మోదీ-జిన్‌పింగ్-ఇమ్రాన్ ఖాన్ (ఫైల్ ఫోటో)
బీజింగ్ : భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో చైనా సానుకూల, నిర్మాణాత్మక పాత్ర పోషించనుందని చైనా విదేశాంగ ప్రతినిధి లూకుంగ్ తెలిపారు. ఆసియాలో భారత్, పాకిస్తాన్‌లు బలమైనా దేశాలని, ఆ రెండు దేశాల మధ్య స్నేహపూర్వకమైన సంబంధాలు మెరగుపడాలని ఆయన వ్యాఖ్యానించారు. భారత్-పాక్ మధ్య అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేయడంలో భవిష్యత్తులో చైనా కీలక పాత్ర పోషించనున్నట్లు లూకుంగ్ వెల్లడించారు.
పాక్ నూతన ప్రధానిగా ఎన్నికైన ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వంతో తాము చర్చలు జరిపేందుకు సిద్దంగా ఉన్నామని, భారత్-పాక్ సత్సబంధాలను చైనా ఎల్లప్పుడూ కోరుకుంటుందని ఆయన అన్నారు. రెండు దేశాలు మధ్య స్నేహం అభివృద్ధి, శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. చైనాకు పొరుగుదేశాలైన భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల పెరుగుదలకు చైనా రెండు దేశాలకు మద్దతునిస్తుందని.. ఇరు దేశాల మధ్య ఉన్న వైరుధ్యాలను పరిష్కరించడానికి తాము ప్రయత్నిస్తామని తెలిపారు.
భారత్, పాక్‌ల మధ్య నిర్మాణాత్మక, అర్ధవంతమైన చర్చలు జరగాలని పాక్ నూతన ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లేఖ రాసినట్లు లూకుంగ్ గుర్తుచేశారు. కాగా భారత్-పాక్ సంబంధాల మధ్య ఇమ్రాన్ ఖాన్ ఆసక్తి చూపుతున్నట్లు చైనా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండు దేశాలు కోరుకుంటే ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వంగా వ్యవహరించడానికి చైనా సిద్దంగా ఉందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment