
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పెరుగుతున్న వంట నూనెల ధరలను తగ్గించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రిఫైన్డ్ సోయాబీన్, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ నూనెలపై ఉన్న దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపు వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీని ద్వారా వంట నూనె ధరలు తగ్గనున్నాయి.
దేశీయ విపణిలో వంటనూనెల ధరలను తగ్గించేందుకు గతంలో తీసుకున్న చర్యలకు ఈ నిర్ణయం తోడ్పడనుందని శాఖ వెల్లడించింది. వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని చివరిసారిగా 2021 అక్టోబర్‌లో 32.5% నుంచి 17.5%కి తగ్గించింది.
చదవండి: ఎన్నికల్లో నామినేషన్ కోసం 22 కి.మీ పరిగెత్తాడు.. కారణం ఏంటంటే!