రియోలో తొలి టెన్నిస్ ప్లేయర్ సానియా !
రియోడిజనీరో: భారత టెన్నిస్, టేబుల్ టెన్నిస్ బృందాలు రియో ఒలింపిక్ గ్రామానికి చేరుకున్నాయి. ఒలింపిక్ విలేజ్లో అడుగుపెట్టిన తొలి టెన్నిస్ ప్లేయర్ గా సానియా నిలిచింది. మాంట్రియెల్ లో రోజర్స్ కప్ ఆడిన సానియా నేరుగా అక్కడి నుంచే రియోడిజనీరోకు వచ్చింది. సానియాకు ఇది మూడో ఒలింపిక్ గేమ్స్. మహిళల డబుల్స్ లో ప్రార్థనా థోంబరే, మిక్స్డ్ డబుల్స్ లో రోహన్ బోపన్నతో కలిసి సానియా బరిలో దిగనుంది.
మరోవైపు భారత హాకీ టీమ్ ఇక్కడ జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో దుమ్మురేపింది. స్పెయిన్ పై 2-1 తేడాతో గెలుపొంది ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత శరత్ మూడోసారి ఒలింపిక్ గేమ్స్ లో పాల్గొంటున్నాడు. కొన్ని కారణాల వల్ల లండన్ ఒలింపిక్స్ లో పాల్గొనలేకపోయాను. రియోలో కచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేస్తానని ధీమాగా ఉన్నానని శరత్ చెప్పాడు.