PM Modi Said India Wants Normal Bilateral Ties With Pakistan - Sakshi
Sakshi News home page

ఆ దేశంతో మామూలు సంబంధాలు కావాలి..కానీ ఆ విషయంలో మాత్రం..: మోదీ

Published Fri, May 19 2023 8:13 PM | Last Updated on Fri, May 19 2023 8:26 PM

PM Modi Said India-Pakistan Ties Want Normal Relations But - Sakshi

పాకిస్తాన్‌తో భారత్‌ సాధారణ పొరుగు సంబంధాలను కోరుకుంటుందని భారత్‌ ప్రధాని మోదీ అన్నారు. అయితే ఉగ్రవాదం లేని అనుకూలమైన వాతావరణం సృష్టించడం, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో పాక్‌నే భాద్యత వహిస్తుందని మోదీ చెప్పారు. జపాన్‌లో జరిగే జీ7 సదస్సుకు గెస్ట్‌ కంట్రీగా భారత్‌ హాజరవనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ అతిపెద్ద స్వతంత్ర వ్యాపార మీడియా గ్రూపులలో ఒక్కటైన నిక్కి ఆసియాకు ఇచ్చిన ఇంటర్య్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు ఉగ్రవాదం విషయంలో పాక్‌ మద్దతుపై భారత్‌ పదేపదే ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు.

ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదం, చర్చలు కలిసి వెళ్లలేవని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా చైనాతో సంబంధాల గురించి ప్రశ్నించిగా..దక్షిణాసియా దేశాల గొంతును, వారి ఆందోళనను తెలియజేయడానికి భారత్‌ చేస్తున్న ప్రయత్నాలు గురించి మాట్లాడారు. భారత్‌ తన సౌర్వభౌమాధికారం, గౌరవం కాపాడుకునేందుకు సిద్దంగానే గాక అందుకు కట్టుబడి ఉందన్నారు.  2020లో చైనా సైన్యంతో చర్యలు తర్వాత తూర్ప లడఖ్‌లో ప్రతిష్టంభన ఏర్పడిందన్నారు. ఈ చర్చలు కొన్ని ప్రాంతాలను విడదీసేలా ఘర్షణ కలిగించాయి. చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు నెరపాలంటే సరిహద్దు ప్రాంతాలలో శాంతి, ప్రశాంతత చాలా అవసరమని చెప్పారు. భారత్‌-చైనా సంబంధాల భవిష్యత్తు, అభివృద్ధి, పరస్పర గౌరవం, సున్నితత్వం, ప్రయోజనాలపై మాత్రమే ఆధారపడి ఉందన్నారు.

అంతేగాదు ఇరు దేశాల విస్తృత సంబంధాలు ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తాయని చెప్పారు. ఇక రష్యా ఉక్రెయిన్‌ వివాదంలో భారత్‌ మధ్యవర్తి పాత్ర పోషించగలదా అని సంధించిన ‍ప్రశ్నకు..ఉక్రెయిన్‌ వివాదంపై తమ దేశం వైఖరి స్పష్టంగా తిరుగులేనిదని మోదీ చెప్పారు. భారత్‌ ఎప్పుడూ శాంతివైపు నిలుస్తుంది. ప్రాథమిక అవసరాలను తీర్చడంలో సవాళ్లను ఎదుర్కొనే వారికి మద్దతు ఇవ్వడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ముఖ్యంగా ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్‌లతో తాము కమ్యూనికేషన్‌ కొనసాగిస్తామన్నారు.

సహాయ సహకారాలతో సమయాన్ని నిర్వచించాలి గానీ సంఘర్షణతో కాదు అని చెప్పారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, చట్టబద్ధమైన పాలన వంటి విలువలే జపాన్, భారత్‌ని మరింత దగ్గర చేశాయని ప్రధాని మోదీ అన్నారు. తాము ఇప్పుడూ ఆర్థిక ప్రయోజనాల్లో పెరుగుతున్న రాజకీయ, వ్యూహాత్మక భద్రత కలయికను చూస్తున్నాం అని చెప్పారు. ఇదిలా ఉండగా జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం జపాన్‌లోని హిరోషిమా చేరుకున్నారు. ఈ సమ్మిట్‌కు భారత్‌ను అతిధిగా ఆహ్వానించారు. 2003 నుంచే జీ7 సదస్సులో భారత్ పాల్గొంటోంది.

(చదవండి: నాడు అద్దె గదిలో జూనియర్‌ లాయర్‌గా ప్రారంభమై..నేడు సుప్రీంకోర్టు జడ్జి స్థాయికి..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement