Contraceptive pills
-
ఇకపై డాక్టర్ చీటీ లేకుండానే గర్భనిరోధక మాత్రలు.. ట్రైల్ సేల్స్‌కు అనుమతి!
జపాన్ ఆరోగ్యమంత్రిత్వశాఖ ఇకపై దేశంలో డాక్టర్ చీటీ లేకుండానే గర్భనిరోధక మాత్రలు విక్రయించేందుకు అనుమతినిచ్చింది. అయితే ముందుగా వీటిని ట్రయల్ రూపంలో విక్రయించాలని నిర్ణయించింది. అత్యవసర గర్భనిరోధక మాత్రల విషయమై జపాన్‌లో చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకూ ఉన్న నియమం ఇదే.. జపాన్ ఆరోగ్యశాఖ తాజాగా అత్యవసర గర్భనిరోధక మాత్రలు ‘మార్నింగ్ ఆఫ్టర్ పిల్స్’ విక్రయాలకు అనుమతినిచ్చింది. ఇప్పటి వరకూ వీటిని కొనుగోలు చేయాలంటే పలు నిబంధనలు ఉన్నాయి. ఎవరైనా మహిళ, లేదా అత్యాచార బాధితురాలు ఈ మాత్రలను కొనుగోలు చేయాలంటే, తప్పనిసరిగా అందుకు సంబంధించిన డాక్టర్ చీటీ చూపించడం తప్పనిసరి. ఆరేళ్ల క్రితం రాజుకున్న వివాదం 2017లో ఎటువంటి డాక్టర్ చీటీ లేకుండా గర్భనిరోధర మాత్రలు విక్రయించడంపై వివాదం చెలరేగింది. ఈ నేపధ్యంలో జపాన్ ప్రభుత్వం కొద్దిపాటి సడలింపుతో డాక్టర్ చీటీ లేకుండా వీటి విక్రయాలకు అనుమతినిచ్చింది. అయితే ‘మార్నింగ్ ఆఫ్టర్ పిల్స్’ మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంచడం తగినది కాదనే వాదన కొందరిలో మొదలయ్యింది. దీనివలన సమస్యలు పెరుగుతాయిని వారు పేర్కొన్నారు. 90వ దశాబ్ధంలో సులభంగా లభ్యం 90వ దశాబ్ధంలో జపాన్‌లో గర్భనిరోధక మాత్రలు డాక్టర్ చీటీ లేకుండానే విక్రయించేవారు. అయితే పలు పరిశోధనల్లో అత్యవసర గర్భనిరోధక మాత్రలతో ముప్పు పొంచి ఉన్నదని వెల్లడయ్యింది. 46 వేల మంది వినతి మేరకు.. 2020 చివరిలో లింగసమానత్వానికి జాపాన్ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ నేపధ్యంలో మరోమారు అత్యవసర గర్భనిరోధక మాత్రల విక్రయాలపై తిరిగి వాదనలు మొదలయ్యాయి. తాజాగా వీటి విక్రయాలపై ప్రభుత్వానికి 46,312 మంది సలహాలు, సూచనలు అందించారు. వీరిలో చాలామంది గర్భనిరోధక మాత్రలను ట్రయల్ రూపంలో విక్రయించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: పాపం పసివాడు:16 రోజులు కోమాలో ఉండి.. -
షాకింగ్: కండోమ్స్, గర్భనిరోధకాలతో స్కూల్‌కు విద్యార్థులు..!
బెంగళూరు: హైస్కూల్ విద్యార్థుల బ్యాగులను ఆకస్మిక తనిఖీ చేసిన అధికారులకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. విద్యార్థుల బ్యాగుల్లో మొబైల్ ఫోన్స్, కండోమ్స్, నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధకాలు, లైటర్స్, సిగరెట్స్, వైట్నర్స్ వంటివి చూసి నివ్వెరపోయారు. ఈ సంఘటన బెంగళూరులో వెలుగు చూసింది. ఆ బ్యాగులు 8, 9, 10వ తరగతి విద్యార్థులకు చెందినవి కావటం గమనార్హం. విద్యార్థులు మొబైల్ ఫోన్స్ తీసుకొస్తున్నారనే ఫిర్యాదుతో నగరంలోని పలు పాఠశాలల్లో ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అధికారులు. విద్యార్థుల బ్యాగులు తనిఖీ చేయాలని పాఠశాలలను ఆదేశించింది కర్ణాటకలోని ప్రైమరీ, సెకండరీ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్(కేఏఎంఎస్). ‘ఒక విద్యార్థి బ్యాగులో నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలు(ఐ-పిల్) లభించాయి. అలాగే వాటర్ బాటిల్లో లిక్కర్ దొరికింది.’ అని కేఏఎంఎస్ ప్రధాన కార్యదర్శి డి.శశికుమార్ తెలిపారు. ఆకస్మిక తనిఖీల అనంతరం కొన్ని పాఠశాలలు తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులే షాక్‌కు గురయ్యారని నగరభావి స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థుల ప్రవర్తనలో తేడా వచ్చినట్లు గుర్తించినట్లు చెప్పారని వెల్లడించారు. వారిలో మార్పు తీసుకొచ్చేందుకు మానసిక చికిత్స అందించేందుకు 10 రోజుల పాటు సెలవులు ఇచ్చామన్నారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిపోయింది. పలువురు నెటిజన్లు తమ ఆలోచనలను ట్విటర్లో షేర్ చేశారు. తాము స్కూల్‌కి వెళ్లినప్పుడు పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు తీసుకెళ్లేవాళ్లం అంటూ ఓ యూజర్ పేర్కొన్నారు. ఈ ఇంటర్నెట్ కాలంలో తల్లిదండ్రుల పాత్ర చాలా క్లిష్టమైనదని మరొకరు రాసుకొచ్చారు. ఇదీ చదవండి: Labour Union Protest: పంజాబ్ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్! -
అలాంటివేమీ వాడలేదు
నాకు పెళ్లై రెండున్నర సంవత్సరాలు కావొస్తుంది. గర్భనిరోధక మాత్రలేవీ వాడలేదు. ఇప్పటి వరకు పిల్లలు లేరు. ట్యూబ్ టెస్టింగ్ చేయించుకోవాల నంటున్నారు. దీని గురించి తెలియజేయగలరు. – డి.వసుమతి, అనంతపురం సాధారణంగా గర్భం రావడానికి గర్భాశయానికి ఇరువైపులా ఉండే ఫెలోపియన్ ట్యూబ్‌లు తెరుచుకుని ఉండాలి. రెండింటిలో కనీసం ఒకటైనా తెరుచుకుని ఉండాలి. కొందరిలో ఏదైనా ఇన్ఫెక్షన్స్, ఇతరత్రా కారణాల వల్ల ఇవి మూసుకుపోయే అవకాశాలు ఉంటాయి. ఫెలోపియన్ ట్యూబ్‌లు తెరుచుకుని ఉన్నాయా, లేదా మూసుకుని ఉన్నాయా నిర్ధారించడానికి ట్యూబ్ టెస్టింగ్ చేస్తారు. వీటిలో ముఖ్యంగా సోనోసాల్పింగో గ్రామ్ (ఎస్ఎస్జీ), హిస్టిరో సాల్పింగోగ్రామ్ (హెచ్ఎస్జీ), లాపరోస్కోపిక్ క్రోమోట్యూబేషన్ వంటివి ఉంటాయి. ఎస్‌ఎస్‌జీలో సన్నని క్యాథటర్ ద్వారా యోని నుంచి గర్భాశయంలోనికి నార్మల్ సెలైన్ పంపించి, స్కానింగ్‌లో నార్మల్ సెలైన్ ట్యూబ్స్ నుంచి బయటకు వస్తుందా లేదా అని చూడటం జరుగుతుంది. హెచ్ఎస్జీలో ‘రేడియో ఒపేక్ డై’ అనే ద్రవాన్ని యోని నుంచి సర్విక్స్ ద్వారా గర్భాశయంలోకి పంపించి, పొట్ట పైనుంచి ఎక్స్‌రే తీయడం జరుగుతుంది. ఇందులో ట్యూబ్స్ తెరుచుకుని ఉంటే పై గర్భాశయంలో నుంచి ట్యూబ్స్‌లోకి ప్రవేశించి, బయటకు పొత్తి కడుపులోకి రావడం కనిపిస్తుంది. మూసుకుని ఉంటే డై ట్యూబ్‌లోకి ప్రవేశించదు. లేదా కొంత దూరం వరకు వచ్చి ఆగిపోవడం జరుగుతుంది. హెచ్ఎస్జీలో ట్యూబ్స్ మూసుకుని ఉన్నట్లు తేలితే, అది నిర్ధారణ చేయడానికి ల్యాపరోస్కోపిక్ క్రోమోట్యూబేషన్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అందులో ట్యూబ్స్ మూసుకుని ఉన్నట్లు నిర్ధారణ జరిగితే హిస్టరోస్కోపీ క్యానులేషన్ ద్వారా ట్యూబ్స్‌ను తెరవడానికి ప్రయత్నించవచ్చు. హెచ్ఎస్జీ పరీక్ష చేసేటప్పుడు కొందరు భయంతో పొట్టను గట్టిగా బిగపట్టడం వల్ల డై సరిగా ట్యూబ్‌లలోకి ప్రవేశించదు. దానివల్ల హెచ్ఎస్జీలో ట్యూబ్స్ బ్లాక్ అయినట్లు రిపోర్ట్ వస్తుంది.అంతమాత్రాన అవి వందశాతం మూసుకుపోయాయని నిర్ధారించలేం. గర్భం రాకపోతే మొదట హార్మోన్ల పనితీరు, అండం విడుదల సక్రమంగా ఉన్నాయా లేదా, భర్త శుక్రకణాల నాణ్యత, సంఖ్య, కదలిక సరిగా ఉన్నదీ, లేనిదీ నిర్ధారణ చేసుకున్నాకే ట్యూబ్ టెస్టింగ్ చేయించుకోవడం మంచిది. ప్రెగ్నెన్సీ సమయంలో సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల, పుట్టబోయే బిడ్డ ఆటిజమ్ సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉంటాయనే ఒక స్టడీలో చదివాను. pట్ఛn్చ్ట్చ∙ఠిజ్టీ్చఝజీnటతప్పనిసరిగా తీసుకోవాలా? – బి.సరోజ, భువనగిరి ప్రెగ్నెన్సీ సమయంలో సరైన మోతాదులో సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డలో ఆటిజం సమస్య వచ్చే అవకాశాలు, సప్లిమెంట్స్ తీసుకోని వారితో పోల్చితే చాలా తక్కువగా ఉంటాయి. మీరు తప్పుగా చదివినట్లు ఉన్నారు. ఆటిజం అంటే మానసిక పెరుగుదల లేకపోవడం, వినికిడి లోపాలు వంటి అనేక లక్షణాలతో కలసిన ఒక సిండ్రోమ్. జన్యుపరమైన కారణాలు, పర్యావరణ మార్పులు, తల్లిలో పోషక లోపాలు, రక్తహీనత, తల్లి మానసిక పరిస్థితి, కొన్ని రకాల మందులు, ఇన్ఫెక్షన్ల ప్రభావం, గర్భంలో ఉన్నప్పుడు ఆక్సిజన్ సరఫరా సరిగా లేకపోవడం, కాన్పులో ఇబ్బందులు, ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల పిల్లల్లో ఆటిజం సమస్య రావచ్చు. కొందరు శిశువులకు గర్భంలో ఉన్నప్పుడు మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగినంతగా ఉండకపోవచ్చు. దానివల్ల మెదడు పెరుగుదల, పనితీరులో లోపాలు ఏర్పడవచ్చు. కాబట్టి రక్త హీనతను అధిగమించడానికి సరైన పోషకాహారంతో పాటు ఫోలిక్ యాసిడ్, బి–కాంప్లెక్స్ వంటి సప్లిమెంట్స్ మాత్రల రూపంలో తీసుకోవడం మంచిది. ప్రీనేటల్ విటమిన్స్ గర్భం రాకముందు మూడునెలల నుంచే తీసుకోవడం మొదలుపెట్టి గర్భం వచ్చిన తర్వాత కూడా వాడుకోవాలి. నాకు కొన్ని సంవత్సరాల క్రితం రొమ్ము క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు తగ్గిపోయింది. నాకు ఒక అమ్మాయి ఉంది. మళ్లీ పిల్లల్ని కనాలనుకుంటున్నాను. ‘పుట్టబోయే బిడ్డ రకరకాల ఆరోగ్య సమస్యలతో పుడతాడు’ అని కొందరు అంటున్నారు. ఇది నిజమేనా? నేను గర్భం దాల్చవచ్చా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – జి.నాగమణి, నూజివీడు ఇప్పుడు రొమ్మ క్యాన్సర్ తగ్గిపోయింది. మందులేమీ వాడటం లేదు కాబట్టి, ఇప్పుడు గర్భం దాల్చడం వల్ల బిడ్డలో ఆరోగ్య సమస్యలేవీ రావు. మీ వయసు రాయలేదు. మీ అమ్మాయి రొమ్ము క్యాన్సర్ రాకముందు పుట్టిందా, వచ్చిన తర్వాత పుట్టిందా అనే వివరాలు రాయలేదు. గర్భందాల్చే ముందు ఒకసారి డాక్టర్ని సంప్రదించి, రొమ్ముకు పరీక్షలు చేయించుకుని, అంతా బాగానే ఉంటే గర్భం కోసం ప్రయత్నించవచ్చు. గర్భం కోసం ప్రయత్నించే టప్పుడు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు రోజుకొకటి చొప్పున వేసుకోవాలి. బరువు ఎక్కువగా ఉంటే, బరువు తగ్గి గర్భం కోసం ప్రయత్నించండి. గర్భంతో ఉన్నప్పుడు కూడా సరైన పోషకాహారం తీసుకుంటూ మరీ ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోవాలి. ఒకవేళ సాధారణంగా గర్భం రాకపోతే, గర్భం కోసం చికిత్స తీసుకునేటప్పుడు హార్మోన్స్ ఎక్కువ మోతాదులో కాకుండా, తక్కువ మోతాదులో వాడుకోవాల్సి ఉంటుంది. ఈస్ట్రోజన్ వంటి హార్మోన్స్ మరీ ఎక్కువ తీసుకుంటే, కొందరి శరీర తత్వాన్ని బట్టి, ముందు వచ్చిన రొమ్ము క్యాన్సర్‌ను బట్టి అది తిరగబెట్టే అవకాశాలు కొద్దిగా ఉంటాయి. ఒకసారి డాక్టర్ని సంప్రదించి, గర్భం కోసం ప్రయత్నించవచ్చు. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
నాకు ఆ అలవాటు ఎక్కువ
నా వయసు 26 సంవత్సరాలు. నేను ప్రెగ్నెంట్. నాకు తీపిపదార్థాలు బాగా తినే అలవాటు ఉంది. పూర్తిగా మానెయ్యమని కొందరు, అంతగా భయపడాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు. ఏది నిజం? ఉమ్మనీరు తగ్గిపోవడం వల్ల ఎదురయ్యే సమస్యల గురించి తెలియజేయగలరు. – ఆర్.క్రిష్ణవేణి, చిత్తూరు ప్రెగ్నెన్సీ సమయంలో తీపిపదార్థాలు అసలు తినకూడదు అని ఏమి నియమం లేదు. మితంగా తీసుకోవచ్చు. తీపిపదార్థాలు ఎంత తినవచ్చు అనేది, ఒక్కొక్కరి బరువును బట్టి, వారి కుటుంబంలో ఎవరికైనా మధుమేహవ్యాధి ఉందా లేదా అనే అంశాలను బట్టి ఉంటుంది.తీపిపదార్థాలను ఎక్కువగా తీసుకోడం వల్ల బరువు ఎక్కువగా పెరగడం జరుగుతుంది. దానివల్ల ప్రెగ్నెన్సీలో షుగర్ పెరిగి జెస్టేషనల్ డయాబెటిస్ రావడం, బీపీ పెరగడం వంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.బరువు ఎక్కువగా పెరగడం వల్ల ఆయాసం, కాన్పు సమయంలో ఇబ్బందుల వంటివి ఏర్పడవచ్చు.బరువు ఎక్కువగా ఉండి, ఫ్యామిలీ హిస్టరీలో షుగర్ వ్యాధి ఉన్నప్పుడు, తీపిపదార్థాలు ఎంత తక్కువగా తీసుకుంటే అంతమంచిది. బరువు మితంగా ఉంటే తీపిపదార్థాలు అప్పుడప్పుడు కొద్దిగా తీసుకోవచ్చు.గర్భాశయంలో బిడ్డ చుట్టూ ఉమ్మనీరు ఉంటుంది. ఇది సరిపడా ఉంటే, బిడ్డ లోపల తేలికగా తిరగటానికి, ఎదుగుదలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది.కొందరిలో అనేక కారణాల వల్ల ఉమ్మనీరు తగ్గిపోతుంది.ఉమ్మనీరు బాగా తగ్గిపోవడం వల్ల బిడ్డ కదలిక, పెరుగుదలకు ఇబ్బంది అవుతుంది. కొందరిలో బిడ్డలో అవయవ లోపాలు, కిడ్నీలలో లోపాల వల్ల ఉమ్మనీరు తగ్గవచ్చు. తల్లి నుంచి బిడ్డకు రక్తసరఫరా సరిగా లేక ఉమ్మనీరు తగ్గవచ్చు. అలాంటప్పుడు బిడ్డ సరిగా బరువు పెరగకపోవచ్చు.ఊపిరితిత్తులు మిగతా అవయవాలు అదుముకున్నట్లయ్యి, బిడ్డకు ఊపిరి సరిగా ఆడకపోవడం, కొందరిలో లోపలే మోషన్ పోవడం, కడుపులో ఊపిరి ఆడక చనిపోవడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. ఇలా ఉన్నప్పుడు స్కానింగ్ ద్వారా క్రమంగా పర్యవేక్షిస్తూ, అవసరాన్ని బట్టి, ఉమ్మనీరు బాగా తగ్గిపోయి, ఎన్ని చికిత్సలు చేసినా పెరగకపోతే, కాన్పు త్వరగా చేసి బిడ్డను బయటకు తియ్యవలసి ఉంటుంది.ఉమ్మనీరు బాగా తగ్గిపోతే సాధారణ కాన్పులో ఇబ్బంది ఏర్పడవచ్చు. అవసరమైతే సిజేరియన్ ద్వారా కాన్పు చేయలవలసి ఉంటుంది. మా బంధువు ఒకరికి హిస్టెరోస్కోపీ చేయాలంటున్నారు. ఇది ఏ పరిస్థితులలో చేయించాల్సి ఉంటుంది? దీని గురించి వివరంగా తెలియజేయగలరు. – కె.కీర్తన, సంగారెడ్డి గర్భాశయం లోపల ఉండే ఎండోమెట్రియల్ పొరలో, క్యావిటీలో ఉండే సమస్యలను హిస్టెరోస్కోపీ ద్వారా తెలుసుకుంటారు. ఇందులో యోనిభాగం నుంచి గర్భాశయ ముఖద్వారం ద్వారా, గర్భాశయం లోపలి ఎండోమెట్రియల్ క్యావిటీ లోపలికి, హిస్టెరోస్కోప్ అనే 3–నుంచి 5 మిల్లీమీటర్ల మందం ఉండే పొడుగాటి పరికరాన్ని ప్రవేశపెట్టి, దాని ద్వారా బయట మానిటర్లో, గర్భాశయం లోపల ఎలా ఉందనేది చూడడం జరుగుతుంది. ఇందులో నార్మల్ సెలైను పంపి గర్భాశయాన్ని వెడల్పు చేయడం ద్వారా లోపలి సమస్యలు స్పష్టంగా కనిపిస్తాయి. దీన్ని డయాగ్నస్టిక్ హిస్టెరోస్కోపీ అంటారు. అదే సమయంలో ఆపరేటివ్ హిస్టెరోస్కోపీ ద్వారా అందులో కనిపించే సమస్యలను తొలగించడం జరుగుతుంది. దీన్ని సరైన అనుభవం, శిక్షణ కలిగిన గైనకాలజిస్ట్లు చెయ్యడం జరుగుతుంది.హిస్టెరోస్కోప్ ద్వారా గర్భాశయంలో పొరలు, కణితులు, అతుకులు తదితర సమస్యలు ఉంటే గుర్తించి వాటిని తీసివేయవచ్చు.ఆపరేటివ్ హిస్టెరోస్కోపీలో కొన్నిసార్లు కొంతమందికి సమస్యను తొలగించడానికి రెండు, మూడు సిటింగ్‌లు కూడా అవసరం పడవచ్చు. దీని ద్వారా కొంతమందికి సమస్య ఎక్కడుందో, సరిగా ఆ భాగం నుంచే ముక్క తీసి ఎండోమైట్రియల్ బయాప్సీకి పంపించవచ్చు. ఒక్కొక్కరి శరీరతత్వాన్నిబట్టి, చేసే ప్రక్రియను బట్టి, నొప్పి తెలియకుండా ఇంజెక్షన్లు లేదా మత్తు ఇచ్చి హిస్టెరోస్కోపీని చేయడం జరుగుతుంది. దీనికి హాస్పిటల్లో 5–6 గంటలు ఉంటే సరిపోతుంది. నేను గర్భనిరోధక మాత్రలు వాడుతున్నాను. ఇవి తీసుకోవడం వల్ల భవిష్యత్‌లో రొమ్ముకాన్యర్ ముప్పు ఉంటుందని చదివాను. ఇది ఎంతవరకు నిజం? గర్భనిరోధక మాత్రాలకు వేరే ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? తెలియజేయగలరు. –డీఆర్, విజయవాడ గర్భనిరోధక మాత్రలు దీర్ఘకాలం వాడటం వల్ల, వాడని వారిలో కంటే 5 శాతం రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయని కొన్ని పరిశోధనలలో తెలియజేయడం జరిగింది. ఇందులో ఈ రిస్క్ ఒక్కొక్కరి శరీరతత్వాన్నిబట్టి, బరువును బట్టి, జన్యువులను బట్టి, ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్లు ఉండేదాన్ని బట్టి, వాడే మాత్రలలో ఈస్ట్రోజన్ శాతం బట్టి కూడా ఉంటుంది.కాకపోతే ఈ గర్భనిరోధకమాత్రలు ఒవేరియన్ (50 శాతం), ఎండోమైట్రియల్ (30 శాతం), కొలోరెక్టల్ క్యాన్సర్(20 శాతం) రిస్క్‌ను తగ్గిస్తుంది.ఇప్పుడు లభించే లోడోస్ పిల్స్ వల్ల రొమ్ముక్యాన్సర్ రిస్క్ కొద్దిగా తగ్గుతుంది. వీటిలో ఈస్ట్రోజన్ హార్మోన్ శాతం కొద్దిగా తక్కువగా ఉంటుంది. కొంతకాలం తీసుకోవడం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు.గర్భనిరోధక మాత్రలకు బదులుగా, తాత్కాలిక కుటుంబ నియంత్రణకు కాపర్–టి(లూప్) లేదా మిరినా (హార్మోన్ లూప్), మూడు నెలలకు ఒకసారి హార్మోన్ ఇంజెక్షన్లు, వెజైనల్ హార్మోన్ రింగ్స్, కండోమ్స్వంటివి వాడుకోవచ్చు. ఇవి కూడా ఒక్కొక్కరి శరీతత్వాన్నిబట్టి కొందరికి దుష్ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.డాక్టర్‌ను సంప్రదించి వాటి ప్రభావాలు ఎలా ఉంటాయి, మీ శరీరతత్వాన్ని, హిస్టరీని బట్టి వారి సలహా మేరకు వాడుకోవడం మంచిది. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్‌బోహైదర్‌నగర్ హైదరాబాద్ -
మైగ్రేన్‌కు పరిష్కారం ఉందా?
నా వయసు 35 ఏళ్లు. నాకు కొంతకాలంగా తలలో ఒకవైపు విపరీతమైన తలనొప్పి వస్తోంది. ఆఫీసులో ఏపనీ చేయలేకపోతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే మైగ్రేన్ అన్నారు. నా సమస్యకు హోమియోలో çపరిష్కారం ఉంటే చెప్పండి. – రవికిరణ్, నిజామాబాద్ పార్శ్వపు నొప్పి అని కూడా పిలిచే ఈ మైగ్రేన్ తలనొప్పిలో తలలో ఒక వైపు తీవ్రమైన నొప్పి వస్తుంది. సాధారణంగా ఇది మెడ వెనక ప్రారంభమై కంటి వరకు వ్యాపిస్తుంది. యువకులతో పోలిస్తే యువతుల్లో ఇది ఎక్కువ. కారణాలు : తలలోని కొన్ని రకాల రసాయనాలు అధిక మోతాదులో విడుదల కావడం వల్ల పార్శ్వపు నొప్పి వస్తుందని తెలుస్తోంది. ఇక శారీరక, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, చాలాసేపు ఆకలితో ఉండటం, సమయానికి భోజనం చేయకపోవడం, సైనసైటిస్, అతి వెలుగు, గట్టి శబ్దాలు, ఘాటైన సువాసనలు, పొగ, మద్యం వంటి అలవాట్లు, మహిళల్లో నెలసరి సమయాల్లో, మెనోపాజ్ సమయాల్లో స్త్రీలలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వంటివి ఈ సమస్యకు కారణాలుగా చెప్పవచ్చు. లక్షణాలు : పార్శ్వపు నొప్పిలో చాలారకాల లక్షణాలు కనిపిస్తాయి. వాటిని మూడు రకాలుగా విభజించవచ్చు. 1. పార్శ్వపు నొప్పి వచ్చేముందు కనిపించే లక్షణాలు : ఇవి పార్శ్వపునొప్పి వచ్చే కొద్ది గంటలు లేదా నిమిషాల ముందు వస్తాయి. చికాకు, నీరసం, అలసట, నిరుత్సాహం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని రకాల తినుబండారాలు ఇష్టపడటం, వెలుతురు, శబ్దాలను తట్టుకోలేకపోవడం, కళ్లు మసకబారడం, కళ్ల ముందు మెరుపులు కనిపించడం జరగవచ్చు. వీటినే ‘ఆరా’ అంటారు. 2. పార్శ్వపునొప్పి సమయంలో కనిపించే లక్షణాలు : అతి తీవ్రమైన తలనొప్పి, తలలో ఒకవైపు వస్తుంటుంది. ఇది 4 నుంచి 72 గంటల పాటు ఉండవచ్చు. 3. పార్శ్వపు నొప్పి వచ్చాక కనిపించే లక్షణాలు : చికాకు ఎక్కువగా ఉండటం, నీరసంగా ఉం్డటం, వికారం, వాంతులు విరేచనాలు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స / నివారణ : కొన్ని అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి. మనకు ఏయే అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తున్నాయో జాగ్రత్తగా గమనించి, వాటికి దూరంగా ఉండటం ద్వారా మైగ్రేన్‌ను నివారించవచ్చు. అలాగే కాన్స్టిట్యూషన్ పద్ధతిలో ఇచ్చే ఉన్నత ప్రమాణాలతో కూడిన హోమియో చికిత్స ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ ఏడీహెచ్‌డీకి చికిత్స ఉందా? మా బాబు వయసు ఏడేళ్లు. ఒక చోట కుదురుగా ఉండడు. ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడతాడు. ఏకాగ్రత తక్కువ. దాదాపు ప్రతిరోజూ స్కూల్ నుంచి ఎవరో ఒక టీచర్ మావాడి ప్రవర్తన గురించి ఏదో ఒక కంప్లయింట్ చేస్తుంటారు. డాక్టర్‌కు చూసిస్తే ఒకరు ఏడీహెచ్‌డీ అన్నారు. హోమియోలో మా వాడి సమస్యకు ఏదైనా చికిత్స ఉందా? – కనకారావు, భీమవరం ఏడీహెచ్‌డీ అనేది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అనే వ్యాధి పేరుకు సంక్షిప్త రూపం. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే కూడా మీ బాబుకు అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివ్ డిజార్డర్ ( ఏడీహెచ్‌డీ) అనే సమస్యే ఉందనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 5 శాతం మంది పిల్లలు ఈ సమస్యతో బారిన పడుతుంటారు. కొంతమంది పిల్లల్లో వారు పెరుగుతున్న కొద్దీ సమస్య తగ్గుతుంది. ఏడీహెచ్‌డీ అనేది సాధారణంగా ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లల్లో వస్తుంది. ఏడీహెచ్‌డీతో బాధపడే పిల్లలు సాధారణ పిల్లల్లా ఉండరు. ఈ సమస్య ఉన్న పిల్లలకు సాధారణంగా ఏమీ గుర్తుండదు. సమస్యకు కారణాలు : ∙జన్యుపరమైన కారణాలు ∙తల్లిదండ్రులు ఎవరిలో ఒకరికి ఈ సమస్య ఉండటం ∙తక్కువ బరువుతో ఉండే పిల్లల్లోనూ, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల సమస్య రావచ్చు. లక్షణాలు : ∙మతిమరపు, తలనొప్పి ∙ఆందోళన, వికారం, నిద్రలేమి, చిరాకు ∙మానసిక స్థితి చక్కగా లేకపోవడం ∙ఒక చోట స్థితిమితంగా ఉండలేకపోవడం ∙ఇతరులను ఇబ్బంది పెట్టడం. నిర్ధారణ : రక్తపరీక్షలు, సీటీ స్కాన్, ఎమ్మారై చికిత్స : హోమియోలో ఏడీహెచ్‌డీ సమస్యకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి వ్యక్తమయ్యే తీరు, లక్షణాలను విశ్లేషించి మందులు ఇవ్వాలి. ఈ మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ సమస్యకు హోమియోలో స్ట్రామోనియమ్, చైనా, అకోనైట్, బెల్లడోనా, మెడోరినమ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏమిటి? నా వయసు 30 ఏళ్లు. వివాహమై నాలుగేళ్లు అయ్యింది. ఇంతవరకు సంతానం లేదు. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని వైద్య పరీక్షలు చేసి ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అని చెప్పారు. ఇన్ఫెర్టిలిటీ అంటే ఏమిటి? హోమియోలో ఈ సమస్యకు పరిష్కారం ఉందా? – ఎస్. మాధవి, ఇల్లందు సంతానలేమి సమస్య ఇటీవల చాలా మందిలో కనిపిస్తోంది. దీనికి అనేక అంశాలు కారణమవుతాయి. సమస్య మహిళల్లో లేదా పురుషుల్లో లేదా ఇద్దరిలోనూ ఉండవచ్చు. స్త్రీలలో సాధారణంగా కనిపించే కారణాలు : ∙జన్యుసంబంధిత లోపాలు ∙థైరాయిడ్ సమస్యలు ∙అండాశయంలో లోపాలు; నీటిబుడగలు ∙గర్భాశయంలో సమస్యలు ∙ఫెలోపియన్ ట్యూబ్స్‌లో వచ్చే సమస్యలు ∙డయాబెటిస్ ∙గర్భనిరోధక మాత్రలు అధికంగా వాడటం. పురుషుల్లో సాధారణంగా కనిపించే కారణాలు : ∙హార్మోన్ సంబంధిత సమస్యలు ∙థైరాయిడ్ ∙పొగతాగడం ∙శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం సంతానలేమిలో రకాలు : ∙ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ ∙సెకండరీ ఇన్ఫెర్టిలిటీ ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ : అసలు సంతానం కలగకపోవడాన్ని ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా జన్యుసంబంధిత లోపాలు, హార్మోన్ సంబంధిత లోపాల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. సెకండరీ ఇన్ఫెర్టిలిటీ : మొదటి సంతానం కలిగిన తర్వాత లేదా అబార్షన్ అయిన తర్వాత మళ్లీ సంతానం కలగకపోవడాన్ని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా గర్భాశయంలో ఏమైనా లోపాలు ఏర్పడటం, ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల సంభవిస్తుంది. గుర్తించడం ఎలా : తగిన వైద్య పరీక్షల ద్వారా సమస్యను నిర్ధారణ చేస్తారు. ముఖ్యంగా థైరాయిడ్ ప్రొఫైల్, సాల్ఫింజోగ్రఫీ, అల్ట్రాసోనోగ్రఫీ, ఫాలిక్యులార్ స్టడీ వంటి టెస్ట్‌లు చేస్తారు. చికిత్స: హోమియోలో ఎలాంటి సమస్యలకైనా కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. కారణాలు కనుగొని ఇన్ఫెర్టిలిటీకి కారణమైన లోపాలను చక్కదిద్దాలి, ఇలా సంతానం కలిగించేందుకు దోహదం చేసే మందులు ఉన్నాయి. వాటితో ఈ సమస్య చాలావరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
నెలసరి... సమస్యలిక సరి
మహిళల్లో క్రమ రహిత ఋతుచక్రం ఇప్పుడు సర్వసాధారణం. ఉండాల్సిన దానికన్నా తక్కువ బరువు ఉండడం, ఒబేసిటీ, అనెరెక్సియా (బరువు పెరుగుతామనే భయంతో తక్కువగా తినడం) మానసిక ఒత్తిడి, గర్భ నిరోధక మాత్రలు, హార్మోన్ల సమస్యలు, థైరాయిడ్, పిసిఒడి... వంటì వన్నీ కారణాలే. యోగలో దీనికి చక్కని పరిష్కారాలున్నాయి. ఋతుక్రమ సమస్య రజస్వల అయిన 5 సంవత్సరాల వరకూ, మెనోపాజ్‌కి 3 సంవత్సరాల ముందు ఎక్కువగా బాధిస్తుంటుంది. ఈ అవస్థ నుంచి బయటపడడానికి విటమిన్డి, కాల్షియం సప్లిమెంట్స్, సోయా, ఫ్లాక్స్ సీడ్ (అవిసెగింజలు) వాడడం, హెర్బల్ మెడిసిన్స్ వాడవచ్చు. వీటన్నింటికన్నా క్రమం తప్పని యోగ సాధన ఎంతైనా ఉపయుక్తం. నిలబడి చేసే ఆసనాల్లో తాలాసన, తాడాసన, త్రికోణాసన, పార్శ్వకోణాసన, కూర్చుని చేసే వాటిలో వక్రాసన, మరీచాసన, భరద్వాజాసన, ఉష్ట్రాసన, అర్ధ ఉష్ట్రాసన, అథోముఖ శ్వానాసన, బద్ధ కోణాసన, బోర్లాపడుకుని చేసే వాటిలో భుజంగాసన, ధనురాసన వంటివి ఉపకరిస్తాయి. వీటిని సాధన చేస్తే పునరుత్పత్తి వ్యవస్థ బాగా ప్రభావితమై సమస్య పరిష్కారమవుతుంది. 1 భరద్వాజాసనం కాళ్లు రెండూ ఎడమవైపు మడిచి శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ శరీరానికి కుడివైపు నేలమీద ఉంచి తలను, ఛాతీని, నడుమును, వెనుకకు పూర్తిగా తిప్పుతూ 2,3 సాధారణ శ్వాసల తర్వాత శ్వాస వదులుతూ తల, ఛాతీ మధ్యలోకి తీసుకురావలెను. ఇదే విధంగా వ్యతిరేక దిశలో చేయవలెను. ఈ ఆసనాన్ని 3 లేదా 5 సార్లు రిపీట్ చేయవచ్చు. 2 పరివృత్త పార్శ్వకోణాసనం సమస్థితిలో నిలబడాలి. కుడికాలు ముందుకి ఎడమ కాలు వెనుకకి (కాళ్ళ మధ్యలో 3 లేదా 4 అడుగుల దూరం) ఉంచాలి. కుడి మోకాలు ముందుకు వంచి ఎడమ కాలిని వెనుకకు బాగా స్ట్రెచ్ చేయాలి, నడుమును ట్విస్ట్ చేస్తూ ఛాతీని కుడివైపుకి తిప్పి, ఛాతీని తొడభాగానికి నొక్కుతూ ఎడమ ఆర్మ్పిట్ (చంకభాగం) కుడి మోకాలు మీదకు సపోర్టుగా ఉంచి వెనుకకు చూస్తూ రెండు చేతులు నమస్కార ముద్రలో ఉంచాలి. కొంచెం సౌకర్యంగా ఉండటానికి ఎడమ మడమను పైకి లేపి పాదాన్ని, కాలి వేళ్ళను ముందు వైపుకి తిప్పవచ్చు. 3 లేదా 5 శ్వాసలు తరువాత తిరిగి వెనుకకు వచ్చి ఇదే విధంగా రెండో వైపు కూడా చేయాలి. నమస్కార ముద్రలో చేతులు ఉంచలేని వాళ్లు ఎడమ అరచేతిని పూర్తిగా నేలమీద ఉంచి కుడిచేతిని కుడి చెవికి ఆనించి ముందుకు స్ట్రెచ్ చేస్తూ కుడి అరచేతిని చూసే ప్రయత్నం చేయవచ్చు. 3 అర్ధ ఉష్ట్రాసనం వజ్రాసనంలో... అంటే మోకాళ్లు మడిచి మడమలు పాదాల మీద (మోకాళ్లు రెండింటి మధ్య ఒక అడుగు దూరం ఉంటే సౌకర్యంగా ఉంటుంది) కూర్చోవాలి. అవసరం అయితే మడమల కింద ఒక దిండును ఉపయోగించండి. ఎడమ అరచేయి ఎడమ పాదం వెనుకగా భూమి మీద ఉంచి చేతిని నేలకు ప్రెస్ చేస్తూ సీట్ భాగాన్ని పైకి లేపుతూ కుడి చేయిని ముందు నుండి పైకి తీసుకు వెళ్లి శ్వాస తీసుకున్న స్థితిలో శరీరాన్ని విల్లులాగా వెనుకకు వంచుతూ పొట్టను ముందుకు నెట్టే ప్రయత్నం చేయాలి. (ఎడమ అరచేయి భూమిమీద సపోర్ట్‌గా ఉంచినట్టయితే వెన్నెముకకు డ్యామేజ్ జరగదు). శ్వాస వదులుతూ తిరిగి వజ్రాసనంలోకి రావాలి. అదే విధంగా రెండవవైపు కూడా చేయాలి. అనుభవం ఉన్న సాధకులు ఎడమ అరచేతిని ఎడమ పాదం మీద ఉంచి పొట్టను ముందుకు నెట్టే ప్రయత్నం చేయవచ్చు. 4 యోగ కాయ చికిత్స పైన చెప్పిన ఆసనాలతో పాటు యోగ కాయ చికిత్స కూడా మంచి ఫలితాన్నిçస్తుంది. న్యూరాన్ ట్రాన్స్మిషన్ చానెల్స్‌కి సంబంధించిన బయోఫీడ్ మెకానిజంతో పనిచేయడమే ఈ యోగ కాయ చికిత్స. ఈ చికిత్సను 21 లేదా 40 రోజులు గాని క్రమం తప్పకుండా చేస్తే పిసిఒడి సమస్య, పొట్టలో లేదా ఛాతీలో ఏర్పడిన గడ్డలు (ఫైబ్రాయిడ్స్) కరిగిపోతాయి. చేసే విధానం పొట్ట మీద గడియారం దిశలో కొంచెం మీడియం సైజ్ సర్కిల్లో మృదువుగా అరచేతితో మర్దన చేయాలి. పొత్తికడుపు కింది భాగం నుంచి పైకి బొడ్డు భాగం వరకూ అప్వార్డ్ దిశలో... బొడ్డు భాగం నుంచి పక్కలకు పై నుంచి కిందకు డయాగ్నల్‌గా రోజూ 20 నిమిషాల చొప్పున ఉదయం సాయంత్రం మర్దన చేయాలి. ప్రాణయామాలు, తేలికపాటి ఆసనాలు తప్ప పొట్ట మీద ఒత్తిడి కలిగించే ఆసనాలు పీరియడ్స్ టైమ్‌లో చేయకూడదు. 5 ధనురాసనం నేలపై బోర్లాపడుకుని మోకాళ్ళని వంచి చేతుల్ని వెనక్కి తీసుకెళ్ళి కాలి చీలమండల్ని పట్టుకోవాలి. నెమ్మదిగా శ్వాస తీసుకొని వదిలేస్తూ మోకాళ్ళని పైకెత్తుతూ రెండు కాళ్ళని, ఛాతీని పైకెత్తాలి. పొట్ట మాత్రమే నేలను తాకుతూ ఉంటుంది. శరీరం బరువు మొత్తం పొట్ట మీద ఉంటుంది. శరీరం ధనుస్సు మాదిరిగా ఉంటుంది. ముందు కాళ్ళను పైకెత్తుతూ, ఛాతీని పైకెత్తితే నడుము మీద ఒత్తిడి పడదు. కాళ్ళను పైకెత్తే క్రమంలో మోకా ళ్ళను ఎడంగా ఉంచాలి. అప్పుడు ఆసనంలోకి వెళ్ళటం తేలిక అవుతుంది. సాధ్యమైనంత సేపు ఆసనంలో ఉండి నెమ్మదిగా ఛాతీ నేలకు ఆనించి తర్వాత కాళ్ళను నేలకు ఆనించి నిదానంగా బయటకు రావాలి. - ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ – సమన్వయం: ఎస్. సత్యబాబు, ఫొటోలు: పోచంపల్లి మోహనాచారి