జపాన్ ఆరోగ్యమంత్రిత్వశాఖ ఇకపై దేశంలో డాక్టర్ చీటీ లేకుండానే గర్భనిరోధక మాత్రలు విక్రయించేందుకు అనుమతినిచ్చింది. అయితే ముందుగా వీటిని ట్రయల్ రూపంలో విక్రయించాలని నిర్ణయించింది. అత్యవసర గర్భనిరోధక మాత్రల విషయమై జపాన్‌లో చాలాకాలంగా చర్చ జరుగుతోంది.
ఇప్పటి వరకూ ఉన్న నియమం ఇదే..
జపాన్ ఆరోగ్యశాఖ తాజాగా అత్యవసర గర్భనిరోధక మాత్రలు ‘మార్నింగ్ ఆఫ్టర్ పిల్స్’ విక్రయాలకు అనుమతినిచ్చింది. ఇప్పటి వరకూ వీటిని కొనుగోలు చేయాలంటే పలు నిబంధనలు ఉన్నాయి. ఎవరైనా మహిళ, లేదా అత్యాచార బాధితురాలు ఈ మాత్రలను కొనుగోలు చేయాలంటే, తప్పనిసరిగా అందుకు సంబంధించిన డాక్టర్ చీటీ చూపించడం తప్పనిసరి.
ఆరేళ్ల క్రితం రాజుకున్న వివాదం
2017లో ఎటువంటి డాక్టర్ చీటీ లేకుండా గర్భనిరోధర మాత్రలు విక్రయించడంపై వివాదం చెలరేగింది. ఈ నేపధ్యంలో జపాన్ ప్రభుత్వం కొద్దిపాటి సడలింపుతో డాక్టర్ చీటీ లేకుండా వీటి విక్రయాలకు అనుమతినిచ్చింది. అయితే ‘మార్నింగ్ ఆఫ్టర్ పిల్స్’ మార్కెట్‌లో సులభంగా అందుబాటులో ఉంచడం తగినది కాదనే వాదన కొందరిలో మొదలయ్యింది. దీనివలన సమస్యలు పెరుగుతాయిని వారు పేర్కొన్నారు.
90వ దశాబ్ధంలో సులభంగా లభ్యం
90వ దశాబ్ధంలో జపాన్‌లో గర్భనిరోధక మాత్రలు డాక్టర్ చీటీ లేకుండానే విక్రయించేవారు. అయితే పలు పరిశోధనల్లో అత్యవసర గర్భనిరోధక మాత్రలతో ముప్పు పొంచి ఉన్నదని వెల్లడయ్యింది.
46 వేల మంది వినతి మేరకు..
2020 చివరిలో లింగసమానత్వానికి జాపాన్ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ నేపధ్యంలో మరోమారు అత్యవసర గర్భనిరోధక మాత్రల విక్రయాలపై తిరిగి వాదనలు మొదలయ్యాయి. తాజాగా వీటి విక్రయాలపై ప్రభుత్వానికి 46,312 మంది సలహాలు, సూచనలు అందించారు. వీరిలో చాలామంది గర్భనిరోధక మాత్రలను ట్రయల్ రూపంలో విక్రయించేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: పాపం పసివాడు:16 రోజులు కోమాలో ఉండి..
Comments
Please login to add a commentAdd a comment