Military Parade
-
Trooping the Colour: ప్రజల ముందుకు కేట్ మిడిల్టన్
లండన్: క్యాన్సర్‌తో బాధపడుతూ బాహ్య ప్రపంచానికి దూరంగా గడుపుతున్న బ్రిటన్ యువరాణి, యువరాజు విలియం భార్య కేట్ మిడిల్టన్ చాలా నెలల తర్వాత ప్రజల ముందుకు వచ్చారు. బ్రిటన్ రాజు ఛార్లెస్–3 జన్మ దినోత్సవాల్లో భాగంగా లండన్‌లో శనివారం అధికారికంగా సైనిక పరేడ్ నిర్వహించారు. ‘ట్రూపింగ్ ది కలర్’ పేరిట జరిగే ఈ కార్యక్రమానికి బ్రిటన్ రాజకుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ప్రఖ్యాత బకింగ్‌హామ్ ప్యాలెస్ బాల్కనీలో భర్త విలియం, పిల్లలతో పాటు నిల్చున్న కేట్‌ను చూసేందుకు జనం ఆసక్తిచూపించారు. గత ఏడాది డిసెంబర్ తర్వాత కేట్ బయటకు రావడం ఇదే తొలిసారి. క్యాన్సర్ సోకి చికిత్స చేయించుకుంటున్నట్లు ఈ ఏడాది మార్చి నెలలో కేట్ ప్రకటించాక ఆమె ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన వ్యక్తమైన విషయం తెల్సిందే. ఆమె కోమాలోకి వెళ్లారని, రాచరిక విధులు నిర్వర్తించలేరని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో 42 ఏళ్ల కేట్ ఎట్టకేలకు ప్రజల ముందుకు రావడంతో బ్రిటన్ రాజకుటుంబ అనుకూల వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. చికిత్స నుంచి మెల్లిగా కోలుకుంటున్నానని, శనివారం జరిగే జన్మదిన వేడుకలకు హాజరవుతానని కేట్ శుక్రవారమే ప్రకటించారు. -
అణు క్షిపణులతో ఉత్తరకొరియా పరేడ్
సియోల్: ఉత్తరకొరియా శక్తివంతమైన అణు క్షిపణులను ప్రదర్శించింది. గురువారం సాయంత్రం రాజధాని ప్యాంగ్యాంగ్లో జరిగిన సైనిక పరేడ్‌లో రష్యా, చైనా ప్రతినిధులతో కలిసి అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ వీటిని తిలకించారు. 1950–53 కొరియా యుద్ధానికి విరామం పలికి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఉత్తరకొరియా పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న వేళ అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, రష్యాతో బంధం మరింత బలోపేతమైందని చాటేందుకే కిమ్ పరేడ్‌ను వేదికగా మార్చుకున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఉత్తరకొరియా వ్యవస్థాపకుడు, కిమ్ తాత పేరుతో ప్యాంగాంగ్‌లో ఉన్న కిమ్–2 సంగ్ స్వే్కర్లో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి లి హొంగ్జోంగ్లతో కలిసి ప్రదర్శనను కిమ్ వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది తరలివచ్చారు. సైనిక కవాతు మధ్య యుద్ధ ట్యాంకులు, భారీ ఖండాంతర క్షిపణు(ఐసీబీఎం)లతో కూడిన ట్రక్కులు కదులుతుండగా ముగ్గురూ చేతులు ఊపుతున్న ఫొటోలను అధికార వార్తాసంస్థ కేసీఎన్ఏ శుక్రవారం విడుదల చేసింది. కిమ్ ప్రసంగించిందీ లేనిదీ వెల్లడించలేదు. క్షిపణి వ్యవస్థలతో పాటు కొత్తగా అభివృద్ధి చేసిన నిఘా, అటాక్ డ్రోన్లను కూడా ప్రదర్శించారు. ఈ ఐసీబీఎంలన్నీ రష్యా డిజైన్ల ఆధారంగా తయారైనవేనని విశ్లేషకులు అంటున్నారు. -
North Korea: కిమ్ సైన్యంలో 'జాంబీలు'.. ఫొటో వైరల్..!
సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. ఇటీవల సైనిక పరేడ్‌ను అట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరేడ్‌లో శక్తిమంతమైన ఆయుధాలతోపాటు అత్యాధునిక, భారీ అణు క్షిపణులను ప్రదర్శించి శత్రు దేశాలకు తన సత్తా ఏంటో తెలిసేలా చేశారు. అయితే సైనిక పరేడ్‌లో పాల్గొన్న ఓ యూనిట్ అందరి దృష్టిని ఆకర్షించింది. అదే జాంబీ యూనిట్. కిమ్ సైనిక పరేడ్‌లో జాంబో యూనిట్‌ను చూసి అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. జాంబీల్లా కన్పిస్తున్న ఈ సైనికుల పరేడ్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. మొహానికి రంగులు వేసుకుని ఒళ్లంతా పచ్చగడ్డి కప్పుకున్నట్లుగా కన్పించిన సైనిక వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. ఈ పరేడ్‌లో క్షిపణులు, అత్యాధునిక ఆయుధాలు, రాకెట్ల కంటే జాంబీ యూనిట్‌ను చూసినప్పుడే తాను భయపడ్డాని అతను చెప్పుకొచ్చాడు. కాగా.. కొరియన్ పీపుల్ రివల్యూషన్ ఆర్మీ వార్షికోత్సవం సందర్భంగా కిమ్ బుధవారం ఘనంగా సైనిక పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పదేళ్ల కూతురు కిమ్ జూ అయే కూడా పాల్గొన్నారు. దీంతో కిమ్ తర్వాతే ఈమే ఉత్తర కొరియాను పాలించేందుకు సన్నద్ధమవుతోందనే ప్రచారం ఊపందుకుంది. కిమ్ జూ అయే బహిరంగంగా ప్రజలకు కనిపించడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. చదవండి: యద్ధాన్ని ఆపేలా పుతిన్‌ని మోదీ ఒప్పించగలారా? -
అట్టహాసంగా ఉత్తర కొరియా సైనిక పరేడ్
సియోల్: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ తన సైనిక బలాన్ని మరోసారి ప్రదర్శించారు. రాజధాని పాంగ్యాంగ్లో బుధవారం రాత్రి సైనిక పరేడ్ అట్టహాసంగా నిర్వహించారు. అమ్ముల పొదిలోని కీలక ఆయుధాలతోపాటు అత్యాధునిక, భారీ అణు క్షిపణులకు సైతం ఈ పరేడ్‌లో చోటుకల్పించారు. కిమ్ జోంగ్ ఉన్‌తోపాటు ఆయన కుమార్తె కిమ్ జూ అయే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పది సంవత్సరాల వయసున్న కిమ్ జూ అయే భవిష్యత్తులో ఉత్తర కొరియా పాలనా పగ్గాలు చేపట్టడం ఖాయమన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెను ఆ దిశగా సన్నద్ధం చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కిమ్ జూ అయే బహిరంగంగా ప్రజలకు కనిపించడం ఇది ఐదోసారి. ఆమె కిమ్‌కు రెండో సంతానమని తెలుస్తోంది. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె తండ్రితోపాటు కనిపించారు. మరిన్ని అణ్వాయుధాలను సొంతం చేసుకోవడానికి కిమ్ తీవ్రంగా శ్రమిస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో నూతన ఘన–ఇంధన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా పరీక్షించబోతున్నట్లు అంచనా వేస్తున్నారు. తాజా సైనిక పరేడ్‌లో డజనుకుపైగా ఖండాంతర బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రదర్శించారు. పొరుగు దేశమైన దక్షిణ కొరియాతోపాటు అగ్రరాజ్యం అమెరికాతో ఉత్తర కొరియా కయ్యానికి కాలు దువ్వుతోంది. పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల వనరులు పరిమితంగా ఉన్నప్పటికీ అత్యాధునిక అణ్వాయుధాల తయారీపై కిమ్ దృష్టి పెట్టడం ఆసక్తికరంగా మారింది. -
కనిపించకుండా పోయిన కిమ్.. ఆఖరికి సైనిక వార్షికోత్సవానికి..
తరుచుగా వార్తలో నిలిచి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా అదృశ్యమై మరోసారి వార్తల్లో నిలిచారు. దీంతో ఆయనకు ఆరోగ్యం బాగోలేదని అందువల్లే.. గతకొద్ది రోజులుగా ఆర్మీ ముందుకు రావడం లేదంటూ ఉహగానాలు హల్చల్ చేస్తున్నాయి. అదీగాక ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్లో పీపుల్స్ ఆర్మీ వ్వవస్థాపక వార్షికోత్సవ పురస్కరించుకుని సాముహిక కవాతులను నిర్వహించనున్నారు. ఈ సమయంలో ఆయన కనిపంచకపోవటం ఉత్తర కొరియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐతే కిమ్ అనుహ్యంగా గత నెల రోజులుగా బహిరంగంగా కనిపించటం లేదని స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. అఖరికి ఆదివారం జరిగిన పొలిబ్యూటో సమావేశాన్ని కూడా కిమ్ దాటవేసినట్లు సమాచారం. వాస్తవానికి కిమ్ ఇలా గతంలో 2014లో దాదాపు 40 రోజుల పాటు పబ్లిక్‌గా కనిపించకుండా ఉన్నట్లు ఉత్తర కొరియా స్థానిక మీడియా పేర్కొంది. కానీ సరిగ్గా ఇదే సమయంలో పీపుల్స్ ఆర్మీ 75వ వ్యవస్థాపక వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం లేదా బుధవారం ప్యోంగ్యాంగ్లో సాముహిక కవాతులు నిర్వహించనుంది. అయితే వార్షికోత్సవంలో కనిపిస్తాడా లేదా అనేది సందిగ్ధంగా ఉంది. అలాగే కిమ్ కూడా ఈ సాముహిక కవాతు ప్రదర్శన ద్వారా తన యుద్ధ సన్నద్ధత సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉత్సుకతతో ఉన్నారు కూడా. ఇదిలా ఉండగా, మరోవైపు ఈ వార్షికోత్సవాన్ని కిమ్ అడ్వాంటేజ్‌గా తీసుకుని తన అణ్వాయుధాల క్షిపణి సామర్థాన్ని ప్రదర్శిస్తుందేమనని యూఎస్ దాని మిత్ర దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. అదీగాక ఇటీవలే దక్షిణ కొరియా, యూఎస్ ఉమ్మడి సైనిక విన్యాసాలపై ఉత్తరకొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే యూఎస్ సైనిక ఎత్తుగలను తిప్పికొట్టేలా అత్యంత శక్తిమంతమైన అణ్వాయుధాలను ప్రయోగిస్తానని బెదిరింపులకు దిగింది కూడా. అంతేగాక ఉత్తరకొరియా 2022లోనే దాదాపు 70 కంటే ఎక్కువ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇందులో దక్షిణ కొరియాలోని లక్ష్యాలను చేధించడానికి లేదా యూఎస్ ప్రధాన భూభాగాన్ని చేరుకునేనే సామర్థ్యం ఉన్న అణ్వయుధాలు ఉన్నాయి. (చదవండి: యూఎస్‌లో పోలీసులకు పట్టుబడ్డ తెలుగు అబ్బాయ్) -
Russia-Ukraine war: యుద్ధ పాపం పశ్చిమ దేశాలదే
మాస్కో/కీవ్: పొరుగుదేశం ఉక్రెయిన్‌పై తాము ప్రారంభించిన సైనిక చర్యను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి సమర్థించుకున్నారు. పశ్చిమ దేశాల విధానాలే తమను ఉక్రెయిన్‌పై యుద్ధానికి పురికొల్పాయని స్పష్టం చేశారు. ఆయా దేశాల చర్యకు ప్రతిచర్యగానే ఈ సైనిక చర్యకు శ్రీకారం చుట్టామన్నారు. రష్యా రాజధాని మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో సోమవారం ‘విక్టరీ డే’ వేడుకల్లో పుతిన్ పాల్గొన్నారు. మిలటరీ పరేడ్‌ను తిలకించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే, పరిశీలకులు అంచనా వేసినట్లు పుతిన్ కీలక ప్రకటనలేదీ చేయలేదు. ఉక్రెయిన్‌పై యుద్ధవ్యూహంలో మార్పు, పూర్తిస్థాయి యుద్ధ ప్రకటన గురించి ప్రస్తావించలేదు. 1945లో నాజీలపై రెడ్ ఆర్మీ సాగించిన పోరాటానికి, ఇప్పుడు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి మధ్య పోలికలు ఉన్నాయని పరోక్షంగా వెల్లడించారు. సరిహద్దుల అవతలి నుంచి తమ మాతృభూమికి ముప్పు పొంచి ఉండడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని పుతిన్ తేల్చిచెప్పారు. ఉక్రెయిన్‌పై దండయాత్ర అత్యవసర చర్యేనని ఉద్ఘాటించారు. రష్యాకు ముప్పు రోజురోజుకూ పెరుగుతోందన్నారు. తాము సరైన సమయంలో, సరైన రీతిలో స్పందించామని అన్నారు. రష్యా భద్రతకు హామీతోపాటు ‘నాటో’ విస్తరణ యోచనను విరమించుకోవాలని కోరామన్నారు. అయినా ఫలితం కనిపించలేదని చెప్పారు. రష్యా దళాలు సొంతదేశం భద్రత కోసమే ఉక్రెయిన్‌లో వీరోచితంగా పోరాడుతున్నాయని ప్రశంసించారు. రష్యాపై దాడులు చేయడానికి ఉక్రెయిన్ గతంలోనే ప్రణాళికలు రచించిందని పుతిన్ ఆరోపించారు. ఉక్రెయిన్‌పై దాడులు ఇక ఉధృతం! రష్యా క్షిపణి దాడులను తీవ్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని ఉక్రెయిన్ సైన్యం సోమవారం తమ ప్రజలను హెచ్చరించింది. రష్యాలోని బెల్గోరాడ్ ప్రాంతంలో 19 బెటాలియన్ టాక్టికల్ గ్రూప్స్ సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. పుతిన్‌కు విజయం అసాధ్యం: జి–7 రష్యా నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిషేధించాలని జి–7 దేశాధినేతలు నిర్ణయానికొచ్చారు. అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ దేశాల అధినేతలు ఆదివారం రాత్రి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వర్చువల్‌గా భేటీ అయ్యారు. ఈ యుద్ధంలో పుతిన్ విజయం దక్కడం అసాధ్యమని జి–7 దేశాల నాయకులు తేల్చిచెప్పారు. కాగా, పోలండ్‌లోని రష్యా రాయబారి సెర్గీ అండ్రీవ్‌కు నిరసన సెగ తగిలింది. వార్సాలోని సోవియట్ సైనిక శ్మశాన వాటికలో దివంగత రెడ్ ఆర్మీ సైనికులకు నివాళులర్పించకుండా అండ్రీవ్‌ను అడ్డుకున్నారు. ఆయనపై ఎర్రరంగు చల్లారు. త్వరలో మాకు రెండు ‘విక్టరీ డే’లు: జెలెన్స్కీ త్వరలో తాము రెండు విక్టరీ డేలు జరుపుకోబోతున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ఈ మేరకు సోమవారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో తమ పూర్వీకుల ప్రాణ త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఉక్రెయిన్ ప్రజలు విజయం సాధించారని, ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలోనూ కచ్చితంగా నెగ్గుతామని ఉద్ఘాటించారు. తద్వారా త్వరలోనే రెండు విక్టరీ డేలు జరుపుకుంటామన్నారు. కొందరికి(రష్యా) ఒక్క విక్టరీ డే కూడా ఉండబోదని వ్యాఖ్యానించారు. -
అసలు చూస్తున్నది కిమ్నేనా? 20 కిలోలు తగ్గిండు.. మనిషి మారిండు
పోంగ్యాంగ్: నవశకం నియంతగా పేరు పొందిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ మళ్లీ బహిరంగ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యాడు. చాలా రోజుల తర్వాత కనిపించిన కిమ్ శరీరాకృతి మారింది. ఇంతకుముందు బొద్దుగా కనిపించే కిమ్ ఈసారి చాలా సన్నబడి కనిపించాడు. ఒక్కసారిగా అతడి మార్పు చర్చనీయాంశమైంది. చివరిసారి కనిపించినప్పుడు అతడి తలపై ఉన్న ఒక గుర్తు గురించి సర్వత్రా చర్చ జరగ్గా ఇప్పుడు కిమ్ బక్కగా అవ్వడం ఆసక్తికరంగా మారింది. 73వ మిలిటరీ పరేడ్ సందర్భంగా ప్యాంగ్యాంగ్లో నిర్వహించిన కార్యక్రమంలో కిమ్ కపించాడు. గతానికి కన్నా భిన్నంగా చలాకీగా.. హుషారుగా.. నవ్వుతూ కనిపించాడు. ఈ సందర్భంగా అతడి లుక్స్ వైరల్‌గా మారాయి. ఆయన తాత, ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సుంగ్ మాదిరి హెయిర్ స్టైల్లో కనిపించాడు. కొన్ని నెలలుగా ఆయన సన్నబడడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బరువు తగ్గేలా కసరత్తులు చేశారు. సన్నబడిన అనంతరం కనిపించడం ఇదే తొలిసారి. సైనిక పరేడ్‌లో ఎప్పుడూ లేని విధంగా కిమ్ కనిపించాడు. ఇద్దరు పిల్లలతో కలిసి దరహాసం చేస్తూ ముందుకు కదిలాడు. ఎంతో ఉత్సాహంగా సైనికుల పరేడ్‌ను తిలకించారు. ఈ సందర్భంగా సైనికులకు అభివాదం చేస్తూ ముందుకుసాగాడు. కిమ్ ఆరోగ్యంపై అంతర్జాతీయంగా ఎప్పుడూ చర్చ సాగుతోంది. 2018లో ఓ టీవీ ఫుటేజ్‌లో కిమ్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత అతడి ఆరోగ్యం క్షీణించిందని వార్తలు వచ్చాయి. అందుకే అతడి సోదరి ప్రభుత్వ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తోందని చర్చ నడిచింది. అలా చర్చ జరుగుతున్నప్పుడే కిమ్ అలా మళ్లీ మీడియా ముందుకు ప్రత్యక్షమవుతుంటాడు. కిమ్ ఒకప్పుడు 140 కిలోల బరువు ఉండేవాడు. అనంతరం కొన్నిరోజులు బరువు తగ్గాడు. అదే కొనసాగిస్తూ ఇప్పుడు 100కు చేరువయ్యాడని తెలుస్తోంది. తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. కిమ్ చికిత్స పొందుతున్నట్లు చర్చ నడుస్తోంది. ఈ సమయంలో అతడి సోదరి వ్యవహారాలు చూసుకుంటోంది. తాజాగా కిమ్ 20 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. -
అమెరికా మా ప్రధాన శత్రువు: కిమ్ జాంగ్ ఉన్
ప్యోంగ్యాంగ్: మరికొద్ది రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ పదవి కాలం ముగియనుండటంతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ దుందుడుకు చర్యలకు దిగారు. తాజాగా రాజధాని ప్యోంగ్యాంగ్లోని కిమ్ ఇల్ సుంగ్ స్క్వేర్‌లో గురువారం జరిగిన సైనిక కవాతులో కిమ్ జాంగ్ ఉన్న కొత్త సబ్‌మెరైన్ లాంచ్ బాలిస్టిక్ మిస్సైల్‌ని (ఎస్ఎల్బీఎం) ఆవిష్కరించినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా వెల్లడించింది. పాలక వర్గం వర్కర్స్ పార్టీ కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా ఈ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా కిమ్ అమెరికాను తన దేశ ప్రధాన శత్రువుగా ప్రకటించారు. ఇక నూతనంగా ఆవిష్కరించిన సబ్‌మెరైన్ లాంచ్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రదర్శనని కిమ్ పర్యవేక్షించారు. ఇక దీనిలో "భూభాగం వెలుపల ముందస్తుగా శత్రువులను గుర్తించి పూర్తిగా నాశనం చేసే శక్తివంతమైన అద్భుతమైన సామర్ధ్యం కలిగిన రాకెట్లు" ఉన్నాయని ఉత్తర కొరియా మీడియా వెల్లడించింది. కొరియా ద్వీపకల్పానికి అవతల పరిధిలో ఉన్న టార్గెట్లని కూడా ఈ రాకెట్లు నాశనం చేస్తాయని ఉత్తర కొరియా మీడియా వెల్లడించింది. కవాతులో సైనికుల వరుసలు, మిలిటరీకి చెందిన ట్యాంకులు, రాకెట్ లాంచర్లు ఉన్నాయి. వీటికి చివర్లో, విశ్లేషకులు అభిప్రాయపడుతున్న కొత్త రకం స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణుల కనిపించాయి. "ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఆయుధం సబ్‌మెరైన్ లాంచ్ బాలిస్టిక్ క్షిపణి. ఒకదాని తరువాత ఒకటి స్వ్కేర్‌లోకి ప్రవేశించి, విప్లవాత్మక సాయుధ దళాల శక్తిని శక్తివంతంగా ప్రదర్శిస్తుంది" అని అధికారిక కేసీఎన్ఏ వార్తా సంస్థ తెలిపింది. ఉత్తర కొరియా నీటి అడుగున నుంచి అనేక ఎస్ఎల్బీఎంలను పరీక్షించింది. ఇక ప్రస్తుతం ఉత్తర కొరియా క్షిపణులను మోయడానికి కార్యాచరణ జలాంతర్గామిని అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: ‘చైనా’ నుంచి ఎల్లోడస్ట్; ఉ. కొరియా వార్నింగ్!) జాతీయ మీడియా విడుదల చేసిన ఫోటోల్లో ఎస్ఎల్బిఎమ్ను పుక్‌గుక్సాంగ్-5 అనే లేబుల్ ఉంది. ఇది అక్టోబర్‌లో నిర్వహించిన సైనిక కవాతులో ఆవిష్కరించబడిన పుక్‌గుక్సాంగ్-4 కు అప్డేటెడ్ వర్షన్‌గా భావిస్తున్నారు. అక్టోబర్ పరేడ్ మాదిరిగా కాకుండా, గురువారం నిర్వహించిన పరేడ్‌లో ఉత్తర కొరియా తన అతిపెద్ద ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను (ఐసీబీఎంలు) ప్రదర్శించలేదు. ఇది అమెరికాలో ఎక్కడైనా అణు వార్‌హెడ్‌ను అందించగలవని నమ్ముతారు. నిషేధించబడిన అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాల నిర్వహణ వల్ల ఉత్తర కొరియాపై అంతర్జాతీయంగా అనేక ఆంక్షలు ఉన్న సంగతి తెలిసిందే. (చదవండి: భారీ క్షిపణిని ప్రదర్శించిన ఉ.కొరియా) ఇదేకాక ప్రస్తుతం ఈ దేశం ఇంకా లాక్‌డౌన్‌లోనే ఉంది. గత జనవరిలో పొరుగున ఉన్న చైనాలో మొదట ఉద్భవించిన కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ఉత్తర కొరియా దాని సరిహద్దులను మూసివేసింది. ఈ చర్యలు ఇప్పటికే కుంటుపడిన ఆర్థిక వ్యవస్థని మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇక వాషింగ్టన్లో నాయకత్వ మార్పు ఉత్తరకొరియాకు సవాలుగా మారనుంది. బైడెన్.. ఒబామా పరిపాలన కాలంలో అనుసరించిన "వ్యూహాత్మక సహనం" విధానంతో సంబంధం కలిగి ఉన్నాడు. అలానే అధ్యక్ష చర్చల సందర్భంగా బైడెన్, కిమ్‌ను "దుండగుడు" గా వర్ణించాడు. బైడెన్ ఆధ్వర్యంలో మరింత సనాతన దౌత్య విధానాలకు అమెరికా తిరిగి వస్తుందని భావిస్తున్నారు. ఇవన్ని ఉత్తర కొరియాకు ఇబ్బందిగా మారనున్నాయి. -
ఒక్కసారిగా ఏడ్చేసిన కిమ్
ప్యాంగాంగ్: ఉత్తర కొరియాలోని అధికార వర్కర్స్ పార్టీ పరేడ్‌లో మునుపెన్నడూ చూడని సంఘటన జరిగింది. పరమ క్రూరుడు, నియంతగా పేరుపడ్డ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రసంగం మధ్యలో కన్నీరు పెట్టుకున్నారు. అధికార వర్కర్స్ పార్టీ 75వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పరేడ్ నిర్వహించారు. దేశ ప్రజల కష్టాలు, సైనికులకు కృతజ్ఞతలు చెప్పే సమయంలో ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తొలిసారిగా దేశ ప్రజలకు ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. అంతర్జాతీయంగా ఆంక్షలు, తుపానులు, కరోనా మహమ్మారి ఆర్థిక ప్రగతికి అవరోధాలుగా మారాయని అన్నారు. ఆ విషయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోయానని చెప్పారు. తనపై ఉంచిన అపార నమ్మకానికి తగ్గట్టుగా ఏమీ చేయలేకపోయిందుకు సిగ్గు పడుతున్నానని కిమ్ అన్నారు. దేశ ప్రజలను కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు తన ప్రయత్నాలు, అంకితభావం సరిపోలేదని వెల్లడించారు. అయితే, దేశంలో ఒక్కరు కూడా కరోనాబారిన పడకపోవడం సంతోషం కలిగిస్తోందని కిమ్ పేర్కొన్నారు. అదే సమయంలో దాయాది దేశం దక్షిణ కొరియాతో త్వరలో చేతులు కలుపుతామనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కరోనా నుంచి దక్షిణ కొరియా కోలుకోవాలని ఆకాక్షించారు. (చదవండి: భారీ క్షిపణిని ప్రదర్శించిన ఉ.కొరియా) స్వీయ రక్షణ కోసమే దేశ రక్షణ శక్తిని, స్వీయ రక్షణను బలోపేతం చేయడాన్ని కొనసాగిస్తామని అధ్యక్షుడు కిమ్ పునరుద్ఘాటించారు. స్వీయ రక్షణ కోసమే ఆయుధాలను సిద్ధం చేస్తున్నామని, ఇతరులపై దాడి ఆలోచన తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. తమ దేశ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తానని ఈ సందర్భంగా కిమ్ ప్రజలకు వాగ్దానం చేశారు. కాగా, తాము తయారు చేసిన అతి భారీ నూతన ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ (ఐసీబీఎం)ని ఉత్తర కొరియా ప్రదర్శించింది. మిలటరీ పరేడ్‌లో భాగంగా భారీ వాహనంపై రాజధాని ప్యాంగ్‌గ్యాంగ్‌లో ఈ ఖండాంతర క్షిపణి ప్రదర్శన నిర్వహించారు. ఇది పనిచేసినట్టయితే.. ప్రపంచంలోనే అతిపెద్ద ఐసీబీఎంలలో ఒకటిగా నిలుస్తుందని నిపుణులు చెప్తున్నారు. అమెరికాలోని ఏ ప్రాంతంపైన అయినా అణుదాడి చేసేందుకు అనుగుణంగా దీనిని రూపిందించినట్టు తెలుస్తోంది. ఇక ప్రసంగంలో ఎక్కడా కూడా కిమ్ అమెరికా గురించి ప్రస్తావించకపోవడం విశేషం. క్రూరుడుగా తనపై ఉన్న చెడ్డపేరును మార్చుకునేందుకు, తన పాలనతో విసిగిపోయిన ప్రజలను కాస్త మంచి చేసుకునేందుకు కిమ్ కొత్త పంథాను ఎంచుకున్నారని నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అల్లకల్లోంగా మారిన ఆర్థిక పరిస్థితి, పరిపాలన విషయంలో కిమ్‌పై నెలకొన్న ఒత్తిడికి ఆ కన్నీరు సూచిక కావొచ్చన్నది మరికొందరు విశ్లేషకుల అంచనా. (చదవండి: ట్రంప్ దంపతులు కోలుకోవాలని ప్రార్థించిన కిమ్) -
భారీ క్షిపణిని ప్రదర్శించిన ఉ.కొరియా
సియోల్: ఉత్తర కొరియా అతి భారీ నూతన ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్‌ని ప్రదర్శించింది. ప్రపంచంలో ఇదే అతిపెద్ద మిస్సైల్ అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీనిని మిలిటరీ పరేడ్‌లో ప్రదర్శించారు. ఉత్తర కొరియాలో అధికార వర్కర్స్ పార్టీ 75వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పరేడ్ నిర్వహించారు. వేలాది మంది సైనికులు, మాస్క్‌లు ధరించకుండా ఈ పరేడ్‌లో పాల్గొన్నారు. ఈ ఖండాంతర క్షిపణిని ప్రధాన వీధుల్లో భారీ వాహనంపై ప్రదర్శించగా కిమ్ జోంగ్ ఉన్ దీనిని వీక్షించినట్టు ఆ దేశ అధికారిక టీవీ చానల్ కేసీ టీవీలో చూపించారు. రోడ్లపై ప్రదర్శించిన ప్రపంచంలో అతిపెద్ద మిస్సైల్ ఇదని, ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్‌కి చెందిన అంకిత్ పాండా ట్వీట్ చేశారు. ఈ క్షిపణి అమెరికాలోని రక్షణ వ్యవస్థల నుంచి తప్పించుకోగల శక్తిసామర్థ్యాలు కలిగి ఉందని భావిస్తున్నారు. ఈ మిస్సైల్‌ని, అమెరికా కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టేటపుడు పరీక్షించాలని భావిస్తున్నట్టు అభిప్రాయపడుతున్నారు. ఆత్మరక్షణ కోసం మన సైన్యాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని భారీ జనసమీకరణను ఉద్దేశించి కిమ్ వ్యాఖ్యానించారు. -
సైనిక కవాతుపై ఉగ్ర దాడి
టెహ్రాన్: ఇరాన్లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. వార్షిక సైనిక కవాతు జరుగుతుండగా నలుగురు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 29 మంది చనిపోగా, 57 మంది గాయపడ్డారు. ఇరాక్‌కు సరిహద్దుగా ఉన్న కుజెస్తాన్ ప్రావిన్స్‌లోని ఆవాజ్ పట్టణంలో శనివారం ఈ ఘటన జరిగింది. మృతిచెందినవారిలో సైనికులతో పాటు కవాతు వీక్షించడానికి వచ్చిన ప్రజలు, అధికారులున్నారు. ఈ దాడి చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల్లో ముగ్గురిని భద్రతా బలగాలు అక్కడే మట్టుబెట్టగా, ఒకరు గాయాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో చనిపోయాడు. అమెరికా మిత్ర దేశమే దాడికి బాధ్యత వహించాలని, ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ అన్నారు. సౌదీ అరేబియా పాత్ర ఉంది.. 1980–88 మధ్య ఇరాక్‌తో జరిగిన యుద్ధానికి స్మారకంగా ఇరాన్ ఏటా సైనిక కవాతు నిర్వహిస్తోంది. ప్రేక్షకులు కూర్చున్న స్టాండ్ వెనక వైపు నుంచి దుండగులు లోనికి చొరబడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. సంఘటనా స్థలంలో సాయం కోసం అరుస్తున్న బాధితుల చిత్రాలను పలు టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. తమ శత్రువైన సౌదీ అరేబియా ఈ దాడికి నిధులు సమకూర్చిందని ఇరాన్ సైన్యం ఆరోపించింది. -
పాక్ డే పరేడ్‌లో భారత ఉన్నతాధికారులు
ఇస్లామాబాద్: భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు క్షీణించిన సమయంలో ఓ సంచలనం చోటుచేసుకుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన పాకిస్తాన్ డే సైనిక పరేడ్‌కు భారత్ దౌత్యవేత్తలు, సైనికాధికారులు హాజరయ్యారు. పరేడ్‌నకు భారత్ అధికారులను పిలవటం ఇదే తొలిసారి. భారత్ ఉన్నతాధికారులను పరేడ్‌నకు ఆహ్వానించాలన్న నిర్ణయం ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాదేనని స్థానిక మీడియా తెలిపింది. భారత్‌తో చెలిమి కోరుకుంటున్నామని తెలిపేందుకు ఆయన ఈ మేరకు ముందడుగు వేశారని సైనిక వర్గాలు తెలిపాయి. పాక్‌లో భారత రాయబారి బిసారియా, డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్, రక్షణ, సైనిక సలహాదారు బ్రిగేడియర్ సంజయ్ విశ్వాస్ తదితరులు పరేడ్‌లో పాల్గొన్నారు. వీరంతా ఇక్కడి అధికారులు అందజేసిన ‘23 మార్చి పాకిస్తాన్ డే’ అని ఉన్న టోపీలను ధరించి పరేడ్‌ను తిలకించారు. పరేడ్‌లో పాక్ అధ్యక్షుడు మమ్నూ న్ భారత్‌పై నిప్పులు చెరిగారు. భారత్‌లోని పాక్ రాయబారి సొహైల్ గురువారం తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. దౌత్యాధికారులను భారత్ వేధిస్తోందంటూ హైకమిషనర్ మెహమూద్‌ను వారం క్రితం పాక్ వెనక్కి పిలిపించుకున్న విషయం తెలిసిందే. -
ఉత్తర కొరియా క్షిపణి పేలింది!
ఆయుధ బలప్రదర్శన మరునాడే పరీక్ష విఫలం సియోల్: ఉత్తర కొరియా క్షిపణి ఒకటి పరీక్షిస్తుండగా పేలిపోయిందని అమెరికా, దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. తూర్పు తీరంలో సిన్పోలో ఆదివారం హై ప్రొఫైల్ క్షిపణి పరీక్ష విఫలమైనట్టు విశ్వసనీయంగా తెలుస్తున్నదని చెప్పారు. అమెరికాను పరోక్షంగా సవాలు చేస్తూ సైనిక వార్షిక దినోత్సవం సందర్భంగా భారీ ఆయుధ బలసంపత్తి ప్రదర్శనతో ఉత్తర కొరియా శనివారం హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మరునాడు చేపట్టిన క్షిపణి పరీక్ష ఇలా విఫలం కావడం ఉత్తరకొరియాకు ఎదురుదెబ్బగా మారింది. ఉత్తర కొరియా అణ్వాయుధ ప్రయోగాలతో చెలరేగిపోతున్న నేపథ్యంలో ఆ దేశాన్ని కట్టడి చేసేందుకు అమెరికా కొరియా ద్వీపకల్పంలో తన భారీ వైమానిక యుద్ధనౌకను మోహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాను సవాల్ చేసేందుకు, తన ఆయుధ బలాన్ని చాటుకునేందుకు కొరియా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ క్షిపణి పరీక్షను చేపట్టారని, అయితే, ఏ రకమైన క్షిపణి, దీని సామర్థ్యం ఎంత అనే వివరాలు తెలియదని అధికార వర్గాలు తెలిపాయి. -
చైనా ఆర్మీలో 3 లక్షల మంది కుదింపు
బీజింగ్: రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయం సాధించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా గురువారం తన సైనిక పాటవాన్ని ప్రపంచానికి చాటింది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకులతో బీజింగ్‌లోని తియానాన్మెన్ స్క్వేర్‌లో పరేడ్ నిర్వహించింది. ఇదే సందర్భంగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన సైన్యం నుంచి 3 లక్షల మంది సైనికులను తగ్గించనున్నట్లు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వెల్లడించారు. -
షాం ఘై మిలటరీ కమాండ్ స్ట్రెక్ డ్రిల్