హైదరాబాద్ : జీఎస్టీ పన్నుల విధానంపై ఆస్ట్రేలియా పర్యటనలో అధ్యయనం చేశామని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో ఈటల రాజేందర్ మాట్లాడుతూ... అన్ని రాష్ట్రాల ఆర్థిక నిపుణులు ఈ పర్యటనలో పాల్గొన్నారని చెప్పారు.
రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా జీఎస్టీ అమలు చేయాలని కేంద్రానికి ఈటల విజ్ఞప్తి చేశారు. వ్యాట్ అమలు తీరులో రాష్ట్రాలకు కొంత అన్యాయం జరిగిందన్నారు. అది పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరతామని ఈటల రాజేందర్ వెల్లడించారు.