సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బకాయిలు చెల్లించకపోవడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. జీఎస్టీ బకాయిలపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రాలకు రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఎగ్గొట్టేందుకు పథకం వేస్తోందని వ్యాఖ్యానించారు. జీఎస్టీ చట్టంలో పండమిక్ యాక్ట్, కరోనా యాక్ట్ లాంటి ఏ ఇతర యాక్ట్‌లు లేవని అన్నారు. రాష్ట్రాలకు సెస్ చెల్లించమంటే ఎలా అని, అటార్నీ జర్నల్ ప్రకారం లీగల్‌గా అయిన ఏ విధంగా అయిన రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ బకాయిల చెల్లించాల్సిందే. కరోనా వచ్చింది, జీఎస్టీ ఇవ్వమంటే కుదరదని తెలంగాణ రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదని స్పష్టం చేశారు. కోవిడ్ (కరోనా) అనేది ఒక్క కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే కాదని, అన్ని రాష్ట్రాలకు ఇదే పరిస్థితి ఉందని గుర్తు చేశారు. కరోనాతో అన్ని రాష్ట్రాలు ఆదాయాలు కోల్పోయావని పేర్కొన్నారు.
ఇలాంటి క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదుకోవాలి, కానీ వచ్చే సెజ్‌ను ఇవ్వమంటే ఎలా అని ప్రశ్నించారు. మనది అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం కనుక, జీఎస్టీలో తెలంగాణ ప్రభుత్వం చేరేందుకు ఆలోచన చేసింది. కానీ గత మూడు సంవత్సరాలలో తెలంగాణ నుండి వసూలయింది 18 వేల 32 కోట్లయితే రిటర్న్ వచ్చింది మాత్రం రూ.3,200 కోట్లు మాత్రమే అని అన్నారు. కోవిడ్ వలన రాష్ట్రం 34 శాతం ఆదాయం కోల్పోయిందని పేర్కొన్నారు. సీఎస్టీ ఉన్నప్పుడు జీఎస్టీలో చేరకపోతే 25 వేల కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చేది. జీఎస్టీలో చేరడం వలన రూ.25వేల కోట్లు నష్టపోయామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రూ. 3 లక్షల కోట్లు సెస్ లోన్ తీసుకొని చెల్లించాలి. అయితే 14 శాతం గ్రోత్ రేట్ ప్రకారం సెస్ చెలిస్తామని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఇప్పుడు దాన్ని పది శాతం తగ్గించే అధికారం ఎక్కడిదని హరీశ్ రావు విమర్శించారు.అయితే అప్పటి దివంగత కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ దీనిపై స్పందించిన విషయాన్ని హరీశ్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రాల సెజ్ తగ్గినా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని అరుణ్ జైట్లీ చెప్పారని.. కానీ ఇప్పుడు చేస్తున్నది ఏంటని సూటిగా ప్రశ్నలు సంధించారు.
గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా తెలంగాణకు రావాల్సింది ఇవ్వలేదని, మీరు కూడా ఇవ్వరా అని జీఎస్టీ చట్టం చేసిన సమయంలో ఆర్ధిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ప్రశ్నిస్తూ.. జీఎస్టీ సమావేశాలలో అరుణ్ జైట్లీ అదేం లేదంటూ అందరికి న్యాయం చేస్తామని చెప్పినట్లు తెలిపారు. రాష్ట్రాల హక్కులను ఒక్కొక్కటి కాలరాస్తున్నారని ఈటెల మండిపడ్డారు. ఇలా కేంద్ర ప్రభుత్వం అన్ని వారి ఆధీనంలోకి తీసుకుంటుందని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడే చెప్పారని గుర్తు చేశారు.
అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీలో విస్తృతమైన అధికారులు ఉన్నాయని, కానీ జీఎస్టీ సెజ్‌ను తగ్గించడాన్నిరాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని అన్నారు. కాగా చట్టానికి లోబడే రాష్ట్రాలకు జీఎస్టీ సెజ్ లు ఇవ్వాలని తెలిపారు. ఒకవేళ ఇవ్వకపోతే పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. జీఎస్టీ అంశంపై ఆరు రాష్ట్రాల ఫైనాన్స్ మినిస్టర్‌ల సమావేశంలో కూడా చర్చించామని పేర్కొన్నారు. అవసరమైతే తాము లీగల్‌గా కూడా పోరాడతామని, పది శాతం ఏ రకంగా తగ్గిస్తారని అన్నారు. మరోవైపు పార్లమెట్‌లో చట్టం చేశాక మీరెలా తగ్గిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈటెల రాజేందర్ విమర్శించారు. చదవండి: జీఎస్టీ పరిహారం.. కేంద్రం బాధ్యతే
Comments
Please login to add a commentAdd a comment