Reason Behind Tamannaah Scenes In Lust Stories 2, Jee Karda - Sakshi
Sakshi News home page

Thamannaah: మిల్కీబ్యూటీ ఇలా మారిపోవడానికి కారణం?

Published Sun, Jul 9 2023 4:56 PM | Last Updated on Wed, Oct 30 2024 3:13 PM

Reason Behind Thamannah Scenes In Lust Stories 2 Jee karda

హీరోయిన్ తమన్నా గత కొన్నిరోజులుగా ట్రెండింగ్ లో ఉంది. కారణం ఏంటో మీకు తెలుసు. రెండు వెబ్ సిరీసులు.. బోలెడన్ని అలాంటి సీన్స్ దీనికి మెయిన్ రీజన్. హమ్మయ్యా ఒకటి అయిందనుకునేలోపు మరొకటి అన్నట్లు షాక్ ఇచ్చి, ప్రతి ఒక్కరి మైండ్ బ్లాంక్ చేసి పడేస్తోంది. రెచ్చిపోవడం అనే రేసులో గుర్రంలా దూసుకెళ్తూ గీత ఎప్పుడో దాటేసిందా అనిపిస్తుంది. ఇంతకీ మిల్కీబ్యూటీ ఇంతలా మారిపోవడానికి కారణమేంటో తెలుసా?

రెమ్యునరేషన్ డబుల్
సాధారణంగా హీరోలతో పోలిస్తే ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినాసరే రెమ‍్యునరేషన్ తక్కువగానే ఇస్తుంటారు. కొన్నాళ్ల ముందువరకు తమన్నా.. సినిమాకు రూ.4 కోట్లు మాత్రమే అందుకునేదట. ఆమెతో వెబ్ సిరీసులు చేయాలనుకున్న దర్శకనిర్మాతలు కొత్త ప‍్లాన్ వేశారు. ఏకంగా రెమ్యునరేషన్ డబుల్ ఇస్తాం, అంటే రూ.7 కోట్లు వరకు అని చెప్పారట. దీంతో ఎప్పటి నుంచో ముద్దుకి కూడా నో చెబుతూ వచ్చిన తమన్నా.. ఏకంగా శృంగార సన్నివేశాలు చేసి హద్దులు చెరిపేసింది.

(ఇదీ చదవండి: గే రిలేషన్‌షిప్‌లో కొడుకు? నా నిర్ణయం అదే: 'అదుర్స్' విలన్)

కెరీర్ లాస్ట్ స్టేజ్
తమన్నా వయసు ప్రస్తుతం 33 ఏళ్లు. 2005 నుంచి సినిమాల్లో ఉంది. అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగడం అంటే మాములు విషయం కాదు. ప్రస్తుతం తమన్నా వయసు కాస్త ఎక్కువ కావడం, హిట్స్ లేకపోవడం వల్ల దర్శకనిర్మాతలు ఈమెపై పెద్దగా ఆసక్తి చూపించట్లేదేమో అనిపిస్తుంది. బహుశా తమన్నాకు ఇది అర్థమైనట్లు ఉంది. అందుకేనేమో ఇండస్ట్రీలో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుందామనే ఆలోచనతో ఉన్నట్లు ఉంది. అందుకే ముద్దు నుంచి సెక్స్ సీన్స్ వరకు అన్నింటికీ ఓకే చెప్పేస్తోందా అనే డౌట్ వస్తోంది. 

విజయ్‌తో రిలేషన్
గతేడాది వరకు తమన్నా సింగిల్. ఈ ఏడాది న్యూయర్ పార్టీలో మాత్రం నటుడు విజయ్ వర్మని ముద్దాడుతూ కనిపించింది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో వీళ్లిద్దరి రిలేషన్ బయటపడింది. ఈ జంట పెళ్లి చేసేసుకుందామని ఫిక‍్సయినట్లు ఉన్నారు. సాధారణంగా ఇండస్ట్రీలో పెళ్లయితే.. సదరు హీరోయిన్లకు అవకాశాలు వచ్చేది తక్కువ. పెళ్లి తర్వాత ఎలా పడితే అలా చేసేద్దాం అంటే కుదరకపోవచ్చు. ఇదీ కూడా తమన్నా ఆలోచించిదేమో.. అందుకే ఇలా రెచ్చిపోతున్నట్లు అనిపిస్తుంది. మరి ఇందులో నిజానిజాలు ఆ శివయ్యకే ఎరుక!

 

(ఇదీ చదవండి: 'సలార్' అప్డేట్.. స్టార్ కమెడియన్ అలా అనడంతో!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement