సాక్షి, హైదరాబాద్ : 2020 హజ్ యాత్రకు సంబంధించి సౌదీ ప్రభుత్వం ఏ సమాచారం తెలియజేయడం లేదు. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెలలో హజ్ యాత్ర ప్రారంభం కావాలి. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు జరగలేదని, దీంతో కేంద్ర హజ్ కమిటీ ఈ ఏడాది యాత్ర రద్దయినట్టేనని చెబుతోందని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మసీవుల్లా, ఎగ్జిక్యూటివ్ అధికారి బి.షఫీవుల్లా బుధవారం విలేకరులకు తెలిపారు. ఈఏడాది హజ్ యాత్రకు ఎంపికైన యాత్రికులు మొదటి విడతగా రూ. 81 వేలు జమ చేశారన్నారు. (హజ్ యాత్రపై కోవిడ్ ప్రభావం)
మరికొంత మంది రెండవ కిస్తు రూ.1.20 లక్షలు కూడా చెల్లించారని, రాష్ట్ర యాత్రికులు చెల్లించిన డబ్బు కేంద్ర హజ్ కమిటీ వద్ద ఉందన్నారు. ఈ ఏడాది కరోనా ప్రభావంతో హజ్ యాత్ర రద్దయిన నేపథ్యంలో కేంద్ర హజ్ కమిటీ యాత్రికులకు వంద శాతం డబ్బులు తిరిగి ఇస్తుందన్నారు. తమ యాత్రను రద్దు చేసుకుంటూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి తిరిగి వారి ఖాతాలో డబ్బులు జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు. యాత్ర రద్దు చేసుకునే వారు కేంద్ర హజ్ కమిటీ వెబ్‌సైట్ ద్వారా చేసుకోవచ్చని లేని పక్షంలో రాష్ట్ర హజ్ కమిటీని 040–23298793లో సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment