cooking oil
-
పొయ్యిపై సల.. సల..ఆరోగ్యాలు విల విల!
పుట్టపర్తికి చెందిన 30 ఏళ్ల మహిళ తిన్న ఆహారం జీర్ణం కాలేదని ఆస్పత్రిలో చేరింది. కడుపు నొప్పితో పాటు ఆకలి మందగించినట్లు డాక్టర్లకు తెలిపింది. పలు వైద్య పరీక్షల అనంతరం కల్తీ ఆహారం తినడం కారణంగానే ఆరోగ్య సమస్య తలెత్తినట్లు వైద్యులు నిర్ధారించారు. కల్తీ నూనె, మసాలా పదార్థాలు తినడం తగ్గించాలని డాక్టర్లు సూచించారని ఆమె తెలిపింది.పెనుకొండలో ఓ చిన్నారి పుట్టినరోజు సందర్భంగా ఐదు కుటుంబాలు విందులో పాల్గొనేందుకు హోటల్‌కు వెళ్లాయి. వాళ్లందరూ రకరకాల వంటకాలు తిన్నారు. చివరగా ఇంటికి చేరే సమయంలో దారిలో కనిపించిన స్ట్రీట్ ఫుడ్ కూడా రుచి చూశారు. ఎక్కడ తేడా కొట్టిందో తెలీదు. కానీ ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా ఫుడ్ పాయిజనింగ్‌గా తేల్చారు. సాక్షి, పుట్టపర్తి : నిత్యావసర సరుకుల ధరలతో పాటు వంటనూనె ధరలు విపరీతంగా పెరిగాయి. కానీ వాడకం మాత్రం తగ్గడంలేదు. మరోవైపు హోటళ్లలో తిండి ధరలు ఉన్నఫలంగా పెంచడం కుదరదు. దీంతో చాలా మంది కల్తీనూనె వాడటం మొదలుపెట్టారు. దీనికితోడు పొయ్యిపై నూనెను పదే పదే మరిగించేస్తున్నారు. ఫలితంగా తాజా నూనె అయినప్పటికీ మరిగించడంతో రుచి మారుతోంది. ఆ నూనెలో తయారు చేసిన పదార్థాలను తింటున్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇలాంటి ఘటనలు పట్టణ ప్రాంతాల్లో తరచూ వెలుగు చూస్తున్నాయి. రోడ్డు పక్కన తయారు చేసే ఆహార పదార్థాలు దుమ్ము, ధూళి రేణువులు చేరి అనారోగ్యానికి గురి చేస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. పట్టణాల్లోనే అధికం.. పల్లెలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే హోటళ్లు అధికం. అందులో రోడ్ల పక్కన చిన్న చిన్న హోటళ్లు, తోపుడు బండ్లు ప్రతి వంద మీటర్లకు ఒకటి కనిపిస్తాయి. ఇతర ప్రాంతాల నుంచి పలు పనులపై వచ్చే వాళ్లు గత్యంతరం లేక ఇక్కడే తినాల్సి వస్తోంది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రధాన కూడళ్లలోని హోటళ్లలో ఎక్కువ మంది ఆహార పదార్థాలను తింటుంటారు. అయితే నూనెను పదే పదే మరిగించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి దాకా.. మద్యం దుకాణాల సమీపంలోని చికెన్ కబాబ్ సెంటర్లలో ఎక్కువసార్లు మరిగించిన నూనెలో చేసిన పదార్థాలను తినడం కారణంగా మందుబాబులు అనారోగ్యం బారిన పడుతున్నారు. మద్యం కంటే కల్తీ నూనె పదార్థాలు ఎక్కువగా ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయనే విషయం మత్తులో గమనించలేకపోతున్నారు. మటన్, చికెన్, కోడిగుడ్ల వంటకాల్లో ఎక్కువగా కల్తీ జరుగుతున్నట్లు తెలిసింది. ప్రైవేటు మద్యం దుకాణాలు రావడంతో ఒక్కో దుకాణం వద్ద పదుల కొద్దీ చికెన్ కబాబ్ సెంటర్లు వెలిశాయి. ఒకసారి పొయ్యి పెట్టిన నూనె సాయంత్రం వరకూ కాగుతూనే ఉంటోంది. ఫలితంగా ఆ ఆహారాన్ని తీసుకునే వారు ఫుడ్ పాయిజన్‌తో పాటు వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అటకెక్కిన తనిఖీలు.. పదే పదే మరిగించిన నూనెలో వంటకాలు చేయడం.. ఆ పదార్థాలు తిన్న వారు అనారోగ్యం బారిన పడటం.. సైకిల్ చక్రంలా స్పష్టంగా కనిపిస్తోంది. అయినా ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు లేకపోవడంతోనే ఇదంతా జరుగుతోందన్న విమర్శలున్నాయి. ఫిర్యాదులు వస్తే కానీ తనిఖీలు చేయరని అంటున్నారు. మరి కొన్ని చోట్ల ఆర్నెల్లకు ఒకసారి కూడా తనిఖీలు చేయడం లేదని రికార్డులు చెబుతున్నాయి. పండుగ సమయంలో మాత్రమే అడపాదడపా తనిఖీలు చేసి చేతులు దులుపుకొంటున్నారు. నూనె డబ్బాల్లో ఎంతమేరకు కల్తీ ఉందనే విషయం ఎవరూ బయటపెట్టడంలేదు. కబేళాలకు తరలించే పశువుల ఎముకల పిండి కూడా నూనెలో కలిపేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. కల్తీ అని తేలితే కఠిన చర్యలు మా సిబ్బంది ఆధ్వర్యంలో నిత్యం తనిఖీలు జరుగుతున్నాయి. అయితే ఎక్కడ కల్తీ జరుగుతోందో పక్కా సమాచారం ఇస్తే.. తనిఖీ ముమ్మరం చేస్తాం. శ్యాంపిళ్లు తీసి ల్యాబ్‌కు పంపిస్తాం. కల్తీ చేసినట్లు నిర్ధారణ అయితే చర్యలు తప్పవు. ఇప్పటికే చాలా చోట్ల తనిఖీలు చేశాం. కల్తీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నాం. ప్రజలు బయట ఫుడ్ తినడం తగ్గిస్తే ఆరోగ్యం బాగుంటుంది. – రామచంద్ర, ఫుడ్ ఇన్స్పెక్టర్, పుట్టపర్తి ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి ఆహారం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఆహారంతోనే ఆరోగ్యం బాగుంటుంది. బయట ఎక్కడ పడితే అక్కడ హోటళ్లలో తింటే అనారోగ్యం బారిన పడటం ఖాయం. మసాలా, నూనె వంటలు తినడం తగ్గించాలి. నూనె వంటకాలతో కొవ్వు శాతం పెరగడంతో పాటు కల్తీ నూనె వంటకాలు తింటే వివిధ రోగాలు సోకే ప్రమాదం ఉంది. – డాక్టర్ మంజువాణి, డీఎంహెచ్ఓరోగాలు ఇలా.. ఒకసారి వాడిన వంటనూనెను మళ్లీ మళ్లీ వినియోగించడం వల్ల ఆరోగ్యానికి చేటు కలిగిస్తుంది. మోతాదుకు మించి మరిగిన నూనెలో టోటల్ పోలార్ కౌంట్ (టీపీసీ) 25 శాతానికి మించి శరీరానికి హానికరంగా మారుతుంది. అలాంటి నూనెతో ఆహార పదార్థాలు వండితే శరీరంలో అధికంగా ఫ్రీరాడికల్స్ పెరిగిపోతాయి. నూనె రంగు మారిపోతుంది. అడుగున నల్లటి పదార్థం తయారవుతుంది. ఆమ్లం అధికమవుతుంది. కొన్ని నూనెలలో నిల్వ ద్వారా విష పదార్థాలు కూడా ఏర్పడతాయి. స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్‌తో సహా చాలా వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. -
వంట నూనె ధరల మంటలు
-
వంట నూనెల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
-
Cooking Oil: ఏ నూనె ఆరోగ్యానికి మంచిది? వైద్యులు చెబుతున్నదిదే..
ఆయా ప్రాంతాల్లోని వాతావరణాన్ని అనుసరించి ఆయా నూనెలు వాడటం జరుగుతుంది. మార్కెట్లో సన్‌ఫ్లవర్ ఆయిల్, పామాయిల్, ఆలివ్ ఆయిల్ వంటి రకరకాల ఆయిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఆహార పదార్థాల రుచి కూడా నూనెపైనే ఆధారపడి ఉంటుంది. కొవ్వు గురించి భయపడి చాలామంది ఆహరంలో తక్కువ నూనె వాడకానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. నలభై ఏళ్లు దాటినవారు ఆయిల్ ఫుడ్‌కు చాలా దూరంగా ఉంటారు. ఇంతకీ ఏ నూనె ఆరోగ్యానికి మంచిది? రిఫైన్డ్ ఆయిల్స్ కంటే గానుగ నూనె బెటరా అంటే.. గానుగ నూనె చాలా పురాతన నూనె. ఎద్దులను ఉపయోగించి గానుగపట్టి నూనె గింజల నుంచి నూనె తీసే విధానం శతాబ్దాలుగా ప్రాచుర్యంలో ఉంది. కొన్నిదేశాల్లో గుర్రాలు, ఒంటెలను కూడా అందుకోసం ఉపయోగిస్తారు.గానుగలో తిప్పడం ద్వారా లభించే నూనెను 'కోల్డ్ ప్రెస్డ్' ఆయిల్ అంటారు. అంటే ఇక్కడ.. గానుగపట్టే సమయంలో ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది. నూనె గింజలను తక్కువ ఉష్ణోగ్రత వద్ద గానుగలో తిప్పడం వల్ల ఆ నూనెలో సహజ విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు వాటి అసలు రూపంలో ఉంటాయి. ఇవి నూనెను మరింత రుచికరంగా ఉంచుతాయి. ఆ కారణంగానే గానుగ నూనె శరీరానికి మేలు చేస్తుందని పలువురు వైద్యులు చెబుతున్నారు. కానీ, ఈ నూనె తయారీకి ఖర్చు ఎక్కువ. ఎందుకంటే, విత్తనాల నుంచి 30 - 40 శాతం నూనె మాత్రమే వస్తుంది, అందువల్ల వ్యర్థాలు ఎక్కువ. అయితే, ఎక్స్పెల్లర్ ప్రెస్డ్ ఆయిల్ మెషీన్ ద్వారా 80 నుంచి 90 శాతం నూనెను తీయవచ్చు. కానీ, మెషీన్ ద్వారా ఆయిల్ తీసే ప్రక్రియలో ఉష్ణోగ్రత స్థాయిలు 100 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండడం వల్ల నూనె సహజ స్వభావం మారుతుంది. ఆ తర్వాత వంట నూనె రిఫైనింగ్ (శుద్ధి) ప్రక్రియ జరుగుతుంది. మెత్తగా నూరిన విత్తనాల చూర్ణానికి హెక్సేన్ అనే రసాయనాన్ని కలుపుతారు. విత్తనాల నుంచి 100 శాతం నూనెను తీసేందుకు ఈ హెక్సేన్ ఉపయోగపడుతుంది. ఆ తర్వాతి దశలో నూనెతో కలిపిన హెక్సేన్‌ను వేరుచేస్తారు. అలా వచ్చిన నూనెను వివిధ రసాయనిక పద్ధతుల్లో రిఫైన్ చేస్తారు. చివరగా, నీళ్లలా శుద్ధంగా కనిపించే రుచీపచీ లేని నూనె వస్తుంది.గత కొన్నేళ్లుగా ఉపయోగిస్తున్న సన్‌ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్స్ హెక్సేన్ ఉపయోగించి రిఫైన్ చేసే నూనెలే. ఏది బెటర్ అంటే.. చివరిగా అన్ని రకాల నూనెల్లోనూ మంచి కొవ్వులు ఉంటాయి. అవి శరీరానికి అవసరం కూడా. అయితే మనం ఎంత నూనె తీసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. గుండె జబ్బులు, ఊబకాయం, బీపీ వంటి ఆరోగ్య సమస్యలుంటే నూనె తీసుకోవాల్సిన పరిమాణంలో మార్పులుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక నెయ్యితో పాటు ఆలివ్ ఆయిల్‌ను కొద్దిగా తీసుకోవచ్చు. వేయించడానికి రైస్ బ్రాన్ ఆయిల్, వేరుశనగ నూనెను వాడొచ్చు. కొబ్బరినూనె, పామాయిల్ వంటి వాటిని కొద్దిమొత్తంలో తీసుకోవచ్చు. అందువల్ల ఒకటే నూనె కాకుండా, అన్ని నూనెలను నిర్దిష్ట మొత్తంలో తీసుకోవడం మంచిది. నిజం చెప్పాలంటే ఒక వ్యక్తికి రోజుకు 15 మిల్లీలీటర్ల నూనె సరిపోతుంది. అంటే.. నెలకు సుమారు 450 నుంచి 500 మిల్లీలీటర్లు చాలు అని చెబుతున్నారు వైద్యులు. (చదవండి: మానవ మెదళ్లు పెద్దవి అవుతున్నాయ్! ఇక ఆ వ్యాధి..) -
164.7 లక్షల టన్నులకు పెరిగిన వంట నూనెల దిగుమతులు
న్యూఢిల్లీ: తాజాగా ముగిసిన సీజన్లో వంట నూనెల దిగుమతులు 16 శాతం అధికంగా నమోదయ్యాయి. అక్టోబర్‌తో ముగిసిన 2022–23 సీజన్లో 167.1 లక్షల టన్నుల వెజిటబుల్ నూనెల దిగుమతులు జరిగినట్టు సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్ట్రర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) ప్రకటించింది. దిగుమతులపై తక్కువ సుంకాలు వృద్ధికి దోహదం చేసినట్టు తెలిపింది. అంతకుముందు నూనెల సాగు సీజన్ 2021–22లో వెజిటబుల్ ఆయిల్ దిగుమతులు 144.1 లక్షల టన్నులుగా ఉన్నాయి. మొత్తం దిగుమతుల్లో 164.7 లక్షల టన్నులు వంట నూనెలు కాగా, ఇతర అవసరాలకు వినియోగించే (నాన్ ఎడిబుల్) నూనెల దిగుమతులు 2.4 లక్షల టన్నులుగా ఉన్నాయి. ‘‘2022–23 నూనెల సీజన్లో వంట నూనెల దిగుమతులు 164.7 లక్షల టన్నులకు పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 24.4 లక్షల టన్నులు పెరిగాయి. ముడి పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకం అతి తక్కువగా 5.5 శాతమే ఉండడం ఇందుకు కారణం. దీంతో దేశీయంగా నూనెల సరఫరా అవసరానికి మించి ఎక్కువగా ఉంది’’అని ఎస్ఈఏ తెలిపింది. దేశీయ పరిశ్రమపై ప్రభావం ‘‘మొత్తం పామాయిల్ దిగుమతుల్లో ఆర్బీడీ (రిఫైన్డ్, బ్లీచ్డ్, డియోడరైజ్డ్) పామోలీన్ ఆయిల్ దిగుమతులు 25 శాతంగా ఉన్నాయి. ఇది దేశీయ రిఫైనింగ్ పరిశ్రమను గణనీయంగా దెబ్బతీస్తోంది. స్థాపిత సామర్థ్యాన్ని దేశీయ రిఫైనింగ్ కంపెనీలు పూర్తిగా వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది’’అని ఎస్ఈఏ ఆందోళన వ్యక్తం చేసింది. 2022–23 సంవత్సరంలో వంట నూనెల దిగుమతుల విలువ రూ.1.38 లక్షల కోట్లుగా ఉంది. 2021–22లో ఇది రూ.1.57 లక్షల కోట్లు కాగా, 2020–21లో రూ.1.17 లక్షల కోట్లుగా ఉంది. నవంబర్ 1 నాటికి పోర్టుల్లో 33 లక్షల టన్నుల నూనెల నిల్వలు ఉన్నాయి. ఆర్బీడీ పామాయిల్ దిగుమతులు 2022–23 సీజన్లో 21.1 లక్షల టన్నులుగా ఉన్నాయి. అంతకుముందు సీజన్లో 18.4 లక్షల టన్నుల కంటే ఇది ఎక్కువ. క్రూడ్ పామాయిల్ దిగుమతులు 54.9 లక్షల టన్నుల నుంచి 75.9 లక్షల టన్నులకు చేరాయి. క్రూడ్ పామ్ కెర్నెల్ ఆయిల్ దిగుమతులు 94,148 టన్నులుగా ఉన్నాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు గత సీజన్‌కు 30 లక్షల టన్నులుగా ఉన్నాయి. అంతకుముందు సంవత్సరంలో 19.4 లక్షల టన్నులుగా ఉండడం గమనించొచ్చు. జూన్ 15 వరకు సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై పన్ను సున్నా స్థాయిలో ఉండడం కలిసొచ్చింది. దీని ఫలితంగా సోయాబీన్ ఆయిల్ దిగుమతులు 41.7 లక్షల టన్నుల నుంచి 36.8 లక్షల టన్నులకు పరిమితమయ్యాయి. -
అమ్మో ఫాస్ట్‌ఫుడ్! హైదరాబాద్‌లో కల్తీ పంది నూనె కలకలం.. కొవ్వు కొని..
సాక్షి, హైదరాబాద్: సిటీ లైఫ్‌లో ప్రజల దినచర్య బిజీబిజీగా గడుపుతుంటారు. కాలుష్య కోరల్లో ప్రయాణం, ఫాస్ట్ ఫాస్ట్‌గా పరిగెత్తుతూ ఫాస్ట్ పుడ్ సెంటర్లో ఆహారం తింటూ.. అలా బతుకు బండిని నడిపిస్తుంటారు. అయితే నగర కాలుష్యాన్ని మనం నియంత్రించడం అంత సులువు కాదు కాబట్టి, కనీసం మనం తినే ఆహారం విషయంలో నాణ్యత ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఇదిలా ఉండగా మరోవైపు ఆహార పదార్థాలే టార్గెట్‌గా కొన్ని ముఠాలు వ్యాపారాలు మొదలుపెట్టాయి. ఇటీవల నగరంలో కల్తీ అల్లంవెల్లుల్లీ పేస్ట్, ఐస్ క్రీమ్స్, సాస్, చాక్లెట్స్ బాగోతం బయటపడింది. అయితే, తాజాగా పంది కొవ్వుతో కల్తీ నూనెలు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు నేరెడ్మెట్ పోలీసులు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని నేరేడ్మెట్ పరిధిలోని ఆర్కేపురంలో ఓ వ్యక్తి తాను నివసిస్తున్న ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా పంది కొవ్వుతో వంట నూనెలు తయారు చేస్తున్నాడు. తొలుత పంది మాంసం విక్రయించే వారి నుంచి కొవ్వు తెచ్చుకుని.. వాటిని వేడి చేసి పలు రకాల కెమికల్స్ కలిపితే అచ్చం వంట నూనెలాగా కనిపించే ఆయిల్స్‌ను తయారు చేయడం.. వాటిని రోడ్డు పక్కన ఉండే ఫాస్ట్‌పుడ్ సెంటర్లకు తక్కువ ధరకు అమ్ముతున్నాడు. ఈ దందా గతకొంత కాలంగా నిర్వహిస్తున్నాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు అతని ఇంటిపై ఆకస్మిక సోదాలు నిర్వహించగా.. కల్తీ గుట్టు మొత్తం బట్టబయలైంది. దీంతో నిందితుడిని నేరెడ్మెట్ పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: IT Scam Hyderabad:హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ కుంభకోణం -
సామాన్యులకు ఊరట.. భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పెరుగుతున్న వంట నూనెల ధరలను తగ్గించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రిఫైన్డ్ సోయాబీన్, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ నూనెలపై ఉన్న దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపు వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీని ద్వారా వంట నూనె ధరలు తగ్గనున్నాయి. దేశీయ విపణిలో వంటనూనెల ధరలను తగ్గించేందుకు గతంలో తీసుకున్న చర్యలకు ఈ నిర్ణయం తోడ్పడనుందని శాఖ వెల్లడించింది. వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని చివరిసారిగా 2021 అక్టోబర్‌లో 32.5% నుంచి 17.5%కి తగ్గించింది. చదవండి: ఎన్నికల్లో నామినేషన్ కోసం 22 కి.మీ పరిగెత్తాడు.. కారణం ఏంటంటే! -
గుడ్ న్యూస్ చెప్పిన మోడీ భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు..!
-
బయో ఇంధనంగా వంట నూనెలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బయో ఇంధనాలకు డిమాండ్ పెరిగిపోయింది. దీని ఫలితంగా వంట నూనెలకు కొరత ఏర్పడుతోంది. ట్రక్కులు, విమానాలకు కూడా బయో ఫ్యూయల్స్ వాడకంపై దృష్టి సారించడంతో.. ఆహారమా/ఇంధనమా అన్న చర్చ మొదలైంది. అమెరికా, బ్రెజిల్, ఇండోనేషియా తదితర ప్రభుత్వాలు సోయాబీన్స్ లేదా కనోలా లేదా జంతు కొవ్వుల నుంచి తీసిన నూనెను ఇంధనాలకు వినియోగించడాన్ని ప్రోత్సహిస్తున్నాయి. సంప్రదాయ శిలాజ ఇంధనాలకు (పర్యావరణ కాలుష్యానికి దారితీసే) బదులు బయో ఇంధనాల వినియోగంతో కాలుష్యాన్ని తగ్గించుకోవాలన్న లక్ష్యంతో కొన్ని దేశాలు పనిచేస్తున్నాయి. దీంతో పామాయిల్ తదితర నూనెలకు డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్ చాలా అధికంగా ఉండడంతో వాడిన వంట నూనె, పామాయిల్ తయారీలో విడుదలయ్యే స్లడ్స్ అనే ఉత్పత్తి కోసం కంపెనీలు వేటను మొదలు పెట్టినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పామాయిల్ తయారీ పరిశ్రమల్లో విడుదలయ్యే స్లడ్స్ బయో ఇంధనాల తయారీకి ముడి పదార్థంగా వినియోగిస్తున్నారు. అవరోధాలు.. బయో ఇంధనాలకు ఏర్పడిన అనూహ్య డిమాండ్ తీరే సానుకూలతలు ప్రస్తుతం కనిపించడం లేదు. ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధం, తీవ్ర వాతావరణ పరిస్థితులు అనేవి నూనెల సరఫరాను పరిమితం చేస్తున్నాయి. అర్జెంటీనాలో తీవ్ర కరువుతో ఉత్పత్తిపై ప్రభావం పడింది. సోయాబీన్ ఆయిల్ ఉత్పత్తిలో ఈ దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండడం గమనించొచ్చు. ఇక యూరప్‌లో హానికారక రసాయాల వినియోగంపై నియంత్రణలు నెలకొన్నాయి. ఇది అక్కడ రేప్‌సీడ్ ఉత్పత్తిపై ప్రభావం పడేలా చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణతో పొద్దు తిరుగుడు నూనె ఉత్పత్తిపై ఒత్తిడి నెలకొంది. ఈ ప్రతికూలతల వల్ల వంట నూనెల తయారీ తగ్గొచ్చన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ ఏడాది ద్వితీయ భాగంలో అంతర్జాతీయ మార్కెట్లో బయో ఇంధనాలకు కొరత ఏర్పడుతుందని ఆయిల్ వరల్డ్ అనే సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ థామస్ మిల్కే తెలిపారు. వెజిటబుల్ నూనె మార్కెట్లో బయో ఇంధనాలు అధిక భాగాన్ని ఆక్రమిస్తున్నాయని.. ప్రపంచంలో డిమాండ్ కంటే సరఫరా తక్కువే ఉన్నట్టు చెప్పారు. అమెరికా, యూరప్, బ్రెజిల్, ఇండోనేషియా బయోడీజిల్, రెన్యువబుల్ డీజిల్, బయోజెట్ ఇంధనం వినియోగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అమెరికా అయితే సోయాబీన్ ఆయిల్, రేప్‌సీడ్ ఆయిల్, వాడిన వంట నూనె, జంతు కొవ్వులను వినియోగిస్తోంది. యూరప్‌లో వ్యర్థాలు, రేప్‌సీడ్ ఆయిల్‌ను వినియోగిస్తున్నారు. బ్రెజిల్ అయితే సోయాబీన్ ఆయిల్‌ను బయో ఇంధనాల తయారికి వాడుతోంది. పామాయిల్‌కు అనుకూలతలు.. బయో ఇంధనాలకు పెరుగుతున్న డిమాండ్‌తో పామాయిల్ ఉత్పత్తిదారులు, కంపెనీలు లాభపడనున్నాయి. అలాగే, ఇతర నూనె గింజలు, వెజిటబు ల్ నూనెల వినియోగం కూడా బయో ఇంధనాల తయారీలో పెరుగుతోంది. ఈ డిమాండ్ పామాయిల్‌కు కలిసొస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కానీ, డిమాండ్ పెరిగితే అప్పుడు పామాయిల్‌కు సైతం కొరత ఏర్పడే ప్రమాదం లేకపోలేదు. ఎందు కంటే ఇండోనేషియా, మలేషియా ప్రపంచ పామాయిల్ ఉత్పత్తిలో 85 శాతం వాటా ఆక్రమిస్తున్నా యి. కానీ ఈ దేశాల్లో ప్లాంటేషన్ నిదానంగా సాగడం, ఉన్న పంటల వయసు పెరిగిపోవడం, ఉత్పత్తి లేని చెట్ల సంఖ్య పెరగడం, అటవీ భూముల వినియోగంపై ఆంక్షలు విస్తరణకు అడ్డుగా ఉన్నాయి. బయో ఇంధనాలకు డిమాండ్ పెరిగిపోతే అది ముడి సరుకు సరఫరా కొరతకు దారితీయవచ్చని.. అదే జరిగితే అంతర్జాతీయంగా కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించాలన్న లక్ష్యాలకు విఘాతం కలుగుతుందని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ హెచ్చరించడం గమనార్హం. -
ఖమ్మంలో నూనె శుద్ధి కర్మాగారం
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆయిల్‌పామ్ సాగులో అతిపెద్దదైన గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ రూ.250 కోట్లతో ఖమ్మం జిల్లాలో వంట నూనెల శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 30 టీపీహెచ్ (టోటల్ పెట్రోలియం హైడ్రోకార్బన్) సామర్ధ్యంతో ఏర్పాటయ్యే ఈ ఫ్యాక్టరీని క్రమంగా 60 టీపీహెచ్‌లకు విస్తరిస్తారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా పామాయిల్‌ను శుద్ధి చేస్తారు. ఈ మేరకు గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ ఎండీ బలరామ్‌సింగ్ యాదవ్ గురువారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుతో భేటీ అయ్యారు. ఈ ఫ్యాక్టరీ 2025–26 నాటికి పూర్తి స్థాయిలో పనిచేస్తుందని, కో జనరేషన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధిస్తుందన్నారు. పది గోద్రెజ్ సమాధాన్ సెంటర్ల ద్వారా రైతులకు అందుబాటులో ఉంటుందని, ఇప్పటికే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సేవలు అందిస్తోందని చెప్పారు. శాటిలైట్, డ్రోన్ల ద్వారా సాగు విస్తీర్ణాన్ని పర్యవేక్షించడంతో పాటు వేర్వేరు యాప్‌ల ద్వారా రైతులకు సేవలు అందిస్తామన్నారు. ఈ యూనిట్ ఏర్పాటు ద్వారా 250 మందికి ప్రత్యక్షంగా, 500 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. వంట నూనెల దిగుమతిని తగ్గించేందుకు రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించడం ద్వారా పసుపు విప్లవం దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ భేటీలో ఎంపీ రంజిత్‌రెడ్డితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
వంట నూనెల దిగుమతులు పెరిగాయ్
న్యూఢిల్లీ: వంట నూనెల దిగుమతుల విలువ అక్టోబర్‌తో ముగిసిన సంవత్సరంలో రూ.1.57 లక్షల కోట్లకు చేరుకుంది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 34.18 శాతం అధికం కావడం గమనార్హం. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) ప్రకారం.. విదేశాల నుంచి భారత్‌కు దిగుమతి అయిన∙వంట నూనెల పరిమాణం 6.85 శాతం అధికమై 140.3 లక్షల టన్నులుగా ఉంది. 2020–21 నవంబర్–అక్టోబర్‌లో 131.3 లక్షల టన్నుల నూనెలు భారత్‌కు వచ్చి చేరాయి. వీటి విలువ రూ.1.17 లక్షల కోట్లు. 2021–22 నవంబర్–అక్టోబర్ కాలానికి పామ్ ఆయిల్ దిగుమతులు 4 లక్షల టన్నులు తగ్గి 79 లక్షల టన్నులుగా ఉంది. ధరల అధిక అస్థిరత ఈ తగ్గుదలకు కారణం. ఆర్బీడీ పామోలిన్ దాదాపు మూడింతలై 18.4 లక్షల టన్నులకు చేరింది. ముడి పామాయిల్ 20 శాతం క్షీణించి 59.94 లక్షల టన్నులు నమోదైంది. సాఫ్ట్ ఆయిల్స్ 48.12 లక్షల టన్నుల నుంచి 61.15 లక్షల టన్నులకు ఎగసింది. సాఫ్ట్ ఆయిల్స్‌లో సోయాబీన్ 28.66 లక్షల టన్నుల నుంచి 41.71 లక్షల టన్నులు, సన్‌ఫ్లవర్ స్వల్పంగా అధికమై 19.44 లక్షల టన్నులకు చేరింది. నవంబర్ 1 నాటికి దేశంలో 24.55 లక్షల టన్నుల వంట నూనెల నిల్వలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా నెలకు 19 లక్షల టన్నుల నూనె వినియోగం అవుతోంది. ముడి పామాయిల్, ఆర్బీడీ పామోలిన్ అధికంగా ఇండోనేషియా, మలేషియా నుంచి సరఫరా అవుతోంది. చదవండి: కేంద్రం భారీ షాక్: పది లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఏంటంటే.. -
కేంద్రం కీలక నిర్ణయం.. భారీగా తగ్గిన వంటనూనె ధరలు!
కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిత్యవసరాల సరుకుల ధర పెరగడంతో బెంబేలెత్తిపోతున్న ప్రజలకు కాస్త ఊరటరానుంది. దేశంలో కుకింగ్ ఆయిల్ రేట్లు (Cooking Oil) దిగివచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత కొన్ని నెలల్లో ఆహార చమురు ధరలు తగ్గుముఖం పట్టాయని, ప్రపంచ మార్కెట్ పరిస్థితులు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఈ తగ్గుదలకు కారణమని పేర్కొంది. ఇటీవల కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో ఎడిబుల్ ఆయిల్ ధరలు 200-300 డాలర్లు తగ్గాయి. దీని ప్రభావం భారత్‌లోని రిటైల్ మార్కెట్లో కూడా కనిపించడం ప్రారంభించిందని తెలిపింది. సామాన్యులకు రిలీఫ్.. ధరలు తగ్గాయ్! దేశవ్యాప్తంగా వీటిపై ఓ లుక్కేస్తే.. RBD పామోలిన్, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, వనస్పతి రిటైల్ ధరలు గత 6 నెలల్లో 26%, 9%, 12%, 9% 11% తగ్గాయి. గత మూడు నెలల్లో, శుద్ధి చేసిన సన్‌ఫ్లవర్ సగటు దేశీయ రిటైల్ ధరలు కిలోకు రూ.181 నుంచి రూ.170కి తగ్గింది. వనస్పతి ధరలు రూ.154 నుంచి రూ.146, రిఫైన్డ్ సోయాబీన్ రూ.157 రూ. 154 తగ్గింది. మహమ్మారి, సరఫరా కారణంగా పెరుగుతున్న వస్తువుల ధరలను అరికట్టడానికి దిగుమతి సుంకాలు, పప్పులపై సెస్ తగ్గింపు, సుంకాల హేతుబద్ధీకరణ, తినదగిన నూనెలు, నూనెగింజలపై స్టాక్ పరిమితులను విధించడం, బఫర్ స్టాక్ నిర్వహణ వంటి పలు నిర్ణయాల కారణంగా వంట నూనె ధరలు తగ్గాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఎడిబుల్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిన ఫలితంగా చమురు ధరలు తగ్గాయి. ప్రస్తుతం తగ్గించిన సుంకం పూర్తి ప్రయోజనాన్ని ప్రజలకు అందేలా చూడాలని పరిశ్రమలను కేంద్రం కోరింది. చదవండి: ఆ కంపెనీ భారీ ప్లాన్.. లీటర్‌కి 40 కి.మీ వరకు మైలేజ్‌తో నడిచే కార్లు వస్తున్నాయట! -
పండుగ తర్వాత షాకిచ్చిన కేంద్రం.. పెరగనున్న వంటనూనె ధరలు!
కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు షాకిచ్చింది. పామాయిల్ దిగుమతి సుంకాలను 6-11 శాతం పెంచనుంది. తాజాగా నోటిఫికేషన్ ద్వారా కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించింది. ఆయిల్‌పై (Oil) దిగుమతి సుంకాల పెంపు నిర్ణయం వల్ల వినియోగదారులపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కందుల గింజల ధరల కారణంగా అల్లాడుతున్న రైతులను ఆదుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నోటిఫికేషన్ ప్రకారం.. ముడి పామాయిల్ (CPO) దిగుమతి సుంకం టన్నుకు 858 డాలర్ల నుంచి 952డాలర్లకి పెరిగింది. అలాగే ఆర్బీడీ (RBD) పామాయిల్ దిగుమతి సుంకం టన్నుకు 905డాలర్ల నుంచి 962డాలర్లకు ఎగసింది. ఇతర పామ్ ఆయిల్ టారిఫ్ కూడా టన్నుకు 882 డాలర్ల నుంచి 957 డాలర్లకు పెరిగింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, ధరల నియంత్రణలో భాగంగా కేంద్రం ముడి పామాయిల్‌పై ప్రాథమిక దిగుమతి పన్నును రద్దు చేసింది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎడిబుల్ ఆయిల్స్, బంగారం, వెండి దిగుమతి ధరలను ప్రభుత్వం సవరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోని ఎక్కువగా ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న భారత్‌కు అధిక భాగం రష్యా, ఉక్రెయిన్, మలేషియా, ఇండోనేషియా నుంచి సరఫరా జరుగుతోంది. చదవండి: 45వేల ఉద్యోగులు కావాలి.. అంతా మహిళలే.. ఎక్కడంటే! -
వంట నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నారా? ఎంత డేంజరో తెలుసా..
పెదవాల్తేరు(విశాఖపట్నం): ఇంట్లోను, హోటళ్లలోను ఒకసారి వినియోగించిన వంట నూనెను పదేపదే ఉపయోగించడం పరిపాటి. కానీ అలా చేయడం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం చాలా మందికి తెలియదు. దీనిపై ఇప్పుడిప్పుడే అధికారులు కూడా అవగాహన కల్పిస్తున్నారు. వాడిన వంటనూనెతో తయారైన ఆహారం తీసుకోవడం ద్వారా గుండెజబ్బులు, లివర్ జబ్బులు, హైపర్‌టెన్షన్, అల్జీమర్ వంటి వ్యాధులు సోకుతాయని జిల్లా ఆహార భద్రత శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. చదవండి: మీకు తెలుసా?.. విద్యుత్ శాఖ నుంచి మెసేజ్‌లు రావు కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందిన ఎన్ఎస్ఆర్ ఇండస్ట్రీస్ ఒకసారి వాడిన వంట నూనెను కొనుగోలు చేస్తుంది. ఇప్పటికే విశాఖలోని పలు హోటళ్లలోను, గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్‌మెంట్లలోను వాడిన వంటనూనె సేకరణ కోసం డ్రమ్ములు కూడా ఏర్పాటు చేశారు. లీటర్ అయిల్‌కు రూ.30 వంతున చెల్లిస్తారు. అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, హోటల్ యజమానులు వాడిన వంటనూనె విక్రయాల కోసం సదరు సంస్థను సంప్రదించాలని ఆహార భద్రత శాఖ అధికారులు కోరుతున్నారు. ఈ నూనె సాయంతో బయోడీజిల్ తయారు చేస్తారు. ఫలితంగా పెరుగుతున్న చమురు ధరల నుంచి ఉపశమనం పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. వంట నూనె సేకరణ సంస్థ, ఎన్ఎస్ఆర్ ఇండస్ట్రీస్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 91605–14567 -
కేంద్రం కీలక నిర్ణయం.. తగ్గనున్న వంటనూనె ధరలు
న్యూఢిల్లీ: దేశంలో అధిక వినియోగంలో ఉన్న సన్‌ఫ్లవర్(పొద్దు తిరుగుడు) తోపాటు సోయాబీన్ ఆయిల్ ధరలు తగ్గించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. రాబోయే రెండేళ్ల కాలానికి ఈ దిగుమతులపై కస్టమ్ డ్యూటీ, అగ్రిసెస్‌ను మినహాయిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. అమాంతం పెరిగిన నూనె ధరలకు కళ్లెం వేయడంలో భాగంగానే వంట నూనెల దిగుమతిపై విధిస్తున్న కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం తొలగించింది. ప్రభుత్వ తాజా చర్యతో దేశీయంగా వంటనూనెల ధరలు రాబోయే రోజుల్లో తగ్గుముఖం పట్టనున్నాయి. ఏడాదికి 20 లక్షల మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు పువ్వు (సన్‌ఫ్లవర్) నూనె, మరో 20 లక్షల మెట్రిక్ టన్నుల సోయాబీన్ నూనెల దిగుమతిపై ఇప్పటి వరకు విధిస్తున్న కస్టమ్స్ సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్‌ను తొలగించింది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ముడి సోయాబీన్ నూనె, ముడి పొద్దుతిరుగుడు పువ్వు నూనెల దిగుమతికి ఈ మినహాయింపు వర్తిస్తుందని ఆర్థికశాఖ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. అయితే, దిగుమతుల కోటా కోసం ఈ నెల 27 నుంచి జూన్ 18లోపు ఆయా సంస్థలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఈ గడువు మించితే మాత్రం గతంలోని సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, దేశీయంగా పంచదార ధరలు పెరగకుండా చూసేందుకు ఎగుమతులకు పరిమితులు విధించింది. ప్రస్తుత సంవత్సరంలో చక్కెర ఎగుమతులను 10 మిలియన్ టన్నులకే ప్రభుత్వం పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 35 లక్షల టన్నుల ముడి సోయాబీన్ నూనె, 16-18 లక్షల టన్నుల ముడి సన్‌ఫ్లవర్ నూనెలను దిగుమతి చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. -
కీలక నిర్ణయం తీసుకున్న ఏషియన్ కంట్రీ.. కుకింగ్ ఆయిల్ ధరలు తగ్గేనా?
అదీఇదీ అని తేడా లేదు. సబ్బు బిళ్ల నుంచి బస్సు ఛార్జీల వరకు ఒకటా రెండా మూడా అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రోజుకో వస్తువు ధర పెరిగిందన్న వార్తలే వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో వంట నూనెల ధర కాస్త తగ్గవచ్చనే ఆశలు మిణుకుమిణుకుమంటున్నాయి. ఎగుమతులపై నిషేధం ప్రపంచంలోనే పామాయిల్ ఎగుమతుల్లో ఇండోనేషియా దేశం నంబర్ వన్ స్థానంలో ఉంది. అయితే దేశీయంగా పామాయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో పామాయిల్ ఎగుమతులను నిషేధిస్తున్నట్టు 2022 ఏప్రిల్ 28న అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇండోనేషియా నుంచి పామాయిల సరఫరా ఆగిపోతుందనే వార్తలతో వంట నూనె ధరలకు మరోసారి రెక్కలు వచ్చాయి. మే 23 నుంచి గత మూడు వారాలుగా పామాయిల్ ఎగుమతులపై నిషేధం కారణంగా ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చినట్టు ఇండోనేషియా ప్రభుత్వం గుర్తించింది. దీంతో 2022 మే 23 నుంచి తిరిగి ఎగుమతులకు అవకాశం ఇస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడో మే 19న ప్రకటించారు. ధర తగ్గడంతో నిషేధం విధించేప్పుడు టోకు మార్కెట్లో లీటరు పామాయిల్ ధర 19,800 రూపయల దగ్గర ఉంది. నిషేధం కారణంగా ఆక్కడ పామాయిల్ ధర దిగివచ్చి ప్రస్తుతం 17 వేల రూపాయల దగ్గర ట్రేడవుతోంది. అయితే ఆ దేశం పెట్టుకున్న టార్గెట్ మాత్రం లీటరు పామాయిల్ 14 వేల రూపాలయకు దిగిరావాలని, అయితే దేశీయంగా పామాయిల్ నిల్వలు సమృద్ధిగా ఉండటంతో పాటు స్థానిక వాణిజ్య రంగాల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ధర తగ్గేనా? ఇండోనేషియా నుంచి పామాయిల్ ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ రావడంతో దేశీయంగా కుకింగ్ ఆయిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇండోనేషియా నుంచి భారత్ భారీ ఎత్తున పామాయిల్ దిగుమతి చేసుకుంటుంది. ఇండోనేషియా నిషేధాన్ని సాకుగా చూపుతూ మిగిలిన అన్ని వంటి నూనెల ధరలు పెంచాయి వ్యాపార వర్గాలు. కానీ త్వరలో పామాయిల్ దిగుమతి అవడం వల్ల డిమాండ్ మీద ఒత్తిడి తగ్గి ధరలు అదుపలోకి వచ్చేందుకు ఆస్కారం ఉంది. చదవండి: ‘పామాయిల్’ సెగ తగ్గేదెలా! -
నూనెలు అధిక రేట్లకు విక్రయిస్తే కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిత్యావసరాలు, ముఖ్యంగా వంట నూనెలను నిర్దేశిత ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హెచ్చరించారు. వంటనూనెల ధరల నియంత్రణపై మంగళవారం సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. కృత్రిమ కొరత సృష్టించి వంట నూనెలను అధిక రేట్లకు విక్రయించినా, పరిమితికి మించి నిల్వలు ఉంచినా బైండోవర్ కేసులు నమో దు చేయాలని ఆదేశించారు. బ్లాక్ మార్కెట్ దందా పై నిరంతరం నిఘా ఉంచి, ఎప్పటికప్పుడు వ్యాపా ర దుకాణాలు, నూనె తయారీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రణాళిక ప్రకారం రైతుబజా రులు, మున్సిపల్ మార్కెట్లలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి, బయటి ధరల కంటే తక్కువకు వంటనూనెలను అందించాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా మండలాల వారీగా నూనె ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాల న్నారు. సోయాబీన్, రైస్ బ్రాన్ నూనెల వాడకాన్ని ప్రోత్సహించాలి పామ్ ఆయిల్ దిగుమతులపై ఆంక్షలున్న నేపథ్యంలో సోయాబీన్, రైస్ బ్రాన్ నూనెల వాడకం వైపు ప్రజలను ప్రోత్సహించాలని మంత్రి కారుమూరి సూచించారు. ఆ నూనెలను ఆయిల్ ఫెడ్ ద్వారా విక్రయించడంతో పాటు కనోల ఆయిల్ (ఆవనూనె) అందుబాటులో ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామన్నారు. పామ్ ఆయిల్ సాగును ప్రోత్సహించి, సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. బ్లాక్ మార్కెట్, కల్తీ నూనెల విషయంలో ఇప్పటి వరకు 76 కేసులు నమోదు చేశామని, 22,598 క్వింటాళ్ల నూనెలను జప్తు చేశామని మంత్రి వివరించారు. వీటిల్లో కేసులు పరిష్కరించిన బ్రాండ్లను తిరిగి మార్కెట్లోకి విడుదల చేసినట్టు చెప్పారు. సమీక్షలో పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీ వీరపాండియన్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ శంకబ్రత బాగ్చి, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి మధుసూదనరెడ్డి, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ కిశోర్‌కుమార్, రైతుబజార్ సీఈవో శ్రీనివాస రావు, ఏపీ ఆయిల్ ఫెడ్ ఎండీ బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
గెల.. గలగల!
దేవరపల్లి, రంగంపేట (తూర్పు గోదావరి): మెట్ట ప్రాంతంలో ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేస్తున్న పామాయిల్ రైతన్నలకు కాసులు కురిపిస్తోంది. రెండేళ్లలో పామాయిల్ గెలల ధర గరిష్ట స్థాయికి చేరడంతో సాగుదారులు మంచి ఆదాయం పొందుతున్నారు. ప్రస్తుతం టన్ను గెలల ధర రూ.21890 చొప్పున పలికి సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. జనవరిలో రూ.17,500 ఉన్న ధర మార్చిలో రూ.19,300కి చేరుకోగా తాజాగా మరింత పెరిగింది. యుద్ధం.. దిగుమతులు ఆగడంతో ఉక్రెయిన్ – రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా పామాయిల్ దిగుమతులకు ఆటంకం తలెత్తడంతో మార్కెట్లో వంటనూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. 2019లో టన్ను గెలల ధర రూ.ఆరు వేలు మాత్రమే ఉండగా 2020లో రూ.8,000 పలికింది. 2021లో రూ.10,000కి చేరుకుంది. ఈనెల 4వ తేదీన ఉద్యాన శాఖ కమిషనర్ డాక్టర్ ఎస్.ఎస్ శ్రీధర్ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రైతులకు ఏప్రిల్ నుంచి టన్ను పామాయిల్ గెలలకు రూ.21,890 చొప్పున చెల్లించాలి. ఈ మేరకు కాకినాడ జిల్లా పెద్దాపురంలోని రుచి సోయా పామాయిల్ కంపెనీతో పాటు మిగిలిన 12 కంపెనీలు కూడా ఇదే ధర చెల్లించాల్సి ఉంది. ఉభయ గోదావరిలో భారీగా సాగు కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజక వర్గాల పరిధిలో 55 వేల ఎకరాల్లో పామాయిల్ పంట సాగులో ఉంది. అనపర్తి, పెద్దాపురం, గండేపల్లిలోనూ సాగు చేపట్టారు. గత మూడు నెలల వ్యవధిలో ఆరు వేల ఎకరాల్లో కొత్తగా నాట్లు వేయడంతో ఉభయ గోదావరిలో సాగు విస్తీర్ణం 81 వేలకు పెరిగిపోయింది. జూన్, జూలైలో మరో ఐదు వేల ఎకరాల్లో నాట్లు వేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. పొగాకుకు ప్రత్యామ్నాయంగా పొగాకు పంట గిట్టుబాటు కాకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయంగా పామాయిల్ సాగు చేసి లాభాలు పొందుతున్నారు. పొగాకు భూముల్లో రెండేళ్లుగా రైతులు పామాయిల్ తోటలు వేస్తున్నారు. దాదాపు 8,000 ఎకరాల్లో ఈ తోటలు వేసినట్లు సమాచారం. పెట్టుబడి తక్కువ, ఆదాయం బాగుండటంతో వీటి సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఎకరాకు రూ.2.20 లక్షల ఆదాయం పామాయిల్ ఎకరాకు 10 టన్నుల గెలలు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం టన్ను గెలల ధర రూ.21,890 ఉండడంతో రూ.2.20 లక్షలు వరకు ఆదాయం వస్తుందని రైతులు తెలిపారు. అన్ని పంటల కంటే ఆయిల్ పామ్‌కు మంచి ధర లభిస్తోందని, మెట్ట రైతులను పామాయిల్ ఆదుకుందని ఆనందంగా చెబుతున్నారు. రైతులను ఆదుకుంది.. ఈ ఏడాది పొగాకు మినహా అన్ని పంటలకు మార్కెట్లో డిమాండ్ ఉంది. పామాయిల్ పంట రైతులను ఆదుకుంది. ఎకరాకు 10 టన్నుల దిగుబడి వస్తుంది. పెట్టుబడి ఎకరాకు రూ.30 వేలు అవుతుంది. సగటున ఎకరాకు రూ.1.70 లక్షల నికర ఆదాయం వస్తుంది. – నరహరిశెట్టి రాజేంద్రబాబు, డైరెక్టర్, రాష్ట్ర ఆయిల్‌పామ్ బోర్డు, యర్నగూడెం ఊహించని ధర ఇంత ధర ఊహించలేదు. పామాయిల్ తోటలు రైతులను ఆదుకుంటున్నాయి. 30 ఎకరాల్లో సాగు చేస్తున్నా. 300 టన్నుల దిగుబడి వచ్చింది. ఎకరాకు సగటున రూ.1.50 లక్షలు మిగులుతుంది. మార్కెట్లో ధర మరింత పెరిగే అవకాశ«ం ఉంది. – యాగంటి వెంకటేశ్వరరావు, రైతు, దేవరపల్లి లాభాల పంట ఆయిల్ పామ్ లాభాల పంట. రెండేళ్ల నుంచి మంచి ఆదాయం వస్తోంది. ఎకరాకు రూ.2 లక్షల ఆదాయం లభిస్తోంది. డ్రిప్ ద్వారా నీటితడులు, పశువుల ఎరువు వాడడం వల్ల దిగుబడులు పెరిగాయి. ఎకరాకు 10 నుంచి 11 టన్నుల దిగుబడి వస్తోంది. గత రెండు సంవత్సరాలు దిగుబడులు, రేటు ఆశాజనకంగా లేక లాభాలు తగ్గాయి. 11 ఎకరాల్లో తోట ఉంది. 112 టన్నులు దిగుబడి వచ్చింది. – పల్లి వెంకటరత్నారెడ్డి, రైతు, త్యాజంపూడి -
వంటనూనెతో నింగిలోకి..
వంట నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ... ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ విమానం జెట్‌ఇంధనంతోకాకుండా వంటనూనెతో నింగిలోకి ఎగిరింది. అది ఎప్పుడు ఎక్కడ టేకాఫ్ అయింది... ఇదెలా సాధ్యమనే ఆసక్తికర విషయాలేంటో తెలుసుకుందాం... –సాక్షి, సెంట్రల్ డెస్క్ సూపర్ జంబో విమానం ఎయిర్‌బస్ ఏ–380 వంటనూనెతో ఆకాశంలోకి ఎగిరి మూడు గంటలపాటు చక్కర్లు కొట్టింది. ఈ విమానం ఇటీవల ఫ్రాన్స్‌లోని టౌలూస్ బ్లాగ్నక్ విమానాశ్రయంలో వంటనూనెతో తయారుచేసిన సస్టెయినబుల్ విమాన ఇంధనాన్ని (ఎస్ఏఎఫ్) 27 టన్నుల వరకు నింపుకుని టేకాఫ్ అయింది. మూడు గంటల తర్వాత నైస్ విమానాశ్రయంలో విజయవంతంగా ల్యాండయింది. ఈ విమానం 100 శాతం ఎస్ఏఎఫ్తో నింగిలోకి ఎగరడం ఇదే తొలిసారి కావడం విశేషం. కొవ్వులు, ఇతర వ్యర్థాలతో.. హరిత, మునిసిపల్ వ్యర్థాలు,కొవ్వులతో తయార య్యే ఈ ఎస్ఏఎఫ్ ఇంధనం దాదాపు 80 శాతం కా ర్బన్‌డయాక్సైడ్‌ను తగ్గిస్తుంది. ఏవియేషన్ పరిశ్రమ 2050 నాటికల్లా కర్భన ఉద్గారాలను జీరో లక్ష్యంగా పెట్టుకోగా,యూకే ప్రభుత్వం 2030 నాటికి 10 శా తం ఎస్ఏఎఫ్ను వినియోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాదికాలంలో ఏ380తోపాటు మూడు విమానాలు 100 శాతం వంటనూనెతో నింగిలోకి ఎగిరాయి. 2021 మార్చిలో ఏ350, అక్టోబర్‌లో ఏ319నియో విమానాలు ఇలా ఎఫ్‌ఏఎఫ్‌తో చక్కర్లు కొట్టాయి. ధర ఐదు రెట్లు ఎక్కువ... సంప్రదాయ విమాన ఇంధనంతో పోలిస్తే ఈ హరిత జెట్ ఇంధనం ధర ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ ఇంధనాన్ని వాడితే విమాన టికెట్ల ధరలు కూడా ఎక్కువ అవుతాయని, అయితే ప్రభుత్వాలు సబ్సిడీలిచ్చి ఆదుకుంటే ధరలు పెంచాల్సిన అవసరం ఉండదని విశ్లేషకులు అంటున్నారు. 2030 నాటికి 13 హరిత విమాన ఇంధనం ప్లాంట్లను నెలకొల్పాలని యూకే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో ప్లాంట్‌కు సుమారు రూ.2,280 కోట్లు వ్యయమవుతుంది. ఎస్ఏఎఫ్ వినియోగం పెరిగిందంటే జీరో కర్భన ఉద్గారాల లక్ష్యానికి చేరువవుతున్నట్లే అని ఎయిర్‌బస్ సంస్థ పేర్కొంది. తమ విమానాలన్నింటిని 50శాతం ఎస్ఏఎఫ్–కిరోసిన్ మిశ్రమంతో నడిపేందుకు అనుమతి ఉందని చెప్పింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 200 బిలియన్ లీటర్ల విమాన ఇంధనం అవసరం అవుతుండగా, గత ఏడాది 10–12 కోట్ల లీటర్ల ఎస్ఏఎఫ్ మాత్రమే ఉత్పత్తి అయిందని అంతర్జాతీయ వైమానిక సంస్థ ఐఏటీఏ అంచనావేసింది. ఇది మొత్తం డిమాండ్‌లో 0.05 శాతం మాత్రమేనని చెప్పింది. శిలాజ ఇంధనాలతో పోలిస్తే ఇలాంటి జీవఇంధనాలతో కాలుష్యం తక్కువగా ఉంటుంది. అందుకే ఎస్ఏఎఫ్ వాడకాన్ని పెంచాలని వైమానిక సంస్థలు ప్రణాళికలు వేస్తున్నాయి. ఎలా మారుస్తారు? మనం వాడుతున్న వంటనూనెను అలాగే విమాన ఇంధనంగా వాడలేం. వాడిన వంటనూనెకు కొన్నిరకాల మిశ్రమాలు కలిపి కొంత ప్రాసెస్ చేసి జీవఇంధనంగా మారుస్తారు. జీఎఫ్ కమ్యూనికేషన్స్ సంస్థ ప్రకారం వాడిన ఆలివ్, కనోలా నూనెలు దీనికి బాగా పనికొస్తాయి. ఎందుకంటే అవి తాజా నూనె కన్నా కూడా బాగా చిక్కగా ఉంటాయి. విమాన ఇంధనంగా మార్చేందుకు ముందుగా వాడిన నూనెను వడబోసి అందులో ఉన్న వ్యర్థాలను తొలగిస్తారు. తర్వాత దాన్ని 70ఫారన్‌హీట్ వరకు వేడిచేస్తారు. తర్వాత కొంచెం ఆల్కహాల్, సోడియం క్లోరైడ్ తదితరాలను జతచేస్తారు. ఈ మిశ్రమంతో రెండు రకాల ఉత్పత్తులు అంటే మీథైల్ ఈస్టర్, గ్లిసరిన్ తయారవుతాయి. బయోడీజిల్ (జీవఇంధనం) రసాయన నామం మీథైల్ ఈస్టర్. గ్లిసరిన్ను సబ్బులతోపాటు చాలారకాల ఉత్పత్తుల తయారీకి వాడతారు. -
విజిలెన్స్ దాడుల్లో భారీగా పట్టుబడ్డ వంట నూనె
-
స్టాకు పాతదే ధర కొత్తది.. లీటరు ప్యాకెట్లో 650 మి.లీ నూనే! రూ.500 తేడా?
సాక్షి,భైంసాటౌన్(నిర్మల్): ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం సాకుతో కొన్ని వంటనూనెల ఉత్పత్తి సంస్థలు మన మార్కెట్లో ధరల మాయాజాలం ప్రదర్శిస్తున్నాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతిలో మన దేశం ఉక్రెయిన్, రష్యాపైనే ఆధారపడుతోంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితుల నేపథ్యంలో దిగుబడిపై ప్రభావం పడింది. ఇదే అదనుగా కొన్ని నూనెల ఉత్పత్తి సంస్థలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయి. రిటైలర్లు, డీలర్లకు స్టాక్ లేదని చెప్పి క్యాష్ చేసుకుంటున్నాయి. కొన్ని కంపెనీలయితే నేరుగా పాత స్టాకుపై ఉన్న ధరను చెరిపేసి, కొత్త ధర ముద్రించి మార్కెట్లోకి పంపుతున్నాయి. ఫలితంగా వినియోగదారులపై ప్రభావం చూపుతోంది. షార్ట్ వెయిట్‌తో మోసం... చాలా వరకు పేద, మధ్య తరగతి ప్రజలు, నిరక్షరాస్యులైన గ్రామీణులు ఎక్కువగా ద్వితీయ శ్రేణి వంటనూనెలనే వినియోగిస్తారు. తక్కువ ధరకే వస్తుండడం, ప్రముఖ బ్రాండ్లను పోలిన స్టిక్కర్లు ఉండడంతో నమ్మి మోసపోతుంటారు. ప్రముఖ బ్రాండ్ల నూనెలు ఖచ్చితమైన కొలతల్లో ఉంటాయి. ద్వితీయశ్రేణి నూనెలు మాత్రం 350 మి.లీ. నూనెను 500 మి.లీ పాకెట్లో, 650 మి.లీ.నూనెను లీటరు పాకెట్లో నింపి విక్రయిస్తారు. దీంతో తక్కువ ధర ఉందని చూసి, నిరక్షరాస్యులు మోసపోతున్నారు. రూ.200–500ల వరకు పెంచేస్తూ... జిల్లా మార్కెట్లో హోల్‌సేల్ వ్యాపారులు సన్‌ఫ్లవర్, పామాయిల్, ఇతర వంటనూనెలు ఎక్కువగా హైదరాబాద్, కామారెడ్డి ప్రాంతాల నుంచి తీసుకొస్తుంటారు. భైంసా మార్కెట్లో శనివారం ఓ హోల్‌సేల్ వ్యాపారి హైదరాబాద్ నుంచి ఓ కంపెనీకి చెందిన 15కిలోల వంటనూనె క్యాన్లను తెప్పించాడు. అయి తే ఆ క్యాన్లపై పాత ధర చెరిపేసి, కొత్త ధర రూ. 2899గా ముద్రించి పంపించారు. ఇలా ఒక్కో క్యా న్పై సుమారు రూ.200–500 వరకు పెంచి సరఫరా చేస్తున్నారు. అయితే వినియోగదారులు మాత్రం తానే ధర పెంచి విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్నారని వ్యాపారి వాపోయాడు. దీంతో వ్యాపారం దెబ్బతినే పరిస్థితి ఉందని చెబుతున్నాడు ఇతడు. తనిఖీలు చేపడితే ప్రయోజనం... యుద్ధం సాకుతో వంటనూనెల ధరలు ఇష్టానుసారం పెంచి పలు కంపెనీలు వినియోగదారులను మోసం చేస్తున్నాయి. ఈమేరకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేపట్టి స్టాకు కృత్రిమ కొరత సృష్టించి, ధరలు పెంచుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. ధరలు అమాంతం పెంచేశారు.. యుద్ధం సాకుతో పాత స్టాకుపై ధరలు చెరిపేసి, పెంచిన ధరలతో వంటనూనెలు అమ్ముతున్నరు. ఇలా చేయడం సరికాదు. పాత స్టాకును పాత ధరకే విక్రయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – అనుసూరి శ్రీనివాస్, భైంసా తనిఖీలు చేపడుతాం.. పాత స్టాక్ వంటనూనెల ధరలు పెంచి విక్రయిస్తే ఫిర్యాదు చేయాలి. అయితే అది పాత స్టాకేనా.. కాదా అనేది వారి బిల్లులు చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. తనిఖీలు జరిపి ఎవరైనా పాత స్టాకును రేటు పెంచి విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. – చిస్తేశ్వర్రావు,వాణిజ్యపన్నుల శాఖ జిల్లా అధికారి -
ధర మార్చి.. ఏమార్చి!
-
వంటనూనెల అక్రమ నిల్వలపై విజిలెన్స్ దాడులు
-
వంటింటిపై ‘బ్లాక్‘ పడగ!
-
వంట నూనెల సలసల.. 15 రోజుల్లో భారీగా పెరిగిన ధర, ఇలా అయితే కష్టమే!
మిర్యాలగూడ: నిత్యావసర ధరలు పెరగడంతో ఇప్పటిటే సామాన్యులు అల్లాడుతండగా.. మూలిగే నక్కపై తాటిపడ్డ చందంగా వంట నూనె ధరలు భగ్గుమంటున్నాయి. 15 రోజుల వ్యవధిలోనే ధరలు లీటరుపై రూ.30 నుంచి రూ.40 వరకు పెరిగాయి. దీంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి దిగుమతి అయ్యే సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతి కాకపోవడంతో పామాయిల్‌కు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రంలో పామాయిల్ వాడకం ఎక్కువ కావడంతో వీటి ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో వంటనూనెను కొనుగోలు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారస్తులే కావాలని కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తగ్గిన సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి వంట నూనె ధరల పెరుగుదలకు ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉక్రెయిన్‌లో 80 శాతం వరకు సన్‌ఫ్లవర్ సాగుచేస్తారు. రష్యాలో కూడా ఎక్కువ మొత్తంలో సాగవుతుంది. ఆ రెండు దేశాల నుంచి భారత్ సన్çఫ్లవర్ దిగుమతి చేసుకుంటుంది. భారత్ ఏటా 3లక్షల టన్నుల నూనెను దిగుమతి చేసుకోగా యుద్దం కారణంగా ప్రస్తుతం 1.40లక్షల టన్నులకు తగ్గింది. ఇండోనేషియా, మలేషియా నుంచి దిగుమ తి చేసుకునే పామాయిల్ వినియోగం పెరగడంతో పామాయిల్ ధర కూడా అమాంతం పెరిగింది. అంతేకాకుండా త్వరలోనే వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించారు ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని సాకుగా చూపించి వ్యాపారస్తులు కృత్రిమ కొరత సృష్టించి వంట నూనెల ధరలను విపరీతంగా పెంచుతున్నారు. అధి కారులు స్పందించి దుకాణాలపై దాడులు చేసి ధరలు పెంచి విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. – కోల ఉమాశ్రీ, మిర్యాలగూడ దిగుమతి అంతరాయంతోధరలు పెరిగాయి ఉక్రెయిన్, ఇండోనేషియా నుంచి వంట నూనెలు దిగుమతి అవుతాయి. దిగుమతి అంతరాయం వల్లే కంపెనీ నిర్వాహకులు ధరలు పెంచారు. స్టాక్ పెట్టేందుకు అవకాశం లేదు. వచ్చినది వచ్చినట్లుగానే వినియోగదారులకు అందించేందుకు నా వంతు కృషిచేస్తా. – చల్లా భాస్కర్, వంట నూనెల హోల్‌సేల్ డీలర్ -
నిత్యావసర సరుకులపై రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం
-
ఉక్రెయిన్ ఎఫెక్ట్..భారీగా పెరిగిన వంట నూనె ధరలు
-
పొద్దుతిరుగుడు పువ్వు నూనె కొండెక్కి కూచుంది!
సాక్షి, న్యూఢిల్లీ: మెజారిటీ మధ్య తరగతి ప్రజలు వంట నూనెగా వినియోగించే పొద్దుతిరుగుడు పువ్వు నూనె కొండెక్కి కూచుంది. గడిచిన ఏడెనిమిది మాసాల్లో వంట నూనెల ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర 70 శాతం వరకు పెరిగింది. ఉత్తరాదిన ఎక్కువగా వినియోగించి ఆవ నూనె, సోయాబీన్ నూనె ధరలు 50 శాతం వరకు, రైస్‌బ్రాన్ ఆయిల్ ధర 50 శాతం వరకు, పామాయిల్ ధర 55 శాతం వరకు పెరిగాయి. ఏడాది క్రితం కిలో సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ. 100 లకు లభించగా, ఇదే నూనె మార్చి 1 నాటికి కిలో ధర రూ. 150కి అటుఇటుగా ఉంది. తాజాగా ఈ నెల రోజుల్లో మరో పది శాతం పెరిగి రూ. 170కి చేరింది. మార్చి 28న ముంబై, భువనేశ్వర్ ప్రాంతాల్లో గరిష్టంగా కిలోకు రూ. 185 గా ఉంది. వేరుశనగ నూనె గరిష్టంగా తిరునల్వేలిలో కిలో ధర రూ. 194గా ఉంది. ఆవ నూనె గరిష్టంగా తిరుపతిలో కిలో ధర రూ. 200గా ఉంది. వనస్పతి గరిష్టంగా దర్బంగాలో కిలో రూ. 150గా ఉంది. ఇక పామాయిల్ గరిష్టంగా భువనేశ్వర్‌లో రూ. 143గా ఉంది. దిగుమతులపైనే ఆధారం.. మన దేశం పెట్రో ఉత్పత్తుల తరహాలోనే వంట నూనెల విషయంలో దిగుమతులపై ఆధారపడి ఉంది. దేశానికి అసవరమయ్యే వంట నూనెల్లో దాదాపు 60 శాతానికి పైగా దిగుమతుల ద్వారా సమకూర్చకుంటోంది. 2015–16 సంవత్సరం నుంచి వరుసగా 14.85 మిలియన్ మెట్రిక్ టన్నులు, 15.32, 14.59, 15.57, 13.34 మిలియన్ మెట్రిక్ టన్నుల మేర వంట నూనెలు దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా 2015–16 నుంచి ఇప్పటివరకు వరుసగా 8.63 మిలియన్ మెట్రిక్ టన్నులు, 10.09, 10.38, 10.35, 10.65 మిలియన్ మెట్రిక్ టన్నుల మేర వంట నూనెల లభ్యత ఉంది. 2019–20లో సోయాబీన్ ఆయిల్ 3.38 మిలియన్ టన్నుల మేర దిగుమతి చేసుకుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ 2.52 మిలియన్ టన్నుల మేర దిగుమతి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వంట నూనెల నిల్వలు తగ్గి సరఫరా తగ్గడంతో వీటి ధరలు అమాంతం పెరుగుతూ వచ్చాయి. ధరల పెరుగుదల దెబ్బకు వంట నూనెల దిగుమతి తగ్గింది. అంతకుముందు ఏడాది ఫిబ్రవరిలో 10,89,661 టన్నుల వంట నూనెలను దిగుమతి చేసుకోగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో 7,96,568 టన్నుల వంట నూనెలు దిగుమతి అయ్యింది. నవంబరు 2020 నుంచి ఫిబ్రవరి 2021 మధ్యకాలంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ 7,70,364 టన్నులు దిగు మతి అయింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 9,89,565 టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అయ్యింది. దిగుమతులు తగ్గి సరఫరా తగ్గడంతో మన దేశంలో వాటి ధర మరింత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తుల తగ్గుముఖం ఉక్రెయిన్, రష్యా దేశాల్లో పొద్దు తిరుగుడు పంట ఉత్పత్తి భారీగా తగ్గడంతో ఈ వంట నూనెల ధరలపై ప్రభావం పడింది. మలేషియా, ఇండోనేషియా దేశాల్లో పామాయిల్ ఉత్పత్తి భారీగా తగ్గింది. కూలీల కొరత వల్ల ఈ సమస్య ఏర్పడింది. అర్జెంటీనా నుంచి సోయాబీన్ ఆయిల్‌ను భారత్ దిగుమతి చేసుకుంటుంది. అర్జెంటీనా, బ్రెజిల్ తదితర దేశాలు ఎల్‌నినో కారణంగా తీవ్రమైన కరువు పరిస్థితులను ఎదుర్కొన్నాయి. అర్జెంటీనా ఓడ రేవుల్లో సమ్మె నడవడంతో అక్కడి నుంచి కొద్ది రోజులపాటు ఎగుమతులకు ఆటంకం కలిగింది. ఈ కారణాలన్నీ వంట నూనెల పెరుగదలకు దారితీశాయి. ఈ పరిస్థితులన్నీ చక్కబడితే మార్చి, ఏప్రిల్ మాసాల వరకు వంట నూనెల ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుదని పరిశ్రమ వర్గాలు గతంలో అంచనా వేశాయి. కానీ మార్చి మాసంలో మరో 10 శాతం ధరలు పెరగడంతో నూనెల ధరల్లో పూర్వ స్థితి చేరుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. సన్‌ఫ్లవర్, సోయాబీన్ వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటడంతో పామాయిల్‌ను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దిగుమతి సుంకం తగ్గాల్సిందేనా? గత నవంబరు 27న కేంద్ర ప్రభుత్వం క్రూడ్ పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 37.5 శాతం నుంచి 27.5 శాతానికి తగ్గించింది. క్రూడ్ పామాయిల్‌పై 2013 జనవరి 23న 2.5 శాతంగా ఉన్న దిగుమతి సుంకం.. 24.12.2014న 7.5 శాతానికి పెరిగింది. 11.08.2017న 15 శాతంగా ఉంది. 17.11.2017న 30 శాతానికి పెరిగింది. మార్చి 1, 2018న ఇది 44 శాతానికి పెరిగింది. 01.01.2019న 40 శాతంగా, 01.01.2020న 37.5 శాతంగా, 27.11.2020న 27.5 శాతంగా ఉంది. ఇక రిఫైండ్ సన్‌ఫ్లవర్ నూనెపై 17.03.2012న 7.5 శాతం దిగుమతి సుంకం ఉండగా.. 20.01.14న 10 శాతంగా, 24.12.2014న 15 శాతంగా, 17.09.2015న 20 శాతంగా, 14.06.18న 45 శాతంగా ఉంది. దేశంలో రైతులు పండించే నూనె గింజల ఉత్పత్తులకు మద్దతు ధర లభించేందుకు వీలుగా దిగుమతి సుంకం విధిస్తున్నప్పటికీ.. ధరల పెరిగిన సందర్భంలో తగిన రీతిలో సడలింపులు లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ చదవండి: COVID-19: అక్టోబర్ 11 తర్వాత మళ్లీ... భవిష్యత్తులో భారత్ మంచి మార్కెట్ కానుంది: కేఎఫ్‌సీ -
బడ్జెట్ 2021: మందుబాబులకు షాక్..!
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రతి ఒక్కరిని కలవరపెడుతున్న అంశం సెస్. ఇక మీదట క్రూడ్ ఆయిల్, ఆల్కహాల్, ముడి ఆయిల్, కొన్ని దిగుమతి చేసుకునే వస్తువులపై వ్యవసాయ, మౌలికసదుపాయల అభివృద్ధి సెస్‌ని విధించేందుకు కేంద్రం సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో ఆల్కాహాల్, క్రూడ్ ఆయిల్, పామయిల్, వంట నూనెల ధరలు భారీగా పెరగనున్నాయి. ఆల్కాహాల్ బివరేజేస్‌పై కేంద్రం 100 శాతం సెస్‌ని ప్రతిపాదించింది. దాంతో మందు బాబుల కళ్లు బైర్లు కమ్మెలా మద్యం ధరలు మరింత పెరగనున్నాయి. ముడి పామాయిల్‌పై 17.5 శాతం, దిగుమతి చేసుకున్న యాపిల్స్‌పై 35 శాతం, ముడి సోయాబీన్, సన్ ఫ్లవర్ నూనెలపై 20శాతం వ్యవసాయ సెస్‌ని బడ్జెట్లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. (చదవండి: ఇంధన ధరల మంట.. నిర్మల వివరణ) ఫలితంగా వంట నూనెలు ధరలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే వంట నూనెలు లీటర్ 140 రూపాయలుగా ఉండగా.. వ్యవసాయ సెస్ అమల్లోకి వస్తే.. ఇది మరింత పెరగనుంది. ఇక పెట్రోల్, డీజిల్‌పై విధించిన వ్యవసాయ సెస్‌ని సుంకం నుంచి మినహాయిస్తామని.. ఫలితంగా వాటి ధరలు యథాతధంగా ఉంటాయిన నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఫార్చ్యూన్ కొంపముంచిన గంగూలీ ‘గుండెపోటు’
సాక్షి, ముంబై: ప్రస్తుత టెక్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తమకు నచ్చని అంశంపైన మాత్రమే గాకుండా, కొన్నిసునిశితమైన అంశాలను కూడా నెటిజన్లు పట్టేస్తారు. తాజాగా వినియోగదారులను బుట్టలో పడేసే వ్యాపార ప్రకటనలపై కూడా స్పందించడమే కాదు ట్రోలింగ్‌తో ట్రెండ్ క్రియేట్ చేశారు. వ్యంగ్య బాణాలు, మీమ్స్‌తో తన అభిప్రాయాలను వెల్లడించారు. జనవరి 3 న తేలికపాటి గుండెపోటుకు గురైన తరువాత భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఎండార్స్ చేసిన ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ వంట నూనె ప్రకటనపై యూజర్లు భారీగా ట్రోల్ చేశారు. ఇది నిజంగా హెల్దీ అయిలేనా? అంటూ.. ఇప్పటికైనా తెలిసిందా దాదా.. గెట్ వెల్ సూన్ అంటూ.. గంగూలీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ ఆయిల్ యాడ్ క్యాంపెయిన్‌పై సోషల్ మీడియా యూజర్లు విమర్శలు గుప్పించారు. క్రీడాకారుడైన గంగూలీ రోజూ వ్యాయామం చేస్తారు. ఫిట్‌గా ఉంటారు...అయినా గుండెపోటుకు గురయ్యారు. గంగూలీ యాడ్‌లో చెప్పినట్టుగా ఆ ఆయిల్ నిజంగా ఆరోగ్యమేనా అని ఒకరు ప్రశ్నించారు. ఒత్తిడే ప్రధాన కారణం కావచ్చు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా భారత మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ కూడా "దాదా త్వరగా కోలుకోవాలి. ఎపుడూ పరీక్షించిన, ప్రయత్నించిన ఉత్పత్తులను మాత్రమే ప్రోత్సహించాలి. జాగ్రత్తగా ఉండాలి.. గాడ్ బ్లెస్’’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు: దీంతో గంగూలీ నటించిన సదరు ప్రకటనను అన్ని ప్లాట్‌ఫాంనుంచి తొలగించడం గమనార్హం. ‘దాదా బోలే వెల్కం టూ ది ఫార్టీస్’ అనే ట్యాగ్‌లైన్‌తో ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ వంట నూనె యాడ్ వస్తుంది. ఈ ప్రకటన ఏప్రిల్ 2020 నుండి దేశవ్యాప్తంగా లాక్డౌన్ సమయం నుంచి వివిధ ఛానళ్ల సమయంలో ప్లే అవుతోంది. అంటే 40ల ఏళ్ల వయసులో కూడా తమ నూనె గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది అనేది ఈ ప్రకటన సారాంశం. అయితే తాజాగా గంగూలీకి గుండెపోటు రావడం, గుండెలో రెండు బ్లాక్ ఉన్నాయని తేలడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ఈ నూనె ప్రామాణికతపై విమర్శలు గుప్పించారు. అయితే ఈ వివాదాన్ని పరిశీలిస్తున్నామని, బ్రాండ్ క్రియేటివ్ ఫార్చ్యూన్ క్రియేటివ్ ఏజెన్సీ ఓగిల్వి & మాథర్ ప్రతినిధి తెలిపారు. అటు కస్టమర్ల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు సంస్థ వేగిరమే తగిన చర్యలు చేపట్టాలని యాడ్ ఏజెన్సీ నిపుణులు భావిస్తున్నారు. కాగా బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఛాతీ నొప్పితో( జనవరి 2 న) పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.. మూడు కరోనరీ ఆర్టరీ బ్లాక్స్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. యాంజియోప్లాస్టీ అనంతరం, గూలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని రేపు( బుధవారం) ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. #Saurav #Ganguly sports person completely fit. Spends time in gym Daily, can do preventive test anytime. Still suffered Cardiac problem 2-3 vessel were blocked. He do advertisement of #Fortune oil. That it is healthy ? Is it really healthy? For me stress is main factor .. pic.twitter.com/SaTptVgpW0 — Doctor Of Bones (@dramolsoni) January 3, 2021 #Saurav #Ganguly sports person completely fit. Spends time in gym Daily, can do preventive test anytime. Still suffered Cardiac problem 2-3 vessel were blocked. He do advertisement of #Fortune oil. That it is healthy ? Is it really healthy? For me stress is main factor .. pic.twitter.com/SaTptVgpW0 — Doctor Of Bones (@dramolsoni) January 3, 2021 Seen many tweets on the irony in Sourav Ganguly endorsing Fortune RiceBran Oil. Got to realise it’s the risk one takes in any endorsement. It isn’t that Ganguly lived an unhealthy lifestyle. Importantly, sportsmen with a 10-15 year playing life need to keep the earnings coming in — Lloyd Mathias (@LloydMathias) January 3, 2021 Now you know .. #Fortune does not work .. @SGanguly99 dada get well soon pic.twitter.com/tawBK0Uv5Q — Jaspal Singh (@JaspalSinghSays) January 3, 2021 Dada @SGanguly99 get well soon. Always promote tested and tried products. Be Self conscious and careful. God bless.#SouravGanguly pic.twitter.com/pB9oUtTh0r — Kirti Azad (@KirtiAzaad) January 3, 2021 -
అంగట్లో వంటనూనెలు
వాసన గ్రహించే ముక్కుకి, రుచిని గ్రహించే నాలుకకి అవినాభావ సంబంధం ఉంది. చక్కగా మరిగిన వంటనూనెలలో రుచిని పెంచే గుణం దాగి ఉంది. అతిగా వాడితే అనారోగ్యం పొంచి ఉంది. ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే వంటనూనెలను మరిగించడం కంటే పచ్చిగా వాడటమే మంచిది. ప్రస్తుతం బజారులో లభించే సాధారణ వంటనూనెలు... నువ్వుల పప్పు నూనె (తిల తైలం), వేరుసెనగ (పల్లీ) నూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, పామాయిల్, మొదలైనవి. కొన్ని ప్రాంతాలలో కొబ్బరినూనె, ఆవనూనె వాడుకునే అలవాటు ఉంది. ఇటీవలి కాలంలో కుసుమ నూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను కూడా ఉపయోగిస్తున్నారు. సామాన్యులు ఈ నూనెల ధరలను బట్టి చవకగా లభించే వాటికే ప్రాధాన్యతనిస్తున్నారు. కారణాలేవైతేనేం! ప్రస్తుతం మినహాయింపు లేకుండా వంటనూనెలన్నీ కల్తీమయమనే విషయం జగమెరిగిన సత్యం. రిఫైన్డు ఆయిల్సులో ఉన్న రసాయనిక ద్రవ్యాలు, జంతు కళేబరాల కొవ్వులతో కల్తీ చేయబడ్డ బ్రాండెడ్ ప్యాకెట్లు, ప్రత్తి విత్తనాల నూనెల్ని కలిపి కల్తీ చేయడం వంటి అనేక ప్రక్రియల వల్ల జీర్ణకోశ సమస్యలే కాక, పక్షవాతం, క్యాన్సరు వంటి దారుణ వ్యాధులు కలుగుతున్నాయని వైద్యవిజ్ఞానం ఘోషిస్తోంది. ఈ మధ్యనే కొంచెం అవగాహన పెరిగి, గానుగలను ఆశ్రయించి, మన కళ్ల ముందు ఆడిస్తున్న నువ్వుల పప్పునూనె, పల్లీల నూనెలపై మొగ్గు చూపుతున్నారు. ఇళ్లల్లో తయారుచేసుకునే పదార్థాలను సేవిస్తున్నారు. ఆయుర్వేద గ్రంథాలలోని ప్రస్తావన... నువ్వుల నూనె: తిలలు అంటే నువ్వులు. పొట్టును తొలగిస్తే ‘నువ్వు పప్పు’ అంటాం. పొట్టుతోబాటు తీసిన నూనెను ఆయుర్వేద ఔషధాలలో వాడతారు. పప్పు నూనె మరింత రుచికరంగా ఉంటుంది. గుణధర్మాలు: దీనిని శరీరానికి మర్దన చేసికొని అభ్యంగ స్నానానికి వాడతారు. వంటనూనెగా కూడా సేవిస్తారు. చర్మానికి మృదుత్వాన్ని, కాంతిని ఇస్తుంది. ఆకలిని పెంచుతుంది. బలాన్ని, తెలివితేటల్ని పెంచుతుంది. స్థూలకాయులకు బరువు తగ్గటానికి, కృశించినవారికి బరువు పెరగటానికి దోహదపడుతుంది. కేశాలకు, నేత్రాలకు మంచిది. గర్భాశయశోధకం. కొంచెం వేడి చేస్తుంది. మలమూత్రాలను అధికంగా కాకుండా కాపాడుతుంది. సాధారణ విరేచనాన్ని సానుకూలం చేస్తుంది. బాహ్యంగానూ, అభ్యంతరంగానూ క్రిమిహరం. శుక్రకరం. నువ్వులలో కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. మెగ్నీషియం, జింక్, కాపర్, ఫాస్ఫరస్, మాంగనీస్, సెలీనియం, విటమిన్ బి 1, ఆహారపు పీచు కూడా ఉంటాయి. ప్రొటీన్లు తగినంత ఉంటాయి. వేరుసెనగ నూనె: ఆయుర్వేద కాలంలో దీని ప్రస్తావన లేదు. పోషక విలువలు: ప్రొటీన్లు, కొవ్వులు తగు రీతిలో లభిస్తాయి. పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. బయోటిన్, కాపర్, నియాసిన్, ఫోలేట్సు, మాంగనీసు, విటమిన్ ఇ , థయామిన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం మొదలైనవి ఉండటం వలన ఆరోగ్యకరం. శరీరబరువు తగ్గటానికి, పిత్తాశయంలో (గాల్‌బ్లాడర్) రాళ్లు ఏర్పడకుండా నిరోధించడానికి దోహదం చేస్తుంది. వేరు సెనగ పలుకుల్ని బాగా ఎండబెట్టి వాడుకుంటే దాని అనర్థాల ప్రభావం ఉండదు. ఆయుర్వేద గ్రంథాలలో ఆవనూనె (సర్లప), ఆవిసె (అతసీ), కుసుమ (కుసుంబ) గసగసాలు (ఖసబీజ), ఏరండ (ఆముదం) నూనెల వివరాలు కూడా ఉన్నాయి. వాడకపోయినా పరవాలేదు... ఒకసారి మరిగించిన నూనెలను మళ్లీమళ్లీ మరిగించి వాడితే క్యాన్సరు వంటి ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి ∙నూనెలను పచ్చివిగా వాడుకుంటే మంచిది ∙కల్తీలను దృష్టిలో ఉంచుకుని అంగట్లో తయారు చేసి అమ్మే సమోసాలు, పకోడీలు, చిప్స్ వంటివి తినకపో వటం మంచిది ∙గానుగలో స్వంతంగా ఆడించుకున్న నూనెలను వాడుకుంటూ, ఇంట్లోనే వండిన వాటిని తినడం వల్ల వ్యాధులు సోకవు ∙అసలు ఈ నూనెలు వాడకపోయినా, శరీరానికి కావలసిన కొవ్వులు ఆకుకూరల వంటి ఇతర ఆహార శాకాలలో లభిస్తాయి (ఇవి మనకు కంటికి కనపడవు) – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్ -
నూనె ఎక్కువేద్దాం!
సాక్షి, హైదరాబాద్: మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా వంట నూనెల కొరత ఏర్పడింది. నూనె గింజల సాగు తక్కువగా ఉండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఉద్యానశాఖ అంచనా వేసింది. మన అవసరాలకన్నా 3 లక్షల టన్నులు తక్కువ ఉత్పత్తి ఉంది. మన దేశ అవసరాలకు 2.1 కోట్ల టన్నుల వంట నూనెలు అవసరం కాగా.. 70 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. మిగిలిన 1.4 కోట్ల టన్నుల నూనెను రూ.75 వేల కోట్లు వెచ్చించి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మొత్తం దిగుమతుల్లో 60 శాతం పామాయిల్ ఉండటం గమనార్హం. దేశంలో నూనె గింజల ఉత్పత్తి 2.52 కోట్ల టన్నులు కాగా, అందులో వంట నూనెల ఉత్పత్తి 70 లక్షల టన్నులుగా ఉంది. పైగా ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో ఉత్పాదకత కేవలం మూడో వంతు మాత్రమే. అందుకే ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటోంది. తెలంగాణలో 42 వేల ఎకరాల్లో పామాయిల్ సాగవుతోంది. ఖమ్మం, కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేటల్లో సాగు చేస్తున్నారు. కానీ ఉత్పాదకత తక్కువగా ఉండటంతో ఉత్పత్తి పెద్దగా లేదు. దీంతో దేశంలోనూ రాష్ట్రంలోనూ వంట నూనెల కొరత వేధిస్తోంది. కార్యాచరణ ప్రణాళిక.. పామాయిల్ సాగును పెంచడం ద్వారానే రాష్ట్రంలో వంట నూనెల కొరతను అధిగమించవచ్చని ఉద్యానశాఖ భావిస్తుంది. మరో 75 వేల ఎకరాలకు పామాయిల్ సాగు విస్తరిస్తే రాష్ట్రంలో నెలకొన్న 3 లక్షల టన్నుల వంట నూనెల కొరతను అధిగమించవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతమున్న 4 జిల్లాలు కాకుండా ఇతర జిల్లాలకు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అందుకోసం వివిధ ప్రాంతాల్లో పామాయిల్ సాగుకు గల అనుకూలతలను అధ్యయనం చేస్తున్నట్లు ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి చెబుతున్నారు. ఇప్పటికే పామాయిల్ సాగుకు అనువైన జిల్లాలను సర్వే చేయించామన్నారు. ఆ సర్వే ద్వారా కొత్తగా 18 జిల్లాల్లోని 206 మండలాల్లో 6.95 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగుకు అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఆ స్థాయిలో సాగు పెరిగితే అవసరాలు తీరడమే కాకుండా, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే అవకాశం ఏర్పడుతుంది. దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిందన్నారు. కొత్తగా ప్రతిపాదించిన జిల్లాల్లో పామాయిల్ సాగుకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు. క్రూడ్ పామాయిల్ రికవరీ శాతాన్ని రైతుల కోరిక మేరకు 18.94 శాతంగా నిర్ణయించామని అధికారులు చెబుతున్నారు. గతేడాది ఇది 18.43 శాతంగా ఉంది. దీనివల్ల రైతులకు ఈ ఏడాది పామాయిల్ గెలలకు అధిక ధర లభించనుంది. -
తెలుగు రాష్ట్రాల్లోకి ‘సన్‌ప్యూర్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సన్‌ప్యూర్ పేరుతో వంట నూనెల తయారీలో ఉన్న కర్ణాటక కంపెనీ ఎంకే అగ్రోటెక్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించింది. రైస్ బ్రాన్ ఆయిల్, పామాయిల్, గోధుమ పిండి, షుగర్ తదితర ఉత్పత్తులను సైతం అందుబాటులోకి తెచ్చింది. కర్నాటకలో నెలకు 18,000 టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను విక్రయిస్తూ వ్యవస్థీకృతంగా 70% వాటాతో తొలిస్థానంలో ఉన్నట్టు ఎంకే అగ్రోటెక్ నేషనల్ సేల్స్ మేనేజర్ మల్లికార్జున్ పేరి తెలిపారు. ఆర్ఎస్ఎం మృత్యుంజయ నాయుడుతో కలిసి మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘సోడియం హైడ్రాక్సైడ్, ఫాస్ఫరిక్ యాసిడ్ వాడకుండా సన్‌ప్యూర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ దేశంలో తొలిసారిగా సేంద్రియ మాధ్యమంలో తయారైంది. ఈ ఉత్పాదనకు పేటెంటు ఉంది’ అని చెప్పారు. రెండేళ్లలో మూడు ప్లాంట్లు..: శ్రీరంగపట్నం వద్ద కంపెనీకి రోజుకు 450 టన్నుల సామర్థ్యం గల నూనె శుద్ధి కర్మాగారం ఉంది. బెంగళూరులో రూ.400 కోట్లతో రోజుకు 750 టన్నుల సామర్థ్యంతో నెలకొల్పుతున్న ప్లాంటు రెండు నెలల్లో సిద్ధం కానుంది. కాకినాడ వద్ద రూ.250 కోట్లతో రిఫైనరీని స్థాపించనుంది. రోజుకు 700 టన్నుల సామర్థ్యంతో 18–24 నెలల్లో ఇది రానుంది. మహారాష్ట్రలో సైతం యూనిట్ ఏర్పాటు చేస్తామని మల్లికార్జున్ వెల్లడించారు. ఆహార ఉత్పత్తుల తయారీలో దేశంలో ప్రముఖ స్థానం సంపాదించాలన్నది సంస్థ లక్ష్యమన్నారు. 1995లో శ్రీరంగపట్నం కేంద్రంగా ఎంకే అగ్రోటెక్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. 1,300 మంది ఉద్యోగులు ఉన్నారు. -
వంట నూనెకు డిమాండ్ జోరు
ముంబై: దేశంలో వంట నూనెల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. 2017లో 23 మిలియన్లుగా ఉన్న వినియోగం 2030 నాటికి 34 మిలియన్ టన్నులకు పెరగనుంది. ‘దేశంలో భవిష్యత్ వంట నూనెల పరిశ్రమ: 2030 నాటికి మరింత డిమాండ్ పెరగడానికి కారణాలు’’ అన్న శీర్షికన రెబో రీసెర్చ్ సంస్థ ఒక నివేదికను రూపొందించింది. ఇందులో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... జనాభా పెరుగుదల, ఆర్థికాభివృద్ధి, ఆదాయాలు ఇందుకు అనుగుణంగా వ్యయాలు పెరగడం. పట్టణీకరణ, ఆహార అలవాట్లు మారడం, ప్రాసెస్డ్ ఫుడ్ తినేవారి సంఖ్యలో గణనీయ పెరుగుదల వంటి అంశాలు వంట నూనె వినియోగం దూసుకుపోవడానికి కారణం. 2017లో దేశ వంట నూనెల వినియోగం 23 మిలియన్ టన్నులయితే వార్షికంగా 7 శాతం పెరుగుతూ, 2030 నాటికి 34 మిలియన్ టన్నులకు చేరుతుంది. దేశీయ వంట నూనెల సరఫరా ప్రస్తుతం డిమాండ్‌కు అనుగుణంగా లేదు. దీనితో వచ్చే దశాబ్ద కాలంలో దిగుమతుల పరిమాణం పెరిగే వీలుంది. దేశీయ నూనెల పరిశ్రమ వృద్ధి నేపథ్యంలో ప్యాకేజ్డ్ వంట నూనెల మార్కెట్ విస్తరిస్తుంది. ఈ పరిస్థితుల్లో పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ ఆయిల్స్ భవిష్యత్‌లో ప్రాంతీయ మార్కెట్లలోకి మరింత చొచ్చుకుపోయే అవకాశం ఉంది. దేశీయ నూనె గింజల ఉత్పత్తి వృద్ధి డిమాండ్‌కు అనుగుణంగా పెరగడం లేదు. పెరుగుతున్న వంట నూనెల డిమాండ్ – దేశీయ వంట నూనెల సరఫరా మధ్య వ్యత్యాసం గడచిన దశాబ్ద కాలంలో 6.5 మిలియన్ టన్నులు– 8.5 మిలియన్ టన్నుల శ్రేణిలో ఉంది. ఆయా అంశాల నేపథ్యంలో 2030 నాటికి వంట నూనెల దిగుమతుల పరిమాణం 25 మిలియన్ టన్నులకు చేరే వీలుంది. 2017లో దిగుమతులు 15.5 మిలియన్ టన్నులు. మొత్తం వంట నూనెల దిగుమతుల్లో 98 శాతం పామాయిల్, సోయా ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ ఆక్రమించనున్నాయి. 2030 నాటికి మొత్తం వంట నూనెల దిగుమతుల్లో 60 శాతంతో సింహభాగంలో పామాయిల్ ఉంటుంది. మలేషియా, ఇండోనేషియాల నుంచి ప్రధానంగా ఈ దిగుమతులు ఉంటాయి. దక్షిణ అమెరికా సోయా ఆయిల్ దిగుమతుల శాతం 24. నల్ల సముద్రం ప్రాంతం నుంచి సన్ ప్లవర్ అయిల్ దిగుమతులు 14 శాతంగా ఉంటాయి. పామాయిల్‌తో పోల్చితే సోయాబీన్, సన్‌ఫ్లవర్ ధర అధికమే. అయినా భారత్‌కు సోయాబీన్, సన్‌ఫ్లవర్ చమురు దిగుమతుల పరిమాణం వార్షికంగా ఐదు శాతం పెరుగుతుంది. నాణ్యతకు వినియోగదారుల ప్రాధాన్యత దీనికి కారణం. అయితే మొత్తంగా చూస్తే, దిగుమతయ్యే వంట నూనెల్లో పామాయిల్‌దే సింహభాగం. దిగువ స్థాయి ఆదాయ వర్గం అధికంగా ఉండడమే దీనికి కారణం. మొత్తం వంట నూనెల వినియోగాన్ని చూస్తే– రిటైల్ రంగంలో ప్యాకేజ్డ్ విక్రయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. మొత్తం వినియోగంలో ప్యాకేజ్డ్ విక్రయాల వాటా 40 శాతం. వచ్చే ఐదేళ్లలో ఈ విక్రయాలు వార్షికంగా 6 నుంచి 8 శాతం పెరుగుతాయి. -
కొత్తగా ట్రై చేయండి
∙మర గానుగ వంట నూనెలతో ఆరోగ్య ప్రయోజనాలు ∙ఇప్పుడు అందుబాటులో ఇంట్లోనే నూనె తీసుకునే చిన్న యంత్రాలు ∙ఎవరి వంట నూనె బాధ్యత వారే తీసుకోవడం వల్ల నమ్మకం ∙‘సాక్షి’తో జాతీయ ప్రకృతి వైద్య సంస్థ(పుణే) సంచాలకులు డాక్టర్ సత్యలక్ష్మి విత్తనాలు, పండ్ల నుంచి అతిగా వేడి పుట్టని రీతిలో గానుగల ద్వారా పోషకాలతో కూడిన ఆరోగ్యదాయకమైన వంట నూనెలను తయారు చేసుకొని వాడుకోవడం పూర్వకాలం నుంచి మనకు ఉన్న సంప్రదాయం. అయితే, ఆధునిక కాలంలో డబుల్ రిఫైన్డ్ వంట నూనెలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన దరిమిలా గానుగ ఆడించడం ద్వారా తీసిన నూనెల వాడకం దాదాపుగా కనుమరుగైంది. డబుల్ రిఫైన్డ్ పేరిట చలామణిలో ఉన్న వంట నూనెల వల్ల కొలెస్ట్రాల్, బీపీ లేకపోయినా శరీరం లోపల జనరలైజ్డ్ ఇన్ఫ్లమేషన్ వల్ల గుండె జబ్బులు వస్తున్నాయని తెలిసిందని పుణేలోని జాతీయ ప్రకృతి వైద్య సంస్థ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి) సంచాలకులు డాక్టర్ సత్యలక్ష్మి అంటున్నారు. భారీ గానుగలు అవసరం లేదని, ఇంట్లో పెట్టుకొని అవసరమైనప్పుడు నూనె తీసుకునే చిన్నపాటి విద్యుత్ గానుగ యంత్రాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయని ఆమె తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన జాతీయ సహజ ఆహారోత్సవం సందర్భంగా డా. సత్యలక్ష్మి ‘సాక్షి’తో ముచ్చటించారు... ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే.. మనం నూనెలను వాడే ముందర ఒక విషయాన్ని తార్కికంగా ఆలోచిద్దాం. ఉదాహరణకు మీ ఇంట్లో సాధారణంగా వేరుశెనగ నూనెను ఉపయోగిస్తున్నారని అనుకుందాం. రెండున్నర కిలోల వేరుశనగ గింజలు ఉపయోగిస్తే తప్ప ఒక లీటరు నూనె రాదు. కిలో నూనె గింజల ఖరీదు నూరు రూపాయలు. కానీ, మార్కెట్లో లీటరు వేరుశనగ నూనెను రూ.120 అంతకన్నా తక్కువకు కూడా అమ్ముతున్నారు. డబుల్ రిఫైన్డ్ నూనె అంటున్నారు. కిలో నూనె రావాలంటే ఉపయోగించాల్సిన రెండున్నర కిలోల గింజల (ముడిసరుకు) ధరే దాదాపుగా రూ. 250 అవుతుంది. అలాంటప్పుడు కిలో వేరుశెనగ నూనె రూ. 120 అంటూ మార్కెట్లో దొరకేది అసలు వేరుశెనగ నూనేనా? ఇంకేదైనానా? ఇక ప్రాసెస్ చేశాక అన్ని రకాల నూనెల రంగు, రుచి, వాసన ఒకే మాదిరిగా ఉంటున్నాయి. మరి అలాంటప్పుడు అది వేరుశెనగ నూనే కావచ్చు అంటూ సర్ది చెప్పుకోవడం తప్ప మరో మార్గం ఉండదు. ఇప్పుడు తార్కికంగా ఆలోచిద్దాం. ముడిసరుకు ధరే రూ. 250 ఉంటే కిలో నూనె ధర రూ. 120 కి దొరికే అవకాశం ఉండదు. కాబట్టి ఆ నూనెలో వేరుశెనగ పాళ్లు చాలా తక్కువ. మిగతాదంతా ఏదైనా రసాయనాలు కావచ్చు. మరి అలాంటప్పుడు మనమే ఓ నూనె తీసుకునే గానుగమెషిన్ కొనుక్కుంటే? మన కళ్ల ముందే మనమే నూనెను తీసుకుంటే? అప్పుడు మనం వాడే నూనె గురించి మనకు భరోసా ఉంటుంది. పైగా కోల్డ్ ప్రెస్డ్ నూనె తీసుకుంటే మరో ప్రయోజనమూ ఉంది. నూనెలు వేడి చేయడం మంచిది కాదన్న విషయం తెలిసిందే. అలాంటప్పుడు మనకు అమ్మే నూనెలను ఏమేరకు వేడి చేసి తీస్తున్నారో మనకు తెలియదు. కానీ మన కళ్ల ముందు ఆడించి, తీసుకునే నూనెను వేడి చేయకుండా తీసుకోవడం వల్ల మనకు భరోసాకు భరోసా, ఆరోగ్యానికి ఆరోగ్యం. అందుకే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన యాంత్రిక గానుగలను వాడుకోవడం ప్రయోజనకరమే కదా. పై ఉదాహరణతో మార్కెట్లో అందుబాటులో ఉన్న డబుల్ రిఫైన్డ్ వంట నూనెల వల్ల అవాంఛనీయ రసాయనాలు, విషపదార్థాలు ఉన్నాయనే విషయం తేలిపోయింది. దాంతో మనం ఆ నూనెలను వాడినప్పుడు ఆయా విషపూరిత రసాయనాలు మన దేహాల్లోకి చేరుతున్నాయి. ఫలితంగా అధిక బరువు, అకాల మతిమరుపు (డిమెన్షియా), కాలేయ సమస్యలు, త్వరగా ముసలితనం రావడం, శరీరం లోపల వాపు (జనరలైజ్డ్ ఇన్ఫ్లమేషన్) వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఈ కలుషిత డబుల్ రిఫైన్డ్ వంట నూనెల వల్ల వస్తున్నాయి. ప్రాసెస్ చేసిన ఈ వంట నూనెలు క్రమంగా మనుషుల ప్రాణాలను బలిగొంటున్నాయి. కాబట్టి వాటిని వంట గదులకు దూరంగా ఉంచడమే ఆరోగ్యదాయకం. అతిగా వేడి తగలని స్థితిలో నూనె గింజలు, పండ్ల నుంచి గానుగ ద్వారా రసాయనాలు లేదా సాల్వెంట్లు వాడకుండా తీసిన వంట నూనెలు అనేక ఆరోగ్యదాయకమైన ప్రయోజనాలను అందిస్తాయి. విటమిన్ ఇ సహా ఇతర పోషకాలను సైతం అందిస్తాయి. ఇవి ఆరోగ్యదాయకమైనవి. అందువల్ల ఈ గ్రహింపుతోనే గత ఏడాదిగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి తరఫున గానుగ నూనెల వాడకాన్ని ప్రోత్సహించే ప్రయత్నం జరుగుతోంది. కొలెస్ట్రాల్, బీపీ... ఈ రెండు గుండె జబ్బులకు మూల కారణాలని గతంలో భావించేవాళ్లం. అయితే, కొలెస్ట్రాల్, బీపీ సమస్యలు లేని వారికీ గుండె జబ్బులు వస్తున్నాయి. గుండెపోటు మరణాలూ సంభవిస్తున్నాయి. సడన్ హెమరేజ్ వంటి సమస్యలు వస్తున్నాయి. డబుల్ రిఫైన్డ్ వంట నూనెల వల్ల వస్తున్న ‘జనరలైజ్డ్ ఇన్‌ఫ్లమేషనే (శరీరం లోపల వాపు) ఇందుకు మూల కారణమని ఇప్పుడు గుండె వైద్య నిపుణులు సైతం గుర్తించారు. శరీరం లోపల ఆ ఇన్‌ఫ్లమేషనే లేకపోతే ఈ కొలెస్ట్రాల్, బీపీ కూడా అంతగా ఇబ్బంది పెట్టవు. వెనకటి కాలంలో మాదిరిగా చెక్క గానుగలు ఇప్పుడూ పెట్టి నాణ్యమైన వంటనూనెలు అందిస్తున్న వ్యక్తులు, సంస్థలు అనేకం ఉన్నాయి. అయితే, ఎవరికి వారు తమ వంట నూనెలను, తమ ఇంట్లోనే కావాలనుకున్నప్పుడు సిద్ధం చేసుకునేందుకు సులువైన చిన్న సైజు ఆయిల్ ఎక్స్ల్లర్స్ సూరత్, నాగపూర్ మోడల్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. వీటి ధర దాదాపు రూ. 22 వేలకు అటూ ఇటుగా ఉంటాయి. చిన్న సైజు ఆయిల్ ఎక్స్ల్లర్ ద్వారా నూనె గింజల్లో నుంచి 98% నూనెను వెలికితీయవచ్చు. చక్క/పిట్టు/పిప్పిలో అతి తక్కువగా 2% నూనె మాత్రమే ఉంటుంది. విద్యుత్ ఖర్చు కూడా పెద్దగా ఉండదు. ఇక ఈ తరహా నూనెల్లోనూ కుసుమ నూనె శ్రేష్టమైనది. తర్వాత నల్ల నువ్వుల నూనె, వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, ఆవ నూనె మంచివి. ముఖ్యంగా కుసుమ, నల్లనువ్వుల నూనెలో శరీరానికి హాని చేసే ట్రాన్స్‌ఫ్యాట్స్ తక్కువ. కాబట్టి మిగతా నూనెలతో పోలిస్తే కుసుమ, నల్లనువ్వుల నూనెలు మంచివి. నూనె తీసిన తర్వాత వచ్చే పిప్పిలో పోషక విలువలు ఉంటాయి. వీటిని నేరుగా తినొచ్చు. కూరల్లో వేసుకోవచ్చు. ఈ విధంగా చూస్తే వృథాగా పోయే వ్యర్థాలనూ ఆరోగ్యం కోసం మనం వాడుకోవచ్చు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటే? నూనె గింజలను వత్తిడికి గురిచేసే క్రమంలో 49 డిగ్రీల సెల్సియస్ వేడి పుట్టినప్పుడు కణాలలో నుంచి నూనె బయటకు వస్తుంది. అంతకన్నా ఎక్కువ వేడి కలగని పద్ధతిలో నిదానంగా వెలికి తీసిన నూనెను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం మరొకటి ఉంది. మనకు థయామిన్ అనే విటమిన్ చాలా మేలు చేస్తుంది. దీని లోపం వల్ల కొన్ని వ్యాధులు వస్తాయి. ఇటీవలి మన ఆహారపదార్థాల్లో ఆర్సినిక్ అనే విషం పాళ్లు ఎక్కువగా ఉంటున్నట్లు అనేక పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఆహారంలో ఆర్సినిక్ ఉన్నప్పుడు థయామిన్ సరిగా పనిచేయదు. ఇలాంటిప్పుడు మన శరీరంలో స్రవించిన ఇన్సులిన్ కూడా ఎంత ప్రభావవంతంగా ఉండాలో అంత ప్రభావవంతంగా పనిచేయదు. దాంతో ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ వస్తుంది. టైప్–2 డయాబెటిస్‌లోనూ ముందుగా ఇలాంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కండిషన్ ఉంటుంది కాబట్టి... ఇలా ఆహారంలో ఆర్సినిక్ ఉండటం, అది థయామిన్ ఇచ్చే మంచి ప్రయోజనాలకు అడ్డుపడటం చక్కెర వ్యాధి ఉన్నప్పుడు ఉండే కండిషన్ల వంటి వాటినే కలగజేస్తుంది. అందుకే రసాయనాలతో ఉండే నూనెలను కొనడం కంటే... మనకు అవసరమైన నూనెను ఈ గానుగ యంత్రాల ద్వారా మనమే తయారు చేసుకోవడం మంచిది. వంట నూనెను పరిమితికి మించి అతిగా వేడి చేసినప్పుడు విషతుల్యంగా మారుతుంది. నూనె రకాన్ని బట్టి పరిమితి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు.. కుసుమ(శాఫ్లవర్) నూనెను 105 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా వేడి చేయకూడదు. ఇది కూరలకు బాగుంటుంది. డీప్ ఫ్రై చేయడానికి ఈ నూనె పనికిరాదు. ఎందుకంటే.. డీప్ ఫ్రై చేసేటప్పుడు 150 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ వేడి చేయాల్సి వస్తుంది. అందుకు వేరుశనగ నూనె పనికొస్తుంది. ఇక్కడ మరో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం తీసుకునే ఆహారం అంటే అదేదో కేవలం తిండికి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు. అది సుస్థిరమైన ఆరోగ్యం కోసం, సమతుల ఆహారం కోసం, మంచి పర్యావరణం కోసం... ఇలా ఈ అంశాలన్నింటి సమతౌల్యానికి దోహదం చేసే అంశం. అందుకే మనం విష రసాయనాలను కాకుండా... నమ్మకమైన ఆహారాన్ని మాత్రమే కడుపులోకి పంపాలి. -
తెలంగాణలో జెమిని ఎడిబుల్స్ రిఫైనరీ
తొలి దశలో 100 కోట్ల పెట్టుబడి ⇒ డిసెంబరుకి ఉత్పత్తి ప్రారంభం ⇒ కంపెనీ ఎండీ ప్రదీప్ చౌదరి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్రీడమ్ బ్రాండ్‌తో వంట నూనెల తయారీలో ఉన్న జెమిని ఎడిబుల్స్, ఫ్యాట్స్ ఇండియా (జెఫ్) తెలంగాణలో రిఫైనరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 30 ఎకరాల స్థలం కావాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అనుమతులు రాగానే 9 నెలల్లో ప్లాంటు నిర్మాణం పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నట్టు జెమిని ఎడిబుల్స్ ఎండీ ప్రదీప్ చౌదరి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, త్వరలోనే తీపి కబురు వస్తుందని వివరించారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, విద్యుత్ సరఫరా సమస్యలు లేకపోవడం, మార్కెట్ అవకాశాల దృష్ట్యా ప్లాంటును ఇక్కడ నెలకొల్పుతున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ సమీపంలో నెలకు 10,000 టన్నుల సామర్థ్యంతో ఇది రానుందని పేర్కొన్నారు. తొలి దశలో రూ.100 కోట్ల పెట్టుబడి పెడతామని వెల్లడించారు. ప్లాంటు అందుబాటులోకి వస్తే 600 మందికి కొత్తగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. మార్కెట్‌కు దగ్గరగా.. ప్రస్తుతం జెఫ్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం, కాకినాడ వద్ద రిఫైనరీలు ఉన్నాయి. విదేశాల నుంచి ముడి నూనెలు దిగుమతి చేసుకుని శుద్ధి చేయడానికి వీలుగా వీటిని తీర ప్రాంతంలో నెలకొల్పింది. అయితే కంపెనీకి మార్కెట్ పరంగా తెలంగాణలో ప్లాంటు అనువైనదని భావిస్తోంది. ప్యాకేజ్డ్ సన్‌ఫ్లవర్ నూనె అమ్మకాల్లో ఫ్రీడమ్ బ్రాండ్ తెలంగాణలో 35 శాతం వాటాతో టాప్–1గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 50 శాతం, ఒరిస్సాలో 50 శాతం వాటాతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కొత్త ప్లాంటులో సన్‌ఫ్లవర్‌తోపాటు ఇతర నూనెల శుద్ధి, ప్యాకింగ్ చేస్తారు. ఇక రైస్ బ్రాన్ ఆయిల్ అమ్మకాలు ఈ రాష్ట్రాల్లో వేగం పుంజుకుంటున్నాయి. అలాగే తెలంగాణలో ముడి సరుకు లభ్యత ఎక్కువే. అందుకే రిఫైనరీ ఏర్పాటుకు ముందుకు వచ్చినట్టు ప్రదీప్ చౌదరి వెల్లడించారు. ఆరోగ్య కారణాలరీత్యా రైస్ బ్రాన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ వినియోగం భవిష్యత్తులో గణనీయంగా ఉంటుందని అన్నారు. లక్ష్యం 20 శాతం వృద్ధి..: జెమిని ఎడిబుల్స్ 2016–17లో రూ.3,500 కోట్ల టర్నోవర్ అంచనా వేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20 శాతం వృద్ధి లక్ష్యంగా చేసుకుంది. ప్యాకేజ్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ విక్రయాల్లో దేశంలో నంబర్–2 స్థానంలో నిలిచామని జెఫ్ సేల్స్, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశేఖర రెడ్డి తెలిపారు. మార్కెట్లో కొన్ని నెలల వరకు వంట నూనెల ధరలు స్థిరంగా ఉంటాయని వివరించారు. కస్టమర్లు బ్రాండెడ్ ఆయిల్స్ వైపుకు మళ్లుతున్నారని చెప్పారు. -
సర్వం.. కల్తీమయం
యాలకులు, మిరియాలు గసగసాలు, అల్లం వెల్లుల్లి నిఖార్సుగా చూడకోయి దేన్నీ కల్తీమయమేనోయి అన్నీ! శనగ పిండి, కారంపొడి మినప్పప్పు, జీలకర్ర నీవైపే చూస్తుంటాయ్! కల్తీ లోతు కనుక్కోమంటాయ్!! వంట నూనె, గరం మసాలా, బాదం, ఫ్రూటీ..ఒక్కటేమిటీ.. ఇంట్లోని ప్రతి ఒక్కటీ.. కాదేదీ కల్తీకనర్హం!! - నగరంలోని పారిశ్రామిక వాడలు, శివారుల్లో కల్తీ దందా - జంతు కళేబరాలతో వంటనూనె.. రంపం పొట్టుతో గరం మసాలా పశు వ్యర్థాలతో రిఫైన్డ్ ఆయిల్, రంపం పొట్టుతో గరం మసాలా.. ఆలుగడ్డ, అరటి తొక్కలతో అల్లం వెల్లుల్లి పేస్ట్.. ప్రమాదకర వ్యర్థాలతో వనస్పతి ఇలా.. నిత్యావసరాల్లో ఏదంటే అది రెడీ! ఈ దందాకు హైదరాబాద్ శ్రామిక వాడలు, శివారు ప్రాంతాలు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. నగరంలో కాటేదాన్, శాస్త్రీపురం, బాబానగర్, బండ్లగూడలతోపాటు శివారు ప్రాంతాలైన పహాడీషరీఫ్, జల్పల్లిలో ఈ కల్తీ ఆహార పదార్థాల ఉత్పత్తి యథేచ్ఛగా సాగుతోంది. ఈ సరుకంతా బేగంబజార్ కేంద్రంగా హోల్‌సేల్‌గా అమ్ముడవుతోంది. ఇదంతా తెలిసినా నెలవారీ మామూళ్ల మత్తులో జోగుతున్న సర్కారీ శాఖల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. - సాక్షి, హైదరాబాద్ అధికారులు ఏం చేస్తున్నట్టు? ► అప్పుడప్పుడు నామ్‌కే వాస్తే నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు, జీహెచ్ఎంసీ హెల్త్ విభాగం అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కల్తీ మాఫియాపై దాడులు చేసి దండుకుంటున్నారే తప్ప పూర్తిస్థాయిలో నిరోధించలేకపోతున్నారు. ► క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా ఆహార నమూనాలను సేకరించి పరీక్షించడంలో ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ► మిర్చి బండ్లు, బిర్యానీ కేంద్రాలు, హోటళ్ల తనిఖీని విస్మరిస్తున్నారు. అమ్యామ్యాలు తీసుకుని మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ► కల్తీ ఆహార పదార్థాలకు సంబంధించి హానికరం, తప్పుడు ప్రచారం (మిస్‌బ్రాండెడ్), నాసిరకం అన్న మూడు అంశాల ఆధారంగా కేసులు నమోదు చేయాలి. కానీ అరకొరగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ► కేసుల తీవ్రత లేకపోవడంతో అక్రమార్కులు నామమాత్రపు జరిమానాలు చెల్లించి.. మళ్లీ యథేచ్ఛగా అదే దందా సాగిస్తున్నారు. కల్తీలతో పెరుగుతున్న కేన్సర్ కేసులు హైదరాబాద్‌లో ఏటా కొత్తగా 10 వేల కేన్సర్ కేసులు నమోదవుతుండగా.. అందులో అత్యధిక కేసులు కల్తీ ఆయిల్ వల్లే వెలుగు చూస్తున్నాయి. ఒకసారి వాడిన ఆయిల్‌ను ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, మిర్చీ బండ్ల వద్ద మళ్లీమళ్లీ వేడి చేస్తున్నారు. జంతు కళేబరాలు, కొవ్వు నుంచి తీసిన నూనెలతో ప్రజలు పలు రకాల కేన్సర్ల బారిన పడుతున్నారు. మళ్లీ మళ్లీ వాడే ఆయిల్‌తో తయారు చేసిన ఆహార పదార్థాలు తినడమే కాదు.. ఆ నూనె వాసన పీల్చినా కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హృద్రోగ, ఇతర జబ్బులతో నమోదవుతున్న మరణాలతో పోలిస్తే కేన్సర్ మరణాలే అధికంగా నమోదవుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. కల్తీ నూనెలతో రక్తంలో ట్రై గ్లిజరాయిడ్స్ అధికమై రక్తపోటు, మధుమేహం కేసులు పెరుగుతున్నాయి. కల్తీ నూనెలు, నెయ్యి, వనస్పతి వినియోగంతో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి పలువురు గుండెపోటుకు గురవుతున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. కల్తీ మాఫియాకు సాక్ష్యాలివిగో.. ► నగర శివారుల్లోని జల్పల్లి గ్రామ సమీపంలో ఓ నిర్మానుష్య ప్రాంతంలో పప్పుసేట్ అనే వ్యక్తి ప్రహరీ నిర్మించాడు. పెద్దపెద్ద కడాయిలు ఏర్పాటు చేసి జంతు కళేబరాలను ఉడికించి ఆయిల్ తయారు చేస్తున్నాడు. ఇటీవల సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు ఈ కంపెనీపై దాడిచేసి 160 డ్రమ్ములు సీజ్ చేశారు. సూపర్వైజర్ తాహేర్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మళ్లీ ఇక్కడ తయారీ మొదలైంది. ► దీని సమీపంలోనే ఆవులు, గేదెల ఎముకలతో ఆయిల్ తయారు చేస్తున్న మరో 2 కంపెనీలను పోలీసులు సీజ్ చేశారు. 2 నెలల క్రితం ఈ కంపెనీలకు సమీపంలోనే బేకరీలకు నకిలీ సాస్ సరఫరా చేసే కంపెనీలపై అధికారులు దాడి చేసి పురుగులు పట్టిన సాస్‌ను పట్టుకున్నారు. ► జల్పల్లి నుంచి పహాడీషరీఫ్ కమాన్‌కు వెళ్లే దారిలో అధికారులు దాడులు చేస్తే మరిన్ని కంపెనీల్లో అక్రమాలు బయటపడే అవకాశాలున్నాయి. ► జల్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమంగా కొనసాగుతున్న నాలుగు పశు వ్యర్థాల గోడౌన్లపై ఇటీవల అధికారులు దాడులు చేశారు. పెద్దఎత్తున నిల్వ ఉన్న పశువుల ఎముకలు, కొవ్వు, ఇతర అవయవాలను గుర్తించారు. ► జల్పల్లి బుగ్గ ప్రాంతంలో దాదాపు పది వరకు పశువుల ఎముకల నుంచి నూనె, కొవ్వు, వనస్పతి తయారీ చేసే గిడ్డంగులు నడుస్తున్నాయి. ఈ నూనె, వనస్పతిని నగరంలోని మిర్చీ బండ్లు, ఇతర ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు ఎగుమతి చేస్తున్నారు. జల్పల్లి శ్రీరాం కాలనీలో ఓ వ్యాపారి కల్తీ ఫ్రూటీలను తయారు చేసి విక్రయిస్తున్నాడు ► ఇందిరా సొసైటీ సమీపంలోని ఓ కంపెనీ మొక్కజొన్న, ఇతర వాటితో కలిపి కల్తీ శనగ పిండి తయారు చేస్తోం ది. ఈ కంపెనీపై గతంలో ఎస్వోటీ పోలీసులు దాడులు చేసినా ఇప్పటికీ ఆ వ్యాపారి కల్తీ శనగ పిండి వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ► జల్పల్లి రోడ్డులోనే కల్తీ సాస్ తయారీ కంపెనీ కొనసాగుతోంది ► శ్రీరాం కాలనీలోనే కల్తీ మసాల దినుసులు పెద్దఎత్తున తయారవుతున్నాయి. కళేబరాల నుంచి నూనె కల్తీ నూనెలు, వనస్పతి తయారీకి కాటేదాన్ పారిశ్రామికవాడ, జల్పల్లి, శాస్త్రీపురం, మల్లాపూర్, మైలార్‌దేవ్‌పల్లి, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాలు అడ్డాగా మారాయి. కల్తీరాయుళ్లు నల్లగొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో జరిగే సంతల నుంచి తక్కువ ధరకు పశువులను కొనుగోలు చేసి వాటి మాంసాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. మిగిలిన కళేబరాలను పెద్ద ఇనుప గోళాలు, గిన్నెల్లో వేసి నాలుగైదురోజులపాటు మరిగించి నూనె, వనస్పతి తీస్తున్నారు. ఈ నూనెను అధిక ధర ఉండే నూనెతో కలుపుతున్నారు. ఆహారశుద్ధి (ఫుడ్‌ప్రాసెసింగ్) పరిశ్రమల ముసుగులో కల్తీ నూనెలను యథేచ్ఛగా తయారు చేస్తున్నారు. కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఈ కంపెనీల్లోకి ప్రవేశించడం సామాన్యులెవరికీ సాధ్యపడదు. ఇక్కడ పనిచేస్తున్న వారంతా బిహార్, అసోం, ఒడిశాలకు చెందిన కూలీలే. పొరపాటున ఈ కంపెనీల్లో సాగుతున్న అక్రమాలపై కన్నెత్తి చూస్తే వారిని చావబాదేందుకు సైతం వెనకాడకపోవడం వీరి నైజం. వ్యవస్థీకృత మాఫియాగా ఈ దందా సాగుతున్నా అధికారులు ఇటు వైపు దృష్టిసారించడం లేదు. కల్తీ చేస్తున్నారు ఇలా.. ► పశువుల కొవ్వులు, ఎముకల నుంచి తీసిన నూనెలను వంట నూనెల్లో కలుపుతున్నారు ► అధిక ధర ఉండే వంట నూనెలో చౌకరకం నూనె కలిపేస్తున్నారు. వనస్పతి నూనెల్లో పశువుల కొవ్వుల మిశ్రమం, రైస్‌బ్రాన్ వంటనూనెలోనూ పత్తి గింజల నూనె ను కలుపుతున్నారు ► పామాయిల్‌ను మరో నూనెతో కలిపి వనస్పతిగా తయారు చేస్తున్నారు. కోటి మందికి ముగ్గురా? ఫుడ్ ఇన్స్పెక్టర్ల కొరత, తనిఖీలకు అవసరమైన వాహనాలు లేకపోవడం కల్తీల నిరోధంపై ప్రభావం చూపుతోంది. కోటి జనాభా ఉన్న గ్రేటర్లో ఆహార భద్రతా విభాగానికి 30 పోస్టులు మంజూరు కాగా.. ప్రస్తుతం పనిచేస్తుంది ముగ్గురే! మిగతా పోస్టులన్నీ ఖాళీ. ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం ప్రతి 50 వేల మంది జనాభాకు ఒక అధికారి ఉండాలి. ఈ లెక్కన ఒక్క నగ రంలోనే 200 మంది అధికారులు అవసరం. బేగంబజార్‌లో అమ్మకం బేగంబజార్ అడ్డాగా కల్తీ మసాలాలు, ఆహార పదార్థాలు హోల్‌సేల్‌గా అమ్ముడవుతున్నాయి. బేగంబజార్, ఫీల్‌ఖానా, మిట్టీకాషేర్, కోల్సివాడి, బేగంబజార్ ఛత్రి ప్రాంతాల్లోని వందలాది హోల్‌సేల్ దుకాణాల్లో కల్తీ విక్రయాలు జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి నగరం నలుమూలలతోపాటు తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాలకు కూడా చేరుతున్నాయి. ఆ ఆయిల్ చాలా ప్రమాదకరం జంతు కళేబరాలు, కొవ్వు నుంచి తీసిన ఆయిల్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఇందులోని హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ కేన్సర్‌కు కారణం అవుతున్నాయి. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, వైన్ షాపుల ముందు మిర్చి, చేపలు, చికెన్ వేపుడు బండ్ల వ్యాపారులు మార్కెట్లో తక్కువ ధరకు దొరికే కల్తీ ఆయిల్‌ను వాడుతున్నారు. ఈ ఆయిల్ నుంచి వచ్చే వాసనను పీల్చినా ప్రమాదమే. ఇటీవల కేన్సర్ కేసులు పెరగడానికి కల్తీ ఆయిల్ కూడా కారణమే. -డాక్టర్ మోహనవంశీ, కేన్సర్ వైద్య నిపుణుడు, ఒమెగా ఆస్పత్రి జీర్ణకోశ కేన్సర్ ముప్పు శరీరంలో కొవ్వు అధికంగా చేరడం మంచిది కాదు. చికెన్, మటన్ వంటివే తక్కువ మోతాదులో తీసుకోవాలి. అలాంటిది జంతు కళేబరాల నుంచి తీసే కొవ్వు మరింత ప్రమాదం. ఇవి కాలేయం, కిడ్నీ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. జీర్ణకోశ కేన్సర్ వ చ్చే ప్రమాదం ఉంటుంది. -డాక్టర్ పి.రఘురామ్, కేన్సర్ వైద్య నిపుణుడు పప్పుల్లో ఇలా..: పాడైన పప్పులకు మిఠాయిలో వాడే రంగులను కలిపి నిగనిగలాడే పప్పుగా మార్చేస్తున్నారు. పైకి బాగా కనిపించడంతో ప్రజలు దాన్ని వాడుతున్నారు. ఇడ్లీ, దోశల్లో తప్పనిసరిగా వాడే మినపపప్పు, మినపగుండ్లలో తెల్లటి పౌడర్ కలిపి మాయ చేస్తున్నారు. అయ్యో.. నెయ్యి..: కిలో నెయ్యి ధర సుమారు రూ.400 పలుకుతుండడంతో.. అక్రమార్కులు దీన్ని సొమ్ము చేసుకుంటున్నారు. అసలు నెయ్యి 25 శాతం ఉంటే అందులో 75 శాతం వనస్పతి కలిపి మార్కెట్లోకి తెస్తున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలో స్వచ్ఛమైన నెయ్యి గడ్డ కట్టదు. కానీ వనస్పతి కలిపిన నెయ్యి మాత్రం గడ్డకడుతోంది. మసాలా దినుసులు.. గసగసాలు: ఉప్మా రవ్వను గసగసాలుగా మార్చేందుకు పిండిమరలో వేస్తారు. పలుకుగా మారగానే వాటిని గసగసాల్లో కలుపుతున్నారు. తెల్లగా ఉండేం దుకు పెయింట్ మిశ్రమాన్ని కలిపి ఆరబెడుతున్నారు. ఒరిజినల్ గసగసాలు రూ.350 వరకూ విక్రయిస్తుండగా, నకిలీవి కేవలం రూ.50 కిలో చొప్పున తయారవుతాయి. జీలకర్రనూ వదలట్లేదు ఒక కేజీ హైడ్రోసల్ఫైట్, 25 కేజీల రెల్లు గడ్డి పూలను 4 లీటర్ల నీటిలో 5 నుంచి 10 నిమిషాలు నానబెడతారు. వాటిని రోలింగ్ మిషన్‌లో వేసి ముదురు పసుపు, పచ్చ పెయింట్స్ స్టెయినర్ వేసి వాటికి మామూలు జీలకర్ర రంగు వచ్చేలా కలియ తిప్పుతారు. ఇంకేముంది కల్తీ జీలకర్ర రెడీ! అల్లం వెల్లుల్లి కల్తీ ఇలా..: అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా కల్తీ చేస్తున్నారు. ఆలుగడ్డను ముద్దగా చేసి అల్లం వెల్లుల్లి మిశ్రమంలో కలుపుతున్నారు. అవసరమైతే అరటి తొక్కలనూ జత చేస్తున్నారు. దీనికి అందమైన ప్యాకింగ్ చేసి ప్రజలకు అంటగడుతున్నారు. సువాసన కోసం కొంచెం అల్లం, వెల్లుల్లిపాయలు, కొన్ని రసాయనాలు కలుపుతున్నారు. గతేడాది డిసెంబర్లో ఫలక్‌నుమాలో పోలీసుల దాడిలో భారీగా కల్తీ అల్లం, వెల్లుల్లి ముద్దలు పట్టుబడ్డాయి. యాలకులు: నాసిరకం యాలకులను ఉత్తరాది రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి నీటిలో నానబెట్టి రంగులు, కెమికల్స్ కలుపుతున్నారు. కేవలం రూ.100-150 ఖర్చుతో వాటిని చూడడానికి ఆకర్షణీయంగా మార్చి మార్కెట్లో అమ్ముతున్నారు. ఒరిజినల్ యాలకులు అంటూ కేజీకి రూ.800-1000 చొప్పున అమ్ముతున్నారు. మిరియాలు: రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లో కిలో రూ.50కే దొరుకుతున్న బొప్పాయి విత్తులు తెస్తున్నారు. వీటికి పలు రకాల కెమికల్స్, నాసిరకం బెల్లం, బ్లాక్ ఆక్సైడ్, సిమెంట్ కలర్ కలిపి మిరియాలు తయారుచేస్తున్నారు. దీంతో మిరియాల బరువు పెరగడంతోపాటు తిన్నవారికి రోగాలు తథ్యం. నకిలీ బాదాం: నాసిరకం బాదానికి రెడ్ ఆక్సైడ్ కెమికల్‌ను కలిపి చూడ్డానికి ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల 5 కిలోల బాదాం మరో 5 కిలోల బరువు పెరుగుతుంది. కారంపొడి: కాటేదాన్, బండ్లగూడ, పహాడీషరీఫ్తో పాటు పాతబస్తీలోని పలుచోట్ల ఒరిజినల్ మిరప కారానికి రంపం పొట్టు, పలు కెమికల్స్, రంగులు కలిపి నకిలీ కారంపొడి తయారుచేస్తున్నారు. నకిలీ సోంపు: జియాగూడ కేసరి హనుమాన్ ఆలయ ప్రాంతంలోని ఓ కేంద్రంలో నకిలీ సోంపు తయారు చేస్తున్నారు. కల్తీ సోంపును తీసుకువచ్చి పలు రకాల కెమికల్స్, హైడ్రోజన్ పెరాక్సైడ్, చెరుకు రసం, రంగులు కలిపి పలు రకాల సోంపులను తయారు చేస్తున్నారు. -
అడిగింది వంట నూనె.. ఇచ్చింది దీపం నూనె
కేసముద్రం : వంట నూనె ఇవ్వమంటే గడువుతేదీ దాటిన నూనె ప్యాకెట్ ఇవ్వగా, ఆ నూనెతో వండిన కూర తిని ఇంటిల్లిపాది అస్వస్థతకు గురైన సంఘటన మండలంలోని అమీనాపురం గ్రామంలో మంగళవారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం. గ్రామానికి చెందిన బిర్రు యుగంధర్ ఇంట్లో వంటకాల కోసం సోమవారం సాయంత్రం గ్రామంలోని ఓ కిరాణ షాపువద్దకు వెళ్లి నూనె ప్యాకెట్ ఇవ్వమని అడిగాడు. దీంతో షాపులో కూర్చున్న యజమాని వంటనూనెకు బదులు(అరకేజీ) దీపారాధన ప్యాకెట్‌ను ఇచ్చింది. ఇది వంటనూనె కాదు గదా అని తెలుపగా, అదేనంటూ చెప్పి మరి ఇవ్వడంతో అతడు ఇంటికి తీసుకెళ్లాడు. ఆ నూనెతో కూరవండి తిన్నారు. దీంతో యుగంధర్ భార్య ప్రభ, కుమారుడు శ్రీవర్ధన్‌కు విరేచనాలయ్యాయి. స్థానిక వైద్యులను సంప్రదించి చికిత్స చేయించారు. వంట వండిన నూనె ప్యాకెట్‌ను పరిశీలించగా అది కేవలం దీపారాధనకు ఉపయోగించాలని ఉంది. పైగా గడవు తేదీ కూడా దాటిపోయింది. దీంతో బాధితుడు వెళ్లి షాపు యజమానిని ప్రశ్నించాడు. ఏదో పొరపాటున ఇచ్చామని వారు సర్దిచెప్పుకొచ్చారు. ఈ కిరాణంషాపుపై తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు తెలిపారు. -
వంటనూనె శుద్ధి కర్మాగారాలపై దాడులు
కాకినాడ: వంటనూనె శుద్ధి కర్మాగారాలపై అగ్మార్క్ అధికారులు శనివారం దాడులు జరిపారు. నకిలీ అగ్మార్క్ వినియోగిస్తున్న లోహియం కంపెనీ నుంచి రూ. 13 లక్షల విలువైన వంటనూనె స్వాధీనం చేసుకున్నారు. నకిలీ శుద్ధి కర్మాగారం యాజమాన్యంపై సర్పవరం పోలీస్ స్టేషన్లో అగ్మార్క్ అధికారులు ఫిర్యాదు చేశారు. వేరుశెనగ, సన్‌ఫ్లవర్ ఆయిల్లో 80శాతం పామాయిల్ కలుపుతున్నారని అధికారులు గుర్తించారు. -
వాడేసిన వంటనూనెతో బయోడీజిల్
భలేబుర్ర వేపుళ్లకు అలవాటు పడ్డ మనదేశంలో వంటనూనె వృథా అంతా ఇంతా కాదు. వాడేసిన వంటనూనెను ఇలా వృథా పోనివ్వకుండా తిరిగి ఉపయోగించు కునేలా తయారు చేయాలనుకున్నారు ముగ్గురు ఢిల్లీ ఐఐటీ విద్యార్థులు. ఆలోచన వచ్చిందే తడవుగా అభిషేక్ శర్మ, హర్షిత్ అగ్రవాల్, మోహిత్ సోనీ అనే ఈ విద్యార్థులు ప్రయోగాలు ప్రారంభించారు. ఇళ్లలోను, హాస్టళ్లలోను వాడేసిన వంట నూనెను సేకరించడం ప్రారంభించారు. దాన్ని బయోడీజిల్‌గా మార్చే ప్రక్రియపై నానా ప్రయోగాల తర్వాత ‘ఫేమ్ వన్’ పేరిట ఓ నమూనా యంత్రాన్ని రూపొం దించారు. దీంతో వంటనూనెను జీవ ఇంధనంగా తయారు చేయగలిగారు. మామూలు డీజిల్‌లో దీనిని ఏ నిష్పత్తిలో నైనా కలుపుకోవచ్చట. వంటనూనె, నీరు, ఆల్కహాల్‌తో పాటు ఒక ఉత్ప్రేరక రసా యనాన్ని వేసి ఆన్ చేస్తే చాలు... గంట సేపట్లోనే బయోడీజిల్ సిద్ధమైపోతుంది. విడతకు ఇరవై కిలోల వాడేసిన వంటనూనెతో ఇరవై కిలోల బయోడీజిల్ తయారు చేయగలుగు తున్నారు. ఈ యంత్రం రూపకల్పనకు అయిన ఖర్చు రూ. 30 వేలు మాత్రమే. కానుగనూనె వంటి వాటితో కూడా బయో డీజిల్ తయారు చేయవచ్చని చెబుతున్నారు. -
కల్తీ నూనె స్థావరంపై దాడులు
నిజామాబాద్: జంతు కళేబరాలు, కొవ్వు నుంచి నూనె తయారుచేస్తున్న స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. నిజామాబాద్ జిల్లా బిచ్కుంద మండలం హస్గుల్ గ్రామ సమీపంలో జంతు వ్యర్థాల నుంచి నూనె తయారు చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్సై ఉపేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో దాడి చేశారు. 50 నూనె డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాడులను గమనించిన నిర్వాహకులు పరారు కాగా ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
బ్యూటిప్స్
వంట నూనెతోనూ కేశసౌందర్యాన్ని పెంచుకోవచ్చు. జుట్టు రాలడం వంటి సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను కూడా ట్రై చేసి చూడండి. అది జుట్టుకు మంచి కండీషనర్‌గా ఉపయోగపడుతుంది. తలస్నానానికి ముందు సన్‌ఫ్లవర్ ఆయిల్‌తో మర్దన చేసుకోవాలి. జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుంది. పొడిబారిన చర్మంతో బాధపడేవారు ఈ చిన్న చిట్కాను పాటించండి. ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే ముఖానికి పెసర పిండిలో నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ప్యాక్ వేసుకోవాలి, 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా ఓ రెండు వారాలు చేస్తే ముఖం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. -
ఈ వంటనూనె 80 సార్లు వాడొచ్చట!
కౌలాలంపూర్: మనం వినియోగించే ఏ వంట నూనెనైనా ఎన్ని సార్లు వాడతాం? ఒకటి.. లేదా రెండుసార్లు. అంతకుమించే వాడితే అది అనారోగ్యానికి దారి తీస్తుంది. అయితే ఇప్పుడు ఒకటీ, రెండు సార్లు కాదు... ఏకంగా 80 సార్లు వినియోగించగలిగే వంటనూనెను తయారు చేశారు పరిశోధకులు. పైగా ఈ నూనె హృద్రోగాలు, క్యాన్సర్ వంటి సమస్యల్ని కూడా తగ్గించగలదట. మలేసియాలోని యూనివర్సిటీ ఆఫ్ పుత్రకు చెందిన పరిశోధకుల బృందం పామాయిల్, ఇతర ప్రకృతి సిద్ధ మూలికలనుంచి దీన్ని తయారు చేసింది. ఈ నూనెను 'ఏఎఫ్డీహెచ్ఏఎల్'గా పిలుస్తున్నారు. పామాయిల్, రూటేసీ జాతి మొక్కల నుంచి తయారైన ఈ నూనె ఇతర నూనెల కన్నా ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందని పరిశోధకులు అన్నారు. వేపుళ్లు వంటివి చేసినప్పుడు ఆయా పదార్థాలు ఎక్కువ నూనెను పీల్చుకుంటాయి. కానీ ఈ నూనెతో చేసే పదార్థాలకు 85 శాతం తక్కువ నూనె వినియోగమవుతుందట. గుండె జబ్బుల ముప్పును కూడా ఇది తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నూనె తయారీకి వాడిన రూటేసీ మూలిక సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేయడంతోపాటు, నూనె పాడవకుండా కాపాడుతుంది. ఇది నూనెను ఎక్కువగా పాడైపోకుండా కాపాడడంతో ఇది 80 సార్లు వినియోగించేందుకు వీలవుతుంది. ఇన్నిసార్లు వినియోగించినా ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయదని సుహైలా అనే శాస్త్రవేత్త అన్నారు. ఇది యాంటీ ఆక్సిడెంట్, బ్యాక్టీరియా నిరోధకం, ఎలర్జీ నిరోధకంగా పనిచేస్తుంది. -
కృష్ణపట్నం వద్ద లోహియా గ్రూప్ ప్లాంటు
గోల్డ్‌డ్రాప్ బ్రాండ్‌తో వంట నూనెల తయారీలో ఉన్న లోహియా గ్రూప్ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద ప్లాంటును నెలకొల్పనుంది. మొత్తం రూ.500 కోట్లు వ్యయం చేయాలని కంపెనీ భా విస్తోంది. స్థలం చేతిలోకి రాగానే 10 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని లోహియా గ్రూప్ ఎండీ మహావీర్ లోహియా తెలిపారు. -
లక్ష్యం రూ.1,200 కోట్లు
సికాఫ్ జీఎం సుబ్రమణియమ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల తయారీలో ఉన్న సౌత్ ఇండియా కృష్ణ ఆయిల్, ఫ్యాట్స్ (సికాఫ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,200 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది. 2013-14లో రూ.1,000 కోట్లకుపైగా ఆర్జించామని సికాఫ్ జీఎం సుబ్రమణియమ్ పలనిసామి తెలిపారు. సూర్యగోల్డ్ బ్రాండ్‌లో కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టిన సందర్భంగా కంపెనీ ప్రతినిధులు శారద తదితరులతో కలిసి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఏటా విక్రయిస్తున్న 2 లక్షల టన్నుల్లో 30 శాతం ప్యాకేజ్డ్ ఆయిల్ కైవసం చేసుకుందన్నారు. 2-3 ఏళ్లలో ప్యాకింగ్ నూనెల విక్రయాలను రెండింతలు చేస్తామన్నారు. ‘రోజుకు 1,200 టన్నుల నూనె ప్రాసెస్ చేయగల ప్లాంటు కృష్ణపట్నం వద్ద ఉంది. రూ.120 కోట్లు వెచ్చించాం. విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకై రూ.10 కోట్లతో విస్తరణ చేపడుతున్నాం. తమిళనాడులోని నాగపట్నం వద్ద రోజుకు 400 టన్నుల సామర్థ్యంగల ప్లాంటును రూ.36 కోట్లతో కొనుగోలు చేశాం. జూన్ నుంచి ఈ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభమవుతుంది’ అని చెప్పారు. -
కోడలిపై వేడి నూనె పోసిన అత్త
బోధన్‌టౌన్ : మండలంలోని ఊట్పల్లిలో అత్తా కోడళ్ల మధ్య వివాదం ఘర్షణకు దారి తీసింది. గ్రామానికి చెందిన రామస్వామితో కోటగిరి మండలంలోని కొడిచర్లకు చెందిన లావణ్యకు రెండు నెలల క్రితం వివాహమైంది. అత్త మల్లవ్వ, కోడలు లావణ్య మధ్య తరుచూ వివాదాలు చోటు చేసుకునేవి. శనివారం లావణ్య వంట చేస్తుండగా అత్త మల్లవ్వతో మాటలు పెరిగాయి. కోపంతో అత్త మల్లవ్వ కొడలిపైకి కాగుతున్న వంట నూనెను విసిరి గాయ పర్చింది.దీంతో లావణ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం బోధన్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. లావణ్య తల్లి ఫిర్యాదు మేరకు మల్లవ్వ పై కేసు నమోదు చేసినట్లు సీఐ రామక్రిష్ణ తెలిపారు. -
ఆశ నిరాశ బడ్జెట్
కొన్ని మెరుపులు.. ఇంకొన్ని పెదవి విరుపులు.. ఇదీ అరుణ్‌జైట్లీ బడ్జెట్‌పై నగరవాసుల స్పందన. ఆదాయ పన్ను పరిమితి వేతన జీవుల్లో కొందరికి ఊరటనివ్వగా, ఇంకొందరిని ఉస్సూరుమనిపించింది. రూ.2 లక్షలలోపు గృహ రుణాలపై పన్ను మినహాయింపు, సిమెంటు, స్టీలు ధరల తగ్గింపుతో మధ్యతరగతి, అల్పాదాయ వర్గాలను సొంతింటి నిర్మాణం వైపు దృష్టిసారించేలా చేసింది. సాక్షి, సిటీబ్యూరో: పెరిగిన ధరలతో ఇంటి బడ్జెట్ తల్లకిందులైన నగరవాసికి సబ్బులు, వంట నూనెల ధరలు కాస్త దిగిరానుండడం స్వల్ప ఉపశమనం కలిగించింది. పాదరక్షలు, బ్రాండెడ్ దుస్తుల ధరలు దిగిరావడం షాపింగ్ ప్రియులైన సిటీజన్లకు పండగే. బర్గర్లు, పిజ్జాలు, బేకరీ ఉత్పత్తులపై సుంకం తగ్గడంతో వెరైటీ రుచులు ఆస్వాదించే ‘భాగ్యం’ దక్కనుంది. స్మార్ట్ఫోన్లు, సెల్ఫోన్ల ధరలు స్వల్పంగా పెరగడం నెటిజన్లయిన మన గ్రేటర్ యూత్‌కు నిరాశే మిగిల్చింది. ఇక ఎల్సీడీ, ఎల్ఈడీ, సోలార్ కాంతులతో ఇళ్లను ధగదగలు చేసుకునేందుకు మక్కువ చూపే ఎగుమ మధ్యతరగతి వర్గం ఆశలు ఈ ఏడాది నెరవేరే అవకాశాలున్నాయి. వంట పాత్రల ధరలు తగ్గుముఖం పట్టనుండడం గృహిణులకు ఉపశమనం కల్పించింది. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరల పెంపు జేబులు గుల్ల చేయనుంది. తాజా బడ్జెట్ గ్రేటర్ వాసిపై చూపనున్న ప్రభావంపై ‘సాక్షి’ ఫోకస్.. ‘రేడియో క్యాబ్’కు రెక్కలు రేడియో క్యాబ్ ప్రయాణంపై సేవా పన్ను రూపంలో భారం మోపారు. ప్రస్తుతం గ్రేటర్లో హైటెక్‌సిటీ, ఐటీ కారిడార్లతో పాటు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్ర యానికి రోజూ 2 లక్షల మంది ప్రయాణిస్తారు. సాఫ్ట్వేర్ నిపుణులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపార వర్గాలు విరివిగా వినియోగించే రేడియో క్యాబ్‌లపైన కిలోమీటర్‌కు రూ.2 నుంచి రూ.3 చొప్పున సేవా పన్ను విధించారు. ఈ క్రమంలో చార్జీలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 2 కిలోమీటర్లకు కనీస చార్జీ రూ.40, ఆపై ప్రతి కిలోమీటర్‌కు రూ.21 చొప్పున క్యాబ్ చార్జీలు ఉన్నాయి. రాత్రి వేళల్లో ఈ చార్జీల పై రూ.25 శాతం అదనంగా వసూలు చేస్తారు. సర్వీసు ట్యాక్సీ వల్ల కనీస చార్జీ రూ.45కి, ఆపై ప్రతి కిలోమీటర్‌కు రూ.25 చొప్పున పెరగొచ్చని క్యాబ్ నిర్వహణ సంస్థలు చెబుతున్నాయి. మరోవైపు ఈ పన్ను విధింపుపై క్యాబ్ నిర్వాహకులూ పెదవి విరుస్తున్నారు. ప్రయాణికుల నుంచి విముఖత వచ్చే అవకాశం ఉందని, ఇది తమ ఉపాధిపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. మిడిల్‌క్లాస్‌కు ఓకే.. బడ్జెట్లో మహిళలకు ఒరిగిందేమీ లేదు. దిగుమతి వస్తువులు, రెస్టారెంట్స్ ఖరీదుగా మారనున్నాయి. విలాస వస్తువులు ధరలూ పెరగనున్నాయి. ఇవన్నీ సంపన్నులకు భారమైనా భరించగలరు. మరోవైపు జ్యువెలరీ, ఫుట్‌వేర్ ధరలు తగ్గనున్నాయి. ఇది మిడిల్‌క్లాస్‌కి మేలు చేసేదే. రూరల్ యూత్‌కి స్టార్టప్స్‌కి ఎంకరేజింగ్‌గా ఉంది. వ్యవసాయంపై మరింత దృష్టి పెట్టాల్సింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిశ్రమకు రూ.37 వేల కోట్ల కేటాయింపు మంచి పరిణామం. - పార్వతీరెడ్డి, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, నార్ ఇన్ఫ్రా ఏపీ,టీజీలపై కేంద్రం వివక్ష ఇది పూర్తిగా ధరలు పెంచే బడ్జెట్. పెట్రోలియం ఉత్పత్తులపై ప్రభుత్వ సబ్సిడీని తగ్గించి, పరోక్షంగా ధరల పెరుగుదలకు కారణమైంది. ప్రభుత్వ వ్యయాన్ని పూర్తిగా నియంత్రిస్తామన్నారు. ఈ నిర్ణయం ధరల పెరుగుదలకు కారణమవుతుంది. మధ్య తరగతి ప్రజలు ఆశించిన స్థాయిలో పన్నులకు సంబంధించి ఆదాయ పరిమితిని పెంచలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు బడ్జెట్లో ప్రాధాన్యంఇవ్వలేదు. సాధారణ ఇన్స్టిట్యూట్లు మినహా కొత్త కేటాయింపుల్లేవు. రెండు తెలుగు రాష్ట్రాల పైనా కేంద్రం వివక్ష చూపింది. రక్షణ, బీమా, మైనింగ్, రైల్వే వంటి కీలక రంగాల్లోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం వల్ల భవిష్యత్తులో దేశ సార్వభౌమాధికారం దెబ్బతినే ప్రమాదం ఉంది. ధరల స్థిరీకరణ నిధికి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించ లేదు. రూ.150 కోట్లతో మహిళలకు భద్రత ఎలా కల్పిస్తారో అర్థం కావడం లే దు. ఓ వైపు వ్యవసాయానికి పెద ్దపీట వేస్తామని చెబుతూనే మరోవైపు నీటి పారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించారు. ఇది ఏదో రకంగా ధరల పెరుగుదలకు కారణమవుతుంది. పారిశ్రామిక వృద్ధి రేటు పెరగాలంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. ఆ దిశగా ఉపాధి అవకాశాలు కల్పించాలి. - ప్రొఫెసర్ నాగేశ్వర్, ఎమ్మెల్సీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఉంది మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ అల్పాదాయ వర్గాల ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చేవిధంగా లేదు. ద్ర వ్యోల్బణాన్ని నియంత్రించే కోణంలో లేదు. బడ్జెట్ కేటాయింపులు వివిధ రంగాలకు అనుకున్నంత మేరకు లేవు. ప్రజలు తమ ఆదాయంలో ఎక్కువ భాగం నిత్యవసరాలు, విద్య, వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారు. ఈ ఖర్చులు తగ్గించే చర్యలు తీసుకోకుండా సబ్బుల ధరలు తగ్గించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ప్రాధాన్య రంగాలను ఇది పూర్తిగా నిరుత్సాహ పరించింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఈ బడ్జెట్ ఉంది. - యనగందుల మురళీధర్‌రావు, హెచ్ఓడీ, ఎకనామిక్స్, ఓయూ -
రెడీ టు ఈట్ విభాగంలోకి వస్తున్నాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల విక్రయ రంగంలో ఉన్న రుచి సోయా ఇండస్ట్రీస్ వచ్చే ఏడాది రెడీ టు ఈట్ విభాగంలోకి ప్రవేశించనుంది. ఇప్పటికే కంపెనీ సోయా ఉత్పత్తులను నూట్రెలా బ్రాండ్‌లో విక్రయిస్తోంది. న్యూట్రెలా ఇన్స్టాంట్ను ఇటీవలే ఉత్తరాదిన ప్రవేశపెట్టారు. సెప్టెంబరుకల్లా వీటిని దక్షిణాదిన పరిచయం చేయనుంది. అల్పాహార ఉత్పత్తులను కూడా తీసుకొస్తామని రుచి సోయా సీవోవో సతేంద్ర అగర్వాల్ గురువారమిక్కడ తెలిపారు. సంయుక్త భాగస్వామితో కలిసి మార్కెట్లోకి తేనున్నట్టు పేర్కొన్నారు. ప్రీమియం సన్‌ఫ్లవర్ నూనె సన్రిచ్ను రీబ్రాండ్ చేసి దక్షిణాది మార్కెట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా కంపెనీ దక్షిణ ప్రాంత వైస్ ప్రెసిడెంట్ అజయ్ మాలిక్, మార్కెటింగ్ హెడ్ అలోక్ మహాజన్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో సన్‌ఫ్లవర్ (పొద్దుతిరుగుడు) నూనె అమ్మకాల్లో ఏడాదిలో 10 శాతం వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారు. బ్లెండెడ్ ఆయిల్‌లోకి..: మిశ్రమ(బ్లెండెడ్) నూనెల విభాగంలోకి ఏడాదిలో అడుగు పెడతామని సతేంద్ర అగర్వాల్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో ఈ విభాగం వాటా 2-3 శాతం మాత్రమే. వృద్ధి 15-20 శాతముందని తెలిపారు. ‘2013-14లో వంట నూనెల వినియోగం 1.9 కోట్ల టన్నులుంది. ఇందులో ప్యాకేజ్డ్ విభాగం వాటా 90 లక్షల టన్నులు. మొత్తం వినియోగం మూడేళ్లలో 2.2 కోట్ల టన్నులకు చేరుకుంటుందని అంచనా. సగటు వినియోగం ప్రపంచంలో 22 కిలోలుంటే, దేశంలో 14 కిలోలకే పరిమితమైంది. ప్యాకేజ్డ్ నూనెల్లో 70 శాతం వినియోగం దక్షిణాది రాష్ట్రాలదే’ అని చెప్పారు. ఉక్రెయిన్ సంక్షోభం మరికొంత కాలం కొనసాగితే సన్‌ఫ్లవర్ నూనె దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆయన చెప్పారు. ఉక్రెయిన్, రష్యాల నుంచి భారత్ ఏటా 15 లక్షల టన్నుల నూనెను దిగుమతి చేస్తోంది. -
అత్తెసరు రేషన్
= ఇంకా దుకాణాలకు చేరని సరుకులు = అరకొరగానే సరఫరా = పత్తాలేని అదనపు కోటా = పట్టింపులేని అధికారులు సాక్షి,సిటీబ్యూరో: కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లుంది..నగరంలో రేషన్ సరఫరా తీరు. పేదలకు ఎంతో సబ్సిడీతో సరుకులు సరఫరా చేస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం..సరుకులను పూర్తిగా సరఫరా చేయడంలో చతికిలపడింది. ఈనెల 14న దసరా పండుగ సమీపిస్తున్నా ఇప్పటివరకు నగరంలోని చాలా దుకాణాలకు సరుకులు చేరలేదు. ఒకవేళ వచ్చినా సగంసగం సరుకులు ఇస్తూ డీలర్లు చేతులు దులిపేసుకుంటున్నారు. నెలనెలా ఇవ్వాల్సిన కోటా పరిస్థితి ఇలా ఉంటే.. పండుగల సమయంలో ఇవ్వాల్సిన అదనపు కోటా పత్తా లేకుండా పోయింది. సాధారణంగా దసరా,దీపావళి, సంక్రాంతి, రంజాన్, బక్రీద్ వంటి పర్వదినాల్లో ప్రభుత్వం రేషన్‌కార్డుదారులకు అదనంగా చక్కెర, పామాయిల్ తదితరవాటిని సరఫరా చేసేది. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. పండుగలు దగ్గరపడుతున్నప్పటికీ అదనపు కోటా ఊసేలేకుండా పోయింది. సీమాంధ్ర ఆందోళన ఫలితం గా అదనపు కోటా దేవుడెరుగు..అసలు కోటాకే ఎసరు వచ్చిపడినట్లయ్యింది. పామాయిల్ దూరం: సీమాంధ్ర ఉద్యమం సెగతో పేద ల వంటనూనె పామాయిల్ దూరమైంది. ఈనెల పా మాయిల్ కోటా ఇప్పటివరకు దుకాణాలకు చేరకపోగా, పండగల అదనపు కోటా జాడలేకపోయింది. గతనెలలో ఆలస్యంగా దశల వారీగా సుమారు 70 శాతం మా త్రమే పామాయిల్ సరఫరా చేశారు. గత రెండునెలలు గా నెల్లూరు నుంచి పామాయిల్ రవాణాకు అడ్డంకు లు ఏర్పడడంతో పూర్తిస్థాయి సరఫరా జరగలేదు. బహిరంగమార్కెట్లో మంచినూనె ధరలు మండిపోతుండడం తో లబ్ధిదారులు పామాయిల్ కోసం దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తీవ్రఇబ్బందులకు గురవుతున్నారు. తగ్గిన గోధుమల కోటా: చౌకధర దుకాణాల ద్వారా గోధుమలు ఇకముందు ఇస్తారో లేదోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రతినెలా కొరత పేరిట దుకాణాలకు కోటా తగ్గిస్తున్నారు. దీంతో ప్రస్తుతం తెల్లకార్డుదారులకు కేవలం ఒకకిలో గోధుమలు, ఒకకిలో పిండి మాత్రమే ఇస్తున్నారు. గతంలో కార్డు ఒక్కంటికి కనీసం 30కిలోల వరకు ఇచ్చేవారు. పండుగల సమయంలో అదనపుకోటాను సైతం కేటాయించేవారు. ప్రస్తుతం అదనపుకోటా ఊసేలేకపోగా, అసలు కోటా కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో పేదలు పిండివంటలకు దూరమయ్యే దుస్థితి ఏర్పడింది.