
వాషింగ్టన్:అమెరికాలో ట్రంప్ యంత్రాంగం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ దాడులతో యుద్ధంతో విధ్వంసానికి గురైన గాజాలో కండోమ్‌ల పంపిణీకి ట్రంప్ సర్కారు నిధులు నిలిపివేసింది. గాజాలో కండోమ్‌ల పంపిణీకి గత బైడెన్ సర్కారు ఏకంగా 50 మిలియన్ డాలర్ల నిధులు కేటాయించడం గమనార్హం.
అయితే ప్రభుత్వ ఖర్చులు తగ్గించే క్రమంలో ట్రంప్ గాజాలో కండోమ్‌ల పంపిణీకి బైడెన్ కేటాయించిన నిధుల పంపిణీ నిలిపివేశారని వైట్‌హౌజ్ తెలిపింది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే డీఓజీఈ కండోమ్‌ల నిధుల వ్యవహారాన్ని గుర్తించిందని వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ తెలిపారు.
అయితే బైడెన్ ప్రభుత్వం నిజంగా కండోమ్‌లకు నిధులకు కేటాయించిందన్నదానికి వైట్‌హౌజ్ ఆధారాలు చూపకపోవకపోవడం చర్చనీయాంశమవుతోంది. బైడెన్ పేషీలో పనిచేసిన ఒక అధికారి ఈ విషయాన్ని కొట్టిపారేయడం గమనార్హం.
కండోమ్‌లలో మండే వాయువులను నింపి ఆ బెలూన్‌లను హమాస్ ఉగ్రవాదులు గాజా నుంచి దక్షిణ ఇజ్రాయెల్‌పై వదిలేవారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్ ఎక్స్(ట్విటర్)లో ఒక ఆసక్తికర పోస్టు చేయడం విశేషం.
Explains why all condom orders were “Magnum” 😂 https://t.co/eKKRsfkgjY
— Elon Musk (@elonmusk) January 28, 2025