ప్రేమకు బాషాబేధాలు అడ్డుకావంటారు. ప్రేమ అనేది ఏ ఇద్దరి మధ్య ఎప్పుడు, ఎలా పుడుతుందో చెప్పలేమని కూడా అంటారు. ప్లంబర్‌గా పనిచేసే ఒక పాకిస్తాన్ యువకుని విషయంలో ఇదే జరిగింది.
వివరాల్లోకి వెళితే 26 ఏళ్ల పాకిస్తాన్ యువకుడు ముకర్రమ్ ఎంజాయ్ చేసేందుకు థాయ్‌లాండ్ వెళ్లాడు. అక్కడ కెనడాకు చెందిన ఒక యువతి ఏదో ఇబ్బంది పడుతూ అతనికి కనిపించింది. దీంతో ముకర్రమ్ ఆమెను సమస్య ఏమిటని అడిగాడు. దీనికి ఆమె తన ఫోను పాడయ్యిందని తెలిపింది. అలాగే తాను బ్రెజిల్ వెళ్లాలని, దానికి సంబంధించిన ఫ్లయిట్ టిక్కెట్ ఆ ఫోనులోనే ఉన్నదని తెలిపింది. ఆమె సమస్యను గ్రహంచిన ముకర్రమ్ ఆమెకు తన ఫోన్ ఇవ్వడమే కాకుండా, బ్రెజిల్ వెళ్లేందుకు ఫ్లయిట్ టిక్కెట్ కూడా కొనుగోలు చేసి ఆమెకు ఇచ్చాడు. అది మొదలు ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. అది వారిద్దరి మధ్య ప్రేమకు దారితీసింది.
పాకిస్తాన్ పాడ్‌కాస్ట్ ఛానల్ డెయిలీ పాకిస్తాన్ గ్లోబుల్ తెలిపిన వివరాల ప్రకారం ముకర్రమ్ ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. అతనిని వివాహం చేసుకునేందుకు కెనడా నుంచి పాకిస్తాన్‌కు ఒక యవతి వచ్చింది. ముకర్రమ్ గత ఏడాది డిసెంబరు 6న ఎంజాయ్ చేసేందుకు థాయ్‌లాండ్ వెళ్లాడు. అక్కడ ముకర్రమ్ కెనడాకు చెందిన యువతికి సాయం అందించాడు. బ్రెజిల్ చేరుకున్న ఆ యువతి ముకర్రమ్‌కు ధన్యవాదాలు తెలిపింది. తరువాత వారిద్దరి మధ్య ఫోను సంభాషణల ద్వారా స్నేహం ఏర్పడి అది ప్రేమగా పరిణమించింది. కొద్ది రోజుల క్రితమే వారిద్దరూ వివాహం చేసుకున్నారు.
ఒక ఇంటర్యూలో ముకర్రమ్ మాట్లాడుతూ థాయ్‌ల్యాండ్‌లో ఆమె బాధపడుతుందటం చూసి, తన ఫోను ఇచ్చానని, దీనిలో ఎటువంటి దురుద్దేశం లేదన్నాడు. కెనడా యువతి మాట్లాడుతూ తాను అర్జెంటీనాలో పుట్టానని, ఎంజాయ్ చేసేందుకు థాయ్‌లాండ్ వెళ్ళగా,అక్కడ ముకర్రమ్ పరిచయమయ్యాడన్నారు.
ఇది కూడా చదవండి: ‘కాకి ఇలా కూడా చేస్తుందా?’.. ఇంతకుముందెన్నడూ చూడని స్ఫూర్తిదాయక వీడియో!
Comments
Please login to add a commentAdd a comment