Bengaluru school
-
షాకింగ్: కండోమ్స్, గర్భనిరోధకాలతో స్కూల్‌కు విద్యార్థులు..!
బెంగళూరు: హైస్కూల్ విద్యార్థుల బ్యాగులను ఆకస్మిక తనిఖీ చేసిన అధికారులకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. విద్యార్థుల బ్యాగుల్లో మొబైల్ ఫోన్స్, కండోమ్స్, నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధకాలు, లైటర్స్, సిగరెట్స్, వైట్నర్స్ వంటివి చూసి నివ్వెరపోయారు. ఈ సంఘటన బెంగళూరులో వెలుగు చూసింది. ఆ బ్యాగులు 8, 9, 10వ తరగతి విద్యార్థులకు చెందినవి కావటం గమనార్హం. విద్యార్థులు మొబైల్ ఫోన్స్ తీసుకొస్తున్నారనే ఫిర్యాదుతో నగరంలోని పలు పాఠశాలల్లో ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అధికారులు. విద్యార్థుల బ్యాగులు తనిఖీ చేయాలని పాఠశాలలను ఆదేశించింది కర్ణాటకలోని ప్రైమరీ, సెకండరీ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్(కేఏఎంఎస్). ‘ఒక విద్యార్థి బ్యాగులో నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలు(ఐ-పిల్) లభించాయి. అలాగే వాటర్ బాటిల్లో లిక్కర్ దొరికింది.’ అని కేఏఎంఎస్ ప్రధాన కార్యదర్శి డి.శశికుమార్ తెలిపారు. ఆకస్మిక తనిఖీల అనంతరం కొన్ని పాఠశాలలు తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులే షాక్‌కు గురయ్యారని నగరభావి స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థుల ప్రవర్తనలో తేడా వచ్చినట్లు గుర్తించినట్లు చెప్పారని వెల్లడించారు. వారిలో మార్పు తీసుకొచ్చేందుకు మానసిక చికిత్స అందించేందుకు 10 రోజుల పాటు సెలవులు ఇచ్చామన్నారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిపోయింది. పలువురు నెటిజన్లు తమ ఆలోచనలను ట్విటర్లో షేర్ చేశారు. తాము స్కూల్‌కి వెళ్లినప్పుడు పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు తీసుకెళ్లేవాళ్లం అంటూ ఓ యూజర్ పేర్కొన్నారు. ఈ ఇంటర్నెట్ కాలంలో తల్లిదండ్రుల పాత్ర చాలా క్లిష్టమైనదని మరొకరు రాసుకొచ్చారు. ఇదీ చదవండి: Labour Union Protest: పంజాబ్ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్! -
మరో స్కూల్లో దారుణం.. గార్డ్స్ పనే!
బెంగళూరు : స్కూళ్లలో దారుణ సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. మొన్న ఢిల్లీలో చిన్నారిపై లైంగికదాడి.. అంతకుముందు గుర్గావ్ స్కూల్లో ఏడేళ్ల బాలుడి హత్య ఘటన చోటుచేసుకోగా.. నేడు బెంగళూరులో అలాంటి దారుణమే చోటు చేసుకుంది. బెంగళూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. పాఠశాలకు భద్రతా సిబ్బందిగా ఉన్నవారిలో ఎవరో ఒకరు ఈ పనిచేసి ఉంటారని అనుమానిస్తున్నారు. బాలికకు పరీక్షలు జరిపిన ఎంఎస్ఆర్ రామయ్య ఆస్పత్రి వైద్యులు కూడా పాపపై లైంగిక దాడి జరిగిందని స్పష్టం చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుల మేరకు దసరాహళ్లి ప్రాంతంలో ఉంటూ స్కూల్లో సెక్యూరిటీ గార్డ్స్‌గా పనిచేస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. వారిని ప్రస్తుతం విచారిస్తున్నామని, బాలిక పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత నిందితుడిని గుర్తించే ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. -
50 లక్షలు విరాళం ఇచ్చిన ప్రైవేటు స్కూలు
ప్రధాని పిలుపుతో సైన్యానికి అందజేత బెంగళూరు: నగరంలోని ఒక ప్రైవేటు స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, యాజమాన్యం ఉమ్మడిగా ముందుకొచ్చి భారత జవాన్ల సంక్షేమం కోసం రూ. 50 లక్షలు విరాళంగా ఇచ్చారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ సైనికులకు స్ఫూర్తిదాయకమైన సందేశాలు పంపించాలని ప్రజలకు పిలునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బెంగళూరులోని న్యూ హారిజన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ భారత సైనికులకు తమవంతుగా మద్దతు తెలుపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా భారత సైనికుల సంక్షేమ నిధికి రూ. 50 లక్షలు విరాళం అందజేసినట్టు ఇన్స్టిట్యూషన్ చైర్మన్ మోహన్ మంఘ్నాని తెలిపారు. కర్ణాటక, కేరళ ప్రాంత జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జరనల్ కేఎస్ నిజ్జర్‌కు ఈ మొత్తాన్ని అందజేశారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘సందేశ్ టు సోల్జర్’ మిషన్‌కు మద్దతుగా తాము ఈ కార్యక్రమం చేపట్టినట్టు చైర్మన్ చెప్పారు. -
చిరుత చెక్కేసింది..
బెంగళూరులోని ఓ పాఠశాలలోకి చొరబడి.. స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసిన చిరుతపులి మళ్లీ తప్పించుకుంది. ఈ నెల 8న చిరుతపులి ఓ పాఠశాలలకు చొరబడి హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అది ఎనిమిది మందిపై దాడి కూడా చేసింది. నాటకీయ పరిణామాల నడుమ దానికి మత్తుమందు ఇచ్చి అత్యంత చాకచక్యంగా బంధించిన సంగతి తెలిసిందే. బంధించిన అనంతరం ఈ చిరుతను తీసుకెళ్లి బన్నెర్ఘట్ట జాతీయ పార్కులో ఓ బోను ఉంచారు. అయితే ఆదివారం రాత్రి చిరుతకు ఆహారం పెట్టేందుకు నిర్వాహకులు బోను తలుపులు తెరిచారు. ఆ తర్వాత సరిగ్గా తలుపులు మూయకపోవడం వల్ల చిరుత తప్పించుకొని ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, పార్కు పరిసరాలను దాటి చిరుత బయటకు వెళ్లలేదని, ఇది చిరుతకు సహజ ఆవాసమని పార్కు డైరెక్టర్ సంతోష్‌కుమార్ తెలిపారు. అయితే మరికొన్ని రోజులు పంజరంలో ఉంచి ఆ తర్వాత దానిని ఈ పార్కులో వదిలేయాలని భావించామని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో చిరుతను బంధించేందుకు 52 మంది అటవీ అధికారులతో ఆరు బృందాలను పార్కులో రంగంలోకి దించామని ఆయన వెల్లడించారు.