ముద్దు వివాదంపై రచ్చ రచ్చ!
రియోడిజనీరో: రియో ఒలింపిక్స్ లో భాగంగా ఒలింపిక్ విలేజ్ ను కొన్ని రోజుల ముందే సిద్ధంచేయాలి. అయితే ఒలింపిక్ గ్రామం ఏర్పాట్లపై సర్వత్రా విమర్శులు వ్యక్తమవుతున్న తరుణంలో రియో మేయర్ ఎడ్యార్డో పేస్ చేసిన చిన్న పొరపాటుపై పెను దుమారం చెలరేగుతోంది. ఇప్పటికే బ్రెజిల్ వాసులు కూడా రియో ఏర్పాట్లు, నిర్వహణ తీరుపై చాలా నిరాశగా ఉండగా, మేయర్ ముద్దు వివాదంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
రియోకు రావడంలో భాగంగా స్థానిక మేయర్ పేస్ను ఆస్ట్రేలియాకు చెందిన కీలక అధికారిణి కిట్టీ చిల్లర్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ పేస్, కిట్టీ బుగ్గపై ముద్దుపెట్టారు. ఒలింపిక్ విలేజ్ లో ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని విమర్శలు ఎక్కవయ్యాయి. అన్ని ఏర్పాట్లు దాదాపు బాగున్నాయని, కొంతమేరకు సమస్యలు తన దృష్టికి వచ్చాయని పేస్ పేర్కొన్నారు. కిట్టీ చిల్లర్ మాట్లాడుతూ.. గత ఐదు ఒలింపిక్స్ లో నిర్వహణ ఇంత సాధారణంగా లేదని, ఏర్పాట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని రియో మేయర్ కు ఆమె సూచించారు.
ముద్దు వివాదంపై తీవ్ర విమర్శల వ్యక్తమవుతున్న నేపథ్యంలో పేస్ స్పందిస్తూ.. తాను ఎలాంటి తప్పిదం చేయలేదని, క్షమాపణ కోరాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చుకున్నారు. కేవలం మర్యాదపూర్వకంగా ఆమెతో ప్రవర్తించానని బుధవారం స్థానిక మీడియాతో ఈ వివరాలు తెలిపారు. ఎలాంటి తప్పిదాలు జరగకుండా మెగా ఈవెంట్ నిర్వహిస్తే చాలంటూ మేయర్ పై స్థానికుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.