సాక్షి, బెంగళూరు : దేశంలోని శృంగార పురుషులు కండోములను విచ్చలవిడిగా ఉపయోగించేస్తున్నారు. గర్భధారణ నిరోధక సాధనాల మార్కెట్లో కేవలం 5 శాతం ఉన్న కండోముల అమ్మకాలు.. ఆన్‌లైన్‌లో ఫ్రీ కండోమ్ స్టోర్ ఆరంభించాక.. ఒక్కసారిగా డిమాండ్‌ఆకాశాన్ని అంటుకుంది. ఆన్ స్టోర్ ప్రారంభించిన 69 రోజుల్లోనే 10 లక్షల కండోములను ఉచితంగా డెలివరీ చేసినట్లు సదరు సంస్థ ప్రకటించింది.
ఎయిడ్స్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ అనే సంస్థ ఏప్రిల్ 28న ఆన్‌లైన్‌లో ఫ్రీ కండోమ్ స్టోర్‌ను ఆరంభించింది. ఈ స్టోర్‌లో ఇప్పటి వరకూ 9.56 లక్షల కండొమ్‌లను ఉచితంగా పంపిణీ చేసినట్లు సంస్థ తెలిపింది. ఎన్‌జీవో సంస్థలు, ఇతర వర్గాలకు 5.14 లక్షల కండోములు సరఫరా చేయగా.. వ్యక్తిగత ఆర్డర్లు 4.41 లక్షలు వచ్చినట్లు సంస్థ తెలిపింది.
ఢిల్లీ, కర్నాటక రాష్ట్రాల్లో కండోములకు అధికంగా డిమాండ్ ఉన్నట్లు ఆర్డర్ల ద్వారా తెలుస్తోంది. దేశంలోని శృంగార పురుషుల కోసం హిందుస్తాన్ లేటెక్స్ లిమిటెడ్ ఈ కండోములను ప్రత్యేకంగా అభివృద్ధి చేసినట్లు ఎయిడ్స్ హెల్త్ కేర్ ఫౌండేషన్ ఇండియా డైరెక్టన్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు.
డిసెంబర్ నెలాఖరు వరకు 10 లక్షల కండోములు వస్తాయని అంచనా. అయితే స్టోర్ ప్రారంభించిన కొద్ది రోజులకే స్టాక్ పూర్తవడం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని, తాజాగా 20 లక్షల కండోములకు ఆర్డర్ ఇచ్చినట్లు శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉండగా.. మరో 50 లక్షల కండోములు జనవరికల్లా అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment