allow
-
ఇకపై డాక్టర్ చీటీ లేకుండానే గర్భనిరోధక మాత్రలు.. ట్రైల్ సేల్స్‌కు అనుమతి!
జపాన్ ఆరోగ్యమంత్రిత్వశాఖ ఇకపై దేశంలో డాక్టర్ చీటీ లేకుండానే గర్భనిరోధక మాత్రలు విక్రయించేందుకు అనుమతినిచ్చింది. అయితే ముందుగా వీటిని ట్రయల్ రూపంలో విక్రయించాలని నిర్ణయించింది. అత్యవసర గర్భనిరోధక మాత్రల విషయమై జపాన్‌లో చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకూ ఉన్న నియమం ఇదే.. జపాన్ ఆరోగ్యశాఖ తాజాగా అత్యవసర గర్భనిరోధక మాత్రలు ‘మార్నింగ్ ఆఫ్టర్ పిల్స్’ విక్రయాలకు అనుమతినిచ్చింది. ఇప్పటి వరకూ వీటిని కొనుగోలు చేయాలంటే పలు నిబంధనలు ఉన్నాయి. ఎవరైనా మహిళ, లేదా అత్యాచార బాధితురాలు ఈ మాత్రలను కొనుగోలు చేయాలంటే, తప్పనిసరిగా అందుకు సంబంధించిన డాక్టర్ చీటీ చూపించడం తప్పనిసరి. ఆరేళ్ల క్రితం రాజుకున్న వివాదం 2017లో ఎటువంటి డాక్టర్ చీటీ లేకుండా గర్భనిరోధర మాత్రలు విక్రయించడంపై వివాదం చెలరేగింది. ఈ నేపధ్యంలో జపాన్ ప్రభుత్వం కొద్దిపాటి సడలింపుతో డాక్టర్ చీటీ లేకుండా వీటి విక్రయాలకు అనుమతినిచ్చింది. అయితే ‘మార్నింగ్ ఆఫ్టర్ పిల్స్’ మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంచడం తగినది కాదనే వాదన కొందరిలో మొదలయ్యింది. దీనివలన సమస్యలు పెరుగుతాయిని వారు పేర్కొన్నారు. 90వ దశాబ్ధంలో సులభంగా లభ్యం 90వ దశాబ్ధంలో జపాన్‌లో గర్భనిరోధక మాత్రలు డాక్టర్ చీటీ లేకుండానే విక్రయించేవారు. అయితే పలు పరిశోధనల్లో అత్యవసర గర్భనిరోధక మాత్రలతో ముప్పు పొంచి ఉన్నదని వెల్లడయ్యింది. 46 వేల మంది వినతి మేరకు.. 2020 చివరిలో లింగసమానత్వానికి జాపాన్ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ నేపధ్యంలో మరోమారు అత్యవసర గర్భనిరోధక మాత్రల విక్రయాలపై తిరిగి వాదనలు మొదలయ్యాయి. తాజాగా వీటి విక్రయాలపై ప్రభుత్వానికి 46,312 మంది సలహాలు, సూచనలు అందించారు. వీరిలో చాలామంది గర్భనిరోధక మాత్రలను ట్రయల్ రూపంలో విక్రయించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: పాపం పసివాడు:16 రోజులు కోమాలో ఉండి.. -
లోకల్లో అందరికీ అనుమతివ్వండి
సాక్షి, ముంబై: సామాన్యులను కూడా లోకల్ రైళ్లలో అనుమతివ్వాలని, లేదంటే ప్రయాణికుల ఆగ్రహం కట్టలు తెంచుకునే ప్రమాదముందని రైల్వే ప్రయాణికుల సంఘటన ప్రభుత్వాన్ని, రైల్వే అధికారులను హెచ్చరించింది. ఆ తరువాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రైవేటు కార్యాలయాలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, షాపుల్లో పనిచేసే ఉద్యోగులు, కూలీలు, కార్మికులు, చిరు ఉద్యోగులు, ఇతర రంగాల్లో పనిచేసే కష్టజీవులు విధులకు హాజరయ్యేందుకు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోకల్ రైళ్లలో సామాన్యులకు అనుమతి లేకపోవడం వల్ల ప్రజా రవాణ వ్యవస్థపై లేదా సొంత వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. విజ్ఞప్తులపై దాటవేత.. ప్రజా రవాణ వ్యవస్థను ఆశ్రయిస్తున్న చిరు ఉద్యోగులు, కార్మికులు, కూలీలు, కష్టజీవులకు ప్రతీరోజు రూ.100–150 చార్జీలు చెల్లించి విధులకు రావడం వీలుపడటం లేదు. అదేవిధంగా ఇందనం ధరలు పెరగడంతో ప్రైవేటు సంస్థల్లో పనిచేసే సామాన్య ఉద్యోగులు కూడా సొంత వాహనాల్లో రాకపోకలు సాగించడం ఆర్థిక పరంగా గిట్టుబాటు కావడం లేదు. దీంతో లోకల్ రైళ్లలో సామాన్యులందరికి అనుమతివ్వాలని ఇటు ప్రభుత్వానికి అటు రైల్వే పరిపాలనా విభాగానికి ప్రయాణికుల సంఘటన వినతి పత్రాలు అందజేసింది. అయినప్పటికీ ఇరు సంస్థల నుంచి స్పందన రాలేదు. దీంతో సామాన్య రైల్వే ప్రయాణికులు వచ్చే బీఎంసీ ఎన్నికల్లో ఓటు వేయవద్దని పిలుపునిస్తూ సంఘటన ద్వారా సోషల్ మీడియాలో సందేశాలు వైరల్ అయ్యాయి. అయినప్పటికీ స్పందన రాలేదు. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారిని అనుమతించాలని సంఘటన విజ్ఙప్తి చేసింది. అయినప్పటికీ ఇరు సంస్థలు నిర్లక్ష్యం చేశాయి. లోకల్ రైళ్లలో అనుమతించకపోవడం వల్ల చిరు ఉద్యోగులు, కార్మికులు, కష్టజీవులు, కూలీలు, ఇతర రంగాల్లో చేనిచేస్తూ పొట్ట నింపుకునే పేదలు తమ కుటుంబాన్ని పస్తులుంచాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ అనుమతించడానికి ప్రభుత్వం, రైల్వే ముందుకు రావడం లేదు. గణేశోత్సవాల తరువాతే సామాన్యులకు అనుమతించే విషయంపై ఆలోచిస్తామని ఇటీవల ప్రభుత్వం స్పష్టంచేసింది. దీంతో ప్రయాణికులు సంఘటన ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో చిరు ఉద్యోగులు, కార్మికులు, కూలీలు, కష్టజీవులు ఇటు లోకల్ రైళ్లలో అనుమతి లేక అటు ప్రజా రవాణ వ్యవస్థ ద్వారా, సొంత వాహనాల్లో కార్యాలయాలకు, వ్యాపార సంస్ధలకు, షాపులకు చేరుకోలేక గత సంవత్సరన్నర నుంచి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అతి తక్కువ చార్జీలు, వేగంగా రాకపోకలు సాగించాలంటే ముంబైకర్లకు లోకల్ రైళ్లు ఒక్కటే ప్రధాన రవాణ సాధనాలుగా ఉన్నాయి. లాక్‌డౌన్‌కు ముందు నిత్యం 75–80 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారంటే దీన్ని బట్టి లోకల్ రైళ్లకు ఏ స్థాయిలో డిమాండ్ ఉందో ఇట్టే అర్థమవుతోంది. ఇతర వాహనాల్లో విపరీతమైన రద్దీ.. లోకల్ రైళ్లలో సామాన్యులందరికి అనుమతినిస్తే రద్దీ పెరుగుతుంది. ఫలితంగా తగ్గుముఖం పడుతున్న కరోనా వైరస్ మళ్లీ పడగవిప్పే ప్రమాదముందని ప్రభుత్వం అంటుంది. ఒక్క పొంచి ఉన్న కరోనా మూడో వేవ్ ప్రమాదం, మరోపక్క రోజురోజుకు పెరుగుతున్న బ్లాక్ ఫంగస్, డేల్టా వేరియంట్ కేసులను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడే సామాన్యులందరికి లోకల్ రైళ్లలో అనుమతివ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. కానీ, ప్రైవేట్ వాహనాలు, ప్రజా రవాణ బస్సుల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. వీటివల్ల కరోనా, బ్లాక్ ఫంగస్, డేల్టా వేరియంట్ కేసులు పెరగవా..? కేవలం లోకల్ రైళ్లలో రద్దీ వల్ల కేసులు పెరుగుతాయా..? అంటూ ప్రయాణికుల సంఘటన నిలదీసింది. ఇప్పటికే సామాన్య ప్రజలు, నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. త్వరలో గణేశోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వీటన్నింటిని పరిగణంలోకి తీసుకుని దశల వారిగా అందరికి అనుమతివ్వాలని ప్రయాణికుల సంఘటన విజ్ఞప్తి చేసింది. లేని పక్షంలో ప్రజా ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని, ఆ తరువాత జరిగే పరిణామాలకు ప్రభుత్వం, రైల్వే పరిపాలన విభాగం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. -
రెండో టెస్టును కూడా ప్రత్యక్షంగా చూడొచ్చు
చెన్నై: ఇన్నాళ్లు కరోనా భయంతో క్రీడా కార్యక్రమాలన్నీ వాయిదా కావడం.. రద్దవడం జరిగింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడి పోటీలు మొదలవుతున్నాయి. అయితే క్రీడా పోటీలు ప్రారంభమైనా ప్రేక్షకులు చూసే అనుమతి లేకపోవడంతో ఇంట్లో కూర్చునే వీక్షించారు. తాజాగా ఇప్పుడు ప్రేక్షకులు నేరుగా చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్టుకు ప్రేక్షకులకు అనుమతినిస్తూ బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ సంఘం నిర్ణయం తీసుకున్నాయి. అయితే కేవలం 50 శాతం మందిని మాత్రమే స్టేడియంలోకి అనుమతించనున్నారు. ఇటీవల క్రీడా పోటీలకు మైదానాలు, స్టేడియాల్లో 50 శాతం మంది ప్రేక్షకులకు అనుమతినిస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించడానికి నిర్ణయం తీసుకున్నారు. భారత్, ఇంగ్లాండ్ మధ్య చెన్నై వేదికగా జరిగే రెండో టెస్టుకు 50శాతం ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించాలని బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) నిర్ణయం తీసుకున్నాయి. కొత్తగా కొవిడ్-19 మార్గదర్శకాలకు అనుగుణంగా స్టేడియంలోకి ఫ్యాన్స్‌ను అనుమతించే విషయంపై అసోసియేషన్ సభ్యులు బీసీసీఐ అధికారులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. దీంతోపాటు మ్యాచ్ కవరేజీకి మీడియా ప్రతినిధులను కూడా అనుమతించనున్నారు. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ నిర్ణయంపై తమిళనాడు క్రికెట్ సంఘానికి ఓ చెందిన ఓ ప్రతినిధి స్పందించి మీడియాతో మాట్లాడారు. 'క్రీడా వేదికల్లో ప్రేక్షకులను అనుమతించే విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను అనుసరించి రెండో టెస్టుకు ప్రేక్షకులను అనుమతించే అంశంపై చర్చించాం. తమిళనాడు ప్రభుత్వం కూడా ఆదివారం ఎస్ఓపీలు విడుదల చేసింది' అని తెలిపారు. ఫిబ్రవరి 13వ తేదీన ఎంఏ చిదంబరం స్టేడియంలో మొత్తం సామర్థ్యం 50,000 ఉండగా వారిలో 25 వేల మందిని అనుమతించనున్నారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ఫిబ్రవరి 5వ తేది నుంచి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. అయితే అహ్మదాబాద్‌లో జరగాల్సిన మూడు, నాలుగు టెస్టులకు ప్రేక్షకులను అనుమతిస్తామని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. -
ఇక అలాంటి సీన్లను కట్ చేయరంట!
న్యూఢిల్లీ: ఇక నుంచి సినిమాలకు కత్తెర గొడవ తప్పనుంది. అడల్ట్ కంటెంట్ కూడా అనుమతిచ్చేలా ప్రతిపాదించిన కొత్త సర్టిఫికేషన్, రేటింగ్ విధానానికి సెన్సార్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) ఓకే చెప్పింది. ఆయా కేటగిరీల్లోని చిత్రాలకు సర్టిఫికేషన్ ఇచ్చే విధానాన్ని పునఃపరిశీలించి కొత్త ప్రతిపాదనలు చేసేందుకు శ్యాంబెనగల్ కమిటీని వేయగా పలు అంశాలను ప్రతిపాదించింది. సీన్లను కత్తిరించడంగానీ, కొన్ని పదాలను నిషేధించడంగానీ చేయకుండా వాటికంటూ ప్రత్యేక సర్టిఫికెట్ ఇచ్చే విధానాన్ని బెనగల్ కమిటీ సెన్సార్ బోర్డుకు ప్రతిపాదించింది. గతంలో సినిమాల్లోని ముద్దుల సీన్ల విషయంలో, లైంగికపరమైన సన్నివేశాల విషయంలో కేంద్ర సెన్సార్ బోర్డుకు చిత్ర నిర్మాతలకు గొడవలు జరగుతుండేది. అలాంటి సన్నివేశాలకు కత్తెర వేయడమే కాకుండా ఆ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ అనే సర్టిఫికెట్ ఇచ్చేది. ఇది చిత్ర నిర్మాతలకు మింగుడుపడక ఘర్షణ పరిస్థితి నెలకొనేది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా శ్యాంబెనగల్ అధ్యక్షతన కమిటీ వేయగా కత్తెరకు అవకాశాలు ఇవ్వకుండా తాజాగా ప్రతిపాదనలు చేసింది. దీని ప్రకారం సినిమాల విడుదలకు ముందు ఇచ్చే సర్టిఫికెట్ విషయంలో కేంద్ర సెన్సార్ బోర్డు పని మరింత పరిమితం కానుంది. కాగా, బెనగల్ సూచించిన ప్రతిపాదనలు నేరుగా అమలుచేయడం సాధ్యం కాదు. వీటిని తొలుత సీబీఎఫ్సీ కేంద్ర సమాచార ప్రసారాల వ్యవహారాల శాఖకు పంపించనుంది. వాటిని పరిశీలించి అంగీకరించి సినిమాటోగ్రాఫ్ చట్టాన్ని/నిబంధనను సవరిస్తేగానీ ఈ కొత్త విధానం అమలులోకి వస్తుంది. కాగా, టీవీ చానెళ్లలో ఇలాంటి సినిమాలు ఎలా ప్రసారం చేయాలనే అంశంలో మాత్రం స్పష్టత రాలేదు. -
యుద్ధభూమిలో భార్యలకు అనుమతి
జైసల్మీర్: సైనికులకు శుభవార్త.. అలాగే, భావి భారత సైనికులకు కూడా తీపికబురు. తమతో తమ భార్యలు లేరే.. కుటుంబం దూరంగా ఉందే అనే బెంగకు త్వరలో ఉపశమనం కలగనుంది. కొత్తగా పెళ్లయిన సైనికుడికి ఏడాదిపాటు తన భార్యను తనతోటే ఉండే అవకాశం ఏర్పడనుంది. ఈ మేరకు భారత ఆర్మీ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. భారత సరిహద్దు దళం (బీఎస్ఎఫ్) ఇతర బలగాలు సరిహద్దుల్లో కుటుంబాన్ని వదిలేసి ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన వారయితే.. పెళ్లయిన కొద్ది రోజుల్లేనే ఉన్నపలంగా భార్యను వదిలిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది. సినిమాలో చూపించినట్లుగా వారి బాధ, మానసిక వ్యధ వర్ణానానీతం. ఈ నేపథ్యంలోనే కొత్తగా పెళ్లయిన సైనికుడిని యుద్ధ భూమిలోనే ఓ ఏడాదిపాటు తన భార్యతో ఉండే అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కేకే శర్మ రెండు రోజుల కిందట జవాన్లతో అయిన సమావేశంలో తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు బీఎస్ఎఫ్ రాజ్ ఫ్రాంటియర్ ఐజీ బీఆర్ మెఘ్వాల్ వెల్లడిస్తూ.. 'ఇది ఎంతో కాలంగా బయటకు వినిపించని డిమాండ్. అప్పుడే వివాహం చేసుకున్న సైనికుడు బాధ్యత రీత్యా ఉన్నపలంగా తన భార్యను వదిలేసి తిరిగి విధుల్లో చేరాల్సి ఉంటుంది. ఇది అతడి పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ నేపధ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. అది కూడా ప్రారంభ దశలో ఉంది. జవాన్లతోపాటు వారి భార్యలు ఏడాది ఉండొచ్చు. అందుకోసం వారికి కుటుంబ వాతావరణం ఉండేలా సరిహద్దులో నిర్మాణాలు కూడా చేపడతాం. అది కూడా పరిపాలక భవనం సమీపంలో చేపడతాం' అని ఆయన చెప్పారు. ఈ నిర్ణయం వల్ల కుటుంబానికి దూరంగా.. ఒంటరిగా ఉంటున్నామన్న భావనపోయి సైనికుడి సామర్థ్యం తప్పకుండా పెరుగుతుందని ఆయన చెప్పారు. -
ఇక ఆ ప్రకటనల్లో సెలబ్రిటీలు?
ముంబై: దేశంలో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను పెంచే ఉద్దేశంతో సెబీ కీలక నిర్ణయం తీసుకోనుంది. వివిధ రంగాల్లో ప్రముఖులతో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులపై ప్రకటనలకు అనుమతిచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో సినీ, క్రీడా రంగ సెలబ్రిటీలు ఆయా ప్రకటనల్లో కనువిందు చేయనున్నారు. అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ తదితర ఆయా రంగాల సెల్రబిటీలను మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల ప్రచార ప్రకటనల్లో వాడుకునే అవకాశం ఉంది. మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టిందని సెబీ ఉన్నతాధికారి తెలిపారు. సెలబ్రిటీ ఎండార్స్ మెంట్ల ద్వారా పెట్టుబడుల విస్తరణకు యోచిస్తోందని, అయితే, దీనికి వ్యక్తిగత సంస్థలకు అనుమతి లేదని తెలిపింది. సెబీ, మ్యూచువల్ ఫండ్ టాప్ ఎగ్జిక్యూటివ్ ల సమావేశంలో దీనిపై చర్చించినట్టు తెలిపారు. దీనికి సెబీ చైర్మన్ ఆమోదం కోసం పంపామన్నారు. మ్యూచువల్ ఫండ్ విస్తరణకు ఇది పెద్ద బూస్ట్ ఇచ్చే ఆలోచన అని పరిశ్రమ సీనియర్లు అంటున్నారు. ప్రకటనలకు సెబీ సమ్మతిస్తే, ఎంఎఫ్ఐ నోడల్ ఏజెన్సీ అవుతుందని టాప్ సెబీ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దీనికి సమకూరనున్న రూ 120-130 కోట్ల అదనపు కార్పస్ ఫండ్ లో కొంత భాగం ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ కు, మరో కొంత భాగం ఈ ప్రకటలనకు వినియోగించవచ్చన్నారు. కాగా ఆయా ప్రకటనదారులు తమ ప్రకటనల బడ్జెట్ లో ముఖ్యభాగాన్ని డిజిటల్ మీడియా లక్ష్యంగానే ఉంటోంది. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ప్రస్తుత ప్రకటన కోడ్ 2000 లో రూపొందించారు. అడపాదడపా కొన్ని మార్పులను చవి చూసింది. ఈ నేపథ్యంలో ఈ కోడ్ లో భారీ సవరణ కోసం పరిశ్రమ పెద్దలు ఎదురు చూస్తున్నారని విశ్లేషకులు భావన. -
కుక్కలు, పిల్లులే ఆహారమౌతున్నాయ్...!
సిరియా ప్రభుత్వ సైన్యాధికారంలో ఉన్న నగరాల్లోని ప్రజలు ఇప్పుడు ఆకలితో అల్లాడుతున్నారు. వేలాదిమంది పస్తులతో మరణిస్తున్నారు. కడుపు నింపుకొనేందుకు పిల్లులు, కుక్కలను తినాల్సిన స్థితికి చేరుకున్నారు. ఒకప్పుడు సిరియన్ల ప్రముఖ హాలీడే రిసార్ట్ గా ఉన్న మధ్య నగరం.. ఇప్పుడు బస్తర్ అల్ అసద్ ప్రభుత్వాధీనంలోకి వెళ్ళిపోయింది. ముట్టడిలో ఉన్న ఆ ప్రాంతంలోని జనం తిండి, నీళ్ళు, నిద్రా లేక అవస్థలు పడుతున్నారు. అయితే ఈ విషయంపై ప్రపంచ వ్యాప్తంగా మీడియా దృష్టి పెట్టడంతో సిరియన్ ప్రభుత్వం ఇప్పుడు వారికి సాయం అందించేందుకు ఆయా పట్టణాలకు అనుమతిస్తోంది. సిరియా ప్రభుత్వ ఆమోదాన్ని తాము స్వాగతిస్తున్నామని, రాబోయే రోజుల్లో మానవతా దృక్పధంతో అక్కడి వారికి సహాయం అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి చెప్పారు. అయితే చలికాలం కావడంతో 'మధ్య'లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఆకలి తట్టుకోలేక అక్కడివారు పిల్లులు, కుక్కలను తినేందుకు వెనుకాడటం లేదు. అందుకు ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన ఓ చిత్రం సాక్ష్యంగా నిలుస్తోంది. కొందరు ఆకులు తిని కడుపు నింపుకుంటున్నారు. ఆకలి తీరేందుకు చాలా కుటుంబాలు గడ్డి తిని నీరు తాగడం, లేదా సుగంధ ద్రవ్యాలు, జామ్ వంటి వాటిని ఆశ్రయిస్తున్నారు. నీరు నింపిన ప్లేట్ లో ఏదో పచ్చని పదార్థం కలిపి సేవిస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన మరో ఫోటో కూడ అక్కడి పరిస్థితిని కళ్ళకు కడుతోంది. బియ్యం కిలో 170 యూరోలు అమ్ముతుండటంతో అక్కడివారికి కొనలేని పరిస్థితి నెలకొంది. మధ్య ప్రాంతవాసుల దారుణ పరిస్తితి వారి కళ్ళలో చూశానని రెడ్ క్రాస్ ప్రతినిధి డైబర్ ఫాకర్ అంటున్నారు. ''మహిళలు తమకు తిండిలేక.. పిల్లలకు పాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఆకలిని తట్టుకోలేక రోజుకు ఇద్దరు ముగ్గురు చనిపోతున్నారు'' అని మధ్య ప్రాంతంలోని మెడికల్ కౌన్సిల్ మేనేజర్ చెప్తున్నారు. చనిపోయేవారిలో ఎక్కువగా పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉంటున్నారని ఆయన తెలిపారు. నీరసించి, చావుబతుకుల్లో ఉన్నవారిని ఆరోగ్య సిబ్బంది ఇరవై నాలుగు గంటలు కనిపెట్టుకొని ఉంటున్నారని, అయితే తమ సంస్థ మరి కొద్ది రోజుల్లో వీరికి సహాయం అందించేందుకు ప్రయత్నిస్తోందని చెప్తున్నారు. మధ్య నగరానికి అక్టోబర్ ప్రాంతంలో సుమారు ఇరవై లారీల వైద్య, ఆహార పదార్థాలను అనుమతించారు. అప్పటినుంచి పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. అయితే ఇటీవలి కొన్ని వారాల్లోనే ఆహారం లేక పదిమంది, ఆహారంకోసం ప్రయత్నిస్తుండగా ప్రభుత్వ బలగాల కాల్పుల్లో 13 మంది వరకూ చనిపోయారని బ్రిటన్ కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ హ్యూమన్ రైట్స్ చెప్తోంది. సిరియాలో యుద్ధం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా యునైటెడ్ నేషన్స్ పేర్కొంది. -
జల్లికట్టుపై రాజకీయాలు
-
ఆన్లైన్ మీడియాపై ఆంక్షలు సడలించిన చైనా
బీజింగ్: ఆన్లైన్ మీడియా వెబ్సైట్లపై ఉన్న తీవ్రమైన ఆంక్షలను చైనా కొంతవరకు సడలించింది. ఇప్పటివరకు చైనా ఆన్లైన్ న్యూస్ వెబ్సైట్లకు స్వతహాగా రిపోర్టింగ్, ఇంటర్వ్యూలను నిర్వహించుకునే అధికారం లేదు. తాజాగా ఈ నిబంధనలలో మార్పులు తీసుకొచ్చారు. సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా( సీఏసీ), స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్ సంస్థలు 14 మేజర్ న్యూస్ వెబ్సైట్లలో పనిచేసే 594 మంది రిపోర్టర్లకు శుక్రవారం అనుమతి కార్డులను జారీ చేశాయి. కానీ కొన్ని పరిమితమైన వెబ్సైట్లకు మాత్రమే ఈ అధికారాన్ని కల్పించి ప్రభుత్వం తన గుత్తాధిపత్యాన్ని నిలుపుకుంది. ఇక నుండి ఆన్లైన్ మీడియా రిపోర్టర్లు స్వతంత్రంగా తమ రిపోర్టింగ్ వ్యవహారాలను నిర్వహించుకోవచ్చని సీఏసీ స్పోక్స్ పర్సన్ జియాంగ్ జున్ తెలిపారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఆన్లైన్ మీడియాపై నియంత్రణ తొలగించాలనే డిమాండ్ తీవ్ర స్థాయిలో వెల్లువెత్తుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ తాజా నిర్ణయంతో గతంలో ఉన్నటువంటి సాంప్రదాయక మీడియా నుండి తీసుకున్న సమాచారాన్నే తర్జుమా చేసే విధానం మారబోతుంది. స్వతహాగా రిపోర్టింగ్ నిర్వహించుకునే వెసులుబాటు కలుగడంతో ఆన్లైన్ న్యూస్ మీడియాకు కొంత స్వేచ్ఛ లభించినట్లయింది. -
ఆ ప్రాజెక్టును మా వద్దే ఉంచండి
ఆదిలాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఆదిలాబాద్ జిల్లా నుంచి తరలించవద్దని ఉద్యమం ఉధృతం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు జన్మ స్థానమైన తుమ్ముడి హెట్టి వద్ద ధర్నా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్, జలసాధన సమితి రాష్ట్ర నాయకులు ధర్నా నిర్వహించారు. ఆదిలాబాద్ ప్రజల ఆశాదీపమైన ప్రాణహిత చేవెళ్లను వేరే చోటుకు తరలిస్తే ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. మున్మందు రోజుల్లో దీక్షను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.