
గాజా పునర్నిర్మాణానికి 53 బిలియన్ డాలర్ల ప్రణాళిక
అరబ్ దేశాధినేతల ఆమోదం ∙హమాస్ మద్దతు
కైరో: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వా«దీనం ప్రతిపాదనకు అరబ్ దేశాలు చెక్ పెట్టాయి. ‘మిడిల్ ఈస్ట్ రివేరా’విజన్‌కు భిన్నంగా గాజా పునర్నిర్మాణ ప్రణాళికను విడుదల చేశాయి. 53 బిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందించిన ఈ ప్రతిపాదనను అరబ్‌నాయకులు ఆమోదించా రు. యుద్ధానంతర ప్రణాళికను ఈజిప్టు ప్రతిపాదించింది, దీని ప్రకారం పాలస్తీనా అథారిటీ (పీఏ) పరిపాలన కింద గాజా పునర్నిర్మాణం జరుగుతుంది. గాజాను అమెరికా అ«దీన ప్రాంతంగా మార్చేందుకు ట్రంప్ చేసిన ప్రణాళికకు ఇది కౌంటర్.
ట్రంప్ గాజా స్వా«దీన ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి మద్దతు తెలిపిన మరుసటి రోజే కైరోలో అరబ్ లీగ్ సదస్సు జరిగింది. ముగింపు సమావేశంలో ఈ గాజా పునర్నిర్మా ణం కోసం ‘సమగ్ర అరబ్ ప్రణాళిక’ను ఆయా దేశా ల నేతలు ప్రకటించారు. అంతేకాదు ఈ ప్రణాళికకు అంతర్జాతీయ మద్దతుకు పిలుపునిచ్చారు. భూభాగ పునర్నిర్మాణానికి నిధులు సమకూర్చడానికి ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రాజెక్టు కోసం అన్ని దేశాలు, ఆర్థిక సంస్థల నుంచి సహకారాన్ని స్వీకరిస్తామని పేర్కొన్నారు.
112 పేజీల డాక్యుమెంట్
పాలస్తీనియన్ల తరలింపు, గాజాను అమెరికా పునర్నిర్మించాలన్న ట్రంప్ ఆకాంక్షకు ప్రత్యామ్నాయంగా ఈజిప్టు, జోర్డాన్, గల్ఫ్ అరబ్ దేశాలు దాదాపు నెల రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నాయి. గాజా నుంచి పాలస్తీనియన్లను సామూహికంగా తరలించడాన్ని అరబ్ దేశాలు తిరస్కరించాయి. తామే ఆ బాధ్యతలు తీసుకున్నాయి. ‘గాజా పునర్నిర్మాణ ప్రణాళిక’పేరుతో 112 పేజీల డాక్యుమెంట్‌ను రూపొందించాయి. గాజాను తిరిగి ఎలా అభివృద్ధి చేయనున్నారనే మ్యాప్‌లు, ఇల్లు, ఉద్యానవనాలు, కమ్యూనిటీ సెంటర్లకు సంబంధించిన ఏఐ జనరేటెడ్ చిత్రాలతో తయారు చేశారు. అలాగే వాణిజ్య నౌకాశ్రయం, టెక్నాలజీ హబ్, బీచ్ హోటళ్లు, విమానాశ్రయం కూడా ఉన్నాయి.
స్వాగతించిన హమాస్..
శిఖరాగ్ర సమావేశం ప్రణాళికను, సహాయక చర్యలు, పునర్నిర్మాణం, పాలనను పర్యవేక్షించడానికి తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు హమాస్ తెలిపింది. అంతేకాదు.. కమిటీలో తమ అభ్యర్థులను ఉంచబోమని ప్రకటించింది. అయితే పీఏ పర్యవేక్షణలో పనిచేసే కమిటీ విధులు, సభ్యులు, ఎజెండాకు తన సమ్మతిని తెలియజేయాల్సి ఉంటుంది. కమిటీలో ఉండబోయే వ్యక్తుల పేర్లను నిర్ణయించినట్లు ఈజిప్టు విదేశాంగ మంత్రి బదర్ అబ్దెలాటీ మంగళవారం రాత్రి తెలిపారు.
పీఏకు నాయకత్వం వహిస్తున్న పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ మాట్లాడుతూ ఈజిప్టు ఆలోచనను తాను స్వాగతిస్తున్నానని, పాలస్తీనా నివాసితులను తరలించని ఇలాంటి ప్రణాళికకు మద్దతు ఇవ్వాలని ఆయన ట్రంప్‌ను కోరారు. పరిస్థితులు అనుకూలిస్తే అధ్యక్ష, పార్లమెంటరీ ఎన్నికలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎన్నికల ప్రణాళికను సైతం హమాస్ స్వాగతించింది.
తిరస్కరించిన అమెరికా..
అరబ్ నాయకులు ఆమోదించిన గాజా పునర్నిర్మాణ ప్రణాళికను ట్రంప్ ప్రభుత్వం తిరస్కరించింది, ఈ భూభాగంలోని పాలస్తీనా నివాసితులను పునరావాసం కల్పిచి, అమెరికా యాజమాన్యంలోని ‘రివేరా’గా మార్చే తన పాత విజన్‌కే అమెరికా అధ్యక్షుడు కట్టుబడి ఉన్నారని తెలిపింది. గాజా ప్రస్తుతం నివాసయోగ్యంగా లేదని, శిథిలాలు, పేలని ఆయుధాలతో కప్పబడిన భూభాగంలో నివాసితులు జీవించలేరని జాతీయ భద్రతా మండలి ప్రతినిధి బ్రియాన్ హ్యూస్ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సును తీసుకురావడానికి మరిన్ని చర్చల కోసం తాము ఎదురు చూస్తున్నామన్నారు.
తోసిపుచ్చిన ఇజ్రాయెల్..
ఈజిప్టు ప్రణాళికను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. కాలం చెల్లిన దృక్పథాలతో ఉందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రక టనలో విమర్శించింది. పీఏఐ ఆధారపడటా న్ని తిరస్కరించింది. ప్రణాళిక హమాస్‌కు అధికారాలిచ్చేదిగా ఉందని ఆరోపించింది. హమా స్ సైనిక, పాలనా సామర్థ్యాలను నాశనం చే యడమే తమ లక్ష్యమని, ముందు హమాస్ సై నిక ఉపసంహరణకు అంగీకరించేలా చేయాల ని డిమాండ్ చేసింది. అది తప్ప మరేదీ తమకు ఆమోదయోగ్యం కాదని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment