భారత కార్మికులకు న్యాయం చేస్తాం
Published Thu, Aug 4 2016 10:35 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
రాయికల్ : సౌదీలోని భారతీయ కార్మికులందరికి న్యాయం చేసేలా చర్యలు చేపడతామని సౌదీ కార్మిక శాఖ మంత్రి అల్‌హక్‌బాని అన్నారు. గురువారం భారత విదేశాంగ మంత్రి వీకే.సింగ్ సౌదీలోని రియాద్‌లో పర్యటించగా సౌదీ కార్మిక శాఖ మంత్రితో భారతీయ కార్మికులు పడుతున్న కష్టాలపై వివరించారు. సానుకూలంగా విన్న కార్మిక శాఖ మంత్రి దేశరాజు సల్మాన్ ఆదేశాల మేరకు S భారతీయ కార్మికులను ఆదుకుంటామని, అంతేకాకుండా యుద్ధప్రతిపాదికన స్వదేశాలకు పంపించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మరికొంత మందికి ఉపాధి కల్పించేలా ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ సంప్రదింపుల విషయాలను భారత విదేశాంగ సహాయ మంత్రి వీకే.సింగ్, భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు సమాచారం అందించారు. సౌదీలోని భారత కార్మికులకు ఆహార ,వైద్యసేవాలçను కార్మికులకు అందిస్తామని ఎ వరూ ఆందోళన చెందవద్దన్నారు. అవసరమైతే న్యాయ సలహాలు పొందేందుకు న్యాయవాదులను సైతం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
Advertisement