50 లక్షలు విరాళం ఇచ్చిన ప్రైవేటు స్కూలు | school to donate Rs 50 lakh to soldiers | Sakshi
Sakshi News home page

భారీగా విరాళం ఇచ్చిన ప్రైవేటు స్కూలు

Published Thu, Nov 17 2016 3:34 PM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM

50 లక్షలు విరాళం ఇచ్చిన ప్రైవేటు స్కూలు

50 లక్షలు విరాళం ఇచ్చిన ప్రైవేటు స్కూలు

  • ప్రధాని పిలుపుతో సైన్యానికి అందజేత

  • బెంగళూరు: నగరంలోని  ఒక ప్రైవేటు స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, యాజమాన్యం ఉమ్మడిగా ముందుకొచ్చి భారత జవాన్ల సంక్షేమం కోసం రూ. 50 లక్షలు విరాళంగా ఇచ్చారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ సైనికులకు స్ఫూర్తిదాయకమైన సందేశాలు పంపించాలని ప్రజలకు పిలునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బెంగళూరులోని న్యూ హారిజన్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ భారత సైనికులకు తమవంతుగా మద్దతు తెలుపాలని నిర్ణయించింది.

    ఇందులో భాగంగా భారత సైనికుల సంక్షేమ నిధికి రూ. 50 లక్షలు విరాళం అందజేసినట్టు ఇన్‌స్టిట్యూషన్‌ చైర్మన్‌ మోహన్‌ మంఘ్నాని తెలిపారు. కర్ణాటక, కేరళ ప్రాంత జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ మేజర్‌ జరనల్‌ కేఎస్‌ నిజ్జర్‌కు ఈ మొత్తాన్ని అందజేశారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘సందేశ్‌ టు సోల్జర్‌’ మిషన్‌కు మద్దతుగా తాము ఈ కార్యక్రమం చేపట్టినట్టు చైర్మన్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement