సాక్షి, హైదరాబాద్: సిటీ లైఫ్‌లో ప్రజల దినచర్య బిజీబిజీగా గడుపుతుంటారు. కాలుష్య కోరల్లో ప్రయాణం, ఫాస్ట్ ఫాస్ట్‌గా పరిగెత్తుతూ ఫాస్ట్ పుడ్ సెంటర్‌లో ఆహారం తింటూ.. అలా బతుకు బండిని నడిపిస్తుంటారు. అయితే నగర కాలుష్యాన్ని మనం నియంత్రించడం అంత సులువు కాదు కాబట్టి, కనీసం మనం తినే ఆహారం విషయంలో నాణ్యత ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఇదిలా ఉండగా మరోవైపు ఆహార పదార్థాలే టార్గెట్‌గా కొన్ని ముఠాలు వ్యాపారాలు మొదలుపెట్టాయి.
ఇటీవల నగరంలో కల్తీ అల్లంవెల్లుల్లీ పేస్ట్, ఐస్ క్రీమ్స్, సాస్, చాక్లెట్స్ బాగోతం బయటపడింది. అయితే, తాజాగా పంది కొవ్వుతో కల్తీ నూనెలు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు నేరెడ్‌మెట్ పోలీసులు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని నేరేడ్‌మెట్ పరిధిలోని ఆర్కేపురంలో ఓ వ్యక్తి తాను నివసిస్తున్న ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా పంది కొవ్వుతో వంట నూనెలు తయారు చేస్తున్నాడు.
తొలుత పంది మాంసం విక్రయించే వారి నుంచి కొవ్వు తెచ్చుకుని.. వాటిని వేడి చేసి పలు రకాల కెమికల్స్ కలిపితే అచ్చం వంట నూనెలాగా కనిపించే ఆయిల్స్‌ను తయారు చేయడం.. వాటిని రోడ్డు పక్కన ఉండే ఫాస్ట్‌పుడ్ సెంటర్లకు తక్కువ ధరకు అమ్ముతున్నాడు. ఈ దందా గతకొంత కాలంగా నిర్వహిస్తున్నాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు అతని ఇంటిపై ఆకస్మిక సోదాలు నిర్వహించగా.. కల్తీ గుట్టు మొత్తం బట్టబయలైంది. దీంతో నిందితుడిని నేరెడ్‌మెట్ పోలీసులు అరెస్టు చేశారు.
చదవండి: IT Scam Hyderabad:హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ కుంభకోణం
Comments
Please login to add a commentAdd a comment