* 2014-15కు అధికారుల అంచనా
* తెలంగాణ వ్యాట్ ఆదాయం రూ.28,514 కోట్లు
* వచ్చే ఏడాదిలో ఆంధ్రాకు రూ.28,322 కోట్లు
* తెలంగాణకు వ్యాట్ ద్వారా రూ.31,078 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాలకు విలువ ఆధారిత పన్ను (వ్యాట్) ద్వారా అధికమొత్తంలో ఆదాయం సమకూరుతుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో వస్తు వినియోగం ఆధారంగా వ్యాట్‌తో ఏ రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుందో అధికార యంత్రాంగం అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో సైతం తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని అంచనా వేసింది. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చే ఆదాయూన్ని విభజించిన తర్వాత తెలంగాణకు 52 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 48 శాతం మేర ఆదాయం వస్తోంది. 2014-15లో వ్యాట్ ద్వారా ఏపీకి రూ.25,986 కోట్లు సమకూరనుండగా, తెలంగాణకు రూ.28,514 కోట్లు రానున్నారుు. అలాగే 2015-16లో వ్యాట్‌తో ఏపీకి రూ.28,322 కోట్లు రానుండగా, తెలంగాణకు రూ.31,078 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అలాగే ప్రస్తుతం, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో ఎక్సైజ్, రవాణా, రిజస్ట్రేషన్లు..స్టాంపులు, గనులు, అటవీ, ల్యాండ్ రెవెన్యూ రంగాల ద్వారా రెండు రాష్ట్రాలకు ఎంత ఆదాయం వస్తుందో కూడా అంచనా వేశారు. ఈ అంచనాల ప్రకారం.. ప్రస్తుత పన్నుల విధానం, లెసైన్స్, పన్ను రేటుల ఆధారంగా వాణిజ్య పన్నుల ఆదాయంలో 9 శాతం మేర వృద్ధి ఉంటుది. ఎక్సైజ్ ఆదాయంలో వృద్ధి 5 శాతం మేర ఉంటుంది. స్టాంపులు..రిజిస్ట్రేషన్ల ఆదాయూనికి సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 25 శాతం మేర పెరుగుదల ఉంటుంది. కృష్ణా, గుంటూరు, ఒంగోలు జిల్లాల్లో 20 శాతం మేర, మిగిలిన జిల్లాల్లో 15 శాతం మేర పెరుగుదల ఉంటుంది. రవాణా రంగం ద్వారా వచ్చే ఆదాయంలో పెద్ద పెరుగుదల ఉండదని, మొత్తం మీద 3 శాతం మేర మాత్రమే ఆదాయ వృద్ధి ఉంటుందని అధికారుల అంచనా వేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో వాణిజ్య పన్నుల బకాయిలు రూ.8,500 కోట్లుగా అంచనా వేశారు. కొన్ని సంస్థలకు పన్ను రాయితీలో భాగంగా రూ.350 కోట్లను ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండు అంశాలపై ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర ప్రభుత్వాలు సంప్రదింపుల ద్వారా ఒక అవగాహనకు రావాల్సి ఉంటుంది. మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలో కేంద్ర అమ్మకం పన్ను పరిహారంగా కేంద్రం నుంచి రూ.11,277 కోట్లు రావాల్సి ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ బ్రూవరీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆదాయం పన్నుగా రూ.4,000 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఈ రెండు అంశాలపై కూడా రెండు ప్రభుత్వాలు సంప్రదింపులు ద్వారా ఒక ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఇదేవిధంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పరిష్కారాలు చూపెట్టని అంశాలను రెండు రాష్ట్రాలు సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అవగాహనతో నిధుల పంపిణీని చేసుకోవాల్సి ఉంటుంది.
ఏపీ వ్యాట్ ఆదాయం రూ.25,986 కోట్లు
Published Sat, Jun 7 2014 5:10 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement