివి, ఆ తర్వాత హార్వర్డ బిజినెస్ స్కూల్లో కూడా ఉన్నతవిద్య అభ్యసించారు. సమాచార ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాజ్యవర్ధన్ రాథోడ్.. ఒలింపిక్స్‌లో కూడా మన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. బెంగాలీబాబు బాబుల్ సుప్రియో మంచి గాయకుడు. ఇక విజయ్ సంప్లా అయితే అచ్చంగా సౌదీ అరేబియాలో ప్లంబర్‌గా పనిచేశారు. కొన్నాళ్లు వ్యవసాయ కూలీగా కూడా ఆయన ఉన్నారు. జీవితంలో తాను చాలాకాలం కటిక పేదరికం అనుభవించానని, కేంద్ర మంత్రి అవుతానని కలలో కూడా ఊహించలేదని సంప్లా చెప్పారు. ఈయన పంజాబ్‌లో సర్పంచి నుంచి ఎదిగి.. పార్టీ రాష్ట్రశాఖలో అనేక కీలక శాఖలు చేపట్టారు. హోషియార్పూర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. మొత్తానికి నరేంద్ర మోదీ మాత్రం తన మంత్రివర్గంలో విభిన్న వర్గాల నుంచి మంత్రులను తీసుకున్నారు. -
ఖాకీచులాట
వరంగల్ క్రైం : వరంగల్ రూరల్, అర్బన్ పోలీసుల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. జిల్లా పోలీసు శాఖ అర్బన్, రూరల్‌గా విభజన చెంది మూడేళ్లకు పైగా కాగా... హెడ్క్వార్టర్స్లోకి కొన్ని విభాగాలు ఇప్పటికీ ఉమ్మడిగానే పనిచేస్తున్నాయి. ఇటీవల కొందరు ఉన్నతాధికారుల ఏకపక్ష నిర్ణయాలతో ఇరువురి మధ్య భేదాభిప్రాయూలు ఏర్పడ్డాయి. చిన్ని చిన్న విషయాల్లో ఇప్పటికే అనేక మార్లు మనస్పర్థలు వచ్చినప్పటికీ సర్దుకుపోతూ వచ్చారు. కానీ... శుక్రవారం హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన సంఘటనతో అర్బన్, రూరల్ పోలీస్‌ల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఉమ్మడి వృత్తి సిబ్బందిపై ఆంక్షలు చిలికిచిలికి గాలివానగా మారి దుమారం చెలరేగింది. అసలు ఏం జరిగిందంటే... ప్లంబర్, కార్పెంటరీ ఇలాంటి వృత్తి ఉద్యోగులు అటు అర్బన్‌కు, ఇటు రూరల్ కార్యాలయాలకు అవసరం వచ్చిన సమయంలో ఉమ్మడిగానే విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్ని రోజులుగా వీరిపై అధికారిగా ఉన్న రూరల్‌కు చెందిన వ్యక్తి ఒకరు అర్బన్‌కు పనులు చేయొద్దని హుకుం జారీచేశారు. అనేక పర్యాయాలు అర్బన్‌కు పని ఉన్నప్పుడు సదరు సిబ్బంది వెళ్లకుండా అడ్డుపడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇలా పలుమార్లు సిబ్బంది అర్బన్‌కు చెందిన పనులు చేయకపోవడంతో పనులన్నీ పెండింగ్‌లో పడ్డాయి. ఈ క్రమంలో సదరు అధికారి ఇలా చేయడం నచ్చని ఒక అర్బన్ అధికారి రూరల్ పోలీస్ పరేడ్‌కు వెళ్లొద్దని తన ఆధీనంలోని బ్యాండ్ కళాకారులను ఆదేశించారు. దీంతో రూరల్ పరేడ్ బ్యాండ్ ప్రదర్శన లేకుండానే ముగిసింది. ఈ విషయంపై ఆగ్రహించిన రూరల్ ఉన్నతాధికారి ఒకరు ‘మాకు బ్యాండ్ ఇవ్వరా’ అంటూ అర్బన్ అధికారులపై చిందులేశారు. అర్బన్ అధికారి కుర్చీ బయటపడేసి... బ్యాండ్‌ను అడ్డుకున్న అర్బన్ అధికారికి, ఇదే కేడర్‌లో ఉన్న రూరల్ అధికారి ఒకే గదిలో నుంచే తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. గతంలో అర్బన్‌కు ఈ పోస్టు ఉండేది కాదు. నాలుగు నెలల క్రితమే ఈ పోస్టు మంజూరైంది. మరో బిల్డింగ్ లేకపోవడంతో ఇద్దరు అధికారులకు ఒకే గదిని కేటాయించారు. అయితే శుక్రవారం జరిగిన ఘటన నేపథ్యంలో అర్బన్ అధికారి కుర్చీని రూరల్ అధికారి బయటకు విసిరేయించాడు. సదరు అర్బన్ అధికారికి సంబంధించిన సామగ్రి మొత్తాన్ని బయట పడేయడంతో హెడ్‌క్వార్టర్స్‌లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అర్బన్, రూరల్ సిబ్బంది రెండు వర్గాలుగా విడిపోయి వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. పరిస్థితి చేయిదాటుతోందన్న సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు కింది స్థాయి ఉద్యోగులను పిలిపించి విషయం తెలుసుకున్నారు. అర్బన్ అధికారి తనకు జరిగిన అవమానాన్ని అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావును కలిసి వివరించారు. దీంతో రూరల్ అధికారులను అర్బన్ ఎస్పీ మందలించినట్లు తెలిసింది. మరో మారు ఇలాంటి వివాదం తలెత్తకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించినట్లు సమాచారం. దయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన గొడవ పోలీస్ శాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. -
కొరతను అధిగమిస్తేనే..
సాక్షి, హైదరాబాద్: అటు కేంద్రంలోను, ఇటు రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఇక నిర్మాణ రంగానికి ఊపిరి పోయడమే తరువాయి. భారత నిర్మాణ రంగానికి రానున్న ఐదేళ్లలో అధిక శాతం పెట్టుబడుల్ని ఆకర్షించే సత్తా ఉందని నిపుణులు చెబుతున్నారు. కాకపోతే మానవ వనరుల కొరతే ఈ రంగం అభివృద్ధికి విఘాతాన్ని కల్గిస్తోందంటున్నారు. నైపుణ్యం గల సిబ్బంది కొరతతో ప్రధాన పారిశ్రామికవాడల్లోని భారీ నిర్మాణాలు 12 నుంచి 18 నెలల ఆలస్యమవుతాయి. ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ తదితర నగరాల్లో మేస్త్రీలు, కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్ల వంటివారి కొరత సుమారు 30 శాతం దాకా ఉంది. ప్రస్తుతం ఐదు కోట్ల మంది పనివారు అందుబాటులో ఉండగా.. కేవలం రెండు కోట్ల మందికే నైపుణ్యముంది. సివిల్ ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, ప్లానర్ల విషయానికొస్తే గిరాకీ, సరఫరాల మధ్య వ్యత్యాసం 82-86 శాతంగా ఉంది. రానున్న ఐదేళ్లలో 40 లక్షల మంది సివిల్ ఇంజనీర్ల అవసరముంటుంది. ఇందుకు గాను ప్రస్తుతం 6.42 లక్షల మంది అందుబాటులో ఉన్నారు. 3.96 లక్షల మంది ఆర్కిటెక్టుల స్థానంలో 65 వేల మంది, 1.19 లక్షల ప్లానర్లకు బదులు 18 వేలే అందుబాటులో ఉన్నారు. మొత్తానికి 2012 నుంచి 2020 మధ్యలో 45 లక్షల మంది నిపుణులు కావాల్సి ఉంటుంది. కొరతను తీర్చే మార్గమిదే.. విదేశాల్లో మాదిరిగా మనం కూడా నిర్మాణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగించాలి. ఈ తరహా నిర్మాణాల్ని చేపట్టేవారికి ప్రభుత్వం పన్ను రాయితీలు కల్పించాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో తలసరి ఉక్కు వినియోగం దాదాపు 150-200 కిలోలుంటే మన దేశంలో చూస్తే సుమారు 40 కిలోలుగా ఉంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించాలి. ఉక్కు నిర్మాణాల్ని కడితే మేస్త్రీలు, కార్పెంటర్లు, బార్ బెండర్లు తదితరుల మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్, కళాశాలల్లో సీట్లను పెంచాలి. భవన నిర్మాణ కార్మికుల నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి.