కోడలిపై వేడి నూనె పోసిన అత్త | aunt hot oil poured on the KODALI | Sakshi
Sakshi News home page

కోడలిపై వేడి నూనె పోసిన అత్త

Published Sun, Oct 12 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM

కోడలిపై వేడి నూనె పోసిన అత్త

కోడలిపై వేడి నూనె పోసిన అత్త

బోధన్‌టౌన్ : మండలంలోని ఊట్‌పల్లిలో అత్తా కోడళ్ల మధ్య వివాదం ఘర్షణకు దారి తీసింది.  గ్రామానికి చెందిన రామస్వామితో కోటగిరి మండలంలోని కొడిచర్లకు చెందిన లావణ్యకు రెండు నెలల క్రితం వివాహమైంది. అత్త మల్లవ్వ, కోడలు లావణ్య మధ్య తరుచూ వివాదాలు చోటు చేసుకునేవి. శనివారం లావణ్య వంట చేస్తుండగా అత్త మల్లవ్వతో మాటలు పెరిగాయి. కోపంతో అత్త మల్లవ్వ  కొడలిపైకి కాగుతున్న వంట నూనెను విసిరి గాయ పర్చింది.దీంతో  లావణ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం బోధన్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. లావణ్య తల్లి ఫిర్యాదు మేరకు మల్లవ్వ పై కేసు నమోదు చేసినట్లు సీఐ రామక్రిష్ణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement