Students Carry Condoms, Contraceptives, Cigarettes In School Bags In Bengaluru, Details Inside - Sakshi
Sakshi News home page

Bengaluru: హైస్కూల్‌ విద్యార్థుల బ్యాగుల్లో కండోమ్స్‌, గర్భనిరోధకాలు..!

Published Wed, Nov 30 2022 6:43 PM | Last Updated on Wed, Nov 30 2022 8:13 PM

Condoms Contraceptives Cigarettes Found In School Bags In Bengaluru - Sakshi

బెంగళూరు: హైస్కూల్‌ విద్యార్థుల బ్యాగులను ఆకస్మిక తనిఖీ చేసిన అధికారులకు దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. విద్యార్థుల బ్యాగుల్లో మొబైల్‌ ఫోన్స్‌, కండోమ్స్‌, నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధకాలు, లైటర్స్‌, సిగరెట్స్‌, వైట్‌నర్స్‌ వంటివి చూసి నివ్వెరపోయారు. ఈ సంఘటన బెంగళూరులో వెలుగు చూసింది. ఆ బ్యాగులు 8, 9, 10వ తరగతి విద్యార్థులకు చెందినవి కావటం గమనార్హం. విద్యార్థులు మొబైల్‌ ఫోన్స్‌ తీసుకొస్తున్నారనే ఫిర్యాదుతో నగరంలోని పలు పాఠశాలల్లో ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అధికారులు. 

విద్యార్థుల బ్యాగులు తనిఖీ చేయాలని పాఠశాలలను ఆదేశించింది కర్ణాటకలోని ప్రైమరీ, సెకండరీ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(కేఏఎంఎస్‌). ‘ఒక విద్యార్థి బ్యాగులో నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలు(ఐ-పిల్‌) లభించాయి. అలాగే వాటర్‌ బాటిల్‌లో లిక్కర్‌ దొరికింది.’ అని కేఏఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి డి.శశికుమార్‌ తెలిపారు. 

ఆకస్మిక తనిఖీల అనంతరం కొన్ని పాఠశాలలు తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులే షాక్‌కు గురయ్యారని నగరభావి స్కూల్‌ ప్రిన్సిపాల్‌ తెలిపారు. విద్యార్థుల ప్రవర్తనలో తేడా వచ్చినట్లు గుర్తించినట్లు చెప్పారని వెల్లడించారు. వారిలో మార్పు తీసుకొచ్చేందుకు మానసిక చికిత్స అందించేందుకు 10 రోజుల పాటు సెలవులు ఇచ్చామన్నారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిపోయింది. పలువురు నెటిజన్లు తమ ఆలోచనలను ట్విటర్‌లో షేర్‌ చేశారు. తాము స్కూల్‌కి వెళ్లినప్పుడు పార్లేజీ బిస్కెట్‌ ప్యాకెట్లు తీసుకెళ్లేవాళ్లం అంటూ ఓ యూజర్‌ పేర్కొన్నారు. ఈ ఇంటర్నెట్‌ కాలంలో తల్లిదండ్రుల పాత్ర చాలా క్లిష్టమైనదని మరొకరు రాసుకొచ్చారు.

ఇదీ చదవండి: Labour Union Protest: పంజాబ్‌ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement