బెంగళూరు: విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఉపాధ్యాయులు వారితో ఇష్టం వచ్చిన పనులు చేయిస్తున్నారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిందిపోయి పని పిల్లలుగా మార్చుతున్నారు. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురువులు.. విద్యార్థులతో టాయిలెట్స్ కడిగించారు.కర్ణాటకలోని శివమొగ్గలో విద్యార్ధులతోటి బలవంతంగా టాయిలెట్లను శుభ్రం చేయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో యూనిఫాం ధరించిన విద్యార్ధులు బ్రష్‌లు చేతబట్టి బాత్రూమ్‌లు శుభ్రం చేయడం కనిపిస్తుంది.
కాగా శివమొగ్గ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప సొంత జిల్లా. మంత్రి బుధశారం రాత్రి చిన్న రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అయితే ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలవ్వలేదు. ఇప్పటి వరకు ఆయన జిల్లాలో జరిగిన ఈ విషయంపై స్పందించలేదు. మరోవైపు ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఈ ఘటనపై విద్యాశాఖ అధికారి నివేదిక అందించారు. ఈ షాకింగ్ ఘటన గత వారం జరగ్గా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పాఠశాల హెడ్ మాస్టర్ వివరణ ఇస్తూ.. విద్యార్థులను కేవలం టాయిలెట్‌లో నీళ్లు సరిగా పోయమని మాత్రమే చెప్పానని, క్లీన్ చేయమని ఆదేశించలేదని చెప్పుకొచ్చారు. కాగా కర్ణాటకలో విద్యార్ధులు బాత్రూమ్‌లు కడగడం వంటి ఘటనలు వెలుగులోకి రావడం ఇది మూడోసారి.
గత వారం రాష్ట్ర రాజధాని బెంగళూరులోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా టాయిలెట్లను శుభ్రం చేస్తూ కనిపించారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, కార్యకర్తలు నగరంలోని ఆండ్రహళ్లి ప్రాంతంలోని పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. అనంతం విద్యాశాఖ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసింది. దీనిపై స్పందించిన మంత్రి విద్యార్థులు టాయిలెట్లు క్లీన్ చేయడంపై సీరియస్ అయ్యారు. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని పేర్కొన్నారు.
చదవండి: ‘వాళ్లు నేరస్తులు కాదు..’ ప్రభుత్వంపై బీజేపీ నేత ఫైర్
Shocker from Karnataka | Students found cleaning toilet in a school in Shivamogga pic.twitter.com/iZhe66gNRC
— NDTV (@ndtv) December 28, 2023
Comments
Please login to add a commentAdd a comment