భారీ క్షిపణిని ప్రదర్శించిన ఉ.కొరియా | Kim Jong Un Puts New Missiles On Display At Military Parade in North Korea | Sakshi
Sakshi News home page

భారీ క్షిపణిని ప్రదర్శించిన ఉ.కొరియా

Published Sun, Oct 11 2020 4:05 AM | Last Updated on Sun, Oct 11 2020 4:05 AM

Kim Jong Un Puts New Missiles On Display At Military Parade in North Korea - Sakshi

ఉత్తర కొరియా మిలటరీ పరేడ్‌లో పాల్గొన్న ఆర్మీ ట్యాంక్‌లు, వేలాదిమంది సైనికులు

సియోల్‌: ఉత్తర కొరియా అతి భారీ నూతన ఖండాంతర బాలిస్టిక్‌ మిస్సైల్‌ని ప్రదర్శించింది. ప్రపంచంలో ఇదే అతిపెద్ద మిస్సైల్‌ అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీనిని మిలిటరీ పరేడ్‌లో ప్రదర్శించారు. ఉత్తర కొరియాలో అధికార వర్కర్స్‌ పార్టీ 75వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పరేడ్‌ నిర్వహించారు. వేలాది మంది సైనికులు, మాస్క్‌లు ధరించకుండా ఈ పరేడ్‌లో పాల్గొన్నారు. ఈ ఖండాంతర క్షిపణిని ప్రధాన వీధుల్లో భారీ వాహనంపై ప్రదర్శించగా కిమ్‌ జోంగ్‌ ఉన్‌ దీనిని వీక్షించినట్టు ఆ దేశ అధికారిక టీవీ చానల్‌ కేసీ టీవీలో చూపించారు.

రోడ్లపై ప్రదర్శించిన ప్రపంచంలో అతిపెద్ద మిస్సైల్‌ ఇదని, ఫెడరేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ సైంటిస్ట్స్‌కి చెందిన అంకిత్‌ పాండా ట్వీట్‌ చేశారు. ఈ క్షిపణి అమెరికాలోని రక్షణ వ్యవస్థల నుంచి తప్పించుకోగల శక్తిసామర్థ్యాలు కలిగి ఉందని భావిస్తున్నారు. ఈ మిస్సైల్‌ని, అమెరికా కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టేటపుడు పరీక్షించాలని భావిస్తున్నట్టు అభిప్రాయపడుతున్నారు. ఆత్మరక్షణ కోసం మన సైన్యాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని భారీ జనసమీకరణను ఉద్దేశించి కిమ్‌ వ్యాఖ్యానించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement